SV Zoo Park
-
సింహం నోట్లో తల పెట్టిన వ్యక్తి
-
తిరుపతి జూలో మరో ‘నంద్యాల’ పులికూన మృతి
సాక్షి, తిరుపతి: నగరంలోని ఎస్వీ జూపార్క్ లో పులికూన ఒకటి మృతి చెందింది. రెండు రోజుల కిందట అది చనిపోయిందని జూ నిర్వాహకులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలలు క్రితం నంద్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి తల్లికి దూరమైన 4 పులి పిల్లలు ఇక్కడికి తరలించిన సంగతి తెలిసిందే. జూకి తరలించిన కొన్నిరోజులకే ఒక కూన మృతి చెందగా, తాజాగా ఈ నెల 29వ తేదీన మరొకటి చనిపోయింది. కిడ్నీ,లివర్ సమస్యతో బాధపడుతూ ఈ పులికూన మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇక.. బ్లడ్ శాంపిల్స్ తో మిగిలిన పులి కూనలకు పరీక్షలు చేస్తున్నారు అధికారులు. నంద్యాల అడవుల్లో తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు.. సమీప గ్రామంలోకి ప్రవేశించాయి. అయితే గ్రామస్తులు వాటిని రక్షించగా.. తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో.. చివరకు వాటిని జూకి తరలించారు. ఇదీ చదవండి: ‘వాతావరణం తట్టుకోలేవ్.. అవి చనిపోతాయని ముందే ఊహించాం!’ -
స్మగ్లర్ల ఆటకట్టించేందుకు.. జూ పార్కు పరిధి పెంపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు పరిధి పెరగనుంది. పార్కుకు ఉత్తరాన 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మేకలబండ కొండ ప్రాంతాన్ని కూడా పార్కులో విలీనం చేయనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఎస్వీ జూ పార్కు ప్రస్తుతం 289 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. పార్కుకు దక్షిణాన ఉన్న లక్ష్మీపురం గ్రామం నుంచి కాలిబాటన వెళ్లి మేకలబండ కొండల్లోకి ప్రవేశిస్తోన్న ఎర్రస్మగ్లర్లు, కూలీలు సులువుగా శేషాచలంలోకి చొరబడుతున్నారు. వీరి చొరబాటును అరికట్టాలంటే ఇక్కడున్న మేకలబండ కొండల ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల పర్యవేక్షణకు అనువుగా మార్చుకోవాలని అధికారులు ఆలోచించి ఈ మేరకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పెరిగిన పరిధిని దృష్టిలో పెట్టుకుని మొత్తం 1200 హెక్టార్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ లే అవుట్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అనుమతులు రాగానే మేకలబండ కొండ ప్రాంతంలో పనులు చేపడతామని అటవీ శాఖ చీఫ్ కన్సెర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు పేర్కొన్నారు. -
తిరుపతిలో తుపాకుల మోత
తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల మోతమోగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పట్ణణ నగర శివారులోని ఎస్వీ జూపార్క్ సమీపంలో ఎర్రచందనం కూలీలు తారాసపడ్డారు. పోలీసులనుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు రాళ్లదాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు స్మగ్లర్లను అడ్డుకునేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆర్ఎస్ఐ వాసుకు గాయాలయ్యాయి. పారిపోతున్న స్మగ్లర్లలో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు.. ఘటనాస్థలం నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులు పట్టుబడిన దొంగలను విచారించారు. -
యంపా, బలరామ్లు అనారోగ్యంతో మృతి చెందాయి
తిరుపతి మంగళం: తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్)లో శుక్రవారం యంపా (22) అనే ఆడసింహం, బలరామ్ (4) అనే తెల్లపులి పిల్ల అకాల మరణానికి కారణం అనారోగ్యమేనని జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గతంలో సర్కస్ల నుంచి ఎస్వీ జూకు 24 సింహాలను తీసుకొచ్చారని, వాటిలో యంపా ఒకటని, మరో 23 సింహాలు కూడా వయసుడిగి పోయాయని వివరించారు. అందులోనూ మిగిలిన 20 సింహాలు వయసుడిగి మృత్యువుకు దగ్గరగా ఉన్నాయన్నారు. అటవీ ప్రాంతంలో అయితే సింహాలు 16నుంచి 18సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయని, ఎస్వీ జూలో సరైన సమయానికి పౌష్టికాహారం, వైద్యసేవలు అందిస్తుండడంతో మరో నాలుగు సంవత్సరాలు ఎక్కువగా జీవించగలిగాయని పేర్కొన్నారు. ఎస్వీ జూలోనే రణధీర్, హసీనా అనే తెల్లపులులకు జన్మించిన బలరామ్(4) అనే తెల్ల పులిపిల్ల కూడా అనారోగ్యంతో మృతి చెందిందని క్యూరేటర్ తెలిపారు. పది రోజులుగా బలరామ్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం మృతి చెందిందన్నారు. జూలో జంతువుల పరిరక్షణకు డాక్టర్ అరుణ్ వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం జూలోనే సింహం, తెల్ల పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేశారు. -
ఓ పులి వందమందితో సమానం
తిరుపతి(మంగళం): అక్రమార్కులను కట్టడి చేయడానికి వందమంది సిబ్బంది ఉండడం కంటే ఓ పులి మేలు చేస్తుందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. అడవుల్లో పులి జోన్లు పెంచాలని ఆయన ఆదేశించారు. అటవీ సంపద కాపాడే యత్నంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్ అంటూ అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి సెల్యూ ట్ చేశారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్) వద్ద అటవీశాఖాధికారులు అమరవీరుల జ్ఞాపకార్థం స్థూపాన్ని, ఎస్వీజూ స్థాపించిన స్వర్గీయ సీఎం ఎన్టీ.రామారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌ను ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అతి దారణంగా చంపాడని, 13 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని స్మగ్లర్లు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలోని అమరుల కుటుంబాలకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. 1993లో ఎన్టీఆర్ 350 హెక్టార్లలో ఎస్వీ జూపార్క్‌ను ఏర్పాటు చేశారని, ఆయన జ్ఞాపకార్ధం ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుధాలు అందించడంలో విఫలం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ అధికారులకు కావాల్సిన ఆయుధాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని వసతులు కల్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏనుగుల దాడుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిచాలన్నారు. స్వీ జూపార్క్ సిబ్బందికి ఆరు నెలల వేతనబకాయిలు చెల్లిం చాలన్నారు. లేకుంటే జూపార్క్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు అటవీశాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఏవీ. జోసెఫ్, పీసీఎఫ్ రవికుమార్, జూ క్యూరేటర్ యశోదాబాయ్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఈస్ట్ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి, రవిశంకర్, పవ న్‌కుమార్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ శెల్వకుమార్, డాక్టర్ అరుణ్, టీడీపీ నాయకులు నరిసింహయాదవ్, శ్రీధర్‌వర్మ, కొండా రాజు పాల్గొన్నారు.