
కోదాడలో భారీ వర్షం
కోదాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మంగళవారం ఉదయం నాలుగు గంటలపాలు కోదాడ పట్టణంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ప్రభావంతో పట్టణంలోని రోడ్లు, వీధులు పూర్తిగా జలమయ్యాయి. లోతట్టులో ఉన్న దుకాణాలలో వర్షపు నీరు చేరడంతో దానిని తొలగించేందుకు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 23వ వార్డులో కాలువ ప్రవాహాన్ని నియత్రించేందుకు వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్ జేసీబీ సహాయంతో కంపచెట్లను తొలగించి, దోమల నివారణ మందు పిచికారీ చేయించారు.