వైఎస్సార్‌సీపీకి పనిచేశారా.. సమావేశం నుంచి వెళ్లిపోండి | YSRCP Worked Go-to-meeting :BOJJALA Gopal Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి పనిచేశారా.. సమావేశం నుంచి వెళ్లిపోండి

Published Wed, Aug 6 2014 3:18 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

వైఎస్సార్‌సీపీకి పనిచేశారా.. సమావేశం నుంచి వెళ్లిపోండి - Sakshi

వైఎస్సార్‌సీపీకి పనిచేశారా.. సమావేశం నుంచి వెళ్లిపోండి

 ‘ఏమ్మా నీవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పనిచేశావంట కదా..? సమావేశం నుంచి వెళ్లిపో’ అంటూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘నాకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేశాను. మా వీధిలో సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. నా సమస్యలు చెప్పాకే వెళతాను’ అంటూ ఐకేపీ సభ్యురాలు తేల్చిచెప్పారు.
 
 శ్రీకాళహస్తి : పట్టణంలోని హరిహరబావివీధి వద్ద మంగళవారం ‘మన వద్దకు మన మున్సిపాలిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథి గా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సుప్రజ మాట్లాడుతూ ఐకేపీ ఆర్‌పీ మాధవి, పొదువు సభ్యురాలు ముని లక్ష్మి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పనిచేశారని మంత్రికి వివరించారు. స్పందించిన ఆయన బహిరంగ సభ నుంచి వెళ్లిపోవాలని పొదువు సభ్యులను ఆదేశించారు. అందుకు వారు ఎందుకు వెళ్లాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వా దం తీవ్ర స్థాయికి చేరింది. ఇంతలో షామియానా కుప్పకూలింది. అది మంత్రిపై పడకుండా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
 
 సంభాషణ వారి మాటల్లోనే..
 కౌన్సిలర్ సుప్రజ: ఐకేపీ ఆర్‌పీ మాధవి, మరో పొదు వు సభ్యురాలు మునిలక్ష్మి మొన్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పనిచేశారు. ఇప్పుడు ఈ సమావేశానికి హాజరయ్యూరు అంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు.
 ఆర్‌పీ మాధవి : అది నేను చేసిన తప్పా.. అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్.. నేను సమావేశానికి ఎందుకు హాజరుకాకూడదు? నేను ఈ వార్డులో ఒక ఓటరును.
 
 కౌన్సిలర్ సుప్రజ : ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి గెలుస్తారంటూ...అందరికీ చెప్పి వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయించారన్నా.
 
 ఆర్‌పీ మాధవి : ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి.... వార్డులోని సమస్యల కోసం సమావేశం పెట్టారు. ఎన్నిక లు, ఓట్లు ఆ విషయాలు ఇప్పుడు చర్చించడం తగదు.. నేను ఏదో నేరం చేసినట్లు బహిరంగ సభలో ఇలా అడగడం ఎంతవరకు సమంజసం చెప్పండి.
 
 మంత్రి గోపాలకృష్ణారెడ్డి: ఆర్‌పీ మాధవి చిన్నగా మాట్లాడు.. నువ్వు మాట్లాడుతుంటే రెండు ఫ్యాన్ల శబ్దం వస్తోంది. మీరు ఇద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోండి ఎందుకు గొడవ.
 
 ఆర్‌పీ మాధవి : ఇదేంది సార్.. మీరు మా ఎమ్మెల్యే.. పైగా రాష్ట్ర మంత్రి కూడా.. మా సమస్యలు తెలుసుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేశారు. మమ్మల్ని వెళ్లిపోవాలని చెప్పడం ఎంతవరకు న్యాయం సార్..? నేనెందుకు వెళ్లాలి...నా ఓటును నాకు ఇష్టం వచ్చిన వాళ్లకు వేసుకున్నా.. నేను ఏ పార్టీకీ అనుకూలంగా పనిచేయలేదు.
 
 మంత్రి (ఆగ్రహం వ్యక్తం చేస్తూ..): నీవల్ల ఇక్కడ రచ్చలు వస్తున్నాయి. ముందు నీవు వెళ్లిపోమ్మా...
 ఆర్‌పీ మాధవి : నేను సమావేశం నుంచి ఎందుకు పోతా ను సార్.. మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చా. చెప్పాకనే వెళ్లిపోతా... కడుపు చేతపట్టుకుని జీవనం సాగించే పేదోళ్లం. మాపై ఎందుకు సార్ కక్షలు.

 మంత్రి: ఆర్‌పీగా మాధవిని పొదువు నుంచి తొలగించి వేరేవాళ్లను పెట్టుకోండి...వివాదాలు ఉండవు..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement