
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ విభూషణ్ పొందిన చిరుకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని తర్వాత ఈ అవార్డ్ అందుకున్న నటుడిగి మెగాస్టార్ ఘనత సాధించారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ బాబీ, గోపించద్ మలినేని, నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవిశంకర్ కూడా మెగాస్టార్‌ను అభినందించారు.
కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ అప్‌డేట్స్ రానున్నాయి.
Blockbuster directors @dirbobby, @megopichand, Producers #NaveenYerneni, @mythriravi & comedian #Ali met and conveyed their best regards to #PadmaVibhushanChiranjeevi garu for being bestowed with the prestigious #PadmaVibhushan award ✨@Kchirutweets @MythriOfficial… pic.twitter.com/0z8YD9DG5U
— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024