ప్రముఖ కమెడియన్ అలీకి నోటీసులు | Telugu Comedian Ali Got Notice Illegal Construction | Sakshi
Sakshi News home page

Comedian Ali: అక్రమ నిర్మాణ ఆరోపణలు.. అలీకి నోటీసులు

Published Sun, Nov 24 2024 11:23 AM | Last Updated on Sun, Nov 24 2024 11:50 AM

Telugu Comedian Ali Got Notice Illegal Construction

అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో టాలీవుడ్ కమెడియన్ అలీకి నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి.. అలీ ఫామ్ హౌసులోని పనిమనుషులకు నోటీసులు అందజేశారు. అక్రమ నిర్మాణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉంది.

(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)

విషయానికొస్తే వికారాబాద్ ఎక్‌మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. కుటుంబంతో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయితే అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించారని, అలానే పన్ను చెల్లించకుండా అందులో నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఈ నెల 5వ తేదీన నోటీసు ఇవ్వగా స్పందన లేదు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు. అలీ అందుబాటులో లేకపోవడంతో పనివాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు సెక్రటరీ తెలిపారు. మరి ఈ విషయమై అలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement