
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.
కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతోనూ జతకట్టింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియను సంప్రదించగా, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట
Comments
Please login to add a commentAdd a comment