UTF
-
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి. 2025 మార్చి 29తో వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30న ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం పెంచుకునేందుకు.... రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి తమ సంఘం నుంచి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పీఆర్టీయూ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. యూటీఎఫ్ కూడా అదే పనిపై దృష్టి సారించింది. నెల రోజుల నుంచి సంఘ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తోంది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పీఆర్టీయూ ఉంది. సంఘంలోని నాయకుల్లో ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సంఘాన్ని వీడిన, సంఘం నుంచి సస్పెండ్ చేసిన నేతలను కూడా మళ్లీ చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో పీఆర్టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని సస్పెండ్ చేసిన సుంకరి బిక్షంగౌడ్‌తోపాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వారిని తిరిగి చేర్చుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇక యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ కూడా ఈనెలాఖరు వరకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. త్వరలోనే పీఆర్టీయూ అభ్యర్థుల ఖరారు పీఆర్టీయూ ప్రస్తుతం జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిని ఈనెలాఖరులోగా పూర్తి చేసి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వచ్చే నెల 7న నిర్వహించాలని నిర్ణయించింది. అందులో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున పోటీలో ఉండే వారి పేర్లను ఖరారు చేసే అవకాశముంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేయగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పులి సరోత్తంరెడ్డి రెబెల్‌గా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం పీఆర్టీయూ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావిస్తున్నట్టుగా సంఘంలో చర్చ సాగుతోంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో ఎవరిని ఖరారు చేస్తారన్నది మొదటి వారంలోనే తేలనుంది. మరోవైపు టీపీటీఎఫ్, యూటీఎఫ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. ఈసారి పార్టీల నుంచి పోటీ.. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీ తరఫున కూడా అభ్యర్థులను పోటీలో నిలుపుతారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఈసారి వరంగల్–ఖమ్మం– నల్లగొండ స్థానంలో పోటీచేయాలని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి భావిస్తున్నారు. ఆయనతోపాటు టీపీయూఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ –కరీంనగర్ స్థానంలో బీజేపీ నుంచి నరహరి లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పార్టీ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీచేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. -
చలో విజయవాడకు అనుమతి లేదు
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయలేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నగరంలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. -
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై .. సర్వత్రా ఆసక్తి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘వరంగల్ – ఖమ్మం – నల్లగొండ’ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారుతోంది. తమ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు పీఆర్టీయూ దృష్టి పెట్టినా, ఆ సంఘంలో నెలకొన్న ఇంటిపోరు అతి పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో శాసనమండలి సభ్యుడిగా గెలిచిన పూల రవీందర్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన మరోమారు పోటీ చేయడం కోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే, అధికార టీఆర్ఎస్ ఇంకా బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. మరో వైపు అదే సంఘంలో ఈసారి పోటీకి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వరంగల్‌కు చెందిన నరోత్తం రెడ్డి తాను పోటీలో ఉంటానని ప్రకటించడంతో పీఆర్టీయూలోని ఇంటిపోరు రచ్చకెక్కింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు గడ్డుపరిస్థితే ఎదురు కానుందని ఆ సంఘం ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు బరిఠి లోకి దిగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ దాకా నా మినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, శుక్రవారం యూటీఎఫ్ తరఫున ఆ సంఘ నాయకుడు నర్సి రెడ్డి నల్లగొండలో రెండు సెట్ల నామినేషన్లు దాఖ లు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ స్థానానికి దాఖలైన నామినేషన్ల సంఖ్య ఐదుకు చేరింది. పోటా ... పోటీ ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ గెలుపు ధీమాతో ఉంది. పీఆర్టీయూకు రెబెల్స్ బెడద ఉండడం తమకు కలిసొస్తుందన్న అంచనాలో ఆ సంఘ నాయకత్వం ఉంది. రాష్ట్ర నాయకుడు ఎ.నర్సిరెడ్డి నల్లగొండలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. మరో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ టీఎఫ్ కూడా పోటీలోకి దిగుతోంది. పీఆర్టీయూలో బుజ్జగింపుల పర్వం రెండో సారి కూడా బరిలోకి దిగుతున్న ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు యూనియన్‌లో కొంద రు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ఆ యూనియన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆయనకు ముళ్లబాటగా మారాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కోమటిరెడ్డి నర్సింహారెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఆయన కొద్ది రోజులు ప్రచారం కూడా చేశారు. ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఇబ్బందిగా మారడంతో అధికార టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని కోమటిరెడ్డి నర్సిరెడ్డిని దారికి తెచ్చుకున్నారని అంటున్నారు. జిల్లా నాయకత్వంతోపాటు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వంలోని ముఖ్యులు కొందరు నర్సింహారెడ్డిని బుజ్జగించారని చెబుతున్నారు. దీంతో పూల రవీందర్‌తో కలిసి ఆయన ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నల్లగొండ పరిస్థితిని చక్కదిద్ది కొంత అదుపులోకి తెచ్చుకున్నా.. వరంగల్‌కు చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి పోటీలో ఉంటున్నారని, ఆయన సొంతం జిల్లా వరంగల్‌లో ఓట్లు చీలడం ఖాయమని, ఈ పరిస్థితులు సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుపుపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. -
ఉద్రిక్తంగా మారిన యూటీఎఫ్ మహా పాదయాత్ర
-
టీచర్ల బదిలీల జీఓ విడుదల చేయాలి
– యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాబురెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : అక్రమ బదిలీల కోసమే ప్రభుత్వం టీచర్ల సాధారణ బదిలీలను ఆలస్యం చేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి ఆరోపించారు. స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యా సంవత్సరానికి ఆటంకం కల్గకుండా వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ బదిలీలను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సీసీఈ విధానంలో ఇంగ్లిషు, తెలుగు మీడియంలను పరిగణనలోకి తీసుకుని పోస్టులు సర్దుబాటు చేయాలన్నారు. అవసరమైతే కొత్త పోస్టులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఒకే సిలబస్, ఒకే పరీక్ష విధానం అనేది రాష్ట్రాల హక్కులు దెబ్బ తీయడమేనన్నారు. స్థానిక పరిస్థితులను గమనించకుండా డిటెన్షన్ విధానం అమలు చేయడం వల్ల డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం. సుధాకర్, ప్రధానకార్యదర్శి ఎస్వీవీ రమణయ్య, గౌరవాధ్యక్షులు నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు వెనుక వాస్తవాలపై విశ్లేషణ అవసరం
భీమవరం టౌన్: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యపరమైన హీనతతో బాధపడుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ చెడ్డదని, ఉపయోగం లేనిదని తాను చెప్పనని అయితే దానికి ముందుగా ఆర్థికవ్యవస్థ స్వరూపం మార్చాలని స్పష్టం చేశారు. భీమవరం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ‘పెద్దనోట్ల రద్దు.. ప్రజ లపై ప్రభావం’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన నాగేశ్వర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు దాని వెనుక ఉన్న వాస్తవాలపై ఆర్థిక విశ్లేషణ అవసరమన్నారు. పెద్దనోట్ల రద్దు సాహసం ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ చేయలేదు.. ప్రధాని మోదీ మాత్రమే చేశారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని నాగేశ్వర్ చెప్పారు. ఐరోపా దేశాల ఆర్థికకూటమి పెద్దనోట్లను గతంలో రద్దు చేసిందన్నారు. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు ఇదే మొదటిసారి కాదన్నారు. సామాన్యులు కూడా రూ.500 నోట్లు సంపాదిస్తున్నారని ఈ నోటు విలాసవస్తువో, సంపన్నులకు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ నగదురహిత ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని చెప్పి 40 రోజులు తిరగకుండానే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాటమార్చారన్నారు. నల్లధనం రూ.500, రూ.1,000 నోట్లు అయితే బొగ్గు, స్పెక్టమ్ర్, కామన్వెల్త్, పశుగ్రాసం, బోఫోర్స్, కేజీ బేసిన్, హర్షద్ మెహతా తదితర కుంభకోణాల్లో ఎన్ని లక్షల కోట్లు ఆ కుంభకోణాలకు పాల్పడిన వారి ఇళ్లల్లో దొరికాయని నాగేశ్వరరావు ప్రశ్నించారు. నగదు రహిత విధాన కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్నారని హ్యాక్ జరిగితే నెలకొనే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారో ఆయన చెప్పాలన్నారు. దేశంలో ఒక కోటి యాభై లక్షలు చిన్నదుకాణాలు ఉన్నాయని, స్వైపింగ్ మెషిన్లు 14 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. 90 శాతం రోడ్డు పక్క వ్యాపారాలు చేసేవారే ఉన్నారన్నారు. ఒక్కోటి 50 లక్షల దుకాణాలకు స్వైపింగ్ మెషిన్లు ఎప్పుడిస్తారు? ఈలోపు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సదస్సుకు యూటీఎఫ్ అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షత వహించారు. వివిధ సంఘాల నాయకులు గాతల జేమ్స్, చింతకాయల బాబూరావు పాల్గొన్నారు. -
ముగిసిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాలు
తాళ్లరేవు : రెండు రోజుల పాటు స్థానిక నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేఏసీ చైర్మ¯ŒS బూరిగ ఆశీర్వాదం తదితరులు హాజరయ్యారు. సీపీఎస్ పోరాటంలో పాల్గొంటామని, సీసీఈకి వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడతానని సూర్యారావు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో లక్షా 20 వేల సభ్యత్వాలుండగా, 15 వేల సభ్యత్వాలతో సంఘ జిల్లా శాఖ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా జి.ప్రభాకరవర్మ, అధ్యక్షునిగా డీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా టి.కామేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎ¯ŒS.అరుణకుమారి, జె.అప్పారావు, కోశాధికారిగా కేవీ ప్రసాద్‌బాబుతో పాటు మరో 19 మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కండి
ఆత్మకూరు: సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహులు పిలుపునిచ్చారు. పట్టణంలోని థెరిస్సా కళాశాలలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా జనరల్ కౌన్సిలర్ సమావేశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెపా్పరు. అనంతరం యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి తిక్కయ్య, కామేశ్వరరావు, మనోహర్, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్, రామశేషయ్య తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి ముందు యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నిర్మాతలు స్వర్గీయ రామిరెడ్డి, గురుస్వామిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు జనార్దన్‌రావు, మండల ప్రధాన కార్యదర్శి జాకీర్ హుసేన్, జిల్లా ఆడిటర్ రఫిక్, ట్రెజరర్ సుధాకర్, ఈశ్వరరెడ్డి, రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం ఉద్యమం
నెల్లూరు(టౌన్): హక్కుల కోసం మహిళా ఉపాధ్యాయులు ఉద్యమించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో శుక్రవారం యూటీఎఫ్ జిల్లా స్థాయి మహిళా టీచర్ల వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పేద బాలికలను తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. పేద విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా మహిళా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు డ్రాప్‌అవుట్స్‌ను మరింత పెంచేలా ఉన్నాయన్నారు. సీసీఈ విధానంలో పెరిగిన పనిభారం, వివరాలు అప్‌లోడ్‌తో వచ్చిన సమస్యలు, మహిళా సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అసోసియేట్ సభ్యులు, అధ్యక్షులు రమాదేవి, ఏపీ ఉమెన్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీదేవి, జిల్లా మహిళా కన్వీనర్ స్వర్ణలత, కో–కన్వీనర్ సుభాషిణి, ఏపీడబ్ల్యూటీఎఫ్ సభ్యురాలు మాధవిలక్ష్మీ పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానం వద్దు
ప్రొద్దుటూరు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి అమలులో ఉన్న కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీంను రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎస్.ఓబుళరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యూటీఎఫ్ కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ వెంటనే ఉత్తర్వులు అమలు అయ్యేలా చూడాలని, రూ.398లతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.లోకేశ్వరరెడ్డి, ప్రొద్దుటూరు అర్బన్, రూరల్, రాజుపాళెం, చాపాడు, దువ్వూరు మండలాలకు చెందిన యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు యూటీఎఫ్ కృషి
బాలాజీచెరువు (కాకినాడ) : ఉపాధ్యాయుల హక్కుల సాధనకు యూటీఎఫ్ కృషిచేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వేంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక యూటీఎఫ్‌హోంలో గురువారం విద్యాసదస్సు జరిగింది. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికా వంటి దేశాల్లో 12వ తరగతి వరకూ ఉచిత విద్యను కల్పిస్తుంటే ఇక్కడ మాత్రం విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత దిశగా ప్రభుత్వం ఉన్నందున ప్రజలే ఉద్యమించాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్సీ రామూ సూర్యారావు మాట్లాడుతూ గ్రామాల్లో లక్షల కొలది గుడులకు నిధులిస్తున్నారని, వాటిని బడులకు ఇచ్చి విద్యారంగాన్ని కాపాడాలన్నారు. అనంతరం పదవ తరగతిలో పదికి పది పాయింట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి 112 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వి.రాఘవులు, కార్యదర్శి టి.వి.కామేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జోనల్ వ్యవస్థను కొనసాగించాలి
నlల్లగొండ టూటౌన్ : తెలంగాణలో జోనల్ వ్యవస్థను కొనసాగించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న విద్యా సంస్థల్లోనే ఉపాధ్యాయులను కొనసాగించాలని కోరా రు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సరళ, ఎడ్ల సైదులు, లక్పతినాయక్, పి.వెంకటేశం, యాదయ్య, బి.అరుణ, సోంబాబు, రామలింగయ్య పాల్గొన్నారు. -
జోనల్ వ్యవస్థను కొనసాగించాలి
నlల్లగొండ టూటౌన్ : తెలంగాణలో జోనల్ వ్యవస్థను కొనసాగించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న విద్యా సంస్థల్లోనే ఉపాధ్యాయులను కొనసాగించాలని కోరా రు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సరళ, ఎడ్ల సైదులు, లక్పతినాయక్, పి.వెంకటేశం, యాదయ్య, బి.అరుణ, సోంబాబు, రామలింగయ్య పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు. సీపీఎస్ ద్వారా వసూలైన డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల అది కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి.వెంకటేశం, రామలింగయ్య, రాజశేఖర్, వీరాచారి, ఆంజనేయులు, సైదులు, రామారావు, సతీశ్, యాదయ్య, నరేశ్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చిలుకూరు: యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పలు పాఠశాల్లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షెన్ స్కీం) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయిలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుండూరి ప్రసాద్‌రావు, జిల్లా, మండల నాయకులు ఖాదర్‌పాషా, బావసింగ్, రమేష్‌బాబు, మూర్తి, కడారు సైదులు, టీఎల్ నరసింహరావు, ఆరె బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బదిలీలు విరమించుకోవాలి
కౌన్సిలింగ్‌కి విరుద్ధంగా ప్రభుత్వ బదిలీలు చేయడాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పీ. బాబురెడ్డిలు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో బదిలీలు జరిగేప్పుడు బదిలీల ఉత్తర్వులు ఇవ్వకుండా ఇప్పడు దొడ్డిదారిన బదిలీలతో టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ బదిలీలపై ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. హెల్త్‌కార్డుల అమలులో ఉన్న లోపాలను సవరించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే చేపట్టాలి ఉపాధ్యాయుల బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఏపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షులు బాపిరాజు, ప్రధాన కార్యదర్శి యం. రాజశేఖర్ రావులు డిమాండ్ చేశారు. సిఫార్సులతో బదిలీలు చేపడితే విద్యా వ్యవస్ధ నిర్వీర్యం అవుతుందని, వెంటనే బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలన్నారు. -
తక్షణమే పదోన్నతులు కల్పించాలి
శ్రీకాకుళం: ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తక్షణమే పదోన్నతులను కల్పించాలని లేని పక్షంలో ఆందోళన ఉ«ధృతం చేస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కోరుతూ మూడో రోజు ధర్నాను ఆదివారం రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా ఆశించిన రీతిలో పదోన్నతుల ఫైలులో కదలిక లేకపోవడం శోచనీయమన్నారు. పదోన్నతులతోపాటు సబ్జెక్టుల వారీగా రోస్టర్ పాయింట్ల జాబితా కాపీని విడుదల చేసి ప్రతి ఉపాధ్యాయునికి అందజేయాలని yì మాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్ పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, పి.సూర్యప్రకాశరావు, ఎస్ఎస్ ప్రధాన్, ఎ.చిన్నవాడు, టి.వైకుంఠరావు, పి.మోహనరావు, డీవీ సత్యనారాయణ, వి.త్రినాథరావు, బి.శ్రీకాంత్, అర్జునరావు, కనకరాజు, రామదాసు, బి.వెంకటరావు, టి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
4న కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
విజయవంతానికి యూటీఎఫ్ పిలుపు శ్రీకాకుళం : జిల్లా పరిషత్ పీఎఫ్ సమస్యలు, రిమ్స్ కార్యాలయంలో మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 4న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి మోహనరావు, చౌదరి రవీంద్ర, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సంపతిరావు కిశోర్‌కుమార్ తెలిపారు. ధర్నాకు సంబంధించి యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పీఎఫ్ ఆన్లైన్ ప్రక్రియ సుదీర్ఘ కాలంగా నడుస్తుందని, సంవత్సరాల తరబడి ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల వివరాలు లేకపోవడంతో తీవ్ర గందరగోళంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పీఎఫ్ సబ్స్క్రిప్షన్ సక్రమంగా జమ అవుతున్నదీ, లేనిదీ తెలియడం లేదన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి వివరాలు అప్డేట్ చేయడానికి ఇన్నేళ్లా? అని ప్రశ్నించారు. జెడ్పీ సీఈవో మీనమేషాలు లెక్కిస్తూ ఏవో కథలు చెబుతున్నారని, కానీ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కో-ఆర్డినేటర్ సమావేశాలు నిర్వహించి హామీలు ఇస్తున్నారు కానీ మళ్లీ యథాతథ స్థితి వుందని పేర్కొన్నారు. అలాగే మెడి కల్ రీయింబర్స్మెంట్ సమస్యల విషయంలో రిమ్స్ అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బిల్లుల్లో కోత సహేతుకంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారమై రిమ్స్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ఏ పోరాటం చేస్తే దాన్ని భగ్నం చేయాలని రిమ్స్ యంత్రాంగం విఫలయత్నం చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుందన్నారు. ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాల ని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ నాయకులు సనపల తిరుపతిరావు, బమ్మిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది చలనం లేని ప్రభుత్వం : యూటీఎఫ్
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి చలనం లేదు. చర్మం మందం... చిన్నపాటి ధర్నాలు చేస్తుంటే దులుపుకుపోతుంది. కదిలించాలంటే పెద్ద పోరాటాలే చేయాలని యూటీఎఫ్ ధర్నాలో ఎమ్మెల్సీ గేయానంద్ పిలుపునిచ్చారు. మెరిట్‌ని ఉపాధ్యాయులకు కాదు.. తన ప్రభుత్వంలోని మంత్రులకు, ప్రజలకు సేవ చేయకుండా దోచుకుంటున్న ఎమ్మెల్యేకు చంద్రబాబు ఇచ్చుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ విద్యని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఓబుళు ధ్వజమెత్తారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జిలాన్ అధ్యక్షతన ధర్నాకు వారితో పాట రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ఉద్యోగుల, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నాన్పుడు ధోరణి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి చర్మం మందం. సాధారణ ఆందోళనలు చేస్తే దులుపుకుపోతుంది. దిగిరావాలంటే పెద్ద ఎత్తున్న పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు కానీ చలనం రాదన్నారు. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్లో మెరిట్ మెలిక పెట్టారు. ఎవరికి మెరిట్ ఇస్తారు... ముందు మీ మంత్రులకు మెరిట్ ఇచ్చి తొలగించండి. గెలిపించిన ప్రజలకు సేవ చేయకుండా తినడానికే పనిచేస్తున్న మీ ఎమ్మెల్యేలకు ఏమి మెరిట్ ఉందని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఉపాధ్యాయులను బదిలీ చేసుకుంటే తప్పేంటని అనడానికి మంత్రి పత్తిపాటి పుల్లారావుకి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 15 సమస్యలు ఏళ్లగా ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూనే ఉందన్నారు. ఒకవైపు కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దిగిరావాలంటే అన్ని వర్గాలకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యతను వివరించి, వారిని కలుపుకుని పెద్ద ఎత్తున్న పోరాటం చేయాలని అన్నారు. ఓబుళు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ విద్యని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జయరామప్ప మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ని రాజధాని పేరుతో అమరావతి చుట్టూ గుమ్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, సీనియర్ నేత రిటైర్డ్ ఉద్యోగి ఇమాం సాహెబ్, నాయకులు రామకృష్ణ, జనార్ధన్, సాయి, తిప్పయ్య, వేణుగోపాల్‌రెడ్డి, అదిశేషు, రాజన్న, నాగేంద్ర, జయచంద్ర, రమణయ్య, కె.నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ జిల్లా సదస్సు
విజయవాడ: నగరంలోని యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారందరినీ క్రమబద్ధీకరించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత, వేతనాల పెంపు, తదితర డిమాండ్లపై చర్చించారు. ప్రభుత్వం త్వరితగతిన తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
30న మోడల్ డీఎస్సీ
ఒంగోలు టౌన్: డీవైఎఫ్ఐ, యూటీఎఫ్, టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన మోడల్ డీఎస్సీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులు 20రూపాయల ఎన్రోల్మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒంగోలులోని ఎల్బీజీ భవన్, యూటీఎఫ్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మోడల్ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎఫ్ బాబు, వి. బాలకోటయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి. వీరాంజనేయులు, పి. రమణారెడ్డిలు కోరారు. -
నీతి, నిజాయితీ బతికే ఉన్నాయ్
నిడదవోలు : ‘యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఎన్నికల ప్రచారం కోసం ఏ కాలేజీకి.. ఏ పాఠశాలకు వెళ్లినా ఉపాధ్యాయులు, నా వద్ద చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఆదరించారు. వారి సొంత ఖర్చులతో నన్ను ప్రచారానికి తీసుకెళ్లారు. నీతి, నిజాయితీలు ఇంకా బతికే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు నిరూపించారు. నా విజయానికి కారణమైన యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడతా’నని ఎమ్మెల్సీగా ఎన్నికైన రాము సూర్యారావు అన్నారు. శుక్రవారం రాత్రి నిడదవోలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత ప్రవక్తలు, మహనీయుల స్ఫూర్తితో, మనిషిలో దేవుడుంటాడనే నమ్మకంతో తన సొం త ఆస్తిని సైతం అమ్ముకుని వేలాది మంది పేద విద్యార్థులను చదివించానని చెప్పారు. వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆనందం వ్యక్తం చేశారు. సీఆర్ రెడ్డి కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసినప్పటి నుంచి పేద రోగులకు సేవ చేస్తున్నానని, తనకు వచ్చే రూ.42 వేల పింఛను మొత్తాన్ని కూడా పేదలకు అవసరమైన మందుల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఏ పేద రోగికి వైద్యం అందకపోయినా తాను సహాయపడతానన్నారు. పేద విద్యార్థులకు సాయం అందిస్తూనే ఉంటానన్నారు. ఏ పేద విద్యార్థి అయినా ఆర్థిక ఇబ్బం దుల వల్ల మధ్యలో చదువు ఆగిపోతే తనను సంప్రదిస్తే సహాయపడతానన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే శాసనమండలిలోనే కాకుండా బయట కూడా పోరాటాలు చేస్తానన్నారు. ఆయన వెంట యూటీఎఫ్ నాయకులు జయకర్, గంగాధర్, సురేష్‌బాబు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, సుందరబాబు ఉన్నారు. -
మనం..మనం..ఒకే గణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల సమీకరణలు, ఎత్తుకు పైఎత్తులు ప్రారంభమయ్యాయి. యూటీఎఫ్ మద్దతుతో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, టీడీపీ మద్దతుతో ఏఎస్ రామకృష్ణ పోటీ చేస్తున్నారు. మూడోసారి పోటీ చేస్తున్న లక్ష్మణరావుకు ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభిస్తుండటంతో, గెలుపే ధ్యేయంగా టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. వివిధ సామాజిక వర్గాల్లో పేరు ప్రతిష్టలు కలిగిన ఆ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వాటికి అదే సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఆహ్వానించి పార్టీ మద్దతు పలికిన ఏఎస్ రామకృష్ణకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతోంది. ఆదివారం గుంటూరులోని గ్రాండ్ నాగార్జున హోటల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమావేశం జరిగింది. దీనికి టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ యాదవ సామాజిక వర్గానికి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తోందని, యాదవ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇదే విధంగా టీడీపీలో ఇతర సామాజిక వర్గాల నేతలు ఆ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుంటే, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చేసిన సేవలే తనను గెలిపిస్తాయనే భావనతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రచారంలో దూసుకువెళుతున్నారు. బీసీ వర్గాల నుంచి మూడో అభ్యర్థి .. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యం కానున్నది. తాజాగా దళిత, గిరిజన, బీసీ సంఘాల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 18,006 మంది ఓటర్లు ఉండగా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఓట్లు 10 వేల వరకు ఉన్నాయి. తమ వర్గాల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితే కనీసం ఆరు వేల ఓట్లు పడినా గెలుస్తాడనే భావనలో ఈ సంఘాలు ఉన్నాయి. ఈ వర్గాల నుంచి దీటైన అభ్యర్థిని నిలిపే బాధ్యతను న్యాయవాది వైకేకు అప్పగించారు. అభ్యర్థి ఎంపికపై ఈ వర్గాలు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయానికి వస్తామని వైకే ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. -
ఎన్నికలకు సన్నద్ధం
ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్‌కు దీటుగా ఇతర అసోసియేషన్లు మద్దతుపై మల్లగుల్లాలు పడుతున్న టీడీపీ నేతలు జనవరి 16న విడుదల కానున్న ఓటర్ల తుది జాబితా గుంటూరు మార్చిలో జరుగనున్న కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయ సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో యుటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ యూనియన్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణరావు గెలుపునకు ప్రధాన కారణమైంది. ప్రస్తుత ఎన్నికలకు ఎస్టీయూ, పీఆర్టీయూ మరికొన్ని సంఘాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వీటితోపాటు ప్రధాన రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ ఆరునెలల్లో ప్రజల ఆశలను వమ్ము చేసింది. ఎన్నికల హామీల అమలుకు అనేక కొర్రీలు వేస్తుండటంతో టీడీపీ అసలు రంగును ప్రజలు గుర్తించారు. మేధావి వర్గానికి చెందిన ఉపాధ్యాయులు పార్టీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా తీర్పును ఇవ్వకపోతే దాని ప్రభావం పాలనపై పడే అవకాశాలు ఉన్నాయి. నేడు టీడీపీ నేతల సమావేశం.. ఈ విషయాన్ని ముందే గుర్తించిన టీడీపీ నేతలు ఇప్పటి నుంచే ఉపాధ్యాయ సంఘాలతో సమాలోచనలు చేస్తున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకునేందుకు టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయమై ఆదివారం పార్టీ నాయకులు సమావేశం కానున్నారు. సంఘాలు బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? పార్టీ నేరుగా అభ్యర్థిని బరిలోకి దింపాలా అనే విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదు. జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులు రానున్నాయి. వీటికోసం పార్టీలో అనేక మంది ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావు పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన మరోసారి గెలవాలనే కాంక్షతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దీనిని గమనించి టీడీపీ అప్రమత్తమైంది. గత ఎన్నికల సమయానికి రెండు జిల్లాల పరిధిలో మొత్తం 12,850 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో గుంటూరులో 6,800 మంది, కృష్ణా జిల్లాలో 6,050 మంది ఓటర్లు ఉన్నారు. మార్చిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటీవల దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం జనవరి 5న విడుదల చేయనుంది. అనంతరం జనవరి 16న తుది జాబితా విడదల చేయనున్నారు. 2009 నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారితో కొన్ని ఓట్లు రద్దు కావడంతో పాటు, కొత్తగా చేరిన ఓటర్లతో కలుపుకుని 14 వేల మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. యూటీఎఫ్ బలంతో గెలిచిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రస్తుతం యూటీఎఫ్, సీపీఎం పక్షాన అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాలనే లక్ష్యంతో గత కొద్ది నెలలుగా ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మంతనాలు సాగిస్తున్నారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని, అప్పటి వరకు దీనిపై దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు లేవని ఆ పార్టీకి చెందిన జూపూడి రంగరాజు స్పష్టం చేశారు. -
యూటీఎఫ్ నారాయణ కారుకు ప్రమాదం
భార్య మృతి ఆయన పరిస్థితి విషమం నల్లగొండ జిల్లాలో ఘటన కట్టంగూర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలోని సవుళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగాటి నారాయణ భార్య మృతి చెందగా నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ, భార్య అమృత(52) కలసి కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం పెద్దబీరవెల్లికి బయలుదేరారు. కారును నారాయణ నడుపుతుండగా కట్టంగూర్ శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. అదే సమయంలో హైదరాబాద్‌కు కట్టెల లోడుతో వెళుతున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారులోని నారాయణ, అమృత ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మొదట 108 సిబ్బంది అమృత చనిపోయిందని భావించి నారాయణను మాత్రమే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్ది సేపటి తర్వాత హైదరాబాద్‌కు వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటనస్థలం వద్ద ఆగి...హైవే సిబ్బందిని గట్టిగా మందలించడంతో కొన ఊపిరితో ఉన్న అమృతను అంబులెన్స్లోకామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నారాయణ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.