వందేమాతరం..!
వందేమాతరం..!
Published Sun, Aug 14 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
70 అడుగుల త్రివర్ణ పతాకంతో డీవైఎఫ్ ప్రదర్శన
గుంటూరు వెస్ట్: బ్రిటీష్ పాలకుల పీడన నుంచి విముక్తి పొందేందుకు సాగిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఉద్ఘాటించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్ నుంచి లక్ష్మీపురం సెంటర్ వరకు 70 అడుగుల త్రివర్ణ పతాకంతో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతం సాగించిన ఈ ప్రయాణంలో భారత ప్రజలు హుందా జీవితం గడిపేందుకు, దారిద్య్రం నుంచి బయటపడేందుకు ఆర్థిక, సామాజిక దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అలుపెరగని పోరాటం చేశారన్నారు.
Advertisement
Advertisement