
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.
ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment