Illegal constructions
-
కోహెడలో హైడ్రా పంజా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం పంజా విసిరింది. అక్కడి అనేక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 951, 952ల్లోని గ్రామపంచాయతీ లేఔట్లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని, రహదారులు లేకుండా అడ్డుగోడలుగా కట్టారని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు పలు పత్రాలను పరిశీలించారు. 1986లో భూ యజమానులు కె.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్ వేసినట్టు నిర్ధారించారు. సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిని స్వా«దీనం చేసుకుని, ఫాం హౌస్ నిర్మించడంతో పాటు లే ఔట్లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుంటూ అంతర్గత రహదారులను బ్లాక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో అన్ని పత్రాలతో తమ కార్యాలయంలో హాజరు కావాలని ఇరుపక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. శనివారం వారు హాజరు కాగా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ తుర్కయాంజాల్ మున్సిపల్ అధికారుల స్పష్టం చేశారు. ప్లాట్లను తమకు అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని తాను కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపించారు. హైడ్రా ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులను విచారించి సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిరి్మంచిన ఫాంహౌస్‌తో పాటు ప్రహరీ, ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా సుమారు 170 ప్లాట్లకు కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి కల్పించారు. వీటిలో పార్కులు, క్రీడా స్థలాలు ఉన్నాయి. -
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra) కూల్చివేస్తోంది. తాజాగా ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల గోడను అధికారులు కూల్చివేశారు. అలాగే, మేడిపల్లిలోని దివ్యనగర్‌లో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. ఘట్కేసర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. అయితే, నల్లమల్లారెడ్డి విద్యా సంస్థలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్కడ సర్వే చేసి అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించారు. ఈ క్రమంలోనే గోడ కూల్చివేతలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.అలాగే, రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు అయ్యిందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని హైడ్రా కూల్చివేయలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు. వీరిలో ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. -
ప్రముఖ కమెడియన్ అలీకి నోటీసులు
అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో టాలీవుడ్ కమెడియన్ అలీకి నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి.. అలీ ఫామ్ హౌసులోని పనిమనుషులకు నోటీసులు అందజేశారు. అక్రమ నిర్మాణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)విషయానికొస్తే వికారాబాద్ ఎక్మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. కుటుంబంతో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయితే అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించారని, అలానే పన్ను చెల్లించకుండా అందులో నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఈ నెల 5వ తేదీన నోటీసు ఇవ్వగా స్పందన లేదు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు. అలీ అందుబాటులో లేకపోవడంతో పనివాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు సెక్రటరీ తెలిపారు. మరి ఈ విషయమై అలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు) -
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు..
-
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
ఫామ్‌హౌస్‌ల కోసమే మూసీ ముసుగు!
సాక్షి, హైదరాబాద్: చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్లపై వేటుపడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలు ముసుగు తొడుక్కొని మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బురదలో కూరుకుపోతున్న నగరాన్ని కాపాడేందుకు తాము మూసీపై ముందుకెళ్తుంటే దానిపైనా బురదజల్లుతున్నారని పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేదలకు అన్యాయం జరుగుతోందని డ్రామాలాడుతున్న బీఆర్ఎస్ నేతలు చేతనైతే ఆ పార్టీ ఖాతాలోని రూ. 1,500 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ములో రూ. 500 కోట్లను మూసీ బాధితులకు పంచాలని సూచించారు. మురికి మూసీలో జీవచ్ఛవాల్లా ఉన్న పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి ఇళ్లు ఇస్తుంటే రెచ్చగొట్టడం తగదన్నారు. గురువారం సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారులకు చెందిన ఫాంహౌస్‌ల అక్రమ నిర్మాణాలను కూల్చాలో వద్దో చెప్పాలని వారినే ప్రశ్నించారు. కేవీపీ రామచంద్రరావు ఫాంహౌస్‌లను కూలగొట్టాలో వద్దో కూడా సలహా ఇవ్వాలన్నారు. నాలాలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అక్రమాలు చేసిందేవరో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. నల్లచెరువు, సున్నం చెరువు, మూసీ ఒడ్డున అక్రమంగా ప్లాట్లు వేసి అమ్మింది బీఆర్ఎస్ వారు కాదా? అని సీఎం ప్రశ్నించారు. బలిసినోళ్లు వదిలిన నీళ్లు పేదలు తాగాలా? ‘హైదరాబాద్‌కు తాగునీరు అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిసరాల్లో బలిసినోళ్లు ఫాంహౌస్‌లు కట్టుకొని వారి డ్రైనేజీ తీసుకొచ్చి వాటిల్లో కలిపితే ఆ నీళ్లు నగర ప్రజలు తాగాల్నా?’అని సీఎం రేవంత్ నిలదీశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిని వదలబోమని, ఒక్కొక్కడినీ చింతపండు చేస్తానని హెచ్చరించారు. అఖిలపక్షంలో మంచి సూచనలివ్వండి.. నిర్వాసితులు ఇళ్లు పోయిన దుఃఖంలో ఆవేశంగా ఉంటారని.. 20 ఏళ్లపాటు ప్రజాక్షేత్రంలో తిరిగిన తనకు పేదల కష్టాలు, రాజకీయాల లోతు తెలియక కాదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయినప్పటికీ రాబోయే తరాల భవిష్యత్ దృష్ట్యా ముందుకే వెళ్తానన్నారు. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని ముంచేస్తున్న మూసీ వరదలకు విపక్షాలు చేతనైతే పరిష్కారం చెప్పాలని సూచించారు. అఖిలపక్ష సమావేశాలు పెడతానని, మంచి సూచనలివ్వాలని కేటీఆర్, హరీశ్‌లను కోరారు. మూసీలో నిర్వాసితులయ్యే వారికి 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుతోపాటు రూ. 25 వేల చొప్పున నగదు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈటలకు ఇంకా ఆ వాసనలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పైనా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీ మారినా పదేళ్లు బీఆర్ఎస్లో ఉన్నందున ఇంకా ఆ గర్దు (కంపు) పోలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్ ఏం మాట్లాడితే తెల్లారే ఆ జిరాక్స్ కాపీలతో ఈటల మాట్లాడతారని ఆరోపించారు. ఆయన కూడా బతకడానికి హైదరాబాద్ వచ్చి ఎంపీ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని.. గౌరవం నిలబెట్టుకోవాలని ఈటలకు సూచించారు. మూసీ ప్రక్షాళనకు చేతనైతే ప్రధానిని రూ. 25 వేల కోట్టు ఇవ్వాల్సిందిగా కోరదామని.. ప్రధానిని కలవడానికి తనకు భేషజాల్లేవని చెప్పారు. జవహర్‌నగర్‌లో వెయ్యి ఎకరాల భూములున్నాయని.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తే మూసీ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లతో కాలనీలే కడతామన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసిన మోదీని అనుసరించే బీజేపీ నేతలు.. మూసీ అభివృద్ధిని వద్దనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఇంకుడుగుంతల్లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లకు రెండింతల చార్జీ.. ‘కొందరు దురాశపరుల వల్ల చెరువుల్లోని నీళ్లు రోడ్లపైకి.. అక్కడి నుంచి ఇళ్లలోకి వస్తున్నాయి. కొందరి స్వార్థంతో లక్షల కుటుంబాలు నీట మునుగుతున్నాయి. దీనికో పరిష్కారం చూపించాలి. అందరూ నాకెందుకులే అనుకుంటే నగరం మునుగుతుంది. చూస్తుండగానే చెరువులు, నాలాలు మూసుకుపోయాయి. ఇలాగే చూస్తూపోతే మూసీ కూడా మూసుకుపోతుంది’అని రేవంత్ అన్నారు. అందుకే ఇకపై ఇంకుడు గుంతల్లేకుంటే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వబోమని.. ఇంకుడుగుంతల్లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లకు రెండింతల చార్జీలు వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నల్లగొండను చంపేద్దామా? ‘నల్లగొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్‌తో, మరోవైపు మూసీ కాలుష్యంతో బతకలేని పరిస్థితిలో ఉంటే ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు ఏం ముఖం పెట్టుకొని నల్లగొండలో తిరుగుతారన్నారు. ఆ జిల్లాలో మీకు ఓట్లేయకుంటే ప్రజలను చంపేస్తారా అని బావబావమరుదులను అడుగుతున్నా’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పేదలకు మెరుగైన సేవల కోసమే డిజిటల్ కార్డు కంటోన్మెంట్: పేదలకు మెరుగైన సేవలు అందించడానికే డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డు ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు లేదా వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే మొదలుపెట్టామన్నారు. కుటుంబ సమగ్ర సమాచారాన్ని.. సంక్షేమ పథకాల అమల్లో 30 శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరిచి ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. వన్న్స్టేట్ వన్న్కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేలా కేంద్రాన్ని ఒప్పించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు. కాగా, దసరాలోపే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పేరిట లబి్ధదారులకు అందిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
‘బుల్డోజర్’ ప్రభుత్వంగా మారొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.అదే తరహా బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్‌రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. ఆ చెడ్డపేరు మనకొద్దు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దసరాకు ముందే.. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. -
అక్రమమైనా జనావాసాల జోలికి వెళ్లం: రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రత్యేక విభాగం కార్యకలాపాలపై సామాన్యులను అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ నుంచి, ఏ బుల్డోజర్ వస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ‘సందట్లో సడేమియా‘లా నోటీసులు, బెదిరింపులతో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మీతో సాక్షి’ సామాన్యుల్లో ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. వాట్సాప్ ద్వారా అనేకమంది పంపించిన ప్రశ్నలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వీరిలో అత్యధికులు తమ పేర్లు గోప్యంగా ఉంచాలని కోరడం గమనార్హం. కాగా ఆయా ప్రశ్నలకు రంగనాథ్ చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి..ప్రకృతిని రక్షిస్తేనే.. మన హైదరాబాద్‌కు భవిష్యత్తు. ప్రకృతిని కాపాడే దిశగా ప్రభుత్వం, మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలే గతంలోనూ ఉన్నాయి. చెరువులు, కుంటల్లో పట్టా ల్యాండ్లు ఉంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని చట్టంలో ఉంది. అయినా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు అన్ని అనుమతులు ఇచ్చేశారు. దీంతో నాతో పాటు అనేక మంది మధ్య తరగతికి చెందినవారం ఈఎంఐ లోన్లతో ఇళ్లు కట్టుకున్నాం. వాటిని ఇప్పుడు మీరు కూల్చేస్తామంటే ఎలా? తొలుత మాకు అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ శిక్షించి, ఆ తర్వాత మా వద్దకు రావడం న్యాయం కదా! – జయంత్‌నాథ్, ముషీరాబాద్జవాబు: అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లం. ఈ విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా సామాన్యుడికి అండగా నిలవాలనే చెప్తోంది. అవసరమైన, చెల్లుబాటు అయ్యే అన్ని అనుమతులు ఉన్న కమర్షియల్ భవనాలనూ కూల్చం. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటి పైనే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా నిర్మించిన లేదా అనుమతులు రద్దు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తాం. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై మాత్రం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఆ అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి లేదా సంబంధిత శాఖకు నివేదిస్తాం. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు పూర్తి వివరాలు సరిచూసుకోండి.హైదరాబాద్ నగరాన్ని కాపాడేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు భేష్. కానీ పెద్దలకు, పేదలకు ఒకే న్యాయం అమలు చేయాలి. పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు. పేదలకు మాత్రం నోటీసు లేకుండానే కూల్చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గంచెరువు, రామాంతపూర్ చెరువు విషయంలో అదే జరిగింది. పేదలు లక్షల రూపాయలు వెచ్చించి కోర్టులకు వెళ్లలేరు. పెద్దలు మాత్రం వెళ్లి తమ అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నారు. అందరికీ ఒకే న్యాయం మీరు అమలు చేయగలరా?– జీవానందరెడ్డి, బంజారాహిల్స్ జవాబు: హైడ్రా ఎలాంటి నోటీసులూ ఇవ్వదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మేం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. హైడ్రా పేద ప్రజల వైపే ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఎన్–కన్వెన్షన్, జవహర్‌నగర్ చెరువు వద్ద ఇదే సూత్రాన్ని పాటించాం. సరైన అనుమతులు లేకుండా నిర్మించిన ఎన్–కన్వెన్షన్‌ను కూల్చినప్పటికీ.. అదే చెరువు కట్టపై మరోపక్క ఉన్న పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదు. జవహర్‌నగర్ చెరువు దగ్గర ఉన్న నివాసాలను కూడా ముట్టుకోలేదన్నది గమనించాలి.మేడ్చల్‌లోని గాలిల్లాపూర్ గ్రామానికి సంబంధించి ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్లపై అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిపై స్పష్టత ఇవ్వగలరా? – శ్రీనివాస్జవాబు: మీ గ్రామంలో ఉన్న చెరువు, కుంట పేరు చెప్తే అవకాశం ఉంటుంది. లేదంటే స్థానిక ఇరిగేషన్ అధికారులను సంప్రదించినా, లేదా హెచ్ఎండీఏకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించినా మీకు సమాచారం లభిస్తుంది.శంషాబాద్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యా దులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గత నెల్లో హైడ్రాకు ఫిర్యాదు చేశాం. దానిపై త్వరగా చర్యలు తీసుకోండి. – ప్రకాశ్‌కుమార్, శంషాబాద్జవాబు: హైడ్రాకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. ప్రస్తుతం అతికొద్ది మందితోనే పని చేస్తున్నాం. ఫిర్యాదులు మాత్రం దాదాపు ఐదు వేలకు పైగా వచ్చాయి. ఈ కారణంగానే విచారణ పూర్తి చేసి, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. అయితే ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. జల్పల్లి పెద్ద చెరువులో అక్రమంగా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్‌ట్యాంక్‌ను రోడ్డుకు అడ్డంగా కట్టారు. దీన్ని ఆధారంగా చేసుకునే ఓ కంపెనీ రోడ్డును ఆక్రమిస్తోంది. వీటిపై చర్యలు తీసుకోండి. – పేరు గోప్యంగా ఉంచాలని కోరిన వ్యక్తిజవాబు: హైడ్రా బృందాన్ని త్వరలో ఆ ప్రాంతానికి పంపిస్తాం. పెద్దచెరువుతో పాటు శ్రీరామ కాలనీ చుట్టు పక్కల ప్రాంతాలపై అధ్యయనం చేయిస్తాం. ఎలాంటి ఆక్రమణలు, అతిక్రమణలు ఉన్నా చర్యలు తీసుకుంటాం. కొందరు రాజకీయ నాయకులకు చెందిన విద్యాసంస్థల్ని కూల్చడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీ దృష్టిలో అవి అక్రమ నిర్మాణాలు కావా? – రాజేంద్రకుమార్, నారాయణగూడ జవాబు: అలాంటి అక్రమ నిర్మాణం ఎవరిదైనా ఉపేక్షించం. అయితే ఇల్లు అనేది ఓ కుటుంబానికి సంబంధించిన అంశం. వాణిజ్య సము దాయం కొందరికే సొంతమైన వ్యవహారం. కానీ విద్యా సంస్థల విషయం అలా కాదు... దాని కూల్చివేత ప్రభావం వందలు, వేల మంది విద్యార్థులు, వారి భవిష్యత్తుపై ఉంటుంది. అందువల్ల వీటిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.బతుకులకుంట చెరువు సమీపంలో ఆరేళ్ల క్రితం ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఆ సమయంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన గుర్తులు లేవు. అది పక్కా పట్టా భూమి అని చెప్పి అమ్మారు. ఇద్దరు ఆడపిల్లలపై చదువులు, పెళ్లిళ్లు దృష్టిలో ఉంచుకుని ఆ ప్లాట్ కొన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? – నాగిరెడ్డి, హయత్‌నగర్ జవాబు: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ పట్టా భూములు ఉంటాయి. అయితే అది ఏ తరహా పట్టా అన్నది తెలుసుకోవాలి. కొన్ని భూముల్ని కేవలం వ్యవసాయం కోసం మాత్రమే వినియోగించాలి. ఆయా పట్టాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అమీన్పూర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో నాలుగు నెలల క్రితం ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నా. బంధంకొమ్ము చెరువు ప్రాంతంలో ఉన్న ఆ అపార్ట్మెంట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అది అక్రమ కట్టడమా? సక్రమ కట్టడమా? ఎలా తెలుసుకోవాలి? – పేరు వెల్లడించని వ్యక్తిజవాబు: అమీర్పూర్ ప్రాంతంలోనే కాదు.. ఎక్కడ స్థిరాస్తి కొనుగోలు చేస్తు న్నా 3 అంశాలు సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చిన అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? అనేది చూసుకోండి. అమీన్పూర్లో కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయతీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేశారు. వీటిని గతంలోనే రద్దు చేసిన ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లండి.మేము 2010లో ప్లాట్ కొనుక్కుని అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇప్పుడు మీ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందంటూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారు. వాస్తవానికి మా ఇంటి పరిధిలో ఎలాంటి చెరువు, కుంట ఉన్న ఆనవాళ్లు లేవు. ఎప్పుడు వరద, నీళ్లు రాలేదు. కానీ రికార్డుల్లో కుంట ఉందని, ఎఫ్టీఎల్లో మీ ఏరియా వస్తుందని అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? – ఎం.సంజీవరెడ్డి, బోడుప్పల్ జవాబు: ప్రస్తుతం ఆ ప్రాంతంలో కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు ఉండి ఉండొచ్చు. అందుకే రికార్డుల్లో జలవనరు ఉన్నట్లు నమోదైంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, అందులో నివాసం ఉంటున్న ఇల్లు చెరువులో ఉన్నప్పటికీ భయపడాల్సిన పని లేదు. అలాంటి వాటి జోలికి వెళ్లం. వీటిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతాం. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటల్ని పూర్తి స్థాయిలో పరిరక్షణ చేయడానికే కట్టుబడి ఉన్నాం. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు దిగితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఎందుకు కూల్చట్లేదు? ఇప్పుడు మూసీ పరీవాహక ప్రాంతంపై ఎందుకు పడ్డారు? – పేరు చెప్పని ‘సాక్షి’ పాఠకుడు జవాబు: మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న సర్వే, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా ఇప్పటివరకు ఎవరికీ, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దుర్గం చెరువు సహా నగరంలోని 11 చెరువులను పునరుద్ధరించి, పరిరక్షించాలని కోరుతూ 2007లో హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై కోర్టు అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు ఆయా చెరువుల పరిధిలో నివసిస్తున్న వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ 11 చెరువుల అంశం ప్రస్తుతంకోర్టు పరిధిలో ఉంది. -
హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య
కూకట్పల్లి (హైదరాబాద్): హైడ్రా అధికారులు తమ ఇళ్లు కూడా కూల్చివేస్తారేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవబస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (56 ).. భర్త శివయ్యతో కలిసి సొంత ఇంటిలో నివసిస్తోంది. వీరికి నల్లచెరువు సమీపంలో మరో రెండు ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచి్చన భార్యాభర్తలు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే గత ఆదివారం హైడ్రా అధికారులు నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వీటికి ఎదురుగానే రోడ్డుకు ఆవతలి వైపు బుచ్చమ్మ ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చమ్మ ఆందోళనకు గురై శుక్రవారం సాయంత్రం భర్త హాల్లో ఉండగానే బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి మా కోసం ప్లాట్లు కొని ఇళ్లు కట్టించారు. అయితే హైడ్రా వాళ్లు చుట్టుపక్కల ఇళ్లు పడగొడుతున్నారు. మా ఇళ్లూ అలాగే అవుతాయనే టెన్షన్‌తో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది..’ అని బుచ్చమ్మ కుమార్తె సరిత చెప్పింది. -
చెరువులో అక్రమ కట్టడం.. పేల్చివేత
కొండాపూర్ (సంగారెడ్డి): హైడ్రాను స్ఫూర్తిగా తీసుకొని సంగారెడ్డిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముందస్తుగా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనం పూర్తిగా నీటిలో ఉండటంతో బుల్డోజర్ల సహాయంతో కూల్చివేసేందుకు వీలు కాలేదు. దీంతో తహసీల్దార్ జిలెటిన్ స్టిక్స్ స్పెషలిస్టులను పిలిపించి వారి సహాయంతో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. అయితే భవనం కూలుస్తున్న సమయంలో అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్‌కు రాయి ఎగిరి వచ్చి బలంగా తాకడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 ఏళ్ల క్రితమే నిర్మాణం కొండాపూర్ మండలం కుతుబ్‌షాహీ పేట శివారులోని సర్వే నంబర్ 93లో ఉన్న చెరువుకు సంబంధించిన మూడెకరాల భూమిని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అక్కడ ఐదంతస్తుల భవనంతోపాటు స్విమ్మింగ్ పూల్, గెస్ట్‌హౌస్‌ను నిర్మించాడు. ఆ భవనం ఎఫ్టీఎల్లో ఉండటంతో భవనం చుట్టూ నీరు చేరకుండా ప్రత్యేకంగా చిన్నపాటి బ్రిడ్జిని కూడా నిర్మించుకున్నాడు. ఇది నిర్మించి 12 ఏళ్లయింది. అయినా హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాక, గ్రామస్తులు ఫిర్యాదు చేసే వరకు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులో నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు భవనాన్ని పరిశీలించడం, మామూళ్లు తీసుకోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు. -
మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో మాల్కాపూర్ చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బహుళ అంతస్తుల భవనాన్ని క్షణాల్లో కూల్చివేశారు.మాల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో, క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడ్డారు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు.. ఇళ్లకు మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీమ్‌లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు.. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు
-
ప్రభుత్వ స్థలంలో 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
-
కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్
-
కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ
సాక్షి, కోకాపేట: హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కోకాపేటపై ఫోకస్ పెట్టింది. అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టిసారించింది. సర్వే నంబర్ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో, ప్రభుత్వ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.ఇదిలా ఉండగా.. హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది. సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన -
బుల్డోజర్లకు బ్రేక్
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ ఒకటో తేదీదాకా నిందితులతో సహా ఎవరి ఇళ్లనూ కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే స్థలాలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను నిరభ్యంతరంగా తొలగించవచ్చని తెలిపింది. తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచి్చంది. చట్టవిరుద్ధంగా ఒక్క కూలి్చవేత చోటుచేసుకున్నా.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దనే ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థల చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు రెండు వారాలు ఆపితే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఏమీ జరిగిపోదని పేర్కొంది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికారవర్గాలను కూలి్చవేతలు ఆపివేయమని తాను కోరలేనని తుషార్ మెహతా నివేదించగా.. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు.. కూలి్చవేతలు నిలిపివేయమని ఆదేశాలు జారీచేశామని తెలిపింది. పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూలి్చవేస్తున్నారని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూలి్చవేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘తాను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్లే తన నిర్మాణాలను కూలి్చవేశారని ఒకరు పిటిషన్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక్క సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడాలని వారికి తెలుసు’ అని తుషార్ మెహతా వాదించారు. బుల్డోజర్లు ఆగవని ఎలా అంటారు? సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా కూలి్చవేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే ఇది నిర్ణయమవుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూలి్చవేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక.. బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి’ అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇళ్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూలి్చవేతలకు దిగలేరు. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయమని సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
అక్రమ కట్టడాలు జలమయం
-
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 27 నుంచి ఇప్పటివరకూ జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా పేర్కొంది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.రామ్‌నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హైడ్రాకు ఐపీఎస్ అధికారి రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి.కాగా చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది. -
హైడ్రాకు పోలీస్ స్టేషన్.. భారీగా సిబ్బంది కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా హైడ్రాకు భారీగా సిబ్బందిని కేటాయించింది.హైడ్రాకు 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఏఎస్ఐ అధికారుల కేటాయించారు. పోలీస్‌స్టేషన్ ఏర్పాటునకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమదారులపై కేసులు, విచారణను ఈ సిబ్బంది ముమ్మరం చేయనున్నారు. అయితే పలుచోట్ల కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. హైడ్రా అధికారులపై తిరగబడుతూ వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. -
కూల్చివేతే చెరువుల నిజమైన పరిరక్షణా?
ఇటీవల హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన భవనాల కూల్చివేతలు ప్రజలలో అటు ఆశావాదం ఇటు భయం రెండింటినీ కలిగించాయి. సినిమా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై గంటల కొద్దీ మీడియాలో అయిన ప్రసారాలు కొత్త ప్రశ్నలను తీసుకొచ్చాయి. చాలా చోట్ల ఆక్రమణదారులు.. చెరువుల్లో అపార్ట్మెంట్లను కట్టి సామాన్యులకు విక్రయించారు. తాజా కూల్చివేతలు ఇలాంటి బడుగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.సహజ వనరులను పరిరక్షించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమే అయినప్పటికీ, వాటిని చేపట్టిన విధానాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పూర్తి నీటి స్థాయి (FTL) ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నప్పుడు.. విలువైన ఆస్తులను పోగోట్టుకుంటున్నామన్న ఆందోళన, వ్యాపారాలు, ఉపాధి దెబ్బతింటున్నాయన్న భయం కలుగుతున్నాయి. పర్యావరణంతో పాటు ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి, ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించడం ముఖ్యం.చెరువుల అభివృద్ధి అథారిటీ ఆవశ్యకతఅమెరికాలో ఇల్లినాయి రాష్ట్రంలో షికాగో, డెట్రాయిట్ మధ్యన ఉండే లేక్ మిషిగాన్‌ను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చెరువుల్లో ఇదొకటి. అలాగే ఇదే రాష్ట్రం పక్కన ఉన్నలేక్ ఈరీని కూడా ప్రశంసించాలి.ఈ చెరువు నుంచే నయాగారా వాటర్ ఫాల్స్ ద్వారా నీళ్లు కిందికి దూకుతాయి. వీటి ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. వీటి నిర్వహణలో అక్కడి స్థానిక సంస్థల పాత్ర ఎంతో గొప్పది. లేక్మి షిగాన్లో నీళ్లను గ్లాసుతో ముంచుకుని తాగేయగలిగేంత శుభ్రంగా ఉంటాయి. వాటి స్పూర్తిగా రాష్ట్రంలో నీటి వనరులను, పరిసర ప్రాంతాలను పరిరక్షించడానికి చెరువుల అభివృద్ధి అథారిటీ అత్యవశ్యకం. వీటిని గవర్న ర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. వీటిలో సామాజిక కార్యకర్తలు, విద్యా ప్రముఖులు, పార్టీల ప్రతినిధులను ఉంచాలి. ఈ కమిటీలు పరిస్థితిని బట్టి పారదర్శక నిర్ణయాలు తీసుకోవచ్చు.అథారిటీ ఏం చేయాలంటే?విధానాల రూపకల్పన: ప్రస్తుతం ఉన్న చెరువులను పరిరక్షించడం, ఆక్రమణకు గురైన నీటి వనరులను పునరుద్ధరించడం, కొత్త చెరువులను సృష్టించడం వంటి నియంత్రణ మరియు పర్యవేక్షణ: చెరువుల స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు ఆక్రమణలు, కాలుష్యం నివారణకు నియమాలను అమలు చేయడం.ప్రజలతో అనుసంధానం: స్థానికులతో మమేకం కావడం, చెరువు ప్రాముఖ్యత గురించి వివరించడం, ప్రజలను పరిరక్షణ కార్యకలాపాలలో భాగస్వామ్యం చేయడంకూల్చివేతలకు ప్రత్యామ్నాయం లేదా?ప్రస్తుతం హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించిన చాలామంది.. వాటిల్లో అపార్ట్మెంట్లను కట్టి ..సామాన్యులకు అమ్మేశారు. డబ్బులు రూటు మార్చి ఆక్రమణదారులు గోడ దాటేశారు. ఇప్పుడు కూల్చివేతల వల్ల వంద శాతం నట్టేటా మునిగేది సామాన్యులే. మరి ఇలాంటి చోట్ల కూల్చివేతలకు బదులుగా, భారీ పెనాల్టీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం సబబు.ఆస్తి విలువ నిర్ధారణ: FTL ప్రాంతాలలో ఉన్న ఏదైనా నిర్మాణ విలువను అంచనా వేయడం. (ఇందులో ఆస్తి యొక్క మార్కెట్వి లువ మరియు దాని పర్యావరణ ప్రభావం..రెండింటినీ కలపాలి)పెనాల్టీ: ఆస్తి యజమాని ఆ నిర్మాణాన్ని కొనసాగించాలని కోరుకుంటే, అతను ఆ ఆస్తి విలువకన్నారెండింతలపెనాల్టీని చెల్లించాలి. ఈపెనాల్టీ భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు నిధులను సేకరించడానికి ఒక మార్గంగా పని చేస్తుంది.నిధుల వినియోగం: ఈ పెనాల్టీల ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ పునరుద్ధరణకు ప్రత్యేకంగా వినియోగిస్తారు. దీని ద్వారా కొత్త చెరువులు సృష్టించడం, దాని చుట్టున్న ప్రాంతాల అభివృద్ధి లేదా నష్టపోయిన నీటివనరులను పునరుద్ధరించడం వంటి ప్రక్రియలు కొనసాగించవచ్చు.ప్రత్యామ్నాయ చెరువుల సృష్టిహైదరాబాద్లో పెరిగిన నగరీకరణతో సహజ నీటి వనరుల లోటు ఏర్పడింది. పాతవాటిని పునరుద్దరిస్తూనే.. కొత్త చెరువులను సృష్టించాలి.అలాగే వర్షం నీటిని ఒడిసి పట్టేలా ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు ఉండేలా ప్రజలను చైతన్యమంతం చేయాలి. ఏ ఇంటి వర్షం నీళ్లు ఆ ఇంట్లోనే, ఏ కాలనీ నీళ్లు ఆ కాలనీలోనే ఇంకిపోయినప్పుడు వరద వచ్చే పరిస్థితి భారీగా తగ్గుతుంది. అలాగే కొత్తచెరువుల సృష్టి కచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.తగిన ప్రదేశాల గుర్తింపు: చెరువు అభివృద్ధి అథారిటీ కొత్త చెరువులను ఎక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి తగిన స్థలాన్ని ఎంపిక చేస్తుంది. అందరిని కలుపుకుని ముందు కెళ్లడం: ఈ ప్రక్రియలో స్థానికులందరినీ కలుపుకుని వెళ్లాలి. తద్వారా ప్రతీ ఒక్కరిలో ఇది నాది అనే భావన కలుగుతుంది.అప్డేటేడ్ డిజైన్: కొత్త చెరువులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయాలి. వాటర్కన్సర్వేషన్, జీవ వైవిధ్యం, ప్రజల సౌకర్యాలను కలిగించే విధంగా ఉండాలి. నిర్వహణ మరియు నిర్వహణ: ఈ చెరువులు భవిష్యత్తరాలకు వారసత్వంగాఇ చ్చేలా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికను ఆలోచించాలి.G.O. 111 కింద ఉన్న ప్రాపర్టీల సంగతేంటీ?ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న కట్టడాలపై షరతులు విధిస్తూ తెచ్చిన G.O. 111లోనూ బోలెడు కబ్జాలున్నాయి. వీటికి కూడా ఇవే నిబంధనలు అమలు చేయాలి. ఈ నిధులను చెరువుల పునరుద్ధరణకు వినియోగించాలి. అన్ని సున్నితమైన జోన్లపై పర్యావరణ బాధ్యత యొక్క సరిహద్దుల సమాన అన్వయించడం ద్వారా సమర్థవంతమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఏర్పడుతుంది. చెరువుల సంరక్షణలో భాగస్వామ్యం అయ్యే ప్రాపర్టీ యజమానులకు ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇవ్వాలి లేదా పన్ను తగ్గించాలి. అందరికీ అవగాహన కల్పించాలి, భారీగా ప్రచారం చేపట్టాలి.-శ్రీకర్ వేముల, ఐఆర్ఎస్ అధికారి -
‘హైడ్రా’ సిఫార్సులు.. మియాపూర్‌లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ కొరడా
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. మ్యాప్స్ కంపెనీ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన అధికారులు.. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు చేశారు.ఎర్రగుంట చెరువును ఆక్రమించి చేసి బహుళ అంతస్తుల భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్పై కేసులు నమోదు చేశారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కేసులు నమోదయ్యాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణఫై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కబ్జా కోరల్లో కాముని చెరువు
-
కూల్చివేతలపై అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక భేటీ
-
మహబూబ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
హుస్సేన్ సాగర్ లో వెయ్యి ఎకరాలు మింగేసి అక్రమ కట్టడాలు
-
హైడ్రా దూకుడు.. కమిషనర్ ఏవీ రంగనాథ్ భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.కాగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హైడ్రా. అక్రమ నిర్మాణదారులంతా ఎక్కడ బుల్డోజర్ తమ వైపునకు వస్తుందోనని భయంతో హడలెత్తిపోతున్నారు నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కూల్చివేతల్లో వెనక్కి తగ్గని హైడ్రా అధికారులు.. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేశారు. మరోవైపు హైడ్రా చేస్తున్న పనుల మీద దుమారం కూడా రేగుతోంది. -
హైడ్రా లిస్ట్ లో ఒవైసీ కాలేజీ.. ఇంకా ఎవరెవరు ఉన్నారు ?
-
హైడ్రా @ 30 రోజులు
-
హైడ్రా @ 30 రోజులు
-
చిత్రపురిపై బుల్డోజర్
-
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
-
గండిపేట్‌లో అక్రమ నిర్మాణలపై హైడ్రా ఉక్కుపాదం
సాక్షి, రంగారెడ్డి: గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్‌లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యజమానులు వ్యాపార సముదాయాలను నిర్మించారు. దీంతో తెల్లవారుజామున నుంచే కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి విచ్చిన హైదరాబాద్ సిటీతోపాటు, శివారులోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝలిపిస్తోంది. బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో నగర శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో గతవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. -
HYDRA పరిధిలో కొనసాగుతున్న హైడ్రా యాక్షన్
-
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం
-
ప్రజల నమ్మకాన్ని చెత్త బుట్టలో పడేశారు
న్యూఢిల్లీ: దేశంలో ప్రఖ్యాతిగాంచిన జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వాటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై మండిపడింది. అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనువుగా నిబంధనలను తుంగలో తొక్కిన 2021లో బీజేపీ ప్రభుత్వహయాంలో నాటి ఉత్తరాఖండ్ అటవీ మంత్రి హరక్ సింగ్ రావత్, నాటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్ల పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ ప్రజా విశ్వాసాన్ని బుట్టదాఖలుచేశారు. ఇంతటి విపరీత నిర్ణయాలు కేవలం ఇద్దరే తీసుకున్నారని అనుకోవట్లేము. ఇందులో చాలా మంది ప్రమేయం ఉండొచ్చు’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని పీకే మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయవనంలోని ల్యాన్డౌన్ ఫారెస్ట్ డివిజన్లో పఖ్రో టైగర్ సఫారీ కోసం వేల చెట్లు నరికేశారంటూ పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్ భన్సల్ వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘‘ అధికారి కిషన్‌ను సస్పెండ్ చేయాలని అటవీ కార్యదర్శి చేసిన సిఫార్సును రావత్ పెడచెవిన పెట్టారు. పైగా కిషన్‌ను సమరి్ధంచారు. రావత్ ఆ పదవి నుంచి దిగిపోయాయే కిషన్ సస్ఫెన్షన్, అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయనేతలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కలిసి చేస్తున్న అక్రమాలకు ప్రబల సాక్ష్యం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఈ ఉదంతంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై సీబీఐ సమగ్ర నివేదిక మూడు నెలల్లో సమరి్పంచాలి. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. జిమ్ కార్బైట్ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ పులులకు ఆవాసం. 1,288.31 చదరపు కి.మీ.లోని ఈ అటవీప్రాంతం పేరు. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది. -
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్‌కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్‌గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
నోటీసులిచ్చారు.. చర్యలు మరిచారు!
● చండూరు పట్టణంలో కేంద్రంలో అనుమతి లేకుండా ఓ భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఓ నాయకుడు ఫిర్యాదు చేశాడు. అధికారులు నిర్మాణదారుడికి ముందుగా నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుంటామని చెప్పే లోపే (ఏడాది సమయంలో) ఆ భవన నిర్మాణం పూర్తయింది. ● పట్టణంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా మూడు ప్లోర్ల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ● ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ ముందు అనుమతి లేకుండా రెండు విగ్రహాలు ఏ్పాటు చేస్తున్నారని పట్టణ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. చండూరు : చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పట్టణంలోని సెంటర్ నుంచి రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు మొదలుకుని పెద్ద భవనాలు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు ఇలా చాలా వరకు అనుమతి లేని నిర్మాణాలే. అక్రమ నిర్మాణం చేసుకునే వారికి నోటీలిస్తున్న అధికారులు వారిపై చర్యలకు మాత్రం వెనుకాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పలుకుబడి ఉన్న వారు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే.. పేదలకు మాత్రం అనుమతులు అడుగుతూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 100 వరకు అక్రమ నిర్మాణాలు.. చండూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 ఇళ్ల వరకు అనుమతిలేనివిగా అధికారులు గుర్తించా రు. వీరికి గతంలో నోటీసులు సైతం అందజేసి.. చ ర్యలు తీసుకోవడం మరిచారు. అధికారులు గుర్తించనవి మరో వంద వరకు ఉంటాయని కౌన్సిలర్లే చెప్తున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పట్టణవాసులు అంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు ఫిర్యాదు చేస్తున్నాం చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు అందించాం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తదుపరి చర్యలకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – మొయిజుద్దీన్, కమిషనర్, చండూరు మున్సిపాలిటీ నిబంధనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం కోసం బీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముందుగా అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ ఆర్ఐ లాగిన్ వెళ్తే ఆర్ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ (టీపీఎస్)కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే టీపీఎస్ నుంచి నేరుగా అనుమతులు ఇస్తారు. అనుమతుల కోసం ఇంటి గజాలను బట్టి ఆన్లైన్లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలా అనుమతుల ప్రక్రియ పట్టణంలో సాగడం లేదు. -
‘నా అకాడమీని ఆక్రమిస్తున్నారు’
తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను. ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది. -
నిబంధనలకు ‘నిప్పు’.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది బోయగూడలోని స్క్రాప్ దుకాణం 11 మందిని పొట్టనపెట్టుకుంది... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ లాడ్జి ఎనిమిది మంది ఉసురుతీసింది... తాజాగా మినిస్టర్స్ రోడ్‌లోని డెక్కన్ కార్పొరేట్ భవనంలో ముగ్గురు గల్లంతయ్యారు... ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అగ్నిమాపక నిబంధనల విషయంలో యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోంది. ఇలాంటి కమర్షియల్ భవనాలు ఎన్నో ఉన్నాయి. వీటి విషయంలో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులు సైతం కళ్లు మూసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇవి చేసిన, చేస్తున్న ఉల్లంఘనల విషయం అటు పాలకులు, ఇటు అధికారులకు పట్టడంలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు తనిఖీలు, చర్యల పేరుతో హడావుడి చేస్తారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, ఆ తర్వాత పై స్థాయి లో పైరవీలు చేసి అనుమతులు తీసుకోవడమో, మ్యానేజ్ చేయడమో నగరంలో మామూలైంది. ► జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్థు భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా... పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. ► కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగి్నప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత జరిగిన మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభ శూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తరవాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. ► ప్రమాద ఘటనలు జరిగిన సందర్భంలో వాడీవేడిగా వెలువడే ఈ ప్రకటనలు ఆ తర్వాత చల్లబడిపోతున్నాయి. రోజుల గడిచే కొద్దీ ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. గురువారం డెక్కన్ కార్పొరేట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పరిస్థితి మరోసారి వేడెక్కింది. ఇకనైనా అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయక ప్రాణాలను బలి కావాల్సిందేనని నగరవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
చెరువు పోరంబోకులో టీడీపీ ఆఫీసు
మదనపల్లె: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార బలంతో అక్రమంగా ఆక్రమించుకున్న చెరువు పోరంబోకు స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేయడమే కాక అనుమతిలేకుండా అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం అధికారుల తనిఖీలో బట్టబయలైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అవినీతి, ఆక్రమణ, అక్రమ నిర్మాణాల బాగోతం అధికారుల హెచ్చరిక బోర్డు ఏర్పాటుతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు హైకోర్టులో కేసు ఉందని, లోనికి ఎవరూ ప్రవేశించరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన ఆయన.. లోపల మాత్రం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని దర్జాగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక.. పెద్ద షెడ్లు ఏర్పాటుచేసి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేయడంపై పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. పట్టణంలోని బండమీద కమ్మపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్–8 పార్టు, విస్తీర్ణం.3.09 ఎకరాల్లో ప్రభుత్వ స్థలానికి సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్నందున భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని జిల్లా కలెక్టర్ గిరీషా ఉత్తర్వులతో మాజీ ఎమ్మెల్యే ఆక్రమిత స్థలంలో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక బోర్డు పెట్టారు. అంతేకాక.. మున్సిపల్, రెవెన్యూ అధికారులు భూమి మొత్తం కలియతిరిగి అందులోని చెట్లను, టీడీపీ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన భవనాన్ని, అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన రెండు షెడ్ల కొలతలు తీశారు. ఈ సమయంలో.. తాను మాజీ ఎమ్మెల్యేనని, కావాలంటే గూగుల్ మ్యాప్స్ తీసుకోవాలని దొమ్మలపాటి రమేష్ వ్యాఖ్యానించారు. అడ్డదారుల్లో దురాక్రమణ ఇలా.. బండమీద కమ్మపల్లె పంచాయతీలో సర్వే నంబర్–8లో ఐదెకరాలు పూర్తిగా చెరువు పోరంబోకు స్థలం. అందులో తప్పుడు రికార్డులతో దొంగపట్టాలు పుట్టించి సర్వే నెం.8/1 పేరుతో ఇంద్రసేనరాజు పేరుతో 1984లో ఇచ్చినట్లుగా డీకేటీ పట్టా సృష్టించారు. అయితే, అదే సంవత్సరం అదే నంబర్‌తో వేరే వారికి పట్టా ఇచ్చినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే దొంగ డీకేటీ పట్టాను ఆన్లైన్లో ఎక్కించేందుకు కుదరకపోవడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయారు. 2016లో తహసీల్దార్ శివరామిరెడ్డి హయాంలో అన్‌లైన్‌లోకి ఎక్కించి ఇంద్రసేనరాజు నుంచి దొమ్మలపాటి రమేష్ భార్య దొమ్మలపాటి సరళ పేరు మీద రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ విషయమై అప్పట్లో పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసు పంపగా దానిమీద హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు కేసు నంబర్లను ప్రహరీగోడ మీద ప్రత్యేకంగా పేర్కొంటూ అనుమతిలేకుండా ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయించారు. లోపలమాత్రం అనుమానం రాకుండా పెద్ద భవనాలు, షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. మరోవైపు.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తుంటే టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శీను, మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ వెంకటేష్, ఇతర టీడీపీ నాయకులు అధికారుల విధులకు భంగం కలిగిస్తూ వారిని వీడియోలు, ఫొటోలు తీశారు. తాము విధి నిర్వహణలో ఉన్నామని అధికారులు వారిని వారిస్తున్నా మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటామని వ్యాఖ్యానించడం కనిపించింది. -
‘ఇప్పటం’ పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాక కూల్చివేతల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రోడ్డును ఆక్రమించుకున్న ఇప్పటంలోని ఇళ్ల యజమానులకు మే 21న నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హారీ కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు మలసాని మనోహర్‌రెడ్డి, జి.నరేష్ కుమార్‌లు వాదనలు వినిపించారు. పిటిషనర్లకు కొందరికి పోస్టు ద్వారా, మరికొందరికి వ్యక్తిగతంగా గతంలోనే నోటీసులు అందజేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. దీనిపై ఏమంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పిటిషనర్లు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ పిటిషనర్ల న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు. ఆ విషయాన్ని పిటిషన్లో ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తి నిలదీశారు. ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టడం, దానిపై హడావుడిగా లంచ్‌మోషన్ పిటిషన్ వేయడం, పిటిషనర్లు నిరక్షరాస్యులు కావడం తదితర కారణాలతో షోకాజ్ నోటీసుల విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని సాయిసూర్య చెప్పారు. ఈ వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని చెప్పడంవల్లే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. కోర్టు ముందు వాస్తవాలను తొక్కిపెట్టినందుకు క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించారు. పిటిషనర్లు కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని వారి తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ / బంజారాహిల్స్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌కు చెందిన హోటల్ డెక్కన్ కిచెన్‌కు అనుబంధంగా ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం కూల్చేశారు. నందుకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులపై ఆధికారులు ఆరా తీశారు. దీంతో ఫిల్మ్ నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ సర్కిల్–18 పరిధి, జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్ నం.1లోని ప్లాట్ నంబర్ 2 (ఇంటి నంబర్ 8–2–293/82/ఎఫ్/2)లో సినీ నటుడు దగ్గుబాటి రానాకు వెయ్యి గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని నందుకుమార్‌కు చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకుంది. పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేష్‌కు చెందిన ప్లాట్ నంబర్ 3లోని వెయ్యి గజాల స్థలాన్ని కూడా నందుకుమార్ లీజుకు తీసుకుని డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. దగ్గుబాటి రానా ఫిర్యాదు తమ స్థలంలో, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రానా గతంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే అడ్డుకోవాలని రానా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ నందకుమార్ నిర్మాణ పనులను కొనసాగిస్తుండటంతో ఆదివారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సుమారు 3 గంటల పాటు కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. నందకుమార్ భార్య సహా కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము చట్ట ప్రకారం లీజుకు తీసుకున్నామని, కోర్టు స్టే సైతం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (రాజకీయాలు చేయడానికి మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్) -
నోయిడా ట్విన్ టవర్స్- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి. చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి. అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్‌లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు. అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, కొందరు హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు. బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది. సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్‌దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
బుల్డోజర్ యాక్షన్.. బీజేపీ నేత కట్టడాల కూల్చివేత
నొయిడా: బుల్డోజర్ చర్యలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటిదాకా కమ్యూనల్‌కు సంబంధించిన కోణంలోనే ఇంతదాకా ఈ తరహా ప్రతిచర్యలు చూశాం. అయితే తాజాగా నోయిడాలో బుల్డోజర్తో అక్రమ కట్టడాలను కూల్చేయడం, అందునా ఆ కట్టడాలు బీజేపీ నేతవి కావడం, ఆదేశాలకు సీఎం యోగి స్వయంగా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. యూపీ, నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. ఇవాళ నొయిడా సెక్టార్-93లోని గ్రాండ్ ఒమాక్సే హౌజింగ్ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు సంబంధిత అధికారులు. Residents of Grand Omaxe in Noida's Sec 93 celebrate after the demolition of illegal construction by #ShrikantTyagi.#ITVideo #Noida | @arvindojha @Akshita_N pic.twitter.com/E1JWw2GfvG — IndiaToday (@IndiaToday) August 8, 2022 ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కట్టడాలను కూల్చేశారు. ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం. బుల్డోజర్ డ్రైవర్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు వాళ్లంతా. Shrikant Tyagi- the National Executive Member Kisan Morcha & National Co-Coordinator - Yuva Kisan Samiti allegedly caught on camera for threatening a woman resident of Grand Omaxe sector 93B #Noida. pic.twitter.com/QTwAgK94dd — Utkarsh Singh (@utkarshs88) August 5, 2022 త్యాగికి దెబ్బలు ఇక్కడితోనే ఆగిపోలేదు. నోయిడాలోని భంగెల్ మార్కెట్లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరిగాయి.అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి. చివరిసారిగా హరిద్వారా్-రిషికేష్ మధ్య అతని సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు 25వేల రూపాయల రివార్డు ప్రకటించారు పోలీసులు. బీజేపీ కిసాన్ మోర్చా నేతగా చెప్పుకుంటున్న శ్రీకాంత్ త్యాగి.. గతంలో బీజేపీ పెద్దలతో కలిసి వ్యక్తిగతంగా ఫొటోలు కూడా దిగాడు. అంతేకాదు ఆ ట్యాగ్‌తోనే దందాలు సైతం నడిపిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన అతను గ్రాండ్ ఓమాక్సే సొసైటీలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి.. దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. గతంలోనూ నోయిడా అథారిటీ అతనికి అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది. అయితే.. బీజేపీ నేత కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వివాద నేపథ్యంలో అతను తమ పార్టీ సభ్యుడు కాదంటూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
అవినీతిపై సర్కార్ ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: నగరపాలక, పురపాలక సంస్థల్లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాల్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కూడా అనకాపల్లి, బొబ్బిలి, సామర్లకోట, ఏలూరు, మార్కాపురం, తిరుపతి, రాజంపేట, పుట్టపర్తి, నందిగామ మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల్లో పట్టణ ప్రణాళికా విభాగం రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంపై అధికంగా అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువైతే అవినీతిపరులపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. దీంతో అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. కాగా ఏసీబీ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. గత కొన్నేళ్లుగా ఆరోపణలు.. మున్సిపల్, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని సిబ్బందిపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. ఆస్తి పన్ను అసెస్మెంట్ చేసేందుకు సర్వే చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తగా భవన నిర్మాణం చేపట్టాలన్నా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండి, ఇంటి ప్లాన్ కూడా నిబంధనల మేరకు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ)కి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతిపరుల ఆటకట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 14400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై అధిక ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ వాటిలో దాడులు ముమ్మరం చేసింది. ఏసీబీ తనిఖీలపై నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక సంస్థలు, 4,132 వార్డు సచివాలయాల్లో ప్రజలకు కనిపించేలా ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్ ప్రదర్శించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం నిర్లక్ష్యం.. సూళ్లూరుపేటలో రూ.2,00,960, జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి మున్సిపాలిటీలో రూ.38,200, పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో రూ.35,560 అనధికార నగదును ఏసీబీ అధికారులు గత రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల సర్వే, ప్లాన్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను కాలవ్యవధికి మించి పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించారు. అంతేకాకుండా అనధికార నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేల్చారు. అలాగే నిబంధనల ప్రకారం కొన్ని భవనాలకు నిర్మాణాల అనుమతి రుసుం వసూలు చేయడంలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది విఫలమయ్యారని.. రికార్డులను సైతం సరిగా నిర్వహించడం లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో బడా బాబుల కక్కుర్తి
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 67లో మాజీ ఎంపీ సి.ఎం.రమేష్ తన ఇంటి సెట్‌బ్యాక్‌లో దుకాణాలను అక్రమంగా నిర్మించగా టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ దుకాణాలను అద్దెకు ఇచ్చుకోవడానికి ఆయన నిర్మించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో ఓ సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త తన ఇంటి సెట్‌బ్యాక్‌ను అక్రమంగా మూడు దుకాణాలను నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు సదరు నిర్మాణదారుడికి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఓ పారిశ్రామికవేత్త తన ఇంటి సెట్‌బ్యాక్‌లో మూడు అంతస్తుల భవనం నిర్మించి ఓ ఫర్నీచర్ షాపు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లో అపార్ట్‌మెంట్‌ను ఆనుకొని సెట్‌బ్యాక్‌లో అపార్ట్మెంట్ నిర్మించిన బిల్డర్ కామన్ ఏరియాలో దుకాణాలు నిర్మించగా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. సాక్షి, హైదరాబాద్: సంపన్న వర్గాలు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో గజం స్థలం ప్రస్తుతం రూ. 2.50 లక్షలు పలుకుతోంది. గతంలో తమ ఇంటి ఆవరణలో వెలుతురు, గాలి కోసం చాలా మంది బడా బాబులు చక్కటి ఇళ్లను సెట్‌బ్యాక్ వదిలేసి నిర్మించుకున్నారు. ఇప్పటిదాకా బాగానే నడిచింది. అయితే ప్రస్తుతం భూముల ధరలు ఆకాశన్నంటుతుండటంతో పది గజల స్థలాన్ని కూడా ఏ ఒక్కరూ ఖాళీగా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కమర్షియల్ కావడంతో ఈ రోడ్లలో నిర్మించుకున్న ఇళ్ల సెట్బ్యాక్లు ఇప్పుడు దుకాణాలుగా మారుతున్నాయి. ► గతంలో అనుమతులు తీసుకొని సెట్‌బ్యాక్ వదలగా ఇప్పుడు ఆ సెట్బ్యాక్లోనే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. ► ఒక వైపు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటిని నేలమట్టం చేస్తున్నా కొంత మంది యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. పది నుంచి 50 గజాల స్థలం ఉంటే చాలు రెండు మడిగెలు వేసి అద్దెకిస్తున్నారు. ఐస్‌క్రీం షాపులు, టిఫిన్ సెంటర్లు, మెడికల్‌షాపులు, ఇలా అద్దెకివ్వడం వల్ల నెల నెలా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అద్దె వస్తుండటంతో ఖాళీగా ఉన్న కామన్ ఏరియాలను వాణిజ్య ప్రాంతాలుగా మారుస్తున్నారు. 87 అక్రమ నిర్మాణాలు... ► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ తదితర సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికే నివాసాల సెట్‌బ్యాక్‌లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. 87 ప్రాంతాల్లో సెట్బ్యాక్లు, దుకాణాలుగా రూపాంతరం చెందినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. చాలా మందికి నోటీసులు జారీ చేసి నా ఉపయోగం లేకుండా పోతున్నది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇస్తున్నారు. (క్లిక్: ఇల్లు కడుతున్నారా.. వెంటనే పర్మిషన్ ఇలా..) పార్కింగ్ స్థలం నో... ► నివాసాల ముందు, వెనుక భాగాల్లో కామన్ ఏరియాలను దుకాణాలుగా మారుస్తున్న నివాసితులు పార్కింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పార్కింగ్తో తమకు సంబంధం లేదని అగ్రిమెంట్ల సమయంలోనే చెప్పేస్తున్నారు. దీంతో రోడ్లపైనే పార్కింగ్లు చేసుకుంటూ ఈ దుకాణంలోకి వెళ్లి వస్తున్నారు. ‘అందరి’ అండదండలు ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసాల సెట్‌బ్యాక్‌లలో జరుపుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు వెళ్తున్న జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తూ అటు వైపు వెళ్లవద్దంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో నిర్మాణదారులు యథేచ్ఛగా అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతూ తమ పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
హైదరాబాద్‌లో కంచికి చేరని అక్రమ కట్టడాల కథ
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల కథ కంచికి చేరకుండానే తిరిగి మొదటికొచ్చింది. హెచ్ఎండీఏతో పాటు వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా.. భవన యజమానులు తిరిగి నిర్మిస్తున్నారు. చాలాచోట్ల స్థానిక నేతల అండదండలతో అక్రమ భవనాల పునర్నిర్మాణం యథావిధిగా కొనసాగుతోంది. కూల్చివేసిన చోట మరోసారి నిర్మాణం చేపట్టకుండా హెచ్ఎండీఏ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అక్రమాలు ఎక్కడా ఆగడం లేదు. ఒక్క దుండిగల్‌లోనే మున్సిపల్ అధికారులు అక్రమ భవనాలను ఏకంగా మూడుసార్లు కూల్చివేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. దుండిగల్‌తో పాటు శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు చివరికి చేతులెత్తేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రహసనంగా కూల్చివేతలు.. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులు నెల రోజుల వ్యవధిలో 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేశారు. వీటిలో చాలా వరకు 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించివే. గ్రామ పంచాయతీల్లో జీ+2 భవనాల కోసం అనుమతులు తీసుకొని అయిదారు అంతస్తుల వరకు అపార్ట్మెంట్లను నిర్మించారు. కొన్ని చోట్ల గోడౌన్లను ఏర్పాటు చేశారు. అధికారులు ఇలాంటి వాటిని గుర్తించారు. వీటిని కూల్చివేయించారు. వేల సంఖ్యలోనే అక్రమాలు.. నగరం చుట్టు శివారు ప్రాంతాల్లో వేలాదిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రెండంతస్తుల కంటే ఎక్కువగా అపార్ట్మెంట్లు నిర్మించేందుకు టీఎస్‌బీ పాస్ నుంచి చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలి. ఔటర్ రింగురోడ్డుకు అన్ని వైపులా విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామ పంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. (క్లిక్: బన్సీలాల్‌పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు) ► దుండిగల్, నిజాంపేట్, శంకర్పల్లి, మేడ్చల్, పోచారం, బడంగ్పేట్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగాయి. ప్రత్యేకంగా కోవిడ్ కాలంలో రెండేళ్లుగా ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు తాము చేపట్టిన కూల్చివేతల కారణంగా కొత్తగా భవనాలను నిర్మించేవాళ్లు మాత్రం నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారని, ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఫలితాన్నిచ్చాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం) -
బల్దియా లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది. అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పీపీల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. -
అక్రమ కట్టడాలపై కేటీఆర్‌కు కోన వెంకట్ ట్వీట్
నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రముఖ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్‌లోని అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల కార్పోరేషన్ దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘సయ్యద్ నగర్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్‌లో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరగుతున్నాయి. మురుగు నీరు లేదు, పారిశుధ్యం లేదు, రోడ్లు లేవు. కానీ ఈ మురికి వాడల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. దయ చేసి దీనిని పరిశీలించండి’ అంటూ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. Lot of Illegal constructions are coming up in Sayyed Nagar, Road no 12, Banjarahills... No sewerage, No sanitation, No roads.. but multi storied constructions in these slums will lead to major problems in future.. Please look into this 🙏 @CommissionrGHMC @KTRTRS @GHMCOnline pic.twitter.com/rHN7uNFySC — kona venkat (@konavenkat99) February 26, 2021 -
కబ్జాలు చేస్తే ఇక జైలుకే...
సాక్షి, హైదరాబాద్ : ఇటీవలి వరదల్లో హైదరాబాద్‌లో జలవిలయంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జనం కడగండ్లు, వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తోంది. గ్రేటర్‌తో పాటు ప్రధాన నగరాల్లో చెరువుల కబ్జాలు, కాల్వల ఆక్రమణల కారణంగా నివాస ప్రాంతాలన్నీ నీటమునిగిన నేపథ్యంలో ప్రధాన శాఖలతో కలిసి చెరువుల పరిరక్షణ చట్టం రూపొందించే కసరత్తు మొదలుపెట్టింది. కబ్జా చేస్తే నేరుగా కటకటాల్లోకి నెట్టేలా, అక్రమ నిర్మాణాలు చేస్తే వారంట్లు లేకుండా అరెస్ట్‌లు చేసేలా... కఠిన చర్యలకు వీలుకల్పిం చే చట్టాన్ని రూపొందించే పనిలో పడింది. అటు కబ్జాలు..ఇటు కన్నీళ్లు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో... చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేలాది చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువు పూర్తి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకుపోయిందని నిర్ధారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయని, ఫీడర్ చానళ్లు, కాల్వలన్నింటినీ ఆక్రమించారని గుర్తించింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఇది ఎక్కువని తేల్చింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 185 చెరువులు ఉండగా ఇందులో సగం చెరువులు ఆక్రమణ దారుల గుప్పిట్లో ఉన్నాయని, 70 శాతానికి మించి చెరువులు కుచించుకుపోయాయని గుర్తించింది. భారీ వరద కొనసాగినప్పుడు కబ్జాల కారణంగా చెరువుల నుంచి నీరు బయటకి వెళ్లే మార్గాల్లేక కట్టలు తెగుతున్నా యి. ఇటీవలి వర్షాలతో గ్రేటర్ పరిధిలోనే 50 చెరువులు దెబ్బతినగా, 20 చెరువులు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మీర్‌పేటలోని పెద్దచెరువు, పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, మియాపూర్‌లోని కొత్తకుంట, గగన్ పాడ్‌లోని మామాడికుంట, షేక్‌పేటలోని శాతం చెరువు, అనుంగని చెరువులు ఎక్కువగా దెబ్బతినగా వీటి మరమ్మతులకే రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా హైదరాబాద్ పరిధిలోనే 35 వేలకు పైగా కుటుంబాలు కొన్ని వారాల పాటు నీటి ముంపుతో అల్లల్లాడాయి. నాలాల పునరుద్ధరణ, ఆక్రమణలను తొలగించడం ద్వారా గ్రేటర్ పరిధిలో వరద ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని, తద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు ఇంజనీర్లు, నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, మున్సిపల్, జీహెచ్ఎంసీలు కలిసి చెరువుల రక్షణకు కొత్తచట్టాన్ని ఓ కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాయి. అవసరమైతే పీడీ యాక్ట్ చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురానుంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. నీటి వనరులు కాపాడేలా గతంలో పార్లమెంట్ స్టాడింగ్ కమిటీలు చేసిన సిఫార్సులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెరువుల ఆక్రమణల నివారణ చట్టాలను అధ్యయనం చేస్తోంది. ప్రభుత్వవర్గాల సమాచారం మేరకు చట్టంలోపొందుపర్చనున్న అంశాలివీ... ►ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందిస్తోంది. ►చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠినచర్యలుంటాయి. ► చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించొద్దు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ► చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహమార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురద, రసాయన వ్యర్థాలను చెరువులో వేయొద్దు. ► ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టొద్దు. ► శుద్ధి చేయని జలాలను చెరువుల్లోకి పంపొద్దు. ► వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. ► ఆక్రమణదారులను ఎలాంటి వారంట్ లేకుండానే అరెస్టు చేసే, పీడీ యాక్టు పెట్టే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు. -
గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత
-
మెట్పల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
‘పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఈ భవనాలకు మున్సిపల్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ అదనంగా మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.’ మెట్పల్లి (కరీంనగర్) : మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మా ణాలు జోరుగా సాగుతున్నా యి. టౌన్‌ప్లానింగ్ వి భాగం అధికారుల అం డతో నిబంధనలకు విరుద్ధంగా సా గుతున్న నిర్మాణాలతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మున్సిపల్ నుంచి అనుమతులు పొందకపోయిన అనుమతి తీసుకొని అంతకుమించి అంతస్తులు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని వెల్లుల్లరోడ్లో ఓ వ్యక్తికి మొదట జీ+1 భవనానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తర్వాత భవనం నిర్మాణంలో ఉండగా పాత అనుమతిని పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా జీ+2 నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఈ అనుమతి వ్యవహారా>న్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టింది. ఆ తర్వాత పలు కాలనీల్లో ఇలాంటి అక్రమాలను స్థానికులు ‘సాక్షి’ దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపై పరిశీలన జరుపగా, అధికారులు మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. కాసులిస్తేనే అనుమతులు ! టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ముడుపులిస్తేనే అనుమతులు జారీ చేస్తారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నిర్మాణాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ లంచం ఇస్తేనే అనుమతులు జారీ చేస్తున్నారని.. లేనిపక్షంలో దానిని షార్ట్‌ఫాల్ కింద పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో తప్పనిసరిగా అనుమతులు జారీచేయాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. లేనిపక్షంలో అధికారులే జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నిర్ధేశిత సమయంలోపు తమ చేతికి ముడుపులు అందింతే అనుమతులు జారీ చేస్తున్నారు. లేకుంటే ఏదో ఒకటి కారణాన్ని సాకుగా చూపుతూ సంబంధిత ఫైళ్లను పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని దరఖాస్తుల విషయంలో మున్సిపల్‌కు ఫీజు రాకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. రూ.లక్షల్లో ఫీజు అవుతుందని దరఖాస్తుదారులకు చెబుతూ అనుమతులకు బదులు తమ జేబులు నింపుకుంటూ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే... టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్న విషయం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో 90 శాతం మేర నిబంధనలకు విరుద్ధంగానే సాగుతున్నాయి. ఇందులో కొన్ని భవనాల్లో తీసుకున్న అనుమతుల కంటే అదనంగా అంతస్తులు నిర్మించడం, మరికొన్ని అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నవి ఉండడం గమనార్హం. ఇష్టారాజ్యానికి నిదర్శనమిదిగో.. పట్టణంలోని వెల్లుల్ల రోడ్లో జీ+1 అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించిన ఇంటికి అధికారులు కొత్తగా జీ+2 అనుమతులిచ్చారు. పాత అనుమతిని పక్కనపెట్టి కొత్తగా అనుమతులివ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇదిలా ఉంటే.. శివాజీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో అధికారులు జాప్యం చేయడంతో అతడు పనులు మొదలుపెట్టాడు. అనంతరం అనుమతిపత్రాల కోసం వెళితే పనులు మొదలుపెట్టిన ఇంటికివ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారు. కానీ వెల్లుల్ల రోడ్లో భవనానికి పాత అనుమతిని పక్కన బెట్టి కొత్తగా అనుమతులివ్వరాదు. అధికారులు అనుమతుల జారీ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. టీపీబీఓ తిరుపతమ్మకు మెమో పట్టణంలోని వెల్లుల్లరోడ్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ భవనానికి అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై ‘సాక్షి’లో ఈ నెల 18న ‘సక్రమం పేరుతో అక్రమం’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీంతోపాటు స్థానికంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై టీపీబీవో తిరుపతమ్మను సంజాయిషీ అడుగుతూ మెమో ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని, వచ్చిన వెంటనే మెమో జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అక్రమమైతే కూల్చివేస్తాం నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. త్వరలోనే నూతన మున్సిపల్ చట్టం అమలులోకి రాబోతుంది. దీని ప్రకారం అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాం. దరఖాస్తుదారులు మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకొని దాని ప్రకారమే భవనాలు నిర్మించుకోవాలి. అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాం. ఎక్కడైన అలాంటివి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్‌గౌడ్, కమిషనర్ -
చట్టప్రకారమే అక్రమ కట్టడాలపై చర్యలు : బొత్స
సాక్షి, అమరావతి : కృష్ణానదిలో అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. నదీ పరీవాహక చట్టాలకు విరుద్ధంగా కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించామన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకమైన నిర్మాణాలకు గతంలోనే సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. చట్టపరంగా, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే పాతూరు కోటేశ్వరరావుకు చెందిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాన్ని సీఆర్డీఏ అధికారులు తొలగించారని, దీన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాగా, చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమమేనని దాని యజమాని లింగమనేనితోపాటు పలు అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేశారని, వాటిని కూడా త్వరలో తొలగించాల్సి వుందన్నారు. -
అక్రమ కట్టడాలపై కొరడా
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వెంబడి కృష్ణానదిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలకు ఇదివరకే నోటీసులు జారీచేసిన అధికారులు... వాటిపై యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సోమవారం నుంచి ఒక్కో అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందుగా పాతూరి కోటేశ్వరరావు నిర్మించిన కాంక్రీట్ చప్టాను సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ధ్వంసంచేసి నదీ ప్రవాహం సాఫీగా వెళ్లేలా చేశారు. కానీ, దీనిపై ఎల్లో మీడియా రాద్ధాంతం మొదలుపెట్టి చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తున్నట్లు గగ్గోలు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లోనూ టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు దీనిపై హంగామా చేశారు. కొద్దిసేపటికి తొలగించేది చంద్రబాబు నివాసం కాదని తేలడంతో ఎల్లో మీడియా గప్‌చుప్ అయింది. ‘లింగమనేని’కి తుది నోటీసులు వాస్తవానికి చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహానికి మూడు రోజుల క్రితం సీఆర్డీఏ అధికారులు తుది నోటీసులు జారీచేశారు. అక్రమంగా నిర్మించిన ఆ భవనాన్ని వారం రోజుల్లో తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, రెండు నెలల క్రితం కృష్ణా నది కరకట్ట లోపల నిర్మించిన 24 అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ ప్రాథమిక నోటీసులు జారీచేసింది. ఆ కట్టడాల యజమానుల నుంచి వచ్చిన వివరణలు, ఇతర అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాత అందులో ఐదు నిర్మాణాలు నదీ పరిరక్షణ చట్టం ప్రకారం ఏమాత్రం సహేతుకంగా లేవని నిర్ధారించారు. అందులో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిథిగృహంతోపాటు ఆక్వా డెవిల్స్, పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 19 నిర్మాణాలకు సంబంధించి ఐదుగురు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మిగిలిన నిర్మాణాల నుంచి వచ్చిన వివరణలను పరిశీలించి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, సోమవారం తొలగించిన పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణానికి అధీకృత అథారిటీ నుంచి ఎటువంటి అనుమతిలేదని, 1884 నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా దీన్ని నిర్మించినట్లు సీఆర్డీఏ తెలిపింది. తమ భూమి కోతకు గురికాకుండా ఈ నిర్మాణం చేపట్టినట్లు యజమాని కోటేశ్వరరావు ఇచ్చిన వివరణలో ఎటువంటి సహేతుకత లేకపోవడంతో దాన్ని తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సీఆర్డీఏ పేర్కొంది. మరోవైపు.. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటన్నింటిని కూల్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మరోచోట ఎటువంటి అనుమతులు లేకుండా పంట పొలం మధ్యలో చేపట్టిన ఓ నిర్మాణానికి సీఆర్డీఏ నోటీసులు జారీచేయడంతో దాని యజమానులే స్వచ్ఛందంగా తొలగించారు. -
అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను నిరోధించాలని ఓ వైపు ప్రచారం చేస్తుంటే అవేమీ పట్టనట్లు వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. నగరంలో లెక్కకు మించి అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పటమట(విజయవాడతూర్పు) : అనుమతి పొందేది ఓ విధమైన భవనానికైతే నిర్మాణం జరిగేది మరో రకమైన నిర్మాణం.. అనుమతులు రాని ప్రాంతాలు, భవనాలకు కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనధికారికంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. నివాసయోగ్యమైన భవనాల అనుమతి పొందుతూ వ్యాపార/వాణిజ్య నిర్మాణాలు చేస్తున్నా.. జీ ప్లస్1కి అనుమతి పొంది.. జీ ప్లస్ ఐదు ఫ్లోర్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఫ్లోర్ నిర్మాణాలకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు లక్షల్లో వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నగర పాలక సంస్థలో ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమంలో, ప్రతి శుక్రవారం జరుగుతున్న ఓపెన్ ఫోరంలో అనధికారిక నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఆయా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. హనుమాన్‌పేటలో ఏలూరులాకులకు వెళ్లే మార్గంలో అనధికారిక ఫ్లోర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టిల్టు, గ్రౌండ్ ఫ్లస్ రెండు ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉన్న భవనంపై గతంలో అనధికారికంగా నిర్మాణం జరుగుతుంటే సంబంధిత అధికారులు వెళ్లి భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయటమే కాకుండా అక్రమకట్టడాన్ని కూల్చివేశారు. నిబంధనల మేరకు ప్లాను పొందిన తర్వాత మాత్రమే భవనం పునఃనిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీఎంసీలోని ఓ కీలక అధికారి చక్రం తిప్పి అదనపు అంతస్తులు వేయటానికి లక్షల్లో బేరం కుదుర్చుకున్నారు. రెసిడెన్షియల్ విభాగంలో పాత ప్లాను పొందిన భవనం కమర్షియల్ వినియోగాలకు అనువుగా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనివల్ల కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం కూడా అధికారులు తమ జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలు. మరో నిర్మాణంలో పూర్తిగా నిబంధనలనేవి కేవలం పత్రాలకే పరిమితం అన్నట్లు వ్యవహరించారని విమర్శ. గాంధీనగర్‌లోని సాంబమూర్తి రోడ్డులోని డీమార్టు వద్ద అతి కొద్ది స్థలంలో భారీ భవనానికి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. రెసిడెన్షియల్ విభాగంలో జీ ఫ్లస్–1 మాత్రమే అనుమతి ఉన్న ఈ భవనానికి అధికారుల చలవతో జీ ఫ్లస్–4 స్లాబులు వేయటంతోపాటు పార్కింగ్‌కు కేటాయించాల్సిన ప్రాంతాన్ని వ్యాపార వినియోగాలకు అనువుగా దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నారని కార్పొరేషన్ 103కి పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తగ్గుతున్న ఆదాయం నిబంధనల మేరకు కార్పొరేషన్‌కు భవన నిర్మాణ అనుమతులకు చలానా రూపంలో స్థలం, నిర్మాణం జరిగే ప్రాంతానికి, యూజీడీ కనెక్షన్లకు, తాగునీటికి, నిర్మాణ వ్యర్థాల తొలగింపు వంటి తదితర అంశాల్లో చలానా రూపంలో నగదు చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనధికారిక నిర్మాణాల వల్ల ఇటు కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం సంబంధిత భవనాల గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయా ఫిర్యాదుల మేరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నాం. అనధికారిక నిర్మాణాలను కూల్చేస్తాం.–లక్ష్మణరావు,వీఎంసీ ప్రణాళిక అధికా>రి -
దాని వెనుకున్న ఆంతర్యమేంటి?
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నా అక్రమార్కులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆంతర్యమేంటనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ యేడాది ఆగస్టు5 బీపీఎస్ గడువు ముగిసినా మళ్లీ 31వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది. అయితే కేవలం 18 కట్టడాలే క్రమబద్ధీకరించబడ్డాయి. లక్షకుపైగా జనాభా..గ్రేడ్ 1 మున్సిపాలిటి ఎమ్మిగనూరు పట్టణంలో అక్రమ లే అవుట్లు..అక్రమ కట్టడాలకూ కొదవలేదు. పట్టణంలో దాదాపు 26,500 భవనాలు ఉన్నాయి. దాదాపు 750కిపైగానే అక్రమ నిర్మాణాలు ఉంటాయన్నది అనధికారిక అంచనా. మున్సిపల్ సాధారణ నిబంధనలు అటుంచుతే కనీసం అనమతి కూడా లేకుండా నిర్మించిన భవనాలు లేకపోలేదు. అక్రమకట్టడాల క్రమబద్ధీకరణకు 86మంది దరఖాస్తు చేసుకోగా 18 మాత్రమే క్రమబద్ధీకరించగా మున్సిపాలిటీకి రూ.16లక్షల ఆదాయం సమకూరింది. మొత్తం అక్రమకట్టడాలు క్రమబద్ధీకరిస్తే రూ. కోట్లలో ఆదాయం వచ్చేదని అధికారులు చర్చించుకుంటున్నారు. చర్యలకు వెనుకడుగు.. ప్రభుత్వం బీపీఎస్‌కు అవకాశం కల్పించినా అక్రమకట్టడాలు చేపట్టిన యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు చర్యలు చేపట్టలేరనే ధైర్యమా... అనాధికారికంగా జరిగిన ఒప్పందాలేమైనా ఉన్నాయా అనే విమర్శలూ లేకపోలేదు. మున్సిపల అధికారులు అనుకుంటే క్రమబద్ధీకరించుకోని నిర్మాణాలను కూల్చివేసే అధికారం ఉంది. ఆస్తిపన్నుపై 25శాతం పెంచి జీవితకాలం వసూలు చేయొచ్చు. శాశ్వతంగా కుళాయి కనెక్షన్లు తొలగించవచ్చు. మున్సిపల్ అధికారులు ఏమిచేయలేరులే అన్న భావన అక్రమకట్టడదారుల్లో ఉండటం, లైసెన్సున్డు సర్వేయర్ల ఆధిపత్యం సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 16లక్షల ఆదాయం బీపీఎస్ కింద ఆగస్టు 5నుంచి 31వరకు 18 కట్టడాలు క్రమబద్ధీకరించబడ్డాయి.రూ.16లక్షల ఆదాయం వచ్చింది. బీపీఎస్ గడువు ముగిసినందునæ అక్రమకట్టడాలకు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం. – హయాత్,టీపీఓ -
‘అప్పటి నుంచి మైండ్ మరింత దెబ్బతిన్నట్టుంది’
సాక్షి, అమరావతి : టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి 23 సీట్లిచ్చి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో అడ్డగోలుగా మాట్లాడుతున్న టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్ పలుమార్లుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లు కట్టబెట్టిన ప్రతిపక్షపాత్ర పోషించకుండా చంద్రబాబు వింతగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు లింగమనేని గెస్ట్ హౌజ్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట. ఇదేం వాదన బాబూ?’అని చురకలంటించారు. మరొక ట్వీట్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారుల తీరుపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓడినా చంద్రబాబే సీఎం అని ఆ మధ్య మాజీ మంత్రి ఒకావిడ.. రాజపత్రంలో ప్రకటించినంత ధీమాగా చెప్పుకొచ్చారు. దీనిని గట్టిగా నమ్మినట్టున్నారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని కొందరు అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో పెట్టడానికి ఇష్టపడటం లేదట. పచ్చ జీవులూ డినయలిజం నుంచి బయటపడండి. వాస్తవ ప్రపంచంలోకి రండి’అని హితవు పలికారు. -
ఏం చేద్దాం..?
సాక్షి, గుంటూరు: టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం అక్రమ నిర్మాణం అని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అటు టీడీపీ నేతల్లోనూ.. ఇటు నగరపాలక సంస్థ అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్రమ కట్టడాలైన ప్రజావేదిక కూల్చి వేయడం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం సైతం అక్రమ కట్టడమని బయటపడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ నేతలు వణికి పోతున్నారు. మరోవైపు అక్రమంగా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై నగరపాలక సంస్థ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే అక్రమ కట్టడానికి పన్నులు వేయించి దాన్ని సక్రమం చేసే పనిలో పడగా, విషయం బయటకు పొక్కడం, అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరూ పన్ను వేసే ధైర్యం చేయలేకపోతున్నారు. టీడీపీ కార్యాలయ భవనానికి ఆక్రమించిన కార్పొరేషన్ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా..? లేదా దానిపై అద్దెలు, జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటారా? అనే చర్చ నడుస్తుంది. అయితే టీడీపీ కార్యాలయ భవనానికి ఎటువంటి అనుమతులు లేకపోవడం.. కార్పొరేషన్ స్థలం ఆక్రమించడం.. లీజుకు ఇచ్చిన స్థలాన్ని సైతం రెన్యూవల్ చేసుకోకుండా వదిలేయడం వంటి అంశాలపై సమగ్రంగా నివేదిక తయారు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ ఉన్నతాధికారులకు పంపేందుకు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. నోటీసుల జారీకి రంగం సిద్ధం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా దృష్టి సారించడంతో టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నగరపాలక సంస్థ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉండటంతో చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడంతోపాటు, ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం నిర్మించినట్లుగా కనీసం కార్పొరేషన్ రికార్డుల్లో కూడా లేదంటే ఏ స్థాయిలో అక్రమం జరిగిందో అర్థమవుతోంది. మామూలుగా అయితే అక్రమ నిర్మాణానికి నోటీసులు జారీ చేసి కూల్చివేసే అధికారులు టీడీపీ రాష్ట్ర కార్యాలయం కావడంతో ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘోర పరాభవం తరువాత కార్యకర్తలకు అందుబాటులో ఉంటానంటూ ఈ భవనం నుంచే తన కార్యకలాపాలు మొదలు పెట్టడం.. ఆయన భవనంలోకి అడుగు పెట్టిన మరుసటి రోజే అక్రమ భవనం గుట్టు రట్టు కావడంతో టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఇప్పటికే ప్రజా వేదికను కూల్చిన ప్రభుత్వం తనపై కక్షతో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి సైతం నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పడం చూస్తుంటే వారు ఏస్థాయిలో ఆందోళనకు గురవుతున్నారో అర్థమవుతోంది. ఏదేమైనా నగరపాలక సంస్థ అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టి అక్రమ భవనాన్ని కూల్చివేయడంతోపాటు టీడీపీ కార్యాలయ ఆక్రమణలో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఇష్టారాజ్యం నిరుపేదలు తలదాచుకునేందుకు చిన్న రేకుల షెడ్డు నిర్మించుకున్నా.. చిరు వ్యాపారులు చిన్న షాపు ఏర్పాటు చేసుకున్నా అదేదో భయంకరమైన తప్పు జరిగిపోయినట్లుగా భావించి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూల్చివేసే నగరపాలక సంస్థ అధికారులకు అడ్డగోలుగా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం మాత్రం కనిపించకపోవడం దారుణమైన విషయం. కార్పొరేషన్ లీజుకు ఇచ్చిన వెయ్యి గజాల స్థలంలో అన్ని అనుమతులతో భవనాన్ని నిర్మించాల్సి ఉన్నప్పటికీ అడ్డగోలుగా అక్రమ కట్టడాన్ని నిర్మించేశారు. 20 ఏళ్లుగా అక్రమ కట్టడానికి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం.. ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. అంతేకాకుండా నగరపాలక సంస్థకు చెందిన 1,637 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించేసి ప్రహరీ నిర్మించి 20 ఏళ్లుగా టీడీపీ నేతలు తమ స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారుల కంటికి అదేమీ కనిపించలేదు. సుమారు రూ.30 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసినా.. స్థలంలీజును రెన్యూవల్ చేసుకోకుండా వదిలేసినా.. వారి జోలికి కూడా వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. గత ఐదేళ్లుగా టీడీపీ అధికారంలో ఉండటంతో వారు ఏం చేసినా అధికారులు తలాడిస్తూ వచ్చారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న అరండల్‌పేటలో ఆ స్థాయి భవనానికి ఆరు నెలలకు రూ. 5 లక్షలు చొప్పున పన్ను వేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నగరపాలక సంస్థకు ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున సుమారుగా 20 ఏళ్ల పాటు రూ. 2 కోట్ల పన్ను ఎగవేయడంతోపాటు అతి ఖరీదైన స్థలాన్ని ఆక్రమించి కబ్జా చేసినా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. -
అవకాశమిచ్చినా అందిపుచ్చుకోరా..
సాక్షి, విజయనగరం : పట్టణ ప్రాంతాల్లో అక్రమ భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్ పథకం ద్వారా మంచి అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకునేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బీపీఎస్‌ను (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) అమలు చేస్తున్న అనుకున్నవిధంగా స్పందన రాలేదు. జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో అక్రమ భవనాలు ఉన్నాయన్న విషయం బహిరంగ సత్యమైనా.. వాటిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో యజ మానులు సైతం నిర్లక్ష్యం నటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో మున్సిపల్, కార్పొరేషన్ల ఖజా నాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న బీపీఎస్ గడువును మరో మారు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జూలై నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ పథకం ప్రారంభించగా... ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువిచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో రెండు నెలల పాటు జూన్ నెలాఖరు వరకు గడువు పెంచింది. అయినప్పటికీ అక్రమభవనాల యజమానుల్లో స్పందన లేకపోవడంతో మరో నెల రోజుల గడువు పెంచుతూ జూలై నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. దీంతో గడిచిన ఐదు నెలల వ్యవధిలో ఇప్పటివరకు రెండు సార్లు గడువు పెంచినట్లైంది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు అమలు చేస్తోన్న బీపీఎస్ స్కీమ్‌కు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. 1985 జనవరి 1వ తేదీ నుంచి 2018 ఆగస్టు 31 వరకు వాస్తవ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టినా.. అసలు అనుమతులే పొందకుండా నిర్మించిన అక్రమ కట్టడాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. అనుమతిలేని లే అవుట్లలో నిర్మాణం జరిగిన భవనాలను కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్ఛు. అనధికార భవన నిర్మాణదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.10 వేలు చొప్పున చెల్లించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారులు భవనాలను పరిశీలించి ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులకు భిన్నంగా నిర్మించిన భవనాలను గుర్తించి అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా తాఖీదులు ఇస్తారు. అందుకు సంబంధించిన అన్ని రికార్డులను ఆన్లైన్లోనే పొందుపరచాలి. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే క్రమబద్ధీకరిస్తూ అనుమతులిస్తారు. అయితే ఈ పథకం కింద జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల నుంచి మొత్తంగా 1126 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 876 దరఖాస్తులు నమోదుకాగా... బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి 88, పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి 89, సాలూరు మున్సిపాలిటీ నుంచి 73 దరఖాస్తులు వచ్చాయి. నాలుగు పట్టణాల్లో వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రతి మున్సిపాలిటీలో వందల సంఖ్యలోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలున్నాయి. అయితే ఆయా భవనాల యజమానులకు రాజకీయ అండదండలు, ఆర్థిక బలం ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. అంతేకాకుండా కొందరు అధికారులు, ఉద్యోగులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇబ్బందులు తప్పవు.. జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అక్రమ భవన నిర్మాణాల బాగోతం కనిపిస్తోంది. భవనాలను క్రమద్ధీకరించుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తొలగించడంతో పాటు క్ర య, విక్రయాలు జరపకుండా నిషేధం విధిస్తారు. మరీ తప్పనిసరి పరిస్థితులైతే ఆయా భవనాలను నేలమట్టం చేసే అవకాశం కూడా ఉంది. గడువు పెంపు.. పట్టణాల్లో అనధికార భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారులు ఈ నెలాఖరులోగా ఆన్లైన్ చేసుకోవాలి. అక్రమంగా భవనాలు నిర్మించిన వాటిని గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేయటంతో పాటు వారికి అవగాహన కల్పిస్తున్నాం. క్రమబద్ధీకరణ చేసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. – వి.శోభన్‌బాబు, కె.హరిదాసు, సిటీ ప్లానర్లు, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిష్కారంలో జాప్యం.. బీపీఎస్‌లో మొత్తం నాలుగు పట్టణాల నుంచి 1126 దరఖాస్తులు నమోదుకాగా..అందులో 93 దరఖాస్తులను పరిష్కరించి భవనాలను క్రమబద్ధీకరించారు. ఇందులో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 40, సాలూరు మున్సిపాలిటీలో 22, బొబ్బిలి మున్సిపాలిటీలో 31 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 3 దరఖాస్తులను తిరస్కరించారు. నాలుగు పట్టణాల్లో మరో 719 దరఖాస్తులు ఇప్పటికీ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 117 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అధికారుల పరిశీలన అనంతరం అపరాధ రుసుం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన దరఖాస్తులు మరో 186 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. -
కరకట్టపై అక్రమ కట్టడాలు
కృష్టానది కరకట్ట తరహాలో గూడూరు పట్టణంలో ఇరిగేషన్ కాలువల కరకట్టలపై టీడీపీ నేతలు అధికారం అండతో అక్రమంగా భారీ భవంతులు నిర్మించారు. కాలువలను కబ్జా చేసి బహుళ అంతస్తుల కళాశాల, కల్యాణ మండపాల భవనాలు నిర్మించారు. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న పొంగూరు నారాయణ అక్రమ నిర్మాణాలను అధికారంతో చట్టబద్ధం చేసుకున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కాలువలు, నదులపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు చర్యలు చేపట్టడంతో పట్టణ ప్రజల దృష్టి గూడూరులో కాలువల కరకట్టలపై నిర్మించిన అక్రమ కట్టడాలపై పడింది. సాక్షి, గూడూరు: 2012 భవంతుల నిర్మాణ నిబంధనల మేరకు నదుల కరకట్టల నుంచి 500 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. 10 మీటర్లపైన వెడల్పు ఉన్న కాలువల నుంచి 100 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదనే నిబంధనలు ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థల అధినేత నారాయణ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేయకముందే ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తన కళాశాల భవంతులను నిర్మించారు. ఇరిగేషన్ కాలువ కరకట్టను ఆనుకుని ప్రహరీ నిర్మాణంతో పాటు, 100 మీటర్లలోపు ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేశారు. కరకట్ట పక్కనే కళాశాలకు చెందిన ఆట స్థలం, వాహనాల పార్కింగ్‌ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అటు ఇరిగేషన్, ఇటు మున్సిపల్ ఉన్నతాధికారులు గానీ వాటి పైపు కన్నెత్తి చేసి, పట్టించుకున్న దాఖలా లేదు. ఈ నేపథ్యంలో 2012లో వచ్చిన నిబంధనల ప్రకారం మున్సిపల్ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా ఆ భవంతులు ఏర్పాటు చేశారని కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అప్పటి మున్సిపల్ అధికారులకు ఆయన ద్వారా భారీగా నజరానాలు అందడంతో ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేశారు. 2014 టీడీపీ అధికారంలోకి రావడంతో మున్సిపల్‌శాఖా మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ తన అక్రమ భవనాలను అధికారం అండతో సక్రమం చేయించుకున్నారు. మున్సిపల్ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు పెంచి, మానసికంగా వేధింపులకు గురిచేసి వారి ద్వారా చట్టబద్ధం చేసుకున్నారు. మినీ బైపాస్ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ కాలువను చదును చేసి, ఆ ప్రాంతంలోనే బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. నారాయణను ఆదర్శంగా తీసుకుని.. నారాయణ అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, మున్సిపల్ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో ఆయన అడుగుజాడల్లోనే ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వనజాకృష్ణ కల్యాణ మండపం పేరుతో తనుకున్న 12 అంకణాల స్థలాన్ని అడ్డుపెట్టుకుని, కోట్ల రూపాయల విలువ చేసే 99 అంకణాల ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టేశారు. ఈ నిర్మాణంతో చెరువుకు సాగునీరు పారే నాయుడుకాలువ ఆక్రమణతో కుంచించుకుపోయింది. ఈ అక్రమ కట్టడంపై పట్టణానికి చెందిన కొందరు లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. వారు అక్రమ నిర్మాణాలను తొలగించాలని కూడా ఆదేశించారు. కానీ తన రాజకీయ పలుకుబడితో జిల్లా రింగ్ లీడర్స్ అయిన బీద బ్రదర్స్, అప్పటి ఎమ్మెల్యే ద్వారా అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో వారు అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చెలరేగిపోయారు. కోట్లాది రూపాయల విలువ చేసే నీటి పారుదల శాఖ కాలువపైనే దుకాణ సముదాయం ఏర్పాటుతో పాటు, మరో వ్యక్తి సొంత స్థలాన్ని అడ్డుపెట్టుకుని, సుమారు 15 అంకణాల కాలువ స్థలాన్ని ఆక్రమించేసి, బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. ఆ బహుళ అంతస్తులో ఆంధ్రా బ్యాంకు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అద్దెలకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఈ కాలువ వెడల్పు 25 అడుగులకుపైగా ఉండాల్సి ఉండగా, కాలువ పొడవునా ఆక్రమణలతో కుంచించుకుపోయి, ప్రస్తుతం అది డ్రెయినేజీ కాలువలా మారింది. దీంతో చెరువుకు వర్షపు నీరు పారే పరిస్థితి లేక గత నాలుగేళ్లుగా ఆయకట్టు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరుకు వరద ముంపు ముప్పు గూడూరు పట్టణంలో నుంచి వెళ్తున్న భారీ నీటిపారుదల కాలువలను ఆక్రమించి భారీ భవంతులు నిర్మించడంతో కాలువ కుచించుకుపోయింది. ప్రస్తుతం పైతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీరంతా ఈ కాలువల ద్వారా చెరువులకు నీరు చేరాల్సి ఉంది. కాలువలు ఆక్రమణల్లో ఉండడంతో నీరు ముందు సాగే పరిస్థితి లేక గూడూరు పట్టణం ముంపునకు గురయ్యే ముప్పు ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015లో వచ్చిన భారీ వరదల్లో నీటి ప్రవాహం కిందికు వెళ్లలేక, నారాయణ ఆక్రమించి కట్టిన కళాశాల వసతి గృహం ముంపునకు గురైంది. దీంతో అందులో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీని కారణంగా అప్పట్లో జాతీయ రహదారిపై వరద నీరు పారడంతో ఒత్తిడి పెరిగి రోడ్డు కొట్టుకుపోయింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుండడంతో గూడూరు పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. భారీ వానలు కురిస్తే భారీగా వరదలు వస్తాయని, లోతట్టు ప్రాంతాలే కాక, మిట్ట ప్రాంతాలు కూడా నీటి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
టీడీపీ గుండెల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం : అక్రమ భవన నిర్మాణదారులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మహా విశాఖ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికారం ఉంది కదానీ.. నిబంధనలకు తిలోదకాలిస్తూ ఐదేళ్ల పాటు అడ్డగోలుగా వ్యవహరించిన టీడీపీ నేతల ఆగడాలకు ముకుతాడు పడుతోంది. మహా విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా.. ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా.. దాని వెనుక ఎంతటివారున్నా వెనుకాడకుండా కూలగొడుతున్నారు. టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన దందాలకు చరమగీతం పాడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అనే విభాగం ఉందన్న విషయం గుర్తులేనట్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాల కోటలు కట్టేసి.. మోనార్క్‌ల్లా వ్యవహరించారు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పట్టణ ప్రణాళికాధికారులు, సిబ్బంది ఉండిపోయారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణా కరకట్టపై అనధికారికంగా నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశించి.. రాష్ట్రంలో ఎక్కడ ఈ తరహా నిర్మాణాలు కనిపించినా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన సంకేతాలు.. టౌన్‌ప్లానింగ్‌లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. వెంటనే అనధికార నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించేందుకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 120కి పైగా భవనాలు, అదనపు అంతస్తుల్ని కూలగొట్టారు. ఈ క్రమంలో నగరం నడిబొడ్డున టీడీపీ నేతలు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ భవనాలపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పార్టీ కార్యాలయంతో మెదలు... దసపల్లా వివాదస్పద భూముల్లోని సర్వే నెంబర్ 1196/7లో 2వేల చదరపు గజాల స్థలాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. దీనికోసం 2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజుకిస్తున్నట్లు కట్టబెట్టింది. లీజుకు తీసుకున్న 2వేల చదరపు గజాల స్థలంతో పాటు మరో వెయ్యి గజాలకు పైగా కొండను తొలచేసే మరీ భవనం నిర్మించేశారు. 2016 ఏప్రిల్ 18న భవన నిర్మాణ ప్లాన్ కోసం టీడీపీ నేతలు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులోని పందిమెట్టలో 2016 ఏప్రిల్ 27న టీడీపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు నారాలోకేష్ శంకుస్థాపన చేశారు. స్టిల్ట్ ప్లస్ జీ ప్లస్ 2 అంతస్తులతో నిర్మించిన ఈ భవనాన్ని 2018 అక్టోబర్ 30న నారాలోకేష్ ప్రారంభించారు. అయితే.. 1086/0422/బీ/జెడ్3/ఆర్యూటీ/2016 దరఖాస్తులో లింక్ డాక్యుమెంట్ల విషయాన్ని ప్రస్తావించారే తప్ప.. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు మాత్రం ఇప్పటికీ జీవీఎంసీకి అందివ్వలేదు. వీటిని అందిస్తే తప్ప ప్లాన్ అప్రూవ్ చేయమంటు అప్పట్లోనే జోన్–3 టౌన్‌ప్లానింగ్ అధికారులు సమాచారం ఇచ్చారు. అయినా.. ప్లాన్ అనుమతులతో సంబం ధం లేకుండానే భవనాన్ని నిర్మించేశారు. ప్లాన్ కోసం చేసిన దీంతో మరోసారి ఈ నెల 28న నోటీసులు సిద్ధం చేసుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం కార్యాలయానికి టీడీపీ ప్రెసిడెంట్ పేరుతో ఉన్న నోటీసులను అక్కడ ఉన్న మేనేజర్‌కు అందించారు. వారం రోజుల్లోగా సంబంధిత డాక్యుమెంట్లు అందివ్వకపోతే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 452 (2) ప్రకారం సదరు భవనాన్ని అనధికారిక నిర్మాణంగా గుర్తించి కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైల్ కమిషనర్ వద్ద.. గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంతో పాటు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అక్రమ నిర్మాణాల అంతు చూసేందుకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం సమాయత్తమైంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. మిగిలిన రెండు భవనాలకూ నోటీసులు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైల్ జీవీఎంసీ కమిషనర్ సృజన వద్ద ఉంది. ఆమె అనుమతి రాగానే ఈ అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్లానూ లేదు.. పన్నూ చెల్లించలేదు.. పార్టీ ప్రధాన కార్యాలయమే కాదు.. నేతల క్యాంపు కార్యాలయాలూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేశారు. భీమిలిలో ఉన్న గంటా క్యాంపు కార్యాలయమే ఇందుకు ఉదాహరణ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి భీమిలి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంపు కార్యాలయాన్ని అడ్డగోలుగా నిర్మించేశారు. ఇప్పటికీ దీనికి సంబం«ధించి అనుమతులకు సంబంధించిన పత్రాలేవీ జీవీఎంసీ వద్ద లేకపోవడం విడ్డూరం. 1997 నుంచి 2014 వరకు ఒకరి పేరుతో ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ) చెల్లించిన పత్రాలున్నాయి. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున వ్యక్తి పేరుతో కరెంట్ బిల్లు వస్తోంది. భవనం నిర్మించినప్పటి నుంచి ఇంతవరకూ ఆస్తి పన్నుగానీ, నీటి పన్నుగానీ చెల్లించలేదు. ఈ విషయాన్ని అడిగేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లిన జీవీఎంసీ రెవెన్యూ అధికారులపై క్యాంపు కార్యాలయంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడటంతో అప్పటి నుంచి భవనం వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు. నిబంధనలు గోవిందా... అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా వెంకట గోవింద్ సత్యనారాయణదీ అదే దారి. ప్రమాదకరమైన గెడ్డ పక్కనే నిబంధనలను పాటించకుండా.. ఆరంతస్తుల భవనాన్ని కట్టేస్తున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసేసుకున్నారు... కాదు కాదు.. అధికార మదంతో జీవీఎంసీ కళ్లు మూయించారు. ఎమ్మెల్యే గోవింద్‌కు ఆయన భార్య పి.విజయలక్ష్మి పేరిట నగరంలోని బీవీకే కళాశాల రోడ్లో సర్వే నెంబర్ 32లో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల మేరకు భవన నిర్మాణం జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ... సదరు ఎమ్మెల్యే మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా నిర్మాణం చేసేస్తున్నారు. ఆ స్థలం పక్కనే దక్షిణ భాగాన భారీ గెడ్డ ఉంది. వాస్తవానికి 168 జీవో ప్రకారం... బఫర్ జోన్ కింద గెడ్డకు పది అడుగుల దూరం, భవన నిర్మాణ కాంపౌండ్ నుంచి మరో పది అడుగులు.. మొత్తంగా 20 అడుగుల దూరం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ ఎమ్మెల్యే ఈ నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనిపై జీవీఎంసీ అధికారులడిగితే.. మా ఇష్టమంటూ హూంకరించారు. మరోవైపు 300 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్ 2 భవన నిర్మాణానికే జీవీఎంసీ అధికారులు అనుమతులిచ్చారు. కానీ అక్కడ ఆరంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేస్తున్నారు. అక్రమంగా నిర్మించేస్తున్న ఈ భవనానికీ మూడింది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గంటా క్యాంపు కార్యాలయం -
చంద్రబాబు నివాసంతో సహా 28 ఇళ్లకు నోటీసులు
-
చంద్రబాబు ఇంటికి నోటీసులు
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్డీఏ సెక్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. -
ఏ క్షణమైనా నోటీసులు జారీచేసే అవకాశం
-
అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నోటీసులను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఆర్డీఏ నిర్ధారించింది. చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కరకట్ట లోపల నిర్మించిన మిగిలిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. దీనికి కొనసాగింపుగా అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఆర్డీఏ నడుం బిగించింది. అక్రమ నిర్మాణానికి ప్రజల సొమ్ముతో హంగులు కృష్ణా నదీ తీరంలో లింగమనేని రమేష్ కొన్నేళ్ల క్రితం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అతిథిగృహం నిర్మించగా, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించినా చంద్రబాబు లెక్కచేయలేదు. పైగా ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ కట్టడాలను ప్రోత్సహించడంతో కరకట్ట లోపల చాలామంది అక్రమ నిర్మాణాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సామాన్యుడికి ఒక నిబంధన, పెద్దలకు ఒక నిబంధన ఉండదని, అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలో అన్నీ అతిక్రమణలే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్–2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254, 272, 274, 790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేని ఈ నిర్మాణాలను గుర్తించారు. తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. -
అక్రమ అంతస్థులకు.. అంతిమ గీతం
సాక్షి, విశాఖపట్నం: నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న అక్రమ భవనాల నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లూ పట్టణ ప్రణాళికా అధికారుల్ని ప్రసన్నం చేసుకుని అక్రమ నిర్మాణాలు చేసేవారు. కానీ ప్రభుత్వం ఈ తరహా నిర్మాణాల సంగతి తేలుస్తామని హెచ్చరించడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల నోట్ల పచ్చి వెలక్కాయ పడ్డటైంది. గత ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్‌లో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ఈ మధ్యనే వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న తీరు చూస్తుంటే నిబంధనలను ఏమేర తుంగలో తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పట్టణాలు క్రమబద్ధంగా నిర్మితమైన ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానిది. రహదారులు, కాలువలు తదతర నిర్మాణాలను పర్యవేక్షించాలి. క్షేత్రాస్థాయికి వస్తే ఈ నిబంధనలు అడ్డుపెట్టుకొని సిబ్బంది యథేచ్ఛగా ముడుపులు దండుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లు విడిచిపెట్టేశారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రహదారులు, కాలువలు ఆక్రమించుకుని భవనాలు నిర్మించారు. మహా విశాఖ నగర పాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఎవరినడిగినా చెబుతారు. వీటిని నియంత్రించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది అందుకు విరుద్ధంగా అక్రమ కట్టడాల యజమానులతో అంతర్గతంగా కుమ్మకై భారీ ఎత్తున తాయిలాలు అందుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమతులు లేని నిర్మాణాలు కూడా పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అనధికార లే అవుట్లు గతంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ముందుగా లేఅవుట్లు క్రమబద్ధీకరించిన తరువాత ప్లాన్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద మొత్తం అవుతుండడంతో ఎటువంటి ప్లాన్లు మున్సిపాలిటీకి సమర్పించకుండానే అన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సూచనలు, సలహాలు సైతం టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే అక్రమ నిర్మాణదారులకు అందుతుండడంతో మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు, పంట కాలువలు, రిజర్వ్ స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకుని ప్రభుత్వ స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత ఈ విభాగానికి ఉన్నప్పటికీ మనదేమిపోయిందన్న రీతిలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా.... ప్రతి వీధిలోనూ ఒకట్రెండు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియకుండా జరుగుతున్నాయంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే చైన్మేన్లు ప్రతి వార్డును నిత్యం పర్యవేక్షించి ఎక్కడ అనుమతిలేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు, ఎక్కడ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. ఎక్కడ గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారు.. ఇలాంటివన్నీ పరిశీలించి సంబంధిత జోన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేయాలి. వారు ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ తమకేమీ పట్టనట్లుగా, తామేమీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. పలు సందర్భాల్లో అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుంటూ జీవీఎంసీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, చైన్మెన్లు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమబద్ధీకరణకు వేలాది దరఖాస్తులు... ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో బీపీఎస్ కోసం వచ్చిన దరఖాస్తులే నిదర్శనం. ఒక సీసీపీ, ఇద్దరు సీపీలు, ఒక డీసీపీ, 8 మంది వర్కింగ్ సూపర్ వైజర్లు, 10 మంది టెంపరరీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, 32 మంది చైన్మేన్లు ఉన్న జీవీఎంసీలో వేలాది బీపీఎస్ దరఖాస్తులు వస్తున్నాయంటే.. వాటిని గుర్తించడంలో లోపమెవరిదన్న విషయం ప్రశ్నార్థకమే. 2007లో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్)కు 23,101 దరఖాస్తులు వచ్చా యి. 2015లో 13,979 అక్రమ అదనపు అంతస్తు నిర్మాణదారుల నుంచి దరఖాస్తులొచ్చాయి. తాజాగా విడుదల చేసిన 2019 బీపీఎస్‌కు జూన్ 30 వరకూ గడువు ఉండగా...ఇప్పటివరకూ 4,233 దరఖాస్తులు వచ్చాయంటే అక్రమ నిర్మాణాలు ఏమేర జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తూర్పులో ‘పెట్రేగిన వెలగపూడి’ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కనుసన్నల్లో గత పదేళ్లలో భూదందాలు పెట్రేగిపోయాయి. ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా... అన్నీ అనుకూలిస్తే అక్రమ నిర్మాణం. ఈ తరహాల్లో గత పదేళ్లలో అక్రమ కట్టడాలకు, భూ కబ్జాలకు తూర్పును కేంద్రంగా వెలగపూడి భూ దందా సాగించారు. అక్కడితో ఆగకుండా ఆయా దందాల అవినీతి మరకలను జీవీఎంసీ, వుడా అధికారులకూ ఆయన అంటించారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎక్సైజ్ విభాగాల్లోని కొందరి అధికారులను ఆయన దందాలకు కాపలాదారులుగా మార్చేశారు. ఇలా వెలగపూడికి దాసోహమై వ్యవస్థను భ్రష్టుపట్టించిన విభాగాల్లో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఒకటి. జోన్–2 టౌన్ ప్లానింగ్ అధికారులైతో రెండు అడుగులు ముందుకేసి ఏకంగా వెలగపూడి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను భుజన వేసుకోవడం కొసమెరుపు. దీంతో నగరంలోని జరిగిన అక్రమ నిర్మాణాల్లో తూర్పు అగ్రభాగాన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్మాణ తొలగింపు ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం వెలగపూడి త్రయంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వందల సంఖ్యలో బినామీ భవనాలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు బినామీల పేరిట వందకు పైగా భవనాలు నిర్మాణం జరిగినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. వీటిలో అధికశాతం తూర్పు నియోజకవర్గంలో ఉండగా 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి మధ్యలో నిర్మాణ పనులు జరిగినవే అధికంగా ఉన్నట్లు అంచనా. ఆరిలోవ, ఎంవీపీ కాలనీ సెక్టార్–2, సెక్టార్–9, సెక్టార్–10, వాల్తేర్, లాసెన్స్ బే, అప్పుఘర్, వెంకోజిపాలెం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వెలగపూడి తన బినామీలు, అనుచరులతో భవన నిర్మాణాలు చేయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ వార్డు అధ్యక్షులు ప్రాంతాల వారిగా పంచుకొని మరీ అక్రమ కట్టడాలకు పూనుకున్నారు. ఆరిలోవ, ఎంవీపీకాలనీ టీడీపీ నాయకులు పట్టాభిరామ్, సత్తిబాబు, కాళ్ల శంకర్ కనుసన్నల్లో సెక్టార్–2, సెక్టార–6, (ఆదర్శనగర్) సెక్టార్–10 లలో పెద్ద ఎత్తున వెలగపూడి బినామీలు, అనుచరులు అడ్డగోలు నిర్మాణాలు చే«శారు. (అప్పుఘర్) సెక్టార్–9లో 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు, పేర్ల మషేన్ కనుసన్నల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు నిర్మాణాలు జరిగాయి. దీంతో పాటు 17వ వార్డు పరిధిలోని పెదవాల్తేర్, చినవాల్తేర్ టీడీపీ నాయకుడు పొతన్న రెడ్డి, మూర్తి, అమరేంద్రల పర్యవేక్షణలో అడ్డగోలు నిర్మాణ దందాలు జరిగినట్లు సమాచారం. విశాలాక్షినగర్, లాసెన్స్‌బే ప్రాంతాల్లో సైతం వెలగపూడి బీనామీలు పెద్ద ఎత్తున అడ్డగోలు నిర్మాలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అనుచరుల ద్వారా ల్యాండ్ కబ్జాలు, అక్రమ కట్టడాలు చేసినట్లు సమాచారం. సీఆర్‌జడ్ నిబంధనలు పట్టవిక్కడ...! చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భీమిలిలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించుకున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో టీడీపీ నాయకుల అండదండలంతో నిర్మించుకున్నవే ఎక్కువ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి 159 ఏళ్ల చరిత్ర కలిగిన భీమిలి మున్సిపాల్టీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అనుమతుల గురించి టౌన్ ప్లానింగ్, జీవీఎంసీ అధికారులను అడిగితే నవ్వేసి ఊరుకుంటారు. వీటితో పాటు బీచ్‌రోడ్‌లోని నిడిగట్టు, చేపలుప్పాడ, కె.నగరపాలెం పంచాయతీలలో అయితే తీరాన్ని ఆనుకుని లెక్కలేనన్ని హేచరీలు, హోటళ్లు సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. భీమిలి జోన్ 1 పరిధిలోకి వస్తుంది.. చారిత్రాత్మక కట్టడాలు, నదీ ముఖద్వారాలు ఉన్న ప్రాంతాలను సీఆర్‌జడ్ నిబంధనల ప్రకారం జోన్ 1గా పరిగణిస్తారు. ఈ కోవలోనే భీమిలి ప్రాంతాన్ని కూడా జోన్ 1లోకే వస్తుంది. ఇలాంటి ప్రాంతాలలో తీరం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదని డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ విభాగం నిర్థారించింది. ఒకవేళ ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా షోర్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(సాడా)తో పాటు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. మున్సిపాల్టీ, జీవీఎంసీలకు అనుమతులు ఇచ్చే అధికారం లేదు. దీని ఆధారంగా భీమిలి పట్టణంలో గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయం నుంచి నిడిగట్టు పంచాయతీలో నేరెళ్లవలస, కె.నగరపాలెంలో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాలలో లెక్కలేనన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇందులో పలువురు పోలీసు,రెవెన్యూ అధికారులు ఉన్నారు. మరీ ఇంత దారుణమా? జీవీఎంసీ జోన్ 2 పరిధిలో 12వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. శంకరమఠం రోడ్డులో రామలింగేశ్వరాలయం వెనుక ఉన్న ఐదు అడుగుల రోడ్డులో అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనం కూడా వెళ్లే వీలులేని ఐదు అడుగుల రహదారిలో జీప్లస్3, జీప్లస్4 తరహాలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఐదు అడుగుల రోడ్డులో గ్రౌండ్, మొదటి అంతస్తుకు మాత్రమే అనుమతులు లభిస్తాయి. ఇక్కడ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు, నాలుగు అంతస్తులు నిర్మించారు. ఇదే రోడ్డులో మరో వ్యక్తి జీప్లస్4 తరహాలో అనుమతి లేకుండా బహుళ అంతస్తు నిర్మించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫైరింజన్ కానీ, అంబులెన్స్ గానీ వెళ్లే మార్గమే లేదు. ఇటువంటి ఇరుకు సందుల్లో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. లలితానగర్‌లో అక్రమ నిర్మాణం రామకృష్ణానగర్ సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న లలితానగర్ రోడ్డులో మారుతి క్లినిక్ పక్కన ఓ వ్యక్తి పాత బిల్డింగ్‌పై అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తు ఉన్న పాత బిల్డింగ్‌పై రెండో అంతస్తు నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని..అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నట్టు స్థానికులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. గాజువాకలో అడ్డూ అదుపూ లేకుండా... గాజువాక ప్రాంతంలో అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా నిర్మాణదారులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని సిఫార్సులు చేసుకోవడంద్వారా తమ జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. కింది అంతస్తులకు అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులను నిర్మిస్తున్న పరిస్థితులు అధికంగా చోటుచేసుకొంటున్నాయి. గాజువాక పట్ణణ ప్రాంతంలో ఏకంగా కమర్షియల్ భవనాలను సైతం నిర్మిస్తుండటం గమనార్హం. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో ఇలాంటి నిర్మాణాలకు అడ్డూ, అయిపూ లేకుండా పోయింది. ► పెదగంట్యాడలోని శీరవానిపాలెం మసీదు పక్కన గెడ్డను ఆనుకొని ఉన్న వెయ్యి గజాల స్టీల్‌ప్లాంట్ స్థలాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించి నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దీనిపై స్టీల్‌ప్లాంట్ భూసేకరణ అధికారులనుంచి ఒత్తిడి లేకపోవడం, అక్కడ ఓ మాజీ కార్పొరేటర్ సిఫార్సులు చేస్తుండటంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ► గాజువాక సర్వే నంబర్ 87లోని కొత్తగాజువాక జంక్షన్లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్లో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆక్రమించింది. 20 ఏళ్ల క్రితంనుంచి వివాదం కొనసాగుతున్న ఈ స్థలాన్ని పల్లా కుటుంబం అధికారం చేతిలోకి రాగానే ఆక్రమించి తాత్కాలిక దుకాణాలను నిర్మించింది. వివాదం తలెత్తినప్పట్నుంచీ ఈ స్థలాన్ని కాపాడుతూ వచ్చిన రెవెన్యూ అధికారులు పల్లా ఒత్తిడితో పట్టించుకోవడం మానేశారు. రూ.20 కోట్ల విలువైన ఈ స్థలానికి అధికారులు పట్టాలను కూడా జారీ చేసేశారు. ► గాజువాక కణితి రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా కింది అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసిన సదరు వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా నాలుగో అంతస్తు నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు. దీనిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అధికారులు అటువైపు చూడటం మానేశారు. పంతులుగారి మేడవద్ద విద్యుత్ తీగల కింద ఒక వ్యక్తి భారీ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. రాజకీయ ఒత్తిళ్లవల్ల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా అనధికార అంతస్తులను తొలగిస్తున్నప్పటికీ తరువాత కాలంలో పూర్తయిపోతున్నాయి. ► ప్రభుత్వ నిర్మాణం ముసుగులో టీడీపీ కార్యకర్త ప్రాథమిక పాఠశాల స్థలాన్ని కబ్జా చేశాడు. అంగన్వాడీ భవనం పేరుతో ఏకంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. శంకుస్థాపన చేసిన స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి భవనాన్ని నిర్మిస్తున్నట్టు అందరిన్నీ నమ్మించి స్థలం కబ్జాకు ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఆగింది. మిగిలిన నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాలని వారు కోరుతున్నారు. సర్కారు నిర్ణయంతో ఉలికిపాటు గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయ్యాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముడుపులకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఆయా పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్న బిల్డర్లు, యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే చాలామంది తమ తమ నిర్మాణాల్ని అర్థాతరంగా నిలిపేశారు. మరోవైపు బీపీఎస్‌కు ఈనెల 30 వరకూ గడువు ఉండడంతో చకచకా నిర్మాణాలు సాగించి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. నిబంధనలు మీరితే సహించం అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే సహించే ప్రసక్తే లేదు. ఎక్కడ నిబంధనలు అతిక్రమించినా వెంటనే నివేదిక ఇవ్వాలని జోనల్ సిబ్బందిని ఆదేశించాం. ప్రతి వార్డులోనూ నిశిత పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – ఆర్జే విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ -
కూల్చి‘వెత’లెన్నో!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేపట్టిన అక్రమ లేఔట్ల కూల్చివేతలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూల్చివేతల ప్రక్రియ అధికారులకు కత్తిమీదసాములా మారింది. సోమవారం నుంచి దాదాపు పదిరోజుల పాటు జరగనున్న ఈ డ్రైవ్‌లో ఇప్పటికే గుర్తించిన దాదాపు 713 అక్రమ లేఅవుట్లలో 500కుపైగా కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్పల్లి జోన్లలోని ప్లానింగ్‌అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నారు. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, స్థానిక పోలీసుల సహకారంతో జేసీబీ యంత్రాలతో అక్రమ లేఅవుట్లను కూల్చివేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ప్లానింగ్ అధికారులను అక్కడి ప్లాట్ల కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు కంగుతింటున్నారు. కొన్నింటిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని... పటాన్చెరు ప్రాంతంలో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అక్కడికి జేసీబీ యంత్రాలతో కూల్చేందుకు వెళ్లిన కిందిస్థాయి ప్లానింగ్ అధికారులను స్థానికులు నిలదీశారు. మా లేఔట్ అక్రమమని కూల్చివేస్తున్న మీరు...పక్కనే ఉన్న వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై వారు సమాధానం చెప్పలేకపోయారు. చివరకు పోలీసుల సహయంతో ఇక్కడ లేవుట్‌ను కూల్చివేశారు. అలాగే ఒట్టినాగులపల్లిలో అక్రమ లేఅవుట్ల విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయని, కిందిస్థాయి ప్లానింగ్ అధికారుల ఆమ్యామ్యాలతో వాటిని అసలు లెక్కలోకే తీసుకోలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మేడ్చల్, ఘట్కేసర్ జోన్లలోనూ ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రాంతంలో భారీగా అక్రమ లేఅవుట్లు ఉంటే రెండు, మూడింటిని మాత్రమే కూల్చి మిగతావారిని దారిలోకి తెచ్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. హెచ్ఎండీఏకు ఆదాయం తెచ్చి పెట్టే ఉద్దేశంతో కమిషనర్ అరవింద్‌కుమార్ ఆదేశాలతో మొదలైన స్పెషల్ డ్రైవ్ కాస్తా కొంతమంది అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారిందని హెచ్ఎండీఏ వర్గాల్లోనే వినిపిస్తోంది. తూతూ మంత్రంగా... అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తామని చెబుతున్న హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు కొందరు తూతూమంత్రంగానే తొలగిస్తున్నారు. అక్కడి రియల్టర్లతో కుమ్మక్కై ఆ లేఅవుట్లో ఉన్న సర్వే నంబర్లు కూడా బయటకు పొక్కనీయడం లేదు. ‘మరో నాలుగు రోజుల తర్వాత మీ పని మీరు మళ్లీ మొదలెట్టండి, ఎవరైనా వచ్చి చూసేది ఉందా..’ అని శంకర్పల్లి జోన్‌లోని ఓ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇక్కడ అవినీతి రాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు హెచ్ఎండీఏకే చెడ్డపేరు తెచ్చేలా ఉందని లోలోన మథనపడుతున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ పూర్తిస్థాయిలో దృష్టి పెడితే దారి తప్పుతున్న అధికారులు దారిలోకి వస్తారని డిమాండ్ చేస్తున్నారు. -
హెచ్ఎండీఏ వద్ద అక్రమ నిర్మాణాల చిట్టా..?
పెద్దఅంబర్‌పేట: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలో అధికారుల కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారుల తీరుతో ఇటు హెచ్ఎండీఏకు, అటు పురపాలక సంఘానికి కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. పాలకవర్గంలోని కొందరు సభ్యులతో చేతులు కలిపిన ఇక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వాటి వల్ల వచ్చే సొమ్మును ‘తిలాపాపం తలాపిడికెడు’ అనే చందంగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దఅంబర్‌పేట 5వ వార్డు పరిధిలోకి వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కార్పొరేట్ భవనం నుంచి హెచ్ఎండీఏ, పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘానికి రావాల్సిన సుమారు రూ. 2 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. అధికారులు, కొంతమంది సభ్యులు సదరు భవన నిర్మాణదారుడి నుంచి రూ. 50లక్షలు (అరకోటి) ముడుపులు తీసుకున్నారనే విమర్శలు స్థానికంగా గుప్పుమంటున్నాయి. సుమారు లక్ష నుంచి లక్షా ముప్పై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన, నిర్మిస్తున్న భవనాలను అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయి ఉచిత సలహాలు ఇస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. రెండు భవనాలూ అక్రమంగానే.. 5 వ వార్డు పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొనసాగుతున్న రెండు భవనాలు కూడా అక్రమ నిర్మాణాలే. అందులో ఒకటి హెచ్ఎండీఏ అనుమతితో నిర్మాణం చేపట్టామని చెబుతున్నప్పటికీ, అధికారుల ఇచ్చిన అనుమతి మ్యాప్‌లో ఒక విధంగా ఉంటే నిర్మాణం మాత్రం అందుకు విరుద్ధంగా కొనసాగుతోంది. సాధారణంగా హెచ్ఎండీఏ అధికారులు సెల్లార్‌ను వాహనాల పార్కింగ్‌కు కేటాయిస్తూ అనుమతిస్తారు. అయితే, అలా కాకుండా సెల్లార్‌ను మొత్తం గదులతో నిర్మించి హెచ్ఎండీఏ అధికారులను సైతం మోసగించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు ఈ భవానికి పక్కనే నిర్మిస్తున్న (దాదాపు పూర్తికావచ్చిన ) భవనానికి పదేళ్ల క్రితం సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి సంతకాలతో కూడిన అనుమతి పత్రాలతోనే భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇదే భవనం తరహాలోనే మరో భవనానికి పునాదులు తీసి పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ తతంగం అంతా స్థానిక పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని అధికారులకు, పాలకవర్గంలో పలువురు సభ్యులకు తెలిసే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారానికి సహకరిస్తున్న అధికారులకు, పలువురు సభ్యులకు నిర్మాణదారుడు రూ. అరకోటి వరకు ముడుపులు చెల్లించారని విశ్వసనీయ సమాచారం. ఏపీ మంత్రికి చెందిన కళాశాల కొనసాగింపు... అయితే, ఈ అక్రమ భవనాల్లో ఒక దాంట్లో ప్రస్తుత ఏపీ మంత్రి నారాయణకు చెందిన కళాశాల కొనసాగుతోంది. దీంతోపాటు పక్కనే నూతనంగా నిర్మాణం పూర్తి చేస్తున్న భవనాలు కూడా వచ్చే జూన్‌లో ఇదే కళాశాల యాజమాన్యానికి అప్పగించాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్నారు. అయితే, వీటిలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్మించడంతో వందలాది మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు,ఉన్నాయా లేదా అని నిర్ధారిం చుకున్న తర్వాతే విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యామండలి అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ వద్ద అక్రమ నిర్మాణాల చిట్టా..? పెద్దఅంబర్‌పేటలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారం హెచ్ఎండీఏ అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేని భవనాలను అడ్డుకోవడంతో పాటు ప్రోత్సహిస్తున్న పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్, టీపీఓలపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దఅంబర్‌పేటకు చెంది న పలువురు హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ అధికారులను స్థానికులు కోరుతున్నారు. -
ఆ హోటల్‌కు అక్రమాలే పునాది
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం.. పత్రికల్లో వార్తలు వచ్చినా, అధికారుల చర్యలు చేపట్టినా.. కొద్దిరోజులు పనులు ఆపేసినట్లు నటించి.. దృష్టి మళ్లించడం.. అందరూ దాన్ని మర్చిపోగానే మళ్లీ అక్రమ నిర్మాణాలు కొనసాగించడం సాధారణ తంతుగా మారిపోయింది..బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్ సమీపంలో ప్రస్తుతం చకచకా సాగుతున్న ఒక హోటల్ నిర్మాణమే దీనికి నిదర్శనం. సముద్రతీరానికి సమీపంలో కొన్ని మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సీఆర్‌జెడ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దానికి విరుద్ధంగా సాగరతీరాన్ని ఆనుకొనే హోటల్ నిర్మాణానికి ఎలా అనుమతించారో.. లేక అనుమతి తెచ్చుకున్నామని నిర్వాహకులు మభ్యపెడుతున్నారో తెలియదుగానీ.. రెండేళ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ తంతు జరుగుతోంది. అధికారులు హెచ్చరించినప్పుడు కొద్దిరోజులు నిర్మాణం నిలిపివేయడం.. మళ్లీ ప్రారంభించడం.. ఇదీ వరస.. అలా మొత్తానికి నిర్మాణాన్ని దాదా పు పూర్తి చేసేశారు. దీనికోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్‌పాత్‌ను, డివైడర్లను ఇష్టారాజ్యంగా తొలిగించేసినా పట్టించుకునేవారు లేరు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాల న్న ధ్యాస కూడా అధికారులకు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరిలోవ(విశాఖ తూర్పు): సామాన్యుడు కష్టపడి చిన్న ఇల్లు నిర్మించుకుంటే.. మెట్లు కాలువ మీదకు వచ్చేశాయని.. శ్లాబ్ రోడ్డువైపు బయటకు వచ్చేసిందని హడావుడి చేసి.. కూల్చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు సముద్రుడి సాక్షిగా.. తామే ఇచ్చిన నోటీసులను సైతం ఖాతరు చేయకుండా కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనలకుపాతరేస్తున్న బడా నిర్మాణదారుల పట్ల మాత్రం ఉపేక్ష వహిస్తున్నారు. ఫలితంగా సాగర్‌నగర్ వద్ద సముద్ర తీరానికి దాదాపు ఆనుకొని ఓ హోటల్ నిర్మాణం దర్జాగా సాగిపోతోంది. జీవీఎంసీ, రెవె న్యూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా.. ఇప్పుడు కళ్లు మూసుకున్నారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు దీనివైపు కన్నెత్తి చూడటం లేదు. జోడుగుళ్లుపాలెం నుంచి రుషికొండ వరకు బీచ్‌రోడ్డు ఆనుకొని సీఆర్‌జెడ్ నిబంధనలు వర్తిస్తాయి. ఈ రోడ్డు నుంచి సముద్రం వైపు ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకూడదు. పూర్తికావచ్చిన నిర్మాణాలు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ హోటల్ నిర్మాణం పక్కాగా జరిగిపోతోంది. ఇందులో శ్లాబుతో రెండు గదులు నిర్మించారు. పలుచోట్ల కాంక్రీట్ ఫ్లోర్లు వేశారు. సిమెంట్ పలకలు అమర్చి హోటల్ లోపలికి మార్గాలు కూడా నిర్మించేశారు. సాగరతీరంలో చెక్కలతో తాత్కాలిక దాబాల నిర్మాణానికి వీఎంఆర్డీఏ అనుమతి ఇస్తోంది. బీచ్‌రోడ్డులో అటువంటి కొన్ని ఉన్నాయి. ఈ హోటల్ కూడా గతంలో అదేమాదిరిగా కంటెయినర్ హోటల్‌గా ఏర్పాటు చేశారు. చెక్కలు, రేకులతో గది మాదిరిగా ఏర్పాటుచేసి నిర్వహించారు. ప్రస్తుతం దాన్ని విస్తరించి నిబంధనలకు సమాధి కట్టారు. ఆ పునాదులపైనే పక్కా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. రెండేళ్ల క్రితం నుంచే.. రెండేళ్ల కిందటే నుంచే ఈ హోటల్ విస్తరణకు నిర్వాహకులు సన్నాహాలు చేపట్టారు. అప్పటి రూరల్ తహసీల్దారు లాలం సుధాకర్‌నాయుడు అటవీశాఖ, రెవెన్యూ స్థలంలో నిర్మాణం చేపట్టకూడదంటూ పనులు నిలిపేశారు. దాంతో కొన్నాళ్లు నిలిపేసిన పనులను కొద్ది రోజుల క్రితం మళ్లీ ప్రారంభించి చకచకా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒకటో జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించగా.. రెండు రోజుల పాటు పనులు నిలిపేసి మళ్లీ కొనసాగిస్తున్నారు. ఈసారి మాత్రం అధికారులు అటువైపు చూడటంలేదు. అంతా ఇష్టారాజ్యమే.. బీచ్ రోడ్డు పక్కన పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌ను కూడా హోటల్ యజమానులు వదల్లేదు. హోటల్ ముందు అడుగు ఎత్తులో ఉన్న ఫుట్‌పాత్‌ను రెండుచోట్ల తవ్వేశారు. హోటల్‌కు కస్టమర్లు రావడానికి మార్గం కోసం ఓ చోట, వాహనాల పార్కింగ్ కోసం మరోచోట తొలగించేశారు. అంతే కాకుండా బీచ్‌రోడ్డు రెండు లైన్ల మధ్య ఉన్న డివైడర్‌ను సైతం తొలగించేశారు. పూలమొక్కలు నాటిన డివైడర్‌ను తొలగించి ఇనుప గేటు ఏర్పాటు చేశారు. నగరం నుంచి వచ్చేవారు దీనికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్క్ చేసి.. రోడ్డుదాటి రావడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ పాదచారులు క్రాస్ చేయకూడదు. దాన్ని ఉల్లంఘిస్తున్న ట్రాపిక్ పోలీసులు దీనిపై దృష్టిపెట్టడం లేదు. నోటీసులు ఇచ్చాం సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం ఇక్కడ నిర్మాణం చేపట్టకూడదు. దాన్ని ఉల్లంఘించి నిర్మాణం చేపట్టిన నిర్వాహకులకు ఇటీవలే నోటీసులు ఇచ్చాం. దాంతో కొన్నాళ్లు పనులు నిలిపేశారు. ఆ హోటల్ నిర్వాహకులు వీఎంఆర్డీఏ అధికారుల నుంచి హోటల్ నిర్మాణానికి అనుమతి తెచ్చుకొన్నట్లుంది. ఫుట్‌పాత్, డివైడర్లు తవ్వేసిన అంశంపై వీఎంఆర్డీఏ అధికారులే స్పందించాలి. – వెంకటేశ్వరరావు, ఏసీపీ,ఒకటో జోన్, జీవీఎంసీ -
‘అయ్యప్ప’కు పొంచి ఉన్న పెను వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మరో పెను వివాదం పొంచి ఉంది. ఆ వివాదానికి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగానే సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో ఉత్తర్వులు మరుగున పడిపోయాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది. ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి. శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్ ప్లాన్‌నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్‌ను కూడా ఉల్లంఘించి కేరళ దేవసం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది. శబరిమల ఆలయ పరిసర కొండల్లో పుడుతున్న పంబా నదీ ప్రవాహాన్ని దెబ్బతీసేలా నది ఒడ్డునే కాకుండా నది ప్రవహించే ప్రదేశంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారట. అందుకనే గత ఆగస్టులో వచ్చిన పంబా వరదల వల్ల రెండంతస్థుల మురుగుదొడ్ల భవనాలు, భక్తుల క్లాక్‌రూమ్‌లు, ఓ రెస్టారెంట్ కూలిపోయాయని నివేదిక తెలిపింది. ఆ మరుగుదొడ్ల స్థానంలో మరోచోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. పర్యవసానంగా భక్తులు భహిర్భూమిని ఆశ్రయిస్తున్నారట. పంబా నది కాలుష్యం కాకుండా నియంత్రించేందుకు రెండు సివరేజ్ ప్లాంట్లను నిర్మించినా అందులో ఒకదాన్నే ఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా అన్ని మరుగు దొడ్ల కాల్వలను అనుసంధానించలేదు. కొన్ని కాల్వలు నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పైగా ఆగస్టులో వచ్చిన వరదల్లో ఈ రెండు సీవరేజ్ ప్లాంట్లు, మరుగుదొడ్డి కాల్వలు దెబ్బతిన్నాయి. ఆ కాల్వలు కూడా ఒవర్ ఫ్లోఅయి నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా నీటిలో ‘ఫేకాల్ కోలిఫామ్ బ్యాక్టీరియా’ కనీసం ఊహకు కూడా అందనంతగా పెరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్నానం చేయడానికి పనికి వచ్చే నీటిలో ‘ప్రతి 100 ఎంఎల్ నీటికి 2,500 ఎంపీఎన్’ కన్నా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉండాలట. 2014–2015లో సేకరించిన శాంపిల్ నీటిలోనే ‘100 ఎంల్ నీటికి బ్యాక్టీరియా 13,20,000 ఎంపీఎన్’ ఉందట. అంటే ఉండాల్సిన దానికన్నా 500 రెట్లు ఎక్కువ. సీవరేజ్ ప్లాంటులు, మురుగు కాల్వలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోబ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అడవి పందులు వచ్చి నీటిని తాగుతున్నాయంటేనే అందులో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం అట. అయ్యప్ప ఆలయంకు వచ్చే భక్తులు విధిగా ఈ పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాకుండా పట్టణం మిట్ట, అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. నవంబర్ 17వ తేదీన ప్రారంభమైన ‘మండల మకరవిలక్కు’ సీజన్లో భక్తుల రద్దీ మరింత పెరగడం వల్ల పంబా నదికి వాటిల్లే కాలుష్యాన్ని అంచనా కూడా వేయలేకపోతున్నామని పంబా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నక్కే సుకుమారన్ నాయర్ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా నది ఒడ్డుకు 50 మీటర్ల దూరంలోనే కేరళ దేవసం బోర్డు పనుల నిర్వహణా భవనాన్ని కూడా నిర్మించారని ఆయన తెలిపారు. నీలక్కల్ వద్ద భక్తుల సౌకర్యాల కోసం 2007లో సవరించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 250 ఎకరాలను కేరళ ప్రభుత్వం కేటాయించినా పట్టించుకోకుండా సన్నిధానంలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నాయర్ ఆరోపించారు. గత నెలలోనే సన్నిదానంలో 52 గదుల అతిథి గృహాన్ని కేరళ దేవసం మంత్రి కే. సురేంద్రన్ ప్రారంభించారు. సన్నిదానం, పంబా ప్రాంతాల్లోనే కాకుండా నీలక్కల్ వద్ద కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొంది. వాటన్నింటిని కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం తన కర్తవ్యమని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కూల్చివేతల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటుందా? కూల్చివేతల వల్ల భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది? భక్తులుగానీ, భక్తుల తరఫున హిందూ సంఘాలుగానీ కూల్చివేతలను అనుమతిస్తాయా? -
జీహెచ్ఎమ్సీ తీరుపై సర్వత్రా విమర్శలు
-
కమిషనర్ ఇంటి వెనుక.. ‘అధికార’ దొంగలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ దొంగలు ఏకంగా మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇంటికే కన్నం పెట్టారు. ఇప్పటివరకు కాంట్రాక్టులు, కమీషన్లకు పరిమితమైన వారు.. ఇప్పుడు కమిషనర్ బంగ్లా వెనుక ఉన్న ఖాళీ స్థలంపై కన్నేశారు. అందులో ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. ఇప్పటికే పునాదుల కోసం తవ్వేశారు. ఒకవేళ అధికారికంగా అనుమతులు తీసుకుని ఉంటే దర్జాగా పనులు చేయకుండా.. దొంగతనంగా రాత్రిళ్లు మాత్రమే చేయడం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నగర నడిబొడ్డున పాత కంట్రోలు రూం పక్కనే కమిషనర్ బంగ్లా ఉంది. ఎవరు కమిషనర్‌గా వచ్చినా ఈ బంగ్లాలోనే ఉంటారు. దీని వెనకవైపు భారీగా ఖాళీ స్థలం ఉంది. ఒకవేళ ఏవైనా పశువులు ఉన్నా కట్టేసుకునేందుకు అనుగుణంగా ఉంది. ఈ ఖాళీ స్థలం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండులోకి వెళ్లే వీలుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చిన్నగేటు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలంపై.. అదీ బంగ్లా కాంపౌండు గేటు లోపల ఉన్న స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇక్కడ షాపులు కడితే భారీగా అడ్వాన్స్‌తో పాటు బాడుగ కూడా వచ్చే వీలుంది. దీంతో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే పనులు కానిస్తున్నట్టు తెలుస్తోంది. అనుమతులు లేకుండానే.. కమిషనర్ బంగ్లా వెనకభాగాన షాపుల నిర్మాణానికి అనుమతి తీసుకునేందుకు గతంలో ప్రయత్నించా రు. పాలకవర్గం నుంచి అనుమతి తీసుకునే ప్రయ త్నం కూడా చేశారు. అయితే, తదనంతరం వచ్చిన కమిషనర్ మూర్తి.. బంగ్లా స్థలాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. పైగా ఈ స్థలాన్ని ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. ఇప్పుడు మళ్లీ అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పుడు నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు కాబట్టి పాలకవర్గమూ లేదు. అందువల్ల కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కలెక్టర్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. భారీగా వసూళ్లుకంట్రోలు రూం నుంచి ప్రధాన రోడ్డుకు ఉన్న షాపులకు వెనుకవైపునేకమిషనర్ బంగ్లా ఉంది. సరిగ్గా ఈ షాపుల వెనకాలే ఖాళీ స్థలం ఉంది. ఇందులో షాపు రూములు కడితే ప్రధాన రోడ్డులో ఉండే షాపులకు అనుబంధంగా తయారవుతాయి. అంటే రోడ్డుపై ఉండే షాపులకు ఎంత గిరాకీ ఉంటుందో అదే స్థాయిలో వీటికీ వస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు భారీగా డబ్బు తీసుకుని ఈ షాపులను నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో కార్పొరేషన్ అధికారులు కిమ్మనడం లేదు. -
మహిళ అధికారిని హతమార్చి.. ఆపై వేషం మార్చి
సిమ్లా : విధులు నిర్వహిస్తున్న మహిళ అధికారిని హతమార్చి వేషం మార్చుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిందిగా ఏప్రిల్ 17న హిమచల్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కసౌలీ, ధరమ్‌పూర్ పట్టణాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేతకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ టౌన్ ప్లానర్‌గా విధులు నిర్వహిస్తున్న షేల్ బాలా అందులోని ఓ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. తన విధుల్లో భాగంగా మంగళవారం కసౌలీ పట్టణంలోని విజయ్ సింగ్ అనే వ్యక్తికి చెందిన హోటల్ భవనాన్ని కూల్చేందుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. నాలుగు అంతస్తులకే అనుమతి తీసుకున్న విజయ్ ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో ఆమె ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనిని వ్యతిరేకిస్తూ.. విజయ్‌సింగ్, అతని తల్లి మహిళ అధికారిణితో వాగ్విదానికి దిగారు. అయిన ఆమె వెనక్కి తగ్గకపోవడంతో విజయ్ అక్కడవున్న అధికారులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో షేల్ బాలా అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం విజయ్ సమీపంలోని అటవీ ప్రాంతలోకి పారిపోయాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ అధికారులు అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటించారు. అడవిలోకి పారిపోయిన అనంతరం విజయ్ తన స్నేహితులకు ఫోన్ చేసి సహాయం చేయాల్సిందిగా కోరారు. పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేస్తారనే అనుమానంతో వెంటనే మొబైల్ స్విచ్ఛాప్ చేశాడు. ఇలా అయితే దొరికిపోతామనే ఆలోచనతో గడ్డం తీయించడంతో పాటు, హెర్ స్టైల్ మార్చి, వివిధ ప్రాంతాల్లో సంచరించడం మొదలు పెట్టాడు. మళ్లీ తన స్నేహితులకు విజయ్ కాల్ చేయడంతో, పోలీసులు అతని లోకేషన్ ట్రేస్ చేశారు. అతడు మథురాలో ఉన్నట్టు తెలీడంతో, ఢిల్లీ పోలీసులను సహాయంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. -
టచ్ చేసి చూడు
ఈ చిత్రం చూశారా? శ్రీకాకుళం నగరంలోనే... రోజూ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాకపోకలు చేసే అరసవల్లి రోడ్డుకు పక్కనే... ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కొత్త ఇంటికి సమీపంలోనే అక్రమంగా నిర్మాణ పనులు జరుగుతున్న కన్వెన్షన్ హాల్! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : ఈ నిర్మాణం గురించి స్థలం సొంతదారైన దేవాదాయశాఖకు సమాచారం లేదు! దీనిపై నోటీసు ఇచ్చి నెలలు గడిచిపోతున్నా సమాధానమూ ఇవ్వలేదు! ఈ స్థలం ఉన్న ఖాజీపేట పంచాయతీ నుంచి నిర్మాణానికి అనుమతీ లేదు! వుడా అప్రూవల్ ప్లాన్ కూడా లేదు! ఈ నిర్మాణ పనులు నిలిపేయాలన్న జిల్లా కలెక్టరు ఆదేశాలు పట్టించుకోవట్లేదు! ‘మీరు కూల్చేయకపోతే... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తాం’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులు గళమెత్తినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది! ఈ బడాబాబుల ధీమా వెనుక ధైర్యం ఎవరు? అంటే అందరి వేళ్లూ అధికార పార్టీ నాయకుల వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖాజీపేట పంచాయతీ కార్యదర్శి శనివారం ముచ్చటగా మూడోసారి నోటీసులు ఇవ్వడం గమనార్హం. పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు... రాష్ట్ర విభజన, శ్రీకాకుళం నగరపాలక సంస్థగా ఆవిర్భావం తదితర పరిణామాలతో శ్రీకాకుళం నగర పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. లేఅవుట్లు కూడా భారీ సంఖ్యలోనే వెలిశాయి. మరోవైపు శ్రీకాకుళం నగరంలో అక్రమ అపార్ట్మెంట్లతో పాటు గ్రూప్ హౌస్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఎలాంటి అనుమతులూ లేకుండా ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నవే వంద వరకూ ఉంటాయని అంచనా. వాటికి ముందు రాత్రికిరాత్రే నిర్మాణాలు పూర్తిచేసి తెల్లసున్నం కొట్టేసిన భవనాలు కూడా అదే సంఖ్యలో ఉంటాయి. వీటిలో చాలావరకూ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) కింద రెగ్యులరైజ్ అయిపోయాయి. వాటి యజమానుల్లో ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులే. ఇంతెత్తున అక్రమ నిర్మాణాలు సాగుతున్నా ఇప్పటివరకూ నగరపాలక సంస్థ యంత్రాంగం కానీ, వుడా టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ ఉదాసీనంగానే వ్యవహరించారు. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, అలాగే అవినీతి వ్యవహారాలు కూడా కారణాలే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే బడ్జెట్ హోటల్ లీజుదారులు అక్రమంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ హాల్. ఇదొక్కటే కాదు శ్రీకాకుళం సింహద్వారం నుంచి కొత్త వంతెన వరకూ, పీఎన్ కాలనీ, న్యూకాలనీ, అరసవల్లి రోడ్డు, 80ఫీట్ రోడ్డు, హౌస్బోర్డింగ్ కాలనీ, పెద్దపాడు రోడ్డు... ఇలా ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బడాబాబులను చూసి సామాన్యులు కూడా ఇంటి నిర్మాణాలకు దిగుతున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవడమో, లేదా ఒకటీ రెండు అంతస్థులకు ప్లాన్ అనుమతి పొంది ఆపై అదనపు అంతస్తు నిర్మించడమో చేస్తున్నారు. ఆగమేఘాలపై కదలిక వెనుక... బడ్జెట్ హోటల్ లీజుదారులు అక్రమంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ హాల్‌పై టౌన్‌ప్లానింగ్ అధికారులు, అధికార పార్టీ నాయకులు అమితమైన ఉదాసీనత చూపించడంపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్మాణం కూల్చివేయాలంటూ ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అధికార పార్టీ నాయకులు, అధికారులు ఒక వ్యూహం ప్రకారం నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కన్వెన్షన్ హాల్ వంటి బడాబాబుల బిల్డింగ్లు గాకుండా సామాన్యుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. అక్రమార్కుల స్వార్థంతో లక్ష్యానికి గండి... జిల్లాలోని అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, శాలిహుండం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కళింగపట్నం తదితర పర్యాటక ప్రదేశాలను ఏటా సగటున 20 లక్షల మంది వరకూ సందర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం త్రీస్టార్ హోటల్ వసతి సేవలను చౌకగా అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ హోటల్ నిర్మాణానికి నాంది పలికారు. అరసవిల్లి జంక్షన్లో సూర్యనారాయణస్వామి ఆలయానికి సమీపంలో దేవాదాయశాఖకు చెందిన ఖాజీపేట పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 12/1లో దాదాపు 2.68 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించేలా కృషి చేశారు. ఆ భూమిలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బడ్జెట్ హోటల్‌తో పాటు నగరప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా తిరుపతి–తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆర్థిక సహాయంతో కల్యాణ మండపం నిర్మించాలని తలపోశారు. ఈ భూమిలో 1.20 ఎకరాలు ఈ కల్యాణ మండపానికి, మిగిలిన 1.48 ఎకరాలు బడ్జెట్ హోటల్‌కు దేవాదాయశాఖ కేటాయించింది. బడ్జెట్ హోటల్ కోసం దేవాదాయశాఖ, పర్యాటక శాఖల మధ్య 2010–11లో లీజు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వరుసగా ఐదేళ్ల పాటు ఏటా రూ.3,22,344 చొప్పున లీజును పర్యాటకశాఖ చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం రూ.16.11 లక్షలను కాంట్రాక్టరు నుంచి పర్యాటక శాఖ వసూలు చేసి అరసవిల్లి ఆలయానికి అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ పైసా కూడా వసూలుకాలేదు. ఈ మొత్తం వెంటనే చెల్లించాలని దేవాదాయశాఖ అధికారులు పర్యాటక శాఖకు రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. అంతేకాదు బడ్జెట్ హోటల్ లీజుదారులు తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలనీ స్పష్టం చేశారు. కానీ ఇప్పటివరకూ సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు. -
నగరంలో కూల్చివేతలు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలో నాలాల విస్తరణ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు పలు ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నాలాలపై అక్రమంగా వెలిచిన కట్టడాలను శనివారం అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో.. పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరమే కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉప్పుగూడ నుంచి డబీర్‌పురా మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఓపెన్ నాలాపై అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత మరోవైపు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలిలో నాలాల అక్రమణ తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి బాధితులకు నచ్చజెప్పి కూల్చివేతలను కొనసాగించారు. నష్టపరిహారం ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. -
బెల్లంపల్లిలో ఉద్రిక్తత
మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 వ వార్డులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కూల్చివేతలు తక్షణమే నిలిపేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ వంటిపై కిరోసిన్ పోసుకుంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
న్యాయం చేస్తారా.. చావమంటారా..?
► శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసు వద్ద హైడ్రామా ► కిరోసిన్ డబ్బాలతో కార్యాలయంలో హల్చల్ హైదరాబాద్ (చందానగర్): న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో బాధితులకు న్యాయం చేయాలని న్యాయమూర్తి ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని, పలుమార్లు ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనకు లోనైన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ డబ్బాలతో తహశీల్దార్ కార్యాలయంలోకి తలుపులు బిగించుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే శంకర్ అనే యువకుడు సోమవారం అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్‌కు చెందిన బాధితులతో కలిసి కిరోసిన్ డబ్బాలతో సహా శేర్లింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. జేసీ వచ్చి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ల ఆర్డీఓ శ్రీనివాస్ వారిని సముదాయించేందుకు ప్రయత్నించగా, వారు వినిపించుకోలేదు. గతంలో ఎన్నో సార్లు కలెక్టర్ ఈ విషయమై తమరికి ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోనందునే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందన్నారు. తమకు కేటాయించిన స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, వాటిని అడ్డుకునేం దుకు ఎవరూ సహసించడం లేదన్నారు. కోర్టు ఆదేశానుసారం న్యాయం చేయాలని కోరారు. తలుపులు పగులగొట్టి... దీంతో తహశీల్దార్ కార్యాలయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆర్డీవో జె. శ్రీనివాస్, తహశీల్దార్ తిరుపతిరావు, ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నర్సింహ్మరెడ్డి న్యాయం చేస్తామని చెప్పినా శంకర్ వినకపోవడంతో 2 గంటల ప్రాంతంలో వట్టినాగులపల్లి ఫైర్ ఆఫీసర్ మోహన్ ఆధ్వర్యంలో తలుపులను బద్ధలు కొట్టి శంకర్‌తో పాటు మరో ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బందే కారణం తమకు పట్టాలు కేటాయించిన స్థలం కేటాయించకపోవడం వెనక రెవెన్యూ సిబ్బంది హస్తం ఉందని శంకర్ ఆరోపించారు. 58 జీవో ప్రకారం కొందరు రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తు చేసుకోగా డబ్బులు ఇవ్వకపోవడంతో తిరిగి తీసుకున్నారని మహిళలు ఆరోపించారు. స్థానికేతరుల నుంచి రూ. 5 లక్షలు తీసుకొని 58 జీవో కింద లబ్ది చేకూర్చరన్నారు. పొజిషన్లో లేనందునే ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్‌లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. 1984లో పట్టాలు పంపిణీ చేశారని, అప్పటి నుండి పొజిషన్లో లేనందునే సమస్యలు తలెత్తాయన్నారు. రెవెన్యూ సిబ్బంది అవినీతి పై విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మాణాలపై నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ తిరుపతిరావు తెలిపారు. -
ఎంఐఎం ఎమ్మెల్యే వీరంగం, ఉద్రిక్తత
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులను ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో అక్రమంగా నిర్మించిన 300 మీటర్ల గోడను జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సాయంతో కూల్చివేస్తున్నారు. విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకొని నానా హంగామా చేశారు. గోడను తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులను తన మనుషులతో బెదిరించి అక్కడి నుంచి పంపించేయడానికి యత్నించారు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే కూల్చివేస్తున్నామని ఎమ్మెల్యేకు చెప్పినా.. పట్టించుకోకుండా బూతు పురాణం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.