వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో...లేదో !
శ్రీకాళహస్తి : ‘ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవు... వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానో ఉండనో నాకే తెలియదు.... అయినా ప్రజాసమస్యలు తెలుసుకుని... వాటిని పరిష్కరించడానికే జన్మభూమికి హాజ రయ్యూన’ని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం పట్టణంలోని 28, 29, 30 వార్డుల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో మంత్రి పాల్గొన్నారు.
సాధారణంగా నాయకులు ఎన్నికల సమయాల్లో మాత్రమే కనిపిస్తారని, అయితే ఐదేళ్ల వరకు ఎన్నికలు లేనప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో తాను హాజరైనట్లు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, కమిషనర్ సన్యాసరావును ఆదేశిం చారు.
అయితే పట్టణంలో పలువురు పురుషులు, వితంతువుల పెన్షన్లు తీసుకుంటున్నారని వాటిని రద్దు చేయాల్సి ఉందన్నారు. పట్టణాన్ని ప్రత్యేక లైటింగ్‌తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సోమశిల-స్వర్ణముఖికాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రధానంగా పెన్షన్లు, మురుగుకాలువలు, రోడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని మంత్రిని ఈ సందర్భంగా కొందరు కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే ధేయ్యం గా...పట్టణాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామని చెప్పారు.
టీడీపీ సీనియర్ నాయకుడు పోతుగుంట గురవయ్యనాయుడు, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి, ఇన్‌చార్జి కమిషనర్ సన్యాసరావు,కో-ఆప్షన్ సభ్యుడు షాకీర్‌ఆలీ,కౌన్సిలర్లు విజయకుమార్‌నాయుడు, ప్రసాద్‌నాయుడు, సుప్రజ పాల్గొన్నారు. స్థానికులు వారివారి సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు.