తెలుగు తమ్ముళ్లు.. కబ్జాకోరులు..
శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత మండలం శ్రీకాళహస్తిలో తెలుగుతమ్ముళ్లు భూరంగం సృష్టిస్తున్నారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు భూదాహంతో తపించిపోతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం వైఎస్సార్‌పురం ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల చుట్టూ పది గ్రామా ల్లో వెరుు్య ఎకరాల భూములను మంత్రి అనుచరులు ఎంచక్కా ఆక్రమించి మినుముపంట సాగుచేయడానికి సిద్ధం చేస్తున్నారు.
సామాన్యుడు సెంటు భూమి ఆక్రమిస్తే కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేస్తున్న రెవెన్యూ అధికారులు తెలుగుతమ్ముళ్ల విషయంలో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో టీడీపీ నాయకులతో కబ్జాలపై గంటల కొద్దీ రెవెన్యూ అధికారులు చర్చలు సాగిస్తున్నారు. అంతేకాదు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వ మిగులు భూముల వివరాలను నాయకులకు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మండలంలో టీడీపీ నాయకుల భూభాగోతమే ఓ హాట్‌టాపిక్‌గా మారింది.
భూములు ఆక్రమిస్తే రాళ్లతో తరిమికొట్టాలని ఓ వైపు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ‘మీ వద్దకు మీ మున్సిపాలిటీ’ సమావేశాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేనాయకులే ఇష్టారాజ్యంగా వందల ఎకరాలు ఆక్రమిస్తున్నా...దాన్ని ఖండించకపోవడం గమనార్హం.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి మండలంలో మన్నవరం వద్ద ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు, కాపుగున్నేరి వద్ద కోకకోలా, రాచగున్నేరి వద్ద ల్యాంకో, మంత్రి స్వగ్రామం ఊ రందూరు వద్ద విష్ణుకెమికల్స్, గుంటకిందపల్లె వద్ద ఫై కర్మాగారం లాంటి మేజర్ ఫ్యాక్టరీలు స్థాపించడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎకరం రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు పలుకుతోంది. మండలంలో మిగులు భూములు కూడా ఎక్కువగా ఉండడంతో ఇదే అదునుగా తెలుగుతమ్ముళ్లు ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నా రు. ఇప్పటికే వెరుు్య ఎకరాలు ఆక్రమించినట్లు తెలుస్తోంది.
ఆక్రమణలివీ..
ప్రధానంగా శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు చూస్తే ఇనగలూరు గ్రామంలో 1769 హెకార్ల భూముల్లో 181బ్లాక్‌లోని 397.15 ఎకరాల్లో 449 నుంచి 454, 488 నుంచి 501, 524 నుంచి 532 సర్వేనెంబర్లలోని 273.52 ఎకరాలు ఆక్రమించి లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా సర్వే నెంబర్ 455 నుంచి 460 వరకు 53.27 ఎకరాలు, 481 నుంచి 487 వరకు 70.36 ఎకరాలు పేదల పేర్లతో కబ్జా చేసినట్లు సమాచారం. ఇక 190 బ్లాక్‌లో 953 ఎకరాల (గోవిందరావుపల్లె, నిమ్మరాళ్లపల్లె, రేపల్లె, మామిడిగుంటలో) ప్రభుత్వ మిగులు భూములు ఉన్నాయి. ఇందులో ఓ టీడీపీ నాయకుడు 150 ఎకరాలు బినామీలతో కలసి ఆక్రమించారు.
మన్నవరం సర్వే నెంబర్లు 87,88లో 80 ఎకరాలు మరో నాయకుడి చేతిలో ఉన్నాయి. ఇక కలవగుంట గ్రామంలో సర్వే నెంబర్ 1బ్లాక్‌లో 60 ఎకరాలను మరో టీడీపీ నాయకుడు మొక్కలు తొలగించి కబ్జాకు సిద్ధం చేసుకుంటున్నారు. వెలంపాడులో 166-3 చిన్న చెరువు 10 ఎకరాలు, 185 బ్లాక్‌లో 80 ఎకరాలు, రేపల్లెలోని 190 బ్లాక్‌లో చిన్న చెరువు 8 ఎకరాలు ఆక్రమించారు. గంగలపూడి గ్రామంలో స్థానికేతరుల పేర్లతో 393-2, 393-4, 393-1, 394-4, 394-4, 388-2, 388-3, 388-4, 388-5, 392-1, 392-2, 392-3, 386-1, 386-2 సర్వే నెంబర్లలో 30 ఎకరాల భూములు ఆక్రమించి మినుముపంట సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా(1000 కుటుంబాలు) యానాదులు నివాసం ఉన్నారు. వారికి ఎక్కడా సెంటు భూమి లేదు. కానీ తెలుగుతమ్ముళ్లు మాత్రం భూదాహంతో వీరంగం సృష్టిస్తున్నారు.