janmabhumi
-
ఒక్క నిజమైన చెప్పారా?
సాక్షి, విజయవాడ: జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవాస్తవాలు, అసత్యాలతో జన్మభూమి సందేశం ఉందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకునే ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. వైఎస్సార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాయన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంతో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసినన్ని కుంభకోణాలు ఎవరైనా చేశారా అని నిలదీశారు. భూకబ్జా కేసులో జైలుకు వెళ్లిన దీపక్‌రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని అనంతపురం జన్మభూమిలో నీతులు చెబుతారా అని అడిగారు. టీడీపీ పచ్చ చొక్కాల సంక్షేమం కోసమే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది జన్మభూమి కాదు... జాదుభూమి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జన్మభూమిలో ఒక్క నిజమైన చెప్పారా? ఆయన చెప్పినవన్నీ నిజాలని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను భోగి మంటల్లో తగలబెడతారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కాదు, చంద్రబాబు కుటుంబ సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. -
పించన్లు, రేషన్ కార్డులు.. భారీగా అడుగుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా అందిన అన్ని అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇన్నాళ్లూ అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా జన్మభూమి సభల్లో జనం నిలదీతలు, నిరసనలతోపాటు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుండటంతో మాట మార్చారు. తాను స్వయంగా నిర్వహించిన సర్వే ప్రకారం పింఛన్లు, రేషన్ కార్డులు ఇంకా ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోందని జన్మభూమి నిర్వహణ తీరుపై గురువారం కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులుతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి 3,00,570 ఆర్జీలు అందినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇందులో అత్యధికం ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించినవేనని తెలిపారు. సీఎం నిజాలను ఒప్పుకోవటానికి కారణం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటమేనని రాజకీయ విశ్లేషకులతోపాటు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గృహాల నిర్మాణం త్వరగా చేపట్టండి
పెద్దారవీడు: ఎన్టీఆర్ పథకం ద్వారా మంజూరైన గృహాలను వెంటనే నిర్మంచుకోవాలని మార్కాపురం గృహా నిర్మాణశాఖ ఈఈ కె బసవయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో పలు గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించుకోని లబ్దిదారుల పేర్లను తొలగించి నిబంధనల ప్రకారం అర్హులైన కొత్త లబ్దిదారులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికి పెద్దదోర్నాల మండలంలో 45, పెద్దారవీడు మండలంలో 135 గృహాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగత లబ్దిదారులు వీలైనంత త్వరగా గృహా నిర్మాణాల పనులు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ పథకంలో మొత్తం రూ 1.50 లక్షలు, వీటిలో ఉపాధి హామీ పథకం రూ 58 వేలు, ఆ నిధులలో ప్రభుత్వం నుంచి 80 బస్తాలు సిమెంట్ ఇస్తుందని, లభ్ధిదారుని వాటా 18 వేలు లోను కట్టాల్సి ఉంటుందని, మిగత డబ్బులు పూర్తిగా సబ్సిడీ వర్తిస్తుందని, పిఎంజివై పథకంలో రూ 2 లక్షలు వాటిలో ఉపాధి హామీ పథకంలో రూ 61,260 వేలు, ఈ నిధులలో 100 బస్తాలు సిమెంట్ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. బేస్మింట్ లెవెల్, రూప్ లెవెల్, రూఫ్ కాస్టెడ్, కంప్లీట్, మరుగుదొడ్డి దశల వారిగా బిల్లులు మంజూరు చేస్తామని, నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చేస్తున్నమన్నారు. త్వరలో జన్మభూమిలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి నియోజకవర్గానికి 2200 గృహాలు మంజూరు కావచ్చన్నారు. ఆయన వెంట పెద్దారవీడు ఏఈ నిరీక్షణబాబు ఉన్నారు. -
‘జన్మభూమి’ పాపం.. కార్యదర్శులకు శాపం
దెందులూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో మృతులకు పింఛన్లు ఇస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొందరు మృతులకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పంపిణీ చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. రూ.1.79 లక్షలు అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. పెదవేగి మండలంలో రూ.1.15 లక్షలు, దెందులూరు మండలంలో రూ.39 వేలు, ఏలూరు మండలంలో రూ.22 వేలు, పెదపాడు మండలంలో రూ.3 వేలు దుర్వినియోగమైనట్టు నిర్దారించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్లు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే గుడ్డిగా అందిస్తుండటంతో ముగ్గురు కార్యదర్శులు బలయ్యారు. దెందులూరు మండలంలోని దోసపాడు, కేఎన్ పురం, గాలాయిగూడెం గ్రామ కార్యదర్శులు శరత్, ప్రసాద్, అవినాష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పల్లచింతలపూడి గ్రామ కార్యదర్శిపై చర్యలకు పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదించారు. పై నాలుగు మండలాల్లో జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో నిధులు దుర్వి నియోగం జరిగినా దెందులూరు మండలంలో ముగ్గురిపై మాత్రమే వేటు వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఒత్తిడి మేరకే గ్రామ కార్యదర్శులు మృ తులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలూ ఉన్నా యి. ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి కారకులైన గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు అధికారులు ఆదేశించినట్టు తెలిసిం ది. దుర్వినియోగమైన మొత్తంలో 90 శాతం నగదును రాబట్టి ట్రెజరీకి జమచేశామని ఎంపీడీఓలు చెబుతున్నారు. ప్రతి పైసా రికవరీ చేస్తాం గ్రామ పంచాయతీల్లో మృతులకు పెన్షన్ సొమ్ము మంజూరు చేసి దుర్వినియోగం చేసిన వ్యవహారంలో ప్రతిపైసా ప్రభుత్వ ఖాతాకు జమయ్యేలా రికవరీ చేస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వపరంగా త్వరలోనే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ, ఏలూరు చర్యలు ప్రారంభించాం దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో మృతులకు పెన్షన్లు మంజూరు చేసి నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ ఆడిట్ అధికారులు ధ్రువీకరించారు. దెందులూరు మండలంలో ఇప్పటికే ముగ్గురు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఓ కార్యదర్శికి పెనాల్టీ విధించి చర్యల నిమిత్తం పంచాయతీరాజ్ కమిషనర్‌కు సమాచారం అందించాం. మిగతా మూడు మండలాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి -
మోసం తప్పా మేలేమి చేశారు!
- ఆయకట్టు రద్దుపై నోరు మెదపరెందుకు? - ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా? - మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం ఆత్మకూరు (రాప్తాడు) : అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో ప్రజలను టీడీపీ ప్రజాప్రతినిధులు మోసగించడమే తప్పా చేసిన మేలేమీ లేదని, ముఖ్యంగా పరిటాల సునీత మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. గత మూడు విడతల జన్మభూమి అర్జీలను పరిష్కరించలేని మంత్రి సునీత.. నాల్గో విడత సభల్లో ప్రజలు తనను నిలదీయకుండా ఉండేందుకు విపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరుస కరువులతో రైతులు, కూలీలు వలసలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలోనూ దాదాపు వంద కుటుంబాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోయాయని, ఇది మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి.. నియోజకవర్గంలోని 20 వేల మంది యువతకు మొండి చేయి చూపారన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే వెయ్యి మంది రేషన్‌డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను అన్యాయంగా తొలగించారని వివరించారు. రైతాంగ సమస్యలపై మంత్రికి ఏ మాత్రమూ అవగాహన లేదని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇలాంటి వైఖరి ఉన్న ఆమె ప్రజలకు ఎలా మేలు చేయగలరని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 15వేల ఇన్పుట్ సబ్సిడీ, సంపూర్ణ రుణమాఫీ, హంద్రీనీవా ద్వారా 74 వేల ఎకరాలకు నీటినిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం వంటి రైతుల డిమాండ్లపై మంత్రి ఎక్కడా నోరు మెదపడం లేదన్నారు. ‘హెచ్చెల్సీ నుంచి దాదాపు 15 టీఎంసీల నీరు ప్రతి ఏటా మనకు రాకపోయినా... దాని గురించి మీరు గానీ, మీ ముఖ్యమంత్రి గానీ కర్ణాటక ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఈ 15 టీఎంసీల నీటిని అప్పర్‡భద్ర కాలువ ద్వారా హంద్రీనీవా ఎగువన ఉన్న బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని చెరువులకు చేర్చే అవకాశం ఉన్నప్పటికీ మీరెందుకు ప్రయత్నం చేయరు’ అని మంత్రిని ప్రశ్నించారు. జీఓ నంబర్ 22 ద్వారా డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసినా, కుప్పంకు నీటిని తరలించడానికి రాప్తాడు ప్రాంత ఆయకట్టును ఫణంగా పెట్టినా మంత్రి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. 40 టీఎంసీలకు హంద్రీ- నీవా సామర్థ్యం పెంచి నీటిని కుప్పంకు తీసుకెళ్తే అర్థం ఉంది కానీ.. నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసి, తద్వారా మిగులు నీటిని తరలించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. -
‘జన్మభూమి’తో ప్రజలకు ఒరిగిందేమి లేదు
గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో పేదలకు ఒరిగిందేమి లేదని, ఊకదంపుడు ఉపన్యాస్యాలు తప్ప సమస్యల పరిష్కారం శూన్యమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. టీడీపీకి బీసీలు వెన్నెమొక అని చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వడ్డెర, వాల్మీకి, రజక, బెస్త, మేదర తదితర కులాలను ఎస్టీల్లో చేరుస్తానని, రూ.10 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చనపుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారని విశ్వసించాలని ఆయన ప్రశ్నించారు. -
జన్మభూమి అర్జీలు 1,15,482
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గోవిడత జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి 1,15,482 వినతులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గురువారం పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,003 పంచాయతీలు, 373 మున్సిపల్ వార్డులు మొత్తం 1,376 చోట్ల జన్మభూమి సభలు జరిగాయని తెలిపారు. రూరల్ పరిధిలో 71, అర్బన్ పరిధిలో 24 జన్మభూమి బృందాలు పని చేశాయని వివరించారు. సంక్రాంతి కానుకలు 10,27,800 మందికి, కొత్త రేషన్ కార్డులు 72,531 మందికి పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన 1,15,482 వినతుల్లో 79,969 ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. శాఖల వారీగా వచ్చిన వినతులు శాఖ వినతులు రూరల్ డెవలప్మెంట్ 179 రెవెన్యూ 11,166 పౌర సరఫరాలు 15,020 గృహ నిర్మాణ సంస్థ 28,477 మున్సిపల్ శాఖ 5,410 మున్సిపల్ ఆర్డీ 259 సెర్ఫ్ (పేదరిక నిర్మూలన) 15,906 ఉపాధి హామీ 435 ఆర్డబ్ల్యూఎస్ 442 పంచాయతీరాజ్ 1,088 విద్యుత్ 223 వ్యవసాయం 364 మొత్తం 978969 -
1.15 లక్షల వినతులు
- ముగిసిన జన్మభూమి - సమస్యలపై నిరసనలు, నిలదీతలు - పార్టీ కార్యక్రమంలా మార్చిన టీడీపీ నాయకులు అనంతపురం అర్బన్ : జిల్లాలో ఈ నెల రెండో తేదీ నుంచి చేపట్టిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమం బుధవారం ముగిసింది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై ప్రజల నుంచి 1.15 లక్షల వినతులు అధికారులకు అందాయి. జన్మభూమి ప్రారంభం నుంచి సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, ప్రజలు గ్రామసభల్లో నిరసనలు తెలిపారు. ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజలు నిలదీశారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ వేదికలుగా మార్చారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రజలపై, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల సభల నుంచి పోలీసులతో నెట్టించారు. అరెస్టు కూడా చేయించారు. సభల్లో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రభుత్వ పథకాలను పొగడడంతోనే సరిపెట్టారు. పలు చోట్ల అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. విపక్ష పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్న సర్పంచ్‌లు, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. + దళిత వర్గానికి చెందిన తనను అగౌరవ పరుస్తున్నారంటూ ఈ నెల 2వ తేదీన కంబదూరు మండలం నూతిమడగు జన్మభూమి సభలో సర్పంచ్ నరసింహులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డారు. + అనంతపురం నగరంలోని 33వ డివిజన్లో ఈ నెల 2న జన్మభూమి సభను ముగించుకుని కారులో వెళుతున్న కమిషనర్‌ను పింఛన్ కోసం మానసిక వికలాంగుడు ప్రకాశ్ గౌడ్ అడ్డుకున్నాడు. ఆ వెనుక వాహనంలో వచ్చిన టీడీపీ కార్పొరేటర్లు అతనిపై చేయిచేసుకున్నారు. + పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో ఈ నెల 3న పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన సభలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఉరవకొండ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు తదితరులు కోరగా.. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పారు. + ఈ నెల 4న శెట్టూరు మండలం కైరేవులో నిర్వహించిన సభలో ప్రారంభంలోనే ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ సర్పంచు జయమ్మఽ తదితరులు నిలదీశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులపై సర్పంచుకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. + ఈ నెల 5న తాడిపత్రి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు ఎందుకివ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో జరిగిన జన్మభూమిలో ప్రజా సమస్యలపై సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. వారిపై ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సమక్షంలో టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఆ గ్రామ సర్పంచు లక్ష్మి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివన్న సభా వేదిక ముందు నేలపైనే కూర్చుని నిరసన తెలిపారు. -
జన్మభూమి ఉద్రిక్తం
- ధ్వజమెత్తిన జాజరకల్లు - జన్మభూమి రద్దు - ‘అనంత’లో ఎమ్మెల్యే నిలదీత - పి.కొత్తపల్లిలో గ్రామసభ బహిష్కరణ - వజ్రకరూరులో అధికారులకు హితవు పలికిన ఎమ్మెల్యే విశ్వ - గుంతకల్లులో వికలాంగులు, వితంతువుల మండిపాటు అనంతపురం సిటీ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలు ఒకింత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. ప్రజా సమస్యలపై స్పందించడం లేదంటూ ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. చాలాచోట్ల వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. - కాలుష్యంతో గ్రామాలకు గ్రామాలు రోగాలతో పడకేశాయని, అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని డి.హీరేహాళ్ మండల పరిధిలోని జాజరకల్లు గ్రామం మొత్తం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మీ నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారులు. వృద్ధులు అనారోగ్యాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో 10 మంది దాకా చిన్నారులు కాలుష్యం కారణంగా జబ్బున పడ్డారని, అధికారులు మామూళ్లకు తలొగ్గి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన చెందారు. కాలుష్యం కోరల్లోంచి తమను, పొలాలను కాపాడతామని భరోసా ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదలనివ్వబోమని భీస్మించుకు కూర్చున్నారు. అయినా స్పందన రాకపోవడంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు తహశీల్దార్ మారుతిని నిర్బంధించారు. ప్రజలకు సమాధానం చెప్పలేని అధికారులు జన్మభూమిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. - పింఛన్లు, ఇళ్ల కోసం ఎన్నిమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదంటూ అనంతపురం నాల్గో డివిజన్‌వాసులు ఎమ్మెల్యే ప్రభాకరచౌదరిని అడ్డుకున్నారు. నేతల నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ పథకాలు తమకు అందకుండా పోతున్నాయని ఆగ్రహించారు. ఎమ్మెల్యే సర్ధిచెప్పే యత్నం చేసినా స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. - ఎన్పీ కుంట మండల పరిధిలోని పి.కొత్తపల్లిలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి ఆద్యంతం రసాబాసగా సాగింది. సోలార్ బాధితులకు పరిహారం అందించాలని అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల నుంచి సమాదానం రాకపోవడంతో వారు జన్మభూమిని బహిష్కరించారు. అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించారు. - మండల కేంద్రమైన వజ్రకరూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధికారులను నిలదీశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి నేతల చుట్టూ తిరిగే వైఖరిని విడనాడాలని హితవు పలికారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పాలని హౌసింగ్ ఏఈ షౌకత్అలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. - గతంలోనూ పింఛన్ల కోసం అనేకసార్లు అర్జీలు ఇచ్చామని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని గుత్తి 22వ వార్డు(చెర్లోపల్లి)లో వికలాంగులు, వితంతువులు అధికారులను నిలదీశారు. అర్జీలతోనే సరిపెడతారా అంటూ మండిపడ్డారు. -
ఫలితం లేని ‘జన్మభూమి’ ఎందుకు?
– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు : ప్రజాసమస్యలు పరిష్కారం కానప్పుడు ‘జన్మభూమి’ కార్యక్రమం ఎందుకని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మండలంలోని కమలపాడులో సర్పంచు యోగానంద అధ్యక్షతన ‘జన్మభూమి – మాఊరు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు విడతల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు ఇచ్చిన వినతులే పరిష్కారానికి నోచుకోలేదు..తిరిగి నాల్గో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇల్లూ నిర్మించలేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మించినట్లు తెలిపారు. ప్రజలు కరువుకాటకాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ‘అంతా డిజిటల్ మయం’ అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జన్మభూమి -మాఊరు సభల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచు యోగానంద, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు కమలపాడు వెంకటరెడ్డి, మన్యంప్రకాష్, నారాయణరెడ్డి, మండలనా యకులు శివరామిరెడ్డి, ఉస్మాన్, రాజగో పాల్, కూర్మన్న, మాబుపీరా, సుంకన్న, రామాంజనేయులు , మనోహర్, పీరా, పూజారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దాడులు..దౌర్జన్యాలు
– జన్మభూమిలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు - సమస్యలపై నిలదీస్తే భౌతికదాడులు – వంతపాడుతున్న అధికారులు, పోలీసులు –రెండోరోజూ నిరసనల హోరు అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం అధికార పార్టీ శ్రేణుల ఆగడాలకు వేదికగా మారింది. ప్రజలు సమస్యలను ప్రస్తావిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారు. అధికారులు, పోలీసుల ముందే రెచ్చిపోతున్నారు. దీంతో సమస్యలపై అర్జీలివ్వడానికి సైతం ప్రజలు జంకుతున్నారు.మంగళవారం జన్మభూమి రెండోరోజు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరననలు, నిలదీతలు, అరెస్టుల మధ్య సాగింది. పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, దుద్దేబండ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, ఇతర నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి సిద్ధపడ్డారు. ఇంతలో ప్రజలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు. సభలో ప్రసంగిస్తున్న ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి చేతిలోని మైకుని లాక్కుని బయటకు పంపించాలంటూ గొల్లపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రాజు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామానికి సంబంధం లేదని వ్యక్తులను సమావేశం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపి నాయకుడు రాజుతో పాటు ఎంపీపీ భర్త కేశవయ్య తదితరులు వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా ఎస్ఐ లింగన్నపై ఒత్తిడి చేసి సర్పంచ్ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వీరనారాయణరెడ్డి అనే నాయకుణ్ని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. స్టేషన్వద్ద వారిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పరామర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించారు. అలాగే ఉరవకొండలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సభలో అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. నాల్గవ విడత జన్మభూమి నిర్వహిస్తున్నా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వరా అంటూ జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పట్టణ కన్వీనర్ తిమ్మప్ప, జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్‌గౌడ్, ఎంపీటీసీ చందా చంద్రమ్మ ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేక పోలీసులను ఉసిగొలిపి బలవంతంగా అరెస్టు చేయించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ జన్మభూమి సభల్లో నిరసనలు, నిలదీతలు వెల్లువెత్తాయి. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, రెయిన్గన్ల పంపిణీలో వివక్షతపై శెట్టూరులో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని టీడీపీ కార్యకర్తలు, సర్పంచు, ప్రజలు నిలదీశారు. అర్హులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ కణేకల్లు మండలం జక్కలవడికి జన్మభూమి సభలో అధికారులను స్థానికులు ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని డి.హీరేహాళ్ మండలం మల్లికేతి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. పలుమార్లు అర్జీలిచ్చినా రుణమాఫీ కాలేదని బొమ్మనహాళ్ మండలం సిద్దారాంపురం గ్రామంలో అధికారులను రైతులు నిలదీశారు. శింగనమల మండలం పెరవలి గ్రామంలో రేషన్ కార్డులు తొలగించారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంబదూరు మండలం రాళ్లఅనంతపురంలో ఇంటి బిల్లులు, పింఛన్లు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది. -
జిల్లాకు 28వేల కొత్త పింఛన్లు
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లాకు 28వేల పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,07,143 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో వృద్ధాప్య 1,21,192, వితంతు 1,24,773, వికలాంగులు 39,548, చేనేత 3,519, కల్లుగీత 159, అభయహస్తం 17,902 మందికి ఇస్తున్నారు. వీరు కాకుండా గతంలో జన్మభూమి సభల్లో అందజేసిన 37,720 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో నియోజకవర్గానికి 2వేల చొప్పున మొత్తం 28వేల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల జాబితాను ఆయా మండలాల ఎంపీడీఓలు తయారు చేస్తున్నారు. ఎంపిక చేసిన వారి జాబితాను వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి గ్రామసభ/వార్డు సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పింఛన్లను లబ్ధిదారులకు ఫిబ్రవరి నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి గుంటూరు రూరల్ : గ్రామ సభలు జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఇక మీదట అలా జరిగితే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. నగరంలోని సీతానగర్ రెండో లైనులోని సర్పంచ్ల సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉన్న జన్మభూమి కమిటీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడనే ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ సభల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. గ్రామ స్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు, సమావేశాల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సర్పంచ్‌లకు సర్వహక్కులు ఇవ్వాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇళ్ల ప్లానులు, ఇతర ప్లానులు తదితర రెవెన్యూ అధికారాలు సర్పంచ్‌లకు కేటాయించాలని కోరారు. విద్యుత్ బిల్లులు, ఆర్థిక సంఘాల నిధుల వినియోగానికి ఈవోపీఆర్డీల కౌంటర్ సంతకాలను వెంటనే ఎత్తివేయాలన్నారు. సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్థి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కల్పించిన సర్పంచ్ల హక్కులను ప్రభుత్వాలు కాలరాయటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం సక్రమంగా అమలు జరిగేందుకు సహకరించాలని కోరారు. అనంతరం తమ సమస్యపై కలెక్టర్ కాంతిలాల్‌దండేకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌస్ సంధాని, గౌరవాధ్యక్షుడు కళ్ల పానకాలరెడ్డి, ఎస్సీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మన్నెం సుజాతకిషోర్, ప్రధాన కార్యదరిశ జగన్, నరసరావుపేట సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోగినేని వసుధ, చల్లావారిపాలెం సర్పంచ్ ఉగ్గం వెంకటేశ్వరరావు, ఓబులునాయుడు పాలెం సర్పంచ్ జి శివపార్వతి సుబ్బారావు, జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
దుష్ట సంప్రదాయం.. నీచ రాజకీయం
- జన్మభూమి వేదికలపై టీడీపీ జెండాలు, ఓడిన అధికారపార్టీ నేతలు - 'రంజాన్ తోఫా' అక్రమాల కాంట్రాక్టర్ కే సంక్రాంతి కానుక కాంట్రాక్ట్ మతలబేమిటి? - అధికార టీడీపీ తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ఫైర్ పట్నంబజారు(గుంటూరు): ప్రభుత్వం తలపెట్టిన జన్మభూమి కార్యక్రమం.. టీడీపీ నేతల పాలిట పునరావాసంగా మారిందని, ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ నేతలే జన్మభూమి వేదికలను ఆక్రమిస్తున్నారని, అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు పెట్టి దుష్టసంప్రదాయానికి తెరలేపారని అధికార తెలుగుదేశం తీరుపై మండిపడ్డారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారరెడ్డి వెంకటేశ్వర్లు. జన్మభూమి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అసలు పరిగణనలోకే తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ నీచ రాజకీయాలకు ఒడిగట్టుతున్నదని ఆరోపించారు. శుక్రవారం గుంటూరు నగరంలోని అరంగల్ పేటలోగల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఉమ్మారెడ్డి.. జన్మభూమి, సంక్రాతి కానుకల విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు. 'అధికార తెలుగుదేశం పార్టీ దుష్ట సంప్రదాయాలకు, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఓడిపోయిన అధికార పార్టీ నేతలు జన్మభూమి-మన ఊరు కార్యక్రమాల్లో వేదికలపై ఆశీనులవుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకుండా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ జెండాలు పెట్టడం దుష్టసంప్రదాయం' అని ఉమ్మారెడ్డి అన్నారు. గత రెండు విడతల జన్మభూముల్లో 33 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 5 లక్షల సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వం పేర్కొనగా, అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా 99శాతం సమస్యలను పరిష్కరించామని చెబుతుండటాన్ని బట్టే ఈ కార్యక్రమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదీ లేనిదీ అర్థమవుతున్నదని, అందుకే జన్మభూమి కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ ప్రజలు.. మంత్రులు, అధికాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఆర్భాటాలకు నిధులెక్కడివి? నిధుల కొరత కారణంగా కొన్ని పనులు చేయలేకపోతున్నామంటున్న సీఎం చంద్రబాబుకు నివాస ఏర్పాట్లు, ప్రత్యేక విమానాలు, విందు వినోదాలకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. చంద్రన్న కానుక కోసం రూ.360 కోట్లు కేటాయిస్తే, దానిలో రూ.180 కోట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు ముద్రించేందుకే ఖర్చయ్యాయన్నారు. 'రంజాన్ తోఫా' లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ కే సంక్రాంతి సరుకుల కాంట్రాక్టును అప్పగించడంలో మతలు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆఖరికి విద్యార్థులను కూడా వదలిపెట్టడం లేదని, గతంలో సేకరించిన విరాళాలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
‘జన్మభూమి’ని అడ్డుకున్న గ్రామస్థులు
చింతలపుడి: ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా.. అనవసరపు ఆర్భాటాలకు పోతుందని ఆగ్రహించిన గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడిలో గురువారం నిర్వహించనున్న జన్మభూమి- మా భూమి కార్యక్రమాలకు హజరైన అధికారులకు గ్రామస్థుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. గ్రామానికి వచ్చే రహదారి సరిగ్గా లేదని గత కొంత కాలంగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోని అధికారులకు తమ గ్రామంలోకి వచ్చే అధికారం లేదని వారిని గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. అనంతరం రహదారి లేకపోవడంతో.. గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు రహదారి నిర్మించిన ఆ తర్వాతనే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. -
పింఛన్లు ఇవ్వడం లేదంటూ సీఎం సభలో నిరసన
తిరుపతి కార్పొరేషన్ : అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదని తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జన్మభూమి గ్రామసభలో పలువురు వృద్ధులు, వికలాంగులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన జన్మభూమి సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు మీడియా గ్యాలరీ వరకు వచ్చారు. అర్హత ఉన్నా తమకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా రేషన్ కార్డులు కావాలని కొందరు, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని మరికొందరు నిరసన తెలిపారు. వామపక్ష, కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు తిరుపతిలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటారని భావించి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సమస్యలు తెలియజేసేందుకు సీపీఎం, సీపీఐ నాయకులు వేర్వేరుగా ర్యాలీ చేపట్టి సీఎం పాల్గొన్నసభకు బయలుదేరారు. వారిని మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా తిరుపతిలో హైకోర్టు ఏర్పాటుచేయాలని మూడు రోజులు కాంగ్రెస్ నాయకులు సంతకాలను సేకరించారు. ఈ నేపథ్యంలో వారు సీఎం సభను అడ్డుకుంటారని భావించి పీసీసీ కార్యదర్శి రుద్రరాజు శ్రీదేవిని ఉదయమే అరెస్టు చేసి చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత విడుదల చేశారు. -
కొమ్మువలసలో జన్మభూమి బహిష్కరణ
ఎల్‌ఎన్‌పేట: శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కొమ్మువలస గ్రామస్తులు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గురువారం గ్రామంలో జర్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే అర్హులకు గాకుండా అనర్హులకు, టీడీపీ సానుభూతి పరులకే సంక్షేమ పథకాలు అందిస్తుండటంతో గ్రామస్తులంతా కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి కార్యక్రమం వట్టి మోసపూరిత కార్యక్రమమని గ్రామస్తులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రామస్తులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. -
రెండు నిమిషాలకే జన్మభూమి వాయిదా..
రొంపిచర్ల: జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధికారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు నిమిషాలకే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విపర్లరెడ్డి పాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు తమ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎండీవో మండిపడ్డాడు. ఫ్లెక్సీని తొలగిస్తేనే జన్మభూమి కార్యక్రమం జరుపుతానని తేల్చి చేప్పాడు. కాగా, ఎండీవో తీరుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం కొద్ది గ్రామస్తులు ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే.. దాని గురించి ప్రజాసమస్యలను పరిష్కరించే కార్యక్రమాన్ని ఆపడమేంటని ప్రశ్నించారు. దీంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎండీవో తిరిగి రెండు నిమిషాలకే వాయిదా వేశారు. -
కర్మకొద్దీ బాబును గెలిపించారు: డీఎల్
అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం వైఎస్సాఆర్ జిల్లా ఖాజీపేటలోని జెడ్పీ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి - మాఊరు గ్రామసభకు ఆయన హాజరయ్యారు. అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో నిధులే కేటాయించనప్పుడు కొత్త ఇళ్లు ఎలా ఇస్తారని, పంట నష్టపరిహారం మాటేమిటని నిలదీశారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే, అర్హులైన మిగతా వారి సంగతేంటని ప్రశ్నించారు. కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకుని బతిమాలుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవసాయానికి రెండు విడతలుగా కాకుండా ఒకే విడత 7 గంటలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. -
ఫ్లెక్సీతో షాకిచ్చిన టీడీపీ నేత
తాళ్లరేవు : తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో సోమవారం ‘జన్మభూమి-మా ఊరు’ సందర్భంగా ‘సమస్యలను పరిష్కరించండి’ అంటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేని, అధికారులను కోరుతూ అధికార పార్టీ నాయకుడే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొరుపల్లి సత్యనారాయణమూర్తి (చిన్నబ్బాయి) ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఇంజరం హైస్కూల్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిధుల్లేక నిలిచిపోయిన అదనపు తరగతి గదులు, స్కూలుకు వచ్చే రహదారి అధ్వానస్థితిని చూపే ఫొటోలను ముద్రించారు. -
పోరు భూమి
నేటి నుంచి మూడో విడత జన్మభూమి సమస్యలు, హామీలపై నిలదీతకు ప్రజలు, విపక్షాల సన్నద్ధం పింఛన్లు, ఇళ్లు, కమిటీల పెత్తనం, రుణ మాఫీ తదితర సమస్యలపై ప్రశ్నించే అవకాశం విశాఖపట్నం : ‘జన్మభూమి మావూరు’ శుక్రవారం నుంచి మళ్లీ మొదలవుతోంది. తొలి రెండు విడతలు మొక్కుబడి తంతు గానే సాగగా.. ఈసారి మాత్రం తమపై వత్తిడి ఉం టుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హుద్‌హుద్ ప్రభావంతో తొలివిడత, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావంతో మలివిడత మొక్కుబడిగా సాగగా.. మూడో విడత మాత్రం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు.. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. అర్జీల చిట్టా కాకిలెక్కలే! టీడీపీ సర్కారు గద్దనెక్కిన తర్వాత 2014 అక్టోబర్‌లో తొలి జన్మభూమి తలపెట్టారు. హుద్‌హుద్ దెబ్బకు ఈ కార్యక్రమానికి ఆదిలోనే బ్రేకులుపడ్డాయి. ఆ తర్వాత నవంబర్‌లో కొనసాగించగా, తుపాను ప్రభావంతో అర్జీలు వెల్లువెత్తాయి. ఏకంగా 3.54 లక్షల అర్జీలు రాగా, వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను మాత్రమే అప్లోడ్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో 2015 జూన్‌లో మొక్కుబడిగా జరిగిన రెండోవిడత జన్మభూమిలో 20 వేల అర్జీలు మాత్రమే వచ్చాయి. రెండు విడతల్లో 3.74లక్షల అర్జీలు రాగా, 2.02,390 అర్జీలను అప్లోడ్ చేశారు. వీటిలో 1.81లక్షల అర్జీలను పరిష్కరించగా, ఇంకా 20,883 అర్జీలు పరిష్కరించాల్సి ఉందని లెక్కతేల్చారు. ఈ లెక్కలన్నీ కాకిలెక్కలుగానే కన్పిస్తున్నాయనే విమర్శలున్నాయి. కొత్త కార్డులు జారీ చేసినా.. టీడీపీ పగ్గాలు చేపట్టక ముందు జిల్లాలో 12.25 లక్షలకుపైగా బీపీఎల్ కార్డులుండేవి. ప్రస్తుతంవాటి సంఖ్య 10,28,800కు చేరింది. అంటే రెండు లక్షలకు పైగా కార్డులు వివిధ రూపాల్లో తొలగించేశారు. కొత్తకార్డుల కోసం 1.75 లక్షల మంది దరఖాస్తు చేస్తే 1.15 లక్షల కార్డులు మాత్రమే మంజూరు చేశారు. కాగా ఇప్పటివరకు ముద్రించిన కార్డులు కేవలం 70 వేల లోపే. కొత్తకార్డులను జన్మభూమి పంపిణీ చేయనుండగా మంజూరైన కార్డులందని వారు, కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డులు కోల్పోయిన వారు సైతం సభల్లో నిలదీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పింఛన్‌దారుల పాట్లు.. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జిల్లాలో 3.26 లక్షల పింఛన్లుండగా.. వడపోతల పేరిట పాతిక వేలకు పైగా పింఛన్లను తొలగించారు. ఆ తర్వాత కాల్‌బ్యాక్, కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు కలుపుకొని జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,24,585కు చేరితే గత మూడునెలల్లో ఆధార్ మిస్‌మ్యాచ్ పేరిట 28,287 పింఛన్లను నిలిపేశారు.మరో పక్క వరుసగా మూడునెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో జిల్లాలో సుమారు 5వేలకు పైగా పింఛన్లు రద్దుచేశారు. వీరంతా సభల్లో తమ గోడు వినిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ మీటింగ్‌లో పింఛన్ల విషయమై అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హౌసింగ్ పైనే దృష్టంతా.. హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ జీవీఎంసీ పరిధిలో 20.030 ఇళ్లు మంజూరు చేస్తే ఏకంగా 1.84 లక్షల మంది దరఖాస్తుచేసుకున్నారు. గ్రామీణజిల్లాకు 12,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికే 46,053 మంది అర్హులుగా లెక్కతేల్చి అప్లోడ్ చేశారు. కానీ ఈ జాబితాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాల్లో టీడీపీ కార్యకర్తలెవరో లెక్కతేల్చి వారికి మాత్రమే ఆమోదముద్ర వేయనుండడంతో అర్హులైన మిగిలిన బాధితులు సభలను వేదికగా చేసుకుని నిలదీసే అవకాశం ఉంది. ‘కొను’గోల్మాల్ ఇక జిల్లాలో ఖరీఫ్ కోతలు నూరుశాతం పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నేటివరకు ఎక్కడా కొనుగోలు ప్రారంభం కాలేదు. దళారీల చేతిలో అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయి. రూ.3 వేల పెట్టుబడి నిధి చాలామంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమకాలేదు.మరో పక్క 2015-16లో జమకావాల్సిన రెండో విడత రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి ఇంకా విడుదల చేయలేదు. హుద్‌హుద్ బాధిత రైతుల్లో చాలా మందికి ఇంకా పరిహారం జమకాని పరిస్థితి నెలకొంది. ఇంకా జిల్లా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రతీ పథకం లోనూ జన్మభూమి కమిటీల పెత్తనం.. వసూళ్ల దందా, ఎన్నికల హామీల అమలులో సర్కార్ వైఫల్యాలపై జన్మభూమి సభలను వేదికగా చేసుకుని యుద్ధభేరి మోగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతుండడం అధికారులకు చమటలు పట్టిస్తోంది. -
'అవినీతికి పాల్పడితే సహించేది లేదు'
హైదరాబాద్: అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జన్మభూమిని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేల వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. -
జన్మభూమి సభలో రైతు ఆత్మహత్యాయత్నం
తొట్టెంబేడు: చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం చిడత్తూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస జరిగింది. టీడీపీకి చెందిన వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని రామకృష్ణయ్య అనే రైతు ఆరోపించాడు. అనంతరం రామకృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆ రైతును చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
'జన్మభూమి'లో టీడీపీ కౌన్సిలర్ల బైఠాయింపు
చిత్తూరు: చిత్తూరు నగరపాలక సంస్థ 45వ వార్డులో ఆదివారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. తాగునీరు సక్రమంగా సరఫరా చేయలేదంటూ పట్టణ టీడీపీ కౌన్సిలర్లతో పాటు వారి అనుచరులు బైఠాయించారు. మంచి నీటి సరఫరా సరిగాలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. -
'జన్మభూమి'లో రసాభాస
తూర్పుగోదావరి(తొండంగి): తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్లు తీసేశారంటూ గ్రామంలో వృద్ధులు, వితంతువులు ప్రభుత్వాధికారులను నిలదీశారు. మాకు పింఛన్ మంజూరు చేస్తారా ? లేదా అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు సమాధానం చెప్పలేక అధికారులు వెనుదిరిగారు.