kodad
-
దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
-
దద్దమ్మలా నోరు మూసుకుని ఉన్నారు.. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ ఫైర్
సాక్షి, సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నాయకులు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారనేది ఆలోచించాలని పేర్కొన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మస్త్రమని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పంటపొలాలు ఎండాలా, పండాలా? అనేది నిర్ణయిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. గోల్మాల్ చేసి దిగువకు తీసుకొచ్చారు తెలంగాణ రాకముందు 2003లో సాగర్ నీళ్ల కోసం రైతులు తన దగ్గరకు వచ్చినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రస్తావించారు. నాగార్జున సాగర్ పేరు నదిగొండ ప్రాజెక్టని తెలిపారు. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా.. గోల్మాల్ చేసి 20 కిలోమీటర్లు దిగువకు తీసుకొచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అన్నారు. దద్దమ్మల్లా మారు మాట్లాడలేదు మనం కట్టాలనుకున్న ప్రాజెక్టును ఆపిందెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపితే నోర్మూసుకొని కూర్చున్నదెవరని నిలదీశారు.. ఇంత జరుగుతున్నా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకుని పడి ఉన్నారని అన్నారు. దద్దమ్మల్లా మారు మాట్లాడలేదని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే తెలంగాణకు అన్యాయం జరిగింది ‘2001లో నేను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసిన దాక అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో మంత్రులు లేకుండెనా..? చాలా మంది ఉండె. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో ఎవరూ కొట్లాడలేదు. నల్గొడ జిల్లాకు నీళ్లు తేలేదు. రైతులు కోరితే మొన్న సాగర్‌నుంచి నీళ్లు విడుదల చేశాం. మరోసారి నీళ్లను విడుదల చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ను రప్పించాలని కోరుతున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే రెండు పంటలు పండుతాయి. మల్లయ్య యాదవ్ గెలవరంటూ చాలామంది అన్నారు. గెలవకున్నా పర్లేదు.. టికెట్ ఇస్తానని అని చెప్పాను. మలమలయ్య యాదవ్‌ను గెలిపిస్తే కోదాడలో బీసీ భవన్ కట్టిస్తా. నీళ్ల కోసం కోదాడనుంచి హలియా వరకు పాదయాత్ర చేశా. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష. డీకే శివకుమార్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ కాళేశ్వరం నీళ్లు కోదాడలో కనిపించడం లేవని భట్టి విక్రమార్క అంటున్నారు. కాంగ్రెస్ ఉంటే గోదావరి నీళ్లు ఇక్కడి వరకు వచ్చేవా?. రైతుల కోసం 24 గంటలు ఇస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు 3 గంటలే కరెంట్ చాలని మాట్లాడుతున్నారు. కరెంట్ మూడు గంటలు కావాలా? 24 గంటలు కావాలా?. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మొదటికే మోసం వస్తుంది’ అని కేసీఆర్ మండిపడ్డారు -
కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్‌టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు... కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్: నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు : ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు భౌగోళిక పరిస్థితులు.. ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం. నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. -
అసలు కట్టప్పలు వేరే ఉన్నారు: ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట: సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సతీమణి పద్మావతిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీని వెనుక పార్టీకి చెందిన ముఖ్యుల హస్తం ఉందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఫిర్యాదుతో అరెస్టయిన వారు చిన్న వారని, వారి వెనుక ఉన్న అసలు కట్టప్పలు త్వరలో బయటకు వస్తారన్నారు. తన సతీమణి పద్మావతి ఎయిర్‌పోర్టులో యాధృచ్చికంగా కొంత మంది బీఆర్ఎస్ మహిళా నేతలను కలుసుకుంటే.. ఆమె బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో వసతి కల్పించారంటూ ఎయిర్‌పోర్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఉత్తమ్ అన్నారు. కొంత కాలంగా తమను కావాలనే బదనాం చేస్తున్నారని, వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ‘మీ అందరికీ తెలుసు. మాకు పిల్లలు లేరు. మీరే మా కుటుంబం అని రాజకీయం చేస్తున్నాం. మాకు వేరే వ్యాపకం, వ్యాపారం లేదు. 24 గంటలూ ప్రజా జీవితం, రాజకీయమే’అని ఆయన తెలిపారు. కోదాడలో 50 వేల మెజారిటీ రావాలి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి అధికార పార్టీని చిత్తుగా ఒడిద్దామని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ -
ఒక్క ఓటు తగ్గినా గుడ్‌బై
కోదాడరూరల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ఈ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 1994లో ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసి కోదాడ రాజకీయాల్లోకి వచ్చానని, 1999 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచినా కోదాడ, హుజూర్నగర్, హైదరాబాద్‌ల్లో అద్దె ఇంటిలోనే ఉంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఒక్కసారి గెలిచినవారే కోట్ల రూపాయలు పెట్టి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే వారి అవినీతి, దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీవో, జిల్లా అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని, వారు చెప్పిన వారికే పనులే చేస్తున్నారని విమర్శించారు. అలాంటి అధికారులు, నాయకులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని( పార్టీ మార్పును ఉద్దేశించి), వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఉత్తమ్ చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురికావద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. -
మే 26న వివాహం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
కోదాడ: కష్టపడి చదివి.. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ .. వివాహం కోసం స్వదేశం వచ్చిన ఆ యువకుడు పెళ్లి చేసుకొని 16 రోజులు పండుగ జరుపుకోవాలనే సంతోషంలో ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంభాలలో తీరని విషాదం మిగిల్చిన సంఘటన పలువురిని కలిచి వేచింది. గురువారం నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అడపా పృథ్వీ (27) కుటుంబం మొత్తం విషాదంలో కూరుకొని పోయింది. కోదాడకు చెందిన అడపా రాజేందర్ కుమారుడు పృథ్వీ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న విజయవాడ సమీపంలోని కీలేశ్వరపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం కావడంతో మే నెలలో ఇండియాకు వచ్చారు..మేనెల 26న వివాహం జరిగింది. గత సంవత్సరం కరోనా సమయంలో యువతి తల్లిదండ్రులు మరణించడంతో మేనమామలు దగ్గరుండి వీరి వివాహం జరిపించారు. చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..) ఈనెల 10న పదహారు రోజుల పండుగ జరగాల్సి ఉంది. 11న కెనడా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో హలియాలో ఉన్న చిన్ననాటి మిత్రుడిని కలవడానికి తండ్రితో కలిసి వెళ్లాడు. గుగూల్ మ్యాప్ పెట్టుకొని వెళ్లడంతో అది మిర్యాలగూడ మీద నుంచి కాకుండా నకిరేకల్ మీదుగా చూపించడంతో నకిరేకల్ నుంచి నల్లగొండ మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో నల్లగొండ– నకిరేకల్ మధ్యలో మూల మలుపువద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. పదహారు రోజుల పండుగ చేసుకుంటామనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు నూతన వధువు పృథ్వీ మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పృథ్వీ అమ్మమ్మ గతంలో కోదాడ పంచాయతీ వార్డు మెంబర్‌గా పని చేసింది. పృథ్వీ తండ్రి కోదాడలో కిరోసిన్ డీలర్ కాగా తల్లి లెనిన్‌కుమారి గృహిణి. ఇతడికి చెల్లెలు ఉంది. శనివారం కోదాడలో పృథ్వీ అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. -
సూర్యాపేట: కోదాడ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం
-
షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్
Fans Gave Shock To Anupama Parameswaran: ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు ఫ్యాన్స్ షాకిచ్చారు. సోమవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటిచ్చింది. అనంతరం ఆమె తిరుగు ప్రయణమవుతుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్, స్థానికులు ఎగబడ్డారు. చదవండి: త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్ అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో తను కాసేపు ఇక్కడే ఉండాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్లలో గాలి తీశారట. దీంతో ఫ్యాన్స్ తీరుకు అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో షాపు నిర్వాహకులు అనపమకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారట. కాగా అనుపమ చివరిగా ‘రౌడీ బాయ్స్’లో సందడి చేసింది. తాజాగా ఆమె నటించిన ‘18 పేజెస్’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘కార్తికేయ 2’, ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: టికెట్ రేట్ల గురించి వేడుకుంటే తప్పేం కాదు: చిరంజీవి -
నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..
సాక్షి, ఖమ్మం రూరల్ : నువ్వే నా లోకం.. అంటూ ప్రేమ పేరిట దళిత యువతి వెంట పడిన యువకుడు, శారీరకంగా ఒక్కటైన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్‌రోడ్డులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. కోదాడ క్రాస్‌రోడ్డులో నివసిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన గునిగంటి పవన్‌కృష్ణ, భద్రాద్రి జిల్లా చర్లకు చెందిన దళిత యువతి సీహెచ్. దీప్తిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా, శారీరకంగా కలవడంతో దీప్తి గర్భం దాల్చింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా పవన్‌కృష్ణ కాలయాపన చేస్తుండడంతో ఈనెల 15న ఆయన ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టింది. ఆ సమయాన పవన్‌కృష్ణ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో దీక్ష విరమించినా ఆ తర్వాత ఫలితం లేకపోవడంతో బుధవారం పురుగుల మందు తాగింది. దీంతో రూరల్ పోలీసులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దీప్తి మాట్లాడుతూ.. తనను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసిన పవన్ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తల్లిదండ్రులు కూడా లేని తనకు న్యాయం చేయాలని తెలిపారు. గతంలో అబార్షన్ చేయించుకోవాలని సూచించగా, భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంతో పాటు చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాక కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్న పవన్‌కృష్ణ, తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఈమేరకు అధికారులు స్పందించిన పవన్‌తో తన పెళ్లి జరిపించాలని ఆమె కోరారు. -
వాట్ యాన్ ఐడియా.. లారీ కాదండోయ్.. ఫైవ్ స్టార్ స్టైల్ హోటల్!
సాక్షి, కోదాడరూరల్(నల్గొండ) : వారికొచ్చిన ఓ ఐడియాతో లారీని ఫైవ్‌స్టార్ లుక్‌లో హోటల్‌గా తయారు చేశారు.. ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్ పాత లారీని కొనుగోలు చేసి దానిని ప్రయాణికులను, ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి హోటల్‌గా మార్చారు. దానిని హైదరాబాద్ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్‌రోడ్‌లో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం టిఫిన్, ఫాస్ట్ ఫుడ్‌తో పాటు పలు రకాల టీలు, కాఫీలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే రెస్టారెంట్ తరహాలో రూపొందించి అన్ని రకాల తినుబండారాలు అందిస్తామని అంటున్నారు. ఈ హోటల్ రహదారిపై వచ్చిపోయే ప్రయాణికులు వాహనాలను నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు చిన్న ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో రోడ్డు వెంట పెట్టి హోటల్స్ నిర్వహించడం చూశాము కానీ ఈ తరహాలో చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. -
మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆమెది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ప్రజాప్రతినిధులుగా అమ్మానాన్న చేస్తున్న సేవలను చిన్నప్పటినుంచీ చూసిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఓవైపు ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తూనే రాజకీయంవైపు అడుగులు వేసింది. పలు పార్టీల్లో చేరి పుట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ మెట్టినింట మాత్రం తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఆమె కోదాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కూతురు శ్రీకళారెడ్డి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రజాసేవబాటలో తొలి అడుగువేసింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రత్నవరం. మా నాన్న కీసర జితేందర్‌రెడ్డి కోదాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మా అమ్మ కీసర లలితారెడ్డి. గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వారికి నేను ఒక్కదానినే సంతానం. మానాన్న యుక్త వయస్సులో ఉండగా పులితో కలబడ్డాడు. ఆయన చేతిని పులి గాయపర్చినా లెక్క చేయకుండా దాన్ని చంపారు. అందరూ ఆయనను పులి అంటారు. ఆయన బిడ్డను కాబట్టి నేను పులి బిడ్డను. నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా కొంత కాలం పని చేశాను. రాజకీయరంగ ప్రవేశం ఇలా.. మా తండ్రి జితేందర్‌రెడ్డి 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ– ఆంధ్ర సరిహద్దు పాలేరు వంతెన వద్ద జరిగిన పోరులో ముందుండి కోదాడ పట్టణా న్ని కాపాడాడు. ఆ తరువాత కో దాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మాఅమ్మ లలి తారెడ్డి మా స్వగ్రామం రత్నవరానికి సర్పంచ్‌గా పని చేశారు. వారిని చూసి స్ఫూర్తిపొంది చిన్నతనం నుంచే రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలనుకున్నాను. 2004 నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి కోదాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయాను. తరువాత బీజేపీలో చేరాను. భర్త, మామ ప్రోత్సాహంతో.. పుట్టింట రాజకీయరంగ ప్రవేశం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోయా. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్తో వివాహం జరగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డాను. మా మామగారు రాజ్‌దేవ్‌సింగ్ కూడా ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే. వారి ప్రోత్సాహంతోనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా పరిధిలోని మలహాని నియోజకవర్గ పరిధిలో టిక్రరా మండలం నుంచి బీజేపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశా. రెబల్ అభ్యర్థి ఉన్నప్పటికీ 12,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. 83 మంది జెడ్పీటీసీల్లో 43 మంది మద్దతు తెలపడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాను. మహిళలకు అండగా.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యానికి ఇన్నాళ్లకు ఒక వేదిక దొరికింది. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంత చేయగలనో అంత చేయ్యాలన్నదే నా లక్ష్యం. త్వరలోనే జిల్లా పరిస్థితులపై అవాహన ఏర్పర్చుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్తాను. -
ఒకరిది మానవత్వం... మరొకరిది ‘పైసా’చికత్వం
కోదాడ: కరోనాతో మృతి చెందాడని బంధువులు ముఖం చాటేశారు.. తమకు ఎక్కడ అంటుకుంటుందేమోనని అయినవారు ఆమడదూరం పారిపోయారు. కానీ... మనిషిలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని దానికి కుల మతాలు ఉండవని కొందరు ముస్లిం యువకులు నిరూపించగా.. ఎలా పోతే మాకేంటి పైసలే మాకు పరమావధి అన్నట్లు మరికొందరు ప్రవర్తించి దహనసంస్కారాలు చేయడానికి వచ్చిన వారి నుంచి మృతదేహాన్ని కాల్చినందుకు రూ.32 వేలను శ్మశానం సాక్షిగా వసూలు చేసి తమలోని ‘పైసా’చికత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మహంకాళి గోపాలకృష్ణమూర్తి (70) కరోనాతో మృతి చెందాడు. ఇతడు దివ్యాంగుడు. ఈయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కేవలం ఇద్దరు బిడ్డలు, ఆయన సోదరుడు హుస్సేన్‌రావు మాత్రమే వచ్చారు. ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆరుగురు ముస్లిం యువకులు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. మృతదేహాన్ని ఇంటినుంచి బయటికి తీసుకురావడంతో పాటు హిందూ శ్మశానవాటిక వద్దకు చేర్చారు. అక్కడ కూడా మృత దేహాన్ని వారే చితి మీదకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదంతా వారు ఉచితంగా సేవాదృక్పథంతో చేయడం గమనించదగ్గ విషయం.. రూ. 32 వేలు.. నిలబెట్టి వసూలు చేశారు.. కరోనాతో మృతి చెందిన గోపాలకృష్ణమూర్తి అంత్యక్రియలకు కోదాడ హిందూ శ్మశానవాటికలో రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని అక్కడ ఉన్నవారు డి మాండ్ చేసి మరీ వసూలు చేసినట్లు మృతుడి సోదరుడు హుస్సేన్‌రావు తెలిపాడు. చితి కోసం కేవలం ఆరుక్వింటాళ్ల కట్టెలు పెట్టి రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఇచ్చిన తర్వాతే మృతదేహాన్ని కాల్చారని వాపోయాడు. ఈ విషయాన్ని ఆయన రికార్డు చేసి సామాజికమాధ్యమంలో పెట్టడంతో చర్చనీయాంశమైంది. కరోనా మృతదేహాల దహనం కోసం సిబ్బందిని పెట్టామని పురపాలకసంఘం అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా అక్కడ ఎవరూ లేరని ఈ దోపిడీపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు -
'నేను చనిపోతున్నా.. పిల్లల్ని బాగా చూసుకో'
సాక్షి,కోదాడ: భార్యకు వీడియో కాల్ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయిబాబా థియేటర్ బజార్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్(32) టాటాఏస్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. లాక్డౌన్ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. పని లేకపోవడం.. తాగుడుకు అలవాటుపడిన అశోక్ భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. శుక్రవారం రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లలను మంచిగా చూసుకో అని భార్యకు వీడియో కాల్ చేసి చెప్పాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చూసేవరకు అప్పటికే అశోక్ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి దావిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ సైదా తెలిపారు. -
చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, కోదాడ: ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మతాలు వేరు కావడం.. ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న ఆందోళన.. వెరసి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన చేగొండి రామయ్య, తిరపమ్మ దంపతుల చిన్న కుమారుడు మణికంఠ అలియాస్ సాయి (20) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయి ఇంటి సమీపంలో ఎస్కె.కరీమా కూతురు ఫాతిమా (16), కుమారుడితో కలసి నివాసం ఉంటోంది. కోదాడలోని ఉర్దూ పాఠశాలలో ఫాతిమా ఆలిమ్ కోర్సు చదువుతోంది. కాగా, సాయి, ఫాతిమా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సాయి రాత్రి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావ్ అంటూ తండ్రి మందలించాడు. దీంతో మరుసటి రోజు నుంచి సాయి కనిపించకుండా పోయాడు. యాసిడ్ తాగి చెరువులో దూకారా? శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు, రెండు గ్లాసులను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల నోట్లో నుంచి నురగలు వచ్చాయి. యాసిడా.. లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్) -
కోదాడలో దారుణం: ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కోదాడ లక్ష్మిపురం కాలనీకి చెందిన సాయి(19) ఐటీఐ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇతడికి అదే కాలనీకి చెందిన ఫాతిమా(15)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సాయి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఫాతిమా నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వీరద్దరూ కోదాడ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరి శవాలు వెలుగు చూశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. చదవండి: ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య! -
కాటికి పంపేవారే కరువయ్యారు!
కోదాడ: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తుందో నిరూపించే విషాద ఉదంతమిది. ఊరంతా బలగం ఉన్నా.. కనీసం కడసారి చూపునకైనా కన్నెత్తి చూసినవారు కానరాలేదు. కాటికి సాగనంపడానికి.. పాడెమోసేందుకు నలుగురు బంధువులు కరువయ్యారు. దీంతో కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న మనుమడు పుట్టెడు కష్టంలో ఒక్కడే నాయనమ్మను కారులో కాటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మునగాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు కుమారులు చనిపోయారు. దీంతో ఆమె కొద్దిరోజులుగా రెండో కుమారుడి కొడుకు (మనుమడి) వద్ద ఉంటోంది. అనారోగ్యంతో ఆదివారం ఆమె మృతిచెందింది. ఇదే సమయంలో ఆమె మనుమడు వేరేచోట కరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్ని చూసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామానికి చెందిన కొందరు ఈ విషయాన్ని మనుమడికి చెప్పగా, తన పరిస్థితిని వివరించి బోరున విలపించాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గ్రామానికి చెందిన నలుగురు పెద్దలు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. రాత్రి 7 గంటల సమయంలో పాజిటివ్‌తో ఇబ్బంది పడుతున్న మనుమడు పీపీఈ కిట్ ధరించి కారులో ఇంటికి వచ్చి మృతదేహాన్ని ఒక్కడే కారులోకి చేర్చాడు. అదే కారును నేరుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లి నాయనమ్మ అంత్యక్రియలు నిర్వహించాడు. -
కోదాడలో సీనియర్ సిటిజన్లకు పరీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో కేరళ రెవెన్యూ కాలనీలోని సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో సి.విద్యాధర భట్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓరల్ టెస్టింగ్ ల్యాబ్స్’ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఈ అంశంపై ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ, సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదును విచారించి పై విధంగా స్పందించారు. కోవిడ్–19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించవచ్చునని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు కోరినట్టుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. -
కోదాడలో మహిళా రైతు ఆత్మహత్య యత్నం
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన వ్యవసాయ భూమి కబ్జాకు గురికావడంతో ఆమె పురుగుల మందు తాగినట్టుగా తెలుస్తోంది. ఇది గమనించిన బాధితురాలి బంధువులు ఆమె చర్యను నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే మహిళా రైతును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు బాధితురాలి భూమిని కబ్జా చేసినట్టు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు రక్షణగా ఉండాల్సిన సర్పంచే తన భూమిని కబ్జా చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైనట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ, తెలంగాణ సరిహద్దు మూసివేత
సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు. మహారాష్ట్ర సరిహద్దు బంద్.. మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందు చెప్పి సరిహద్దులు మూసేస్తం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తాం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నాం. -
లెక్కిస్తానని చెప్పి నొక్కేశాడు
కోదాడరూరల్ : అంకుల్ నీ డబ్బులకు సిరా అంటుకుంది నేను లెక్కిస్తా ఉండు అని చెప్పి అతడి వద్ద రూ.44వేలు నొక్కేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఈ సంఘటన కోదాడ ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని కాపుగల్లుకు చెందిన నర్రా వెంకటయ్య తన అవసరాల నిమిత్తం బ్యాంకుకు వచ్చి రూ.లక్ష విత్‌డ్రా చేశాడు. అనంతరం ఆయన అక్కడే కూర్చొని నగదును లెక్కిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చాడు. అంకుల్ మీ నగదుకు సిరా అంటుకుంది, ఇవి బయట చెల్లవు.. ఓ సారి నేను లెక్కిస్తా అని మాయమాటలు చెప్పి అతడి దృష్టి మళ్లించి ఇరవై రెండు రూ.2వేల నోట్లను జేబులో పెట్టుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత వెంటకయ్య మరోసారి లెక్కించగా నగదు తక్కువ ఉండడంతో లబోదిబో అంటూ వెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై ఎస్ఐ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!
సాక్షి, కోదాడ: సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కోదాడలో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు ప్రముఖులు దీనిలో భాగస్వాములు కావడంతో సామాన్యులు సులువుగా మోసపోతున్నారు. రూ.12 వేలు చెల్లిస్తే సభ్యత్వంతో పాటు అంతే విలువైన ఉత్పత్తులను (వివిధ రకాలైన వస్తువులు) ఇస్తామని వీటి అమ్మకం వల్ల రూ.2వేల లాభం వస్తుందని, మరో ఇద్దరిని చేర్పిస్తే మరో రూ.3 వేల లాభం వస్తుందని ఇలా సభ్యులు చేరినా కొద్దీ రూ.లక్షలు మీ జేబుల్లో వచ్చి పడతాయని చెపుతుండడంతో పలువురు వీరి వలకు చిక్కుతున్నారు. దీని వ్యవహారం ఏమిటంటే.. ఇప్పటికే అనేక మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు కుచ్చుటోపీ పెట్టి నిండా ముంచుతున్న ఉదంతాలు వెలుగు చూస్తుండగా తాజాగా మరో కంపెనీ కోదాడ ప్రాంతంలో గుటుచ్చప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది .‘ఇండుస్ వివా’ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ వ్యాపారం ముందుగా నాలుగు రకాల వస్తువులైనా ఐస్లిమ్, ఐకాఫీ, ఐ పల్స్, ఐ చార్జీలను అంటగడుతున్నారు. వీటి కోసం 12,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని అమ్ముకోవడం వల్ల రూ.2 వేల కమీషన్ వస్తుందని, దీంతో పాటు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా మరో రూ.5 వేలు, వారు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా చైన్ పెరిగి మీ ఖాతాల్లో రూ.లక్షలు జమ అవుతాయని నమ్మబలుకుతూ తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యాపారం అంతా రహస్యంగా కొంత మంది తమ ఇళ్లలో సాగిస్తున్నారని సమాచారం. అబ్బో.. కేన్సర్ కూడా తగ్గుతుందట...! ఎక్కడ తయారు అవుతున్నాయో, వాటిలో ఏముంటాయో తెలియకుండా వీరు నాలుగు రకాల ఉత్పత్తులను అంటగడుతున్నారు.. వీటిలో ఐ స్లిమ్ వాడితే ఎంత లావు ఉన్నా ఒక్క నెలలోనే స్లిమ్‌గా తయారవుతారట. ఇక ఐ ఫల్స్ తాగితే ప్రాణాంతకమైన కేన్సర్ కూడా తగ్గుతుందట. దీనిలో అసైబెర్రీ అనే ఫలరసం ఉంటుందని, ఇది అమెజాన్ అడవుల్లోనే ఉంటుందని మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. ఇక ఐ చార్జీ వాడితే వెంటనే బాడీలో శక్తి వచ్చి పరుగులు పెట్టవచ్చట. ఇలా ఈ ఉత్పత్తుల్లో ఉన్న బ్రహ్మపదార్థం ఏమిటో అర్థం కాక వైద్యులే తలపట్టుకుంటున్నారు. వీరు మాత్రం సులువుగా మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులు వీరి వలకు చిక్కుతున్నారు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు సామాన్యులను బురిడీ కొట్టించడానికి వీరు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు పెడతారు. సూటు, బూటు వేసుకుని కనికట్టు మాటలతో మభ్యపెడుతుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. అంతేకాక కొంత మందిని తీసుకొచ్చి ఇప్పటికే రూ.లక్షలు తమ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నట్లు చెప్పిస్తుంటారు. దీంతో పలువురు యువకులు తమ తల్లిదండ్రులు వద్దంటున్నా వీరికి సొమ్ముచెల్లించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
బతికున్నవారిని చనిపోయినట్లుగా చూపి..
సాక్షి, హైదరాబాద్: బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్.ఐ.సి సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కయిన ఈ కుంభకోణంలో మొత్తం రూ.3.13 కోట్ల ఎల్.ఐ.సి. డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. వివరాలు.. కోదాడ ఎల్.ఐ.సి కార్యాల యంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్ బీకూనాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు) మరో ఉద్యోగి పి.రఘుచారి 8 మంది ఎల్.ఐ.సి. ఏజెంట్లతో కుమ్మక్కు అయ్యారు. నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఎల్.ఐ.సి.కి చెందిన రూ.3,13,78,733 డ్రా చేసుకున్నారు. పత్రా ల్లో పేర్కొన్న నామినీల బ్యాంకు ఖాతాల్లో కాకుండా సొంత ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకున్నారు. సొంత తండ్రినీ వదల్లేదు.. 2006 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 190 నకిలీ పాలసీలు సృష్టించి రూ.3 కోట్లకుపైగా తమ జేబులో వేసుకున్నారు. ప్రధాన నిందితుడు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీకూ నాయక్ తన తం డ్రి బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించడం గమనార్హం. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన కోదాడ ఎల్.ఐ.సి. చీఫ్ మేనేజర్ ఎడ్ల వెంకటేశ్వర్రావు విచారణ జరిపారు. అంతర్గత విచారణంలో వీరి భాగోతాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని సీబీఐకి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో బీకూనాయక్, గుగులోత్ హర్యా, ఏజెంట్లు పి.రఘుచారి, ఎ.కొండయ్య, పి.సురేశ్, ఎం.దానమూర్తి, టి.సరేందర్రెడ్డి, బి.విజయ్‌కుమార్, వి.సైదాచారి, భూక్యా రవి, కల్వకుంట్ల వెంకన్నలపై ఐపీసీ 120(బి), 409, 420, 465, 467, 468, 471, 477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
విజయమే లక్ష్యంగా ముందుకుపోదాం
సాక్షి, కోదాడ : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివా రం కోదాడ పట్టణంలోని గన్నా సర్వయ్య ఫంక్షన్‌హాలులో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలతో పాటు తెలంగాణలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందన్నారు. మోసపూర్తి మాటలు, వాగ్ధానాలు, గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమితో ఆ పార్టీ పతనానికి పునాది పడినట్లేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. వారితో ఓటు వేయించుకోవడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. రాహూల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని అందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్‌లో సోమవారం జరగనున్న రాహూల్‌గాంధీ సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కోదాడకు చెందిన న్యాయ వాది నాళం రాజన్న, మునగాల మండల నాయకుడు వేమూరి సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, టీపీసీసీ పరిశీలకుడు ఎం.అనిల్‌కుమార్, నాయకులు పారా సీతయ్య, వంగవీటి రామారావు, వీరేపల్లి సుబ్బారావు, బషీర్, బాగ్ధాద్, వంటిపులి వెంకటేష్, పాలకి అర్జున్, ధనమూర్తి, వాడపల్లి వెంకటేశ్వర్లు, సైదిబాబు, రంగారావు, వీరారెడ్డి, సంగిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.