Published
Sun, Sep 11 2016 8:08 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
యువజన విధానం ప్రకటించాలి
కోదాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యువజన విధానం ప్రకటించాలని భారత యువజన ప్రజాతంత్ర సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి కె. భాస్కర్ డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రోజులుగా కోదాడలో జరుగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. రా్రçష్టంలో 20–30 సంవత్సరాల వయస్సు కలిగి చదువుకున్న యువత 30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలు కల్పించలేక పోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించక పోవంతో అవి నిర్వీర్యంగా మారిపోతున్నాయని, దీనిని సాకుగా తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు పేద తల్లి దండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. కేజీ టు పీజీ విద్య విధానంపై ప్రభుత్వం తన విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి మార్జిన్‌మనీ లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలను మంజూరు చేయాలని కోరారు. ఈసమావేశంలో న ర్సింహారావు, రవినాయక్, ఎస్‌కె. బషీర్, కుక్కడపు ప్రసాద్, పి. శ్రీనివాస్,ముత్యాలు, కె. శ్రీనివాస్, కె. వెంకటనారాయణ, చంద్రం, రాధాకృష్ణ, సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.