బొజ్జలకు అడవులు, పర్యావరణం
జిల్లాకు రెండోసారి అటవీ శాఖ
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ శాఖకు ప్రాధాన్యం
తిరుపతి : టీడీపీ సీనీయర్ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అడవులు, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల ఎనిమిదో తేదీన చంద్రబాబు సహా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ శాఖలు కేటాయించని విషయం తెలిసిందే. నాలుగు రోజుల వ్యవధి తరువాత మంత్రి బొజ్జలకు అడవులు, పర్యావరణ శాఖలు కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు అటవీ శాఖ కేటాయించడం ఇది రెండోసారి. 2009 శాసనసభ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ైవె ఎస్.రాజశేఖరరెడ్డి తన కేబినెట్‌లో జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీ శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. తిరిగి చంద్రబాబు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఇదే శాఖకు మంత్రిగా నియమించారు. గతంలో రెండుసార్లు చంద్రబాబు కేబినెట్‌లో గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా వ్యవహరించారు.
అప్పట్లో ఆయన ఆర్ అండ్ బీ, డ్వాక్రా, ఐటీ శాఖలు నిర్వహించారు. కాగా జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బొజ్జలకు ఈ శాఖను కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శేషాచలం అడవుల్లో పలు దఫాలు స్మగ్లర్లకు, అటవీ అధికారులకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఎర్రదొంగలు హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బొజ్జలకు అటవీ శాఖను కేటాయించడం ద్వారా స్మగ్లింగ్ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం అవుతోంది. రాయలసీమలో సుమారు నాలుగున్నర లక్షల హెక్టార్లలో శేషాచల అడవి ఉంది. అయితే సిబ్బంది కొరత, ఆయుధాల వినియోగానికి అవకాశం లేకపోవడంతో అటవీశాఖ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకే చెందిన వ్యక్తి మంత్రిగా నియమితులు కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు తదితర ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఏనుగుల దాడిలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న గోపాలకృష్ణారెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది.
బొజ్జలకు అడవులు, పర్యావరణం రామచంద్రారెడ్డికి అటవీ శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. తిరిగి చంద్రబాబు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఇదే శాఖకు మంత్రిగా నియమించారు. గతంలో రెండుసార్లు చంద్రబాబు కేబినెట్‌లో గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఆర్ అండ్ బీ, డ్వాక్రా, ఐటీ శాఖలు నిర్వహించారు. కాగా జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బొజ్జలకు ఈ శాఖను కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శేషాచలం అడవుల్లో పలు దఫాలు స్మగ్లర్లకు, అటవీ అధికారులకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఎర్రదొంగలు హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బొజ్జలకు అటవీ శాఖను కేటాయించడం ద్వారా స్మగ్లింగ్ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం అవుతోంది. రాయలసీమలో సుమారు నాలుగున్నర లక్షల హెక్టార్లలో శేషాచల అడవి ఉంది. అయితే సిబ్బంది కొరత, ఆయుధాల వినియోగానికి అవకాశం లేకపోవడంతో అటవీశాఖ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకే చెందిన వ్యక్తి మంత్రిగా నియమితులు కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు తదితర ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఏనుగుల దాడిలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది.