'కల్కి' నిర్మాతలు మరోసారి సీరియస్ అయ్యారు. డార్లింగ్ ప్రభాస్ సినిమా విషయంలో నోటీసు ఇచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో మూవీ విషయంలో లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కూడా అప్పుడెప్పుడో 1990లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కోసం. ఇలా సడన్‌గా సోషల్ మీడియాలో చిరు క్లాసిక్ హిట్ సినిమాపై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అసలేంటి గొడవ? ఏం జరుగుతోంది?
(ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?)
అసలు ఏమైంది?
టాలీవుడ్‌లో వైజయంతీ మూవీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ. నిర్మాత అశ్వనీదత్ అప్పట్లో సినిమాలు తీశారు. కానీ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మూవీస్ తీయలేకపోయారు. నిర్మాణం ఆపేశారు. దీంతో ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారారు. 'మహానటి', 'సీతారామం' లాంటి హిట్ సినిమాలతో మళ్లీ లైన్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ పెట్టి 'కల్కి' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నారు.
కొన్నాళ్ల ముందు 'కల్కి' నుంచి ఓ ఫొటో లీక్ కావడం, అది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేసరికి నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే దాన్ని షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబరు 21న ఈ నోటీసు విషయమై ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాలేదు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కాపీరైట్స్ విషయమై ప్రకటనతో పాటు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
(ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి)
ఆ సినిమాపై పరోక్షంగా?
ఈ పోస్ట్ ప్రకారం.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేన్ని కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటనతో పాటు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇలా సడన్‌గా ఎందుకు సీరియస్ అయ్యారా అనేది చాలామందికి అర్థం కాలేదు. అయితే చిరు 157వ సినిమాని ఉద్దేశిస్తూనే పరోక్షంగానే ఈ నోటీస్ ఇచ్చారా అనేది డౌట్ కొందరికి వస్తోంది.
ఎందుకంటే 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో చిరు చేస్తున్న ఈ సినిమాకు 'ముల్లోకవీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ మూవీ కాన్సెప్ట్.. హీరో, వేరే లోకానికి వెళ్లడం అక్కడ దేవకన్యలని కలవడం ఇలానే ఉండబోతుందని అంటున్నారు. చూస్తుంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో పోలికలు కనిపిస్తున్నాయి కదా! అందుకే 'వైజయంతీ' సంస్థ ఎవరు కాపీ కొడుతున్నారు? లేదా కొట్టాలని ట్రై చేస్తున్నారనేది పేరు చెప్పకుండా నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస‍్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే)
Comments
Please login to add a commentAdd a comment