ఇంట్లో ఉండగానే భవనం కూల్చివేత
మీరట్‌లో నలుగురి మృతి
మీరట్ : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరించడంతో భవన శిథిలాల కింద పడి నలుగురు మృతిచెందారు. ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని కంటోన్మెంట్‌లో హైకోర్టు ఆదేశాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతను కంటోన్మెంట్ బోర్డు అధికారులు చేపట్టారు. శనివారం వేకువజామున అక్కడికి చేరుకున్న అధికారులు బంగ్లా నం 210 భవనంలోని వారిని సామానుతోపాటు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆరుగంటలకు కూల్చివేత ప్రారంభించారు.
అయితే భవనంలో ఇంకొంతమంది ఉండటంతోశిథిలాల్లో చిక్కుకుని పోయారు. నలుగురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నలుగురు మృతిచెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కూల్చివేతకు ముందే అందర్నీ భవనం నుంచి ఖాళీ చేయమని చె ప్పామని, ఖాళీ చేసేందుకు వారికి మరో మూడు గంటలు అదనపు సమయాన్ని ఇచ్చామని కంటోన్మెంట్ బోర్టు పేర్కొంది.