డీవైఎఫ్‌ఐ మహా సభలను విజయవంతం చేయాలి | DYFI meetins must sucussful | Sakshi
Sakshi News home page

డీవైఎఫ్‌ఐ మహా సభలను విజయవంతం చేయాలి

Published Sun, Jul 31 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

డీవైఎఫ్‌ఐ మహా సభలను విజయవంతం చేయాలి

డీవైఎఫ్‌ఐ మహా సభలను విజయవంతం చేయాలి

 కోదాడఅర్బన్‌: ఆగస్టు నెల చివరి వారంలో కోదాడ పట్టణంలో నిర్వహించే డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు సంఘం కార్యకర్తలు కృషి చేయాలని ఆ సంఘం డివిజన్‌ కార్యదర్శి కాసాని కిశోర్‌ కోరారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవనలో జరిగిన ఆ సంఘం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలుచేయడంలో విఫలమైందన్నారు. ఎంసెట్‌ పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలలో చర్చింనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్‌ అధ్యక్షుడు ఎస్‌కె.ఖాదర్, సభ్యులు కేసగాని భద్రయ్య, లెనిన్‌బాబు, వెంకటనారాయణ, వినోద్, చినరాములు, నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement