
సాక్షి, అమరావతి/భీమవరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్‌కు వైఎస్సార్‌సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఓ ప్రకటనలో ఖండించారు.
ఈ సందర్బంగా ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించారు. కూటమి బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓడిపోవడం, విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టుగా ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు. రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ మద్దతుతో టీడీపీ అభ్యర్థులు గెలిచిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

Comments
Please login to add a commentAdd a comment