ఏమిటీ ప్రకటనలు..? | who is the tdp leader next elections in srikalahasti | Sakshi
Sakshi News home page

ఏమిటీ ప్రకటనలు..?

Published Mon, Aug 14 2017 3:01 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

ఏమిటీ ప్రకటనలు..? - Sakshi

ఏమిటీ ప్రకటనలు..?

► తండ్రా ... తనయుడా ?
►  శ్రీకాళహస్తిలో మా నాయకుడెవరో !
►  టీడీపీ నాయకుల్లో అయోమయం 
 
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేస్తారా....లేదా ఆయన తనయుడు బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి బరిలో ఉంటా రా...అనే అంశంపై పార్టీలో తీవ్రమైన చర్చసాగుతోంది. రెండు రోజుల క్రితం బొజ్జల తనయుడు బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి పట్టణంలోని పంచాయతీ అతిథి భవనంలో విలేకరుల ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని...ఆ మేరకు మంత్రి నారా లోకేష్‌ తనకు హామీ ఇచ్చారని తెలిపారు.

అయితే ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలో దేవస్థానం చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీలో ఉంటారని...ఆయన నామినేషన్‌ వేసి ఇంట్లో ఉన్నా.... కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడులాగే గోపాలకృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నేతలకు సూచించారు. దాంతో పార్టీ నేతలు ఇంతకీ తమ నాయకుడు తండ్రా ... ? తనయుడా ? అనే డోలాయమానంలో పడ్డారు. తండ్రీకొడుకులు చర్చించుకుని ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుంటే ఇబ్బందిపడాల్సి వస్తుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement