ఒంగోలు టౌన్: డీవైఎఫ్‌ఐ, యూటీఎఫ్, టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన మోడల్ డీఎస్సీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులు 20రూపాయల ఎన్‌రోల్‌మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒంగోలులోని ఎల్‌బీజీ భవన్, యూటీఎఫ్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మోడల్ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎఫ్ బాబు, వి. బాలకోటయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి. వీరాంజనేయులు, పి. రమణారెడ్డిలు కోరారు.
30న మోడల్ డీఎస్సీ
Published Fri, Apr 24 2015 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM