సాక్షి, శ్రీకాళహస్తి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధికార పార్టీ నేతల చిందులకు వేదికగా మారింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు ‘గున్నా మామిడి’ పాటకు జోరుగా డాన్స్ వేశారు. ఈలలు వేస్తూ, ఒళ్లు మరిచిపోయి నృత్యాలు చేశారు. టీడీపీ నాయకుల నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా డాన్సులు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చబాబుల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల జోక్యం తొలినాళ్ల నుంచి తెలిసిందే. దీంతో ప్రజల పాలిట కామధేనువు కావాల్సిన జన్మభూమి అపహస్యం పాలవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమం జనవరి 2-11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కాగా, ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పలు చోట్ల గ్రామ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
జన్మభూమిలో ‘గున్నా మామిడి’
Published Thu, Jan 11 2018 4:39 PM | Last Updated on Thu, Jan 11 2018 4:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment