పాలనలో ప్రభుత్వాల విఫలం | Governments failure in governance | Sakshi
Sakshi News home page

పాలనలో ప్రభుత్వాల విఫలం

Published Mon, Aug 15 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

పాలనలో ప్రభుత్వాల విఫలం

పాలనలో ప్రభుత్వాల విఫలం

 
  • డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు 
గూడూరు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన, అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం డీవైఎఫ్‌ఐ 18వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భందా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లధనాన్ని బయటకు తీస్తామని చెప్పిన బీజేసీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రధాన మంత్రి మోడీ విదేశ పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తూ పారిశ్రామిక రంగాన్ని విస్మరిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే జీవన భృతి కల్పిస్తామని బాబు ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, కార్యదర్శి కిరణ్, సుధీర్, ప్రసాద్, శివ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement