governments failure
-
హోదా విషయంలో ప్రభుత్వాలు విఫలం
వింజమూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ, సాధించడంలో టీడీపీ పూర్తిగా విఫలమయ్యాయని మాజీ జెడ్పీ చైర్మన్, ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పి.చెంచలబాబుయాదవ్ విమర్శించారు. స్థానిక ఆర్అండ్బి అతి«థి గృహంలో గురువారం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, టీడీపీ మంత్రుల తీరు చూస్తే ప్రత్యేక హోదా రాదని తేలిపోయిందన్నారు. హోదా సంజీవని కాదని, హోదాతో అన్ని సమస్యలు పరిష్కారం కావని బీజేపీ నేతలు అనడం దారుణమన్నారు. రాష్ట్రంలో 2014 ఎన్నికల ప్రచారంలో 5 చోట్ల బహిరంగ సభల్లో నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకుని, ప్రస్తుతం 5 కోట్ల ఆంధ్రులను నయవంచనకు గురిచేశారన్నారు. వీరికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రధానమంత్రి దేశంలో మాట తప్పడం 70 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రధమమన్నారు. ఏడు సార్లు జిల్లాకు చంద్రబాబు వచ్చినా ఒరిగిందేమీ లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నాయన్నారు. ఆయన వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి బయ్యపురెడ్డిచెన్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోడెందుల వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సుమన్ ఉన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం
పశువులపై ఉన్న ప్రేమ మనుషులపై లేదు ముద్రగడ స్వగృహంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు కిర్లంపూడి : పేదరిక నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, పశువులపై ఉన్న ప్రేమ మనుషులపై లేదని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం కిర్లంపూడిలో కాపు ఉధ్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రెండు సంవత్సరాల కాలపరిమితి తరువాత చంద్రబాబు ఇచ్చిన హామీల కోసం కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపే హక్కు ముద్రగడకు ఉందని, అటువంటి హక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రభుత్వ బలంతో అణచి వేయడానికి కుట్ర పన్నారన్నారు. దీక్షా సమయంలో చూడటానికి ఎవరూ వచ్చిన అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఆ సమయంలో రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడను చూడటానికి అనుమతినివ్వకపోవడంతో ఈ రోజు పరామర్శించడానికి వచ్చానన్నారు.S అమలాపురంలోని సుధాపాలెం ఘటన ఎంతో కలచివేసిందన్నారు. సుధాపాలెం ఘటన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పేదరిక నిర్మూలనకు పొలాలు పంపిణీ, నిరుద్యోగులకు రాబడి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట అడపా శ్రీహరి, పోలు కిరణ్‌రెడ్డి, గుర్రం గౌతమ్ తదితరులు ఉన్నారు. -
పాలనలో ప్రభుత్వాల విఫలం
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు గూడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన, అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం డీవైఎఫ్ఐ 18వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భందా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లధనాన్ని బయటకు తీస్తామని చెప్పిన బీజేసీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రధాన మంత్రి మోడీ విదేశ పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తూ పారిశ్రామిక రంగాన్ని విస్మరిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే జీవన భృతి కల్పిస్తామని బాబు ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, కార్యదర్శి కిరణ్, సుధీర్, ప్రసాద్, శివ పాల్గొన్నారు.