
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కోదాడ: ఐపీఎల్ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదుతో పాటు ఓ బైక్, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలోని కోదాడ టీచర్స్ కాలనీలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.