క్రికెట్ బెట్టింగ్‌లో ఒకరి అరెస్ట్‌.. స్పందించిన వైజయంతి మూవీస్ | That Person Never Work With Vyjayanthi Movies | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్‌లో ఒకరి అరెస్ట్‌.. స్పందించిన వైజయంతి మూవీస్

Published Thu, Feb 6 2025 2:56 PM | Last Updated on Thu, Feb 6 2025 3:09 PM

That Person Never Work With Vyjayanthi Movies

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్‌ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే, తాను  వైజయంతీ మూవీస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు నిలేశ్‌ చోప్రా చెప్పారని వార్తలు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఈ క్రమంలో తాజాగా వైజయంతీ మూవీస్‌ ఎక్స్‌ పేజీ ద్వారా స్పందించింది. నిలేశ్‌ చోప్రా ఎవరో తమకు తెలియదని , అలాంటి పేరుతో ఉన్న వ్యక్తి తమ వద్ద ఎప్పుడు కూడా పనిచేయలేదని పేర్కొంది.

'ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నందుకు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలా చెప్పబడుతున్న వ్యక్తి  వైజయంతి మూవీస్ ఆఫీస్‌లో  ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి  ఎస్‌ఆర్ నగర్ సంబంధిత పోలీసు అధికారులతో మేము ఇప్పటికే మాట్లాడాం. వాస్తవాలను వారికి వివరించాం. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు తమను సంప్రదించి వాస్తవాలను ధృవీకరించవలసిందిగా మీడియాను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము' అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement