వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు | Comedian Ali, Thallada Sai Krishna Donation for Telugu States Flood Victims | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు సెలబ్రిటీల సాయం

Published Wed, Sep 4 2024 3:59 PM | Last Updated on Wed, Sep 4 2024 8:59 PM

Comedian Ali, Thallada Sai Krishna Donation for Telugu States Flood Victims

కుండపోత వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం మేమున్నామంటూ తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌, అల్లు అర్జున్‌, చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ తమవంతు సాయం చేశారు.

అలీ దంపతుల గొప్ప మనసు
తాజాగా కమెడియన్‌ అలీ దంపతులు ఆంధ్రప్రదేశ్‌కు రూ.3 లక్షలు, తెలంగాణకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. యంగ్‌ డైరెక్టర్‌ తల్లాడ సాయికృష్ణ సైతం ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాకు కలిపి రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అతడి స్నేహితులతో కలిసి.. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆహారం, నిత్యావసర వస్తులను పంచుతూ మానవత్వం చాటుకున్నారు.

అక్కినేని కుటుంబం సాయం
మరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటే అక్కినేని కుటుంబం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ సాయాన్ని అందజేశాయి. 

మరోవైపు రామ్‌చరణ్‌ సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశాడు..

 
 

 

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.10 లక్షలు విరాళమిచ్చాడు. అలాగే అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షలు సాయం ప్రకటించారు.
 

చదవండి: కోట్లు దానం చేసిన ప్రభాస్-బన్నీ

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement