
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు సోమవారం యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని డీవైఎఫ్‌ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనలకు దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు.
ఇదీ చదవండి: ఖమ్మం బీఆర్‌ఎస్‌కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు??
Comments
Please login to add a commentAdd a comment