వచ్చే నెలలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు | DYFI statelevel metings in september 10, 11th | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

Published Tue, Aug 30 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

వచ్చే నెలలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

వచ్చే నెలలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

కోదాడ : డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను సెప్టెంబర్‌ 10,11వ తేదీల్లో కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.విప్లవ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభలలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్‌ ముఖర్జీ, జాతీయ ఉపాధ్యక్షుడు కె.భాస్కర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. మహాసభల విజయవంతం కోసం ఈ సందర్భంగా పలు కమిటీలను నియమించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహారావు, నాయకులు ఖాదర్, కిశోర్, భద్రయ్య, రాధాకష్ణ, ముత్యాలు, కేవీ.భద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement