పార్వతీపురం (విజయనగరం జిల్లా)/చిత్తూరు: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని గోపాలపురం, అద్దపు శిల గ్రామాల్లో బుధవారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. పార్వలతీపురం ఎండీఓ కె. కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు ఈ రెండు గ్రామాల్లో జన్మభూమి నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోనూ జన్మభూమి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశమైంది.