DYFI
-
సినిమా థియేటర్ ఎదుట - డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆందోళన
-
ప్రగతి భవన్ ముట్టడికి ‘డీవైఎఫ్ఐ’ యత్నం.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు సోమవారం యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని డీవైఎఫ్ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనలకు దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ఖమ్మం బీఆర్ఎస్కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు?? -
మోదీకి వ్యతిరేకంగా ఆందోళన
సేలం: చదువుకున్న యువకులు పకోడీ విక్రయించైన బతకవచ్చని తెలిపిన మోదీ వ్యాఖ్యను ఖండిస్తూ సేలం రైల్వేస్టేషన్లో డైఫీ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం సేలం రైల్వే స్టేషన్లో పకోడి పంపిణీ చేశారు. తర్వాత స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులను పక్కను తోసివేసి రైల్వే స్టేషన్లోకి చొరబడి, రైల్వే పట్టాలపై బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో యువకులకు అవకాశం కల్పించాలి, రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాని విరమించాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు 63 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న డైఫీ నేతలు, కార్యకర్తలు -
బేటా ఉఠో.. బేటా గుర్మిత్..!
‘బేటా ఉఠో.. బేటా గుర్మిత్! జర ఆంఖే ఖోలోకర్ దేఖో.. యా గురునానక్.. జర రహెం కరో.. మేరే బేటేకో బచావో’ అంటూ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కళ్లముందే రైలు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే కన్న పేగు వేదనకు అంతు లేకుండా పోయింది. బిడ్డను ప్రాణాలతో చూడాలనుకుని పరితపించింది. కనిపించని దేవుళ్లను ప్రార్థించింది. ఉఠోరే గుర్మిత్ అంటూ గుండెలవిసేలా రోదించింది. చివరకు తన ఒడిలోనే ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని హత్తుకుని బోరున విలపించింది. సాక్షి, అనంతపురం: తల్లిని రైలు ఎక్కించే క్రమంలో తనయుడు కాలుజారి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. కళ్లెదుటే కన్న కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వివరాల్లోకెళితే.. పంజాబ్‌లోని ఫసిల్‌కా జిల్లా బలేల్‌కాకమల్ గ్రామానికి చెందిన గుర్మిత్‌సింగ్ (30) కేకే ఎక్స్‌ప్రెస్‌లో తన తల్లి బీబీకి ఆపరేషన్ చేయించేందుకు ఢిల్లీ నుంచి పుట్టపర్తికి బయలుదేరాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో కేకే ఎక్స్‌ప్రెస్ అనంతపురం వచ్చింది. దాహంగా ఉండటంతో తల్లీకొడుకులు స్టేషన్లో దిగారు. కాసేపటికే రైలు కదిలింది. దీంతో గుర్మిత్‌సింగ్ అతని తల్లి బీబీ పరుగులు తీశారు. ఈ క్రమంలో తల్లిని రైలెక్కించే క్రమంలో గుర్మిత్‌సింగ్ రైల్వే ట్రాక్, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. కాలు రైలు కింద పడడంతో తీవ్రంగా దెబ్బతింది. శరీరంపై రైలు ఒత్తిడి ఎక్కువ పడడంతో గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు రైల్వే ట్రాక్‌కు, రైలుకు మధ్య చిక్కుకుని గుర్మిత్‌సింగ్ మృతి చెందడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కేకే ఎక్స్‌ప్రెస్‌ను పది నిమిషాలపాటు ఆపేశారు. గుర్మిత్‌సింగ్ తల్లి బీబీ తలకు తీవ్రగాయమై బాధపడుతున్నా రైల్వే అధికారులు కానీ, సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందితే రైల్వే అధికారులు, సిబ్బంది కనీసం తొంగిచూడకపోవడంపై డీవైఎఫ్ఐ నాయకులు బాలకృష్ణ మండిపడ్డారు. మృతుడి తల్లికి తీవ్రగాయమైనా ఆస్పత్రికి తరలించేందుకు కూడా ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు కూడా అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్‌పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్‌పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
'డీఎస్సీలో 8792 పోస్టులు భర్తీ చేయాల్సిందే'
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు మేరకు డీఎస్సీ నియామకాలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు 8792 పోస్టులు భర్తీ చేయాలని చెబితే రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో 342 ఉద్యోగాలకు కోత పెట్టి 8,452 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోందని డీవైఎఫ్ఐ అధ్యక్షుడు ఎం.విప్లవ్‌కుమార్ ఒక ప్రకటలో విమర్శించారు. కేవలం సుప్రీంతీర్పులోని పోస్టులే కాకుండా తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీని నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా తిరుపతి
హన్మకొండ చౌర స్తా : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా జిల్లాలోని రేగొండ మండలంలోని బా గిర్థిపేట గ్రామానికి చెందిన దొగ్గెల తిరుపతి ఎన్నికయ్యారు. 10, 11వ తేదీల్లో నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ సభలలో జరిగిన రాష్ట్ర నూతన కార్యవర్గంలో తిరుపతి ఉపాధ్యక్షుడిగా ఎన్నిౖMðనట్లు బాధ్యులు తెలిపా రు. తిరుపతి దశాబ్దకాలానికి పైగా ఎస్ఎఫ్ఐలో జిల్లా, రాష్ట్ర కమిటీల్లో వివిధ పదవులలో కొనసాగారు. విద్యార్థి సమస్యల పై రాజీలేని పోరాటాలు చేసిన తిరుపతి, డీవైఎఫ్ఐలో రెండేళ్ళుగా నిరుద్యోగ సమస్యల పై పోరాటాలు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికై జిల్లా డీవైఎఫ్ఐ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా తిరుపతి
హన్మకొండ చౌర స్తా : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా జిల్లాలోని రేగొండ మండలంలోని బా గిర్థిపేట గ్రామానికి చెందిన దొగ్గెల తిరుపతి ఎన్నికయ్యారు. 10, 11వ తేదీల్లో నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ సభలలో జరిగిన రాష్ట్ర నూతన కార్యవర్గంలో తిరుపతి ఉపాధ్యక్షుడిగా ఎన్నిౖMðనట్లు బాధ్యులు తెలిపా రు. తిరుపతి దశాబ్దకాలానికి పైగా ఎస్ఎఫ్ఐలో జిల్లా, రాష్ట్ర కమిటీల్లో వివిధ పదవులలో కొనసాగారు. విద్యార్థి సమస్యల పై రాజీలేని పోరాటాలు చేసిన తిరుపతి, డీవైఎఫ్ఐలో రెండేళ్ళుగా నిరుద్యోగ సమస్యల పై పోరాటాలు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికై జిల్లా డీవైఎఫ్ఐ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యువజన విధానం ప్రకటించాలి
కోదాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యువజన విధానం ప్రకటించాలని భారత యువజన ప్రజాతంత్ర సమాఖ్య(డీవైఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి కె. భాస్కర్ డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రోజులుగా కోదాడలో జరుగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. రా్రçష్టంలో 20–30 సంవత్సరాల వయస్సు కలిగి చదువుకున్న యువత 30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలు కల్పించలేక పోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించక పోవంతో అవి నిర్వీర్యంగా మారిపోతున్నాయని, దీనిని సాకుగా తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు పేద తల్లి దండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. కేజీ టు పీజీ విద్య విధానంపై ప్రభుత్వం తన విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి మార్జిన్‌మనీ లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలను మంజూరు చేయాలని కోరారు. ఈసమావేశంలో న ర్సింహారావు, రవినాయక్, ఎస్కె. బషీర్, కుక్కడపు ప్రసాద్, పి. శ్రీనివాస్,ముత్యాలు, కె. శ్రీనివాస్, కె. వెంకటనారాయణ, చంద్రం, రాధాకృష్ణ, సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యువతను నిర్వీర్యం చేస్తున్న పాలకులు
కోదాడ : యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, వీరి అసమర్థ పాలన వల్ల యువశక్తులు నిర్వీర్యం అవుతున్నాయని డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అభయ్ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో జరుగుతున్న డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల్లో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యావ్యవస్థను కార్పొరేట్ రంగానికి అప్పగించి సామాన్యులకు అందని వస్తువుగా విద్యను తయారు చేశారని ఆరోపించారు. అందరికి విద్యను అందించాలనే రాజ్యాంగమౌళిక సూత్రాలకు పాలకులు తిలోదకాలు ఇచ్చారన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ వనరులు, యువశక్తులు భారతదేశానికి ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకుంటే మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారుతుందన్నారు. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరిచి పుష్కరాలు, నిమజ్జనాలు, బతుకమ్మ పండుగల అంటూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనుత్పాదక రంగాలకు ఖర్చు చేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ఉపాధి కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టాలని యువ శక్తులను సక్రమంగా వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతతకు మారు పేరుగా ఉండే యూనివర్సిటీల్లో కేంద్ర పాలకులు తమ రాజకీయాలను జొప్పించి అశాంతి నిలయాలుగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న ఢిల్లీలో జరిగే దళిత ర్యాలీలో డీవైఎఫ్ఐ పాల్గొంటుందన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని వారికి ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏ. విజయ్‌కుమార్, కె భాస్కర్, జిల్లా కార్యదర్శి జె. నర్శింహారావు, కుక్కడపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
కోదాడ : డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను సెప్టెంబర్ 10,11వ తేదీల్లో కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.విప్లవ్‌కుమార్ తెలిపారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్లో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభలలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ ముఖర్జీ, జాతీయ ఉపాధ్యక్షుడు కె.భాస్కర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. మహాసభల విజయవంతం కోసం ఈ సందర్భంగా పలు కమిటీలను నియమించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహారావు, నాయకులు ఖాదర్, కిశోర్, భద్రయ్య, రాధాకష్ణ, ముత్యాలు, కేవీ.భద్రం తదితరులు పాల్గొన్నారు. -
డీవైఎఫ్ఐ జిల్లా కార్యవర్గం
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్ల నాగరాజు, జి.తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.భీమాసాహెబ్ తెలిపారు. మంగళవారం నగరంలో డీవైఎఫ్ఐ 4వ జిల్లా మహాసభలలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జి.టి నాయక్, జి.శివరాజు, దిలీప్, సహాయ కార్యదర్శులుగా భాస్కర్‌నాయక్, భానేష్, రాము, కమిటీ సభ్యులుగా రాజు, సూర్య, చిరంజీవి, ప్రేమ్‌కుమార్, కాసీమ్, సంతోష్, శ్రీకాంత్ ఎన్నికయ్యారు. -
పాలనలో ప్రభుత్వాల విఫలం
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు గూడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన, అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం డీవైఎఫ్ఐ 18వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భందా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లధనాన్ని బయటకు తీస్తామని చెప్పిన బీజేసీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రధాన మంత్రి మోడీ విదేశ పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తూ పారిశ్రామిక రంగాన్ని విస్మరిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే జీవన భృతి కల్పిస్తామని బాబు ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, కార్యదర్శి కిరణ్, సుధీర్, ప్రసాద్, శివ పాల్గొన్నారు. -
వందేమాతరం..!
70 అడుగుల త్రివర్ణ పతాకంతో డీవైఎఫ్ ప్రదర్శన గుంటూరు వెస్ట్: బ్రిటీష్ పాలకుల పీడన నుంచి విముక్తి పొందేందుకు సాగిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఉద్ఘాటించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్ నుంచి లక్ష్మీపురం సెంటర్ వరకు 70 అడుగుల త్రివర్ణ పతాకంతో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతం సాగించిన ఈ ప్రయాణంలో భారత ప్రజలు హుందా జీవితం గడిపేందుకు, దారిద్య్రం నుంచి బయటపడేందుకు ఆర్థిక, సామాజిక దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అలుపెరగని పోరాటం చేశారన్నారు. -
పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని ధర్నా
ఏలూరు(సెంట్రల్) : పోలీసు శాఖలో ఉద్యోగాలకు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తు సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా స్థానిక జిల్లా గ్రంథాలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్ మాట్లాడుతూ 2011 తరువాత తిరిగి ఈ ఏడాదిలోనే 4,548 పోస్టులకు ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసిందని, దీంతో ఇంతకాలం ఉద్యోగంపై ఆశతో కోచింగ్ తీసుకున్న వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనే అవకాశం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిపికే షన్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు జాప్యం చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందని శివకుమార్ విమర్శించారు. తక్షణమే ఐదేళ్ల వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్‌ను కలిసి వినితపత్రాన్ని ఇచ్చారు. ధర్నాలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ సమస్యపై యువత ఉద్యమించాలి
ఆత్మకూరురూరల్ : నిరుద్యోగ సమస్యపై యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడతా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని చెర్లో రమణారెడ్డి భవన్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. 14 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం 4,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ను విడుదల చేశారని, ఇందులోనూ అనేక సమస్యలున్నాయన్నారు. ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కానిస్టేబుల్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1, 2 పోస్టుల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పాలకులు యువతను మోసం చేస్తున్నారన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈనెల 14వ తేదీన జిల్లా మహాసభ జరుగుతుందని, ఇందులో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. -
డీవైఎఫ్ఐ మహా సభలను విజయవంతం చేయాలి
కోదాడఅర్బన్: ఆగస్టు నెల చివరి వారంలో కోదాడ పట్టణంలో నిర్వహించే డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు సంఘం కార్యకర్తలు కృషి చేయాలని ఆ సంఘం డివిజన్ కార్యదర్శి కాసాని కిశోర్ కోరారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవనలో జరిగిన ఆ సంఘం డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలుచేయడంలో విఫలమైందన్నారు. ఎంసెట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలలో చర్చింనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్ అధ్యక్షుడు ఎస్కె.ఖాదర్, సభ్యులు కేసగాని భద్రయ్య, లెనిన్‌బాబు, వెంకటనారాయణ, వినోద్, చినరాములు, నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
డీవైఎఫ్ఐ మహాసభలను విజయవంతం చేయాలి
మునగాల: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు షేక్ ఖాదర్ కోరారు. ఈ సమావేశాన్ని పట్టణంలో ఆగస్టు తొలి వారంలో నిర్వహిస్తామన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువజనోద్యమాల సారథి, ఐక్యపోరాటాల వారధి డీవైఎఫ్ఐ తొలి రాష్ట్ర మహాసభలకు చారిత్రాత్మక పోరాటాల పురిటిగడ్డ కోదాడ పట్టణం వేదిక కానున్నదని వివరించారు. ఈ తొలి రాష్ట్ర మహాసభల ఏర్పాటుకై బుధవారం కోదాడలో జరిగే సన్నాహాక సమావేశంలో మండలం నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఖాదర్ పిలుపునిచ్చారు. -
సీఎం చుట్టూ మరింత బిగుస్తున్న ఉచ్చు
తిరువనంతపురం: సోలార్ స్కాం లో ప్రధాని నిందితుడు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో చెలరేగిన ఆందోళన ఉద్రిక్తతను రాజేసింది. ముఖ్యమంత్రిపై కేసులు నమోదు చేయాలని కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఊమెన్ చాందీ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, ప్రజాసంఘాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. డివైఎఫ్ఐ, తదితర కార్యకర్తలు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. తక్షణమే చాందీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు సెక్రటేరియట్ వద్ద బారికేడ్లను తొలగించి లోనికి వెళ్లేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత రాజుకుంది. పోలీసులకు, కార్యకర్తలకుమధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. సోలార్ స్కాంలో ప్రధాన నిందితులైన సరితా నాయర్, రాధా కృష్ణన్-తమకున్న రాజకీయ పలుకుబడితో సౌర విద్యుత్ పానెల్‌ను చవకగా అందిస్తామని నమ్మించి పారిశ్రామికవేత్తల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ సిఎం వ్యక్తిగత సిబ్బంది ఏడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని జస్టిస్ శివరాజన్ కమిటీ ముందు ఆరోపించడంతో ముఖ్యమంత్రి చుట్టూ సోలార్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసును విచారిస్తున్న త్రిసూర్ కోర్టు - ప్రాథమిక ఆధారాలను పరిశీలించి -ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో ప్రతిపక్షాలు సోలార్ స్కాంను అస్త్రంగా చేసుకుని ఊమెన్ చాందీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు తనపై ఆరోపణలు చేసిన సరితా నాయర్ పై ఊమెన్ చాందీ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
చెవిలో పూలతో నిరసన
నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగులు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఖాళీలుగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. -
'నిరుద్యోగ పోరాటాలకు మద్దతివ్వాలి'
మునగాల : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించే నిరుద్యోగుల పోరాటాలకు తెలంగాణ ఎమ్మెల్యేలు మద్దతు పలికి భాగస్వాములు కావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ పిలుపునిచ్చారు. మునగాలలో మూడు రోజుల పాటు కొనసాగుతున్న డీవైఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులలో భాగంగా బుధవారం స్థానిక అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత పోరాట త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆగస్టు నెలంతా తెలంగాణ నిరుద్యోగలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ‘ఉద్యోగాలిచ్చుడో- కేసిఆర్‌ను గద్దెదించుడో’ అనే నినాదంతో ఉద్యమించనున్నట్లు భాస్కర్ తెలిపారు. మునగాల మండలంలో డీవైఎఫ్ఐ డివిజన్ నాయకుడైన బొంత శ్రీనివాసరెడ్డి, జూలకంటి ఉపేందర్రెడ్డిలను హత్యచేసిన రౌడీలతో చేతులు కలిపి ఈ ప్రాంత ప్రజాతంత్ర ఉద్యమాలను, త్యాగాలను అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. డీవైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు జె.నర్సింహారావు అధ్యక్షత వ హించిన ఈ సదస్సుకు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.విప్లవకుమార్, రైతుసంఘం జిల్లా నాయకులు బి.శ్రీరాములు, బెల్లంకొండ సత్యనారాయణ, సీపీఎం పార్టీ నాయకులు ఆరె.రామకృష్ణారెడ్డి, దేవరం(లిఫ్ట్)వెంకటరెడ్డి, సొంపంగు జానయ్య , చిర్రా శ్రీనివాస్, స్వరాజ్యం, సుందరం తదితరులు పాల్గొన్నారు. -
30న మోడల్ డీఎస్సీ
ఒంగోలు టౌన్: డీవైఎఫ్ఐ, యూటీఎఫ్, టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన మోడల్ డీఎస్సీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులు 20రూపాయల ఎన్రోల్మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒంగోలులోని ఎల్బీజీ భవన్, యూటీఎఫ్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మోడల్ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎఫ్ బాబు, వి. బాలకోటయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి. వీరాంజనేయులు, పి. రమణారెడ్డిలు కోరారు. -
రైల్వే బడ్జెట్ వల్ల ఉపయోగం శూన్యం
విజయనగరం ఫూల్‌బాగ్ : రైల్వే బడ్జెట్ వల్ల రాష్ట్రానికి గాని జిల్లాకు గాని ఒరిగిందేమీ లేదని అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహనరావు అన్నారు. బడ్జెట్‌కు నిరసనగా బుధవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేలో దేశ వ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 4 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడం అన్యాయమన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన మోడీ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు నేరుగా ఒక్క ట్రైన్ కూడా లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం కూలీలు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం నుంచి ట్రైన్ వేయాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందన్నా రు. ప్రతి ఆరు నెలలకొకసారి రైల్వే చార్జీలు పెం చేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు త్రినాథ్, శ్రీరామ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.గణేష్, సరేష్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రకు మొండిచేయి విజయనగరం ఫూల్‌బాగ్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. స్థానిక బాలగంగాధరరావు భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బడ్జెట్ వల్ల ప్రజలపై భారం పడిందన్నారు. కనీసం జిల్లా నుంచి ఒక్క రైలు కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. రైళ్లు నడిపే విభాగం మినహా మిగతా విభాగాలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇది ఎంతమత్రం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఉత్తరాంధ్రకు ఎటువంటి ప్రాజెక్టులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. వీక్లీ ట్రైన్స్ (నాగావళి, బిలాస్పూర్, సమత, యశ్వంత్‌పూర్, తిరుపతి)ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. -
కదంతొక్కిన విద్యార్థులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా స్థానిక హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా గేట్లువేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులంతా రోడ్డుపైనే బైఠాయించడంతో అరగంటకుపైగా రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు అక్కడకు వచ్చి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంతకుముందుగా విద్యార్థులనుద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ మాట్లాడుతూ ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలవుతున్నా ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరిం చకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిధులు ఉన్నప్పటికీ ఖర్చు చేయకుండా చోద్యం చూస్తున్నారన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వారు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని ఏంజాయ్ చేస్తున్నారన్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను కూడా సకాలంలో విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నారన్నారు. కొన్ని నెలలకు సంబంధించిన కాస్మోటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విద్యార్థులకు కేటాయించిన నిధులను వారికే వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్‌ను ముట్టడించినట్లు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీ బాలకోటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం ఫీజులు మాత్రం పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. విద్యార్థులకు సంబంధించి మూడు కోట్ల రూపాయల బడ్టెట్ ఉన్నా.. అధికారులు వాటిని ఖర్చు చేయడం లేదన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వసతి గృహాలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు విన్నవించేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులు ఉండటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు అధికారులు, పాలకులను విద్యార్థులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు కే సుబ్బరావమ్మ మాట్లాడుతూ బాలికల వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాలికల వసతి గృహాలకు ఎలాంటి రక్షణా లేకపోవడంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో అధికారులతో సమావేశం... విద్యార్థుల సమస్యలపై రెండురోజుల్లో అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టరేట్ పరిపాలనాధికారి జ్వాలానరసింహం హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతామని, విద్యార్థులు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ప్రారంభించేలా బ్యాంకులకు ఆదేశాలిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ నగర కార్యదర్శి అత్తంటి శ్రీనివాసరావు, గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి రాపూరి శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు టీ మహేష్, పీ కిరణ్, వీ అంజిబాబు, పీ ప్రవీణ్, పీ ఏసురత్నం, నగర అధ్యక్ష, కార్యదర్శులు పీ రాంబాబు, సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.