
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.
కాగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హైడ్రా. అక్రమ నిర్మాణదారులంతా ఎక్కడ బుల్డోజర్ తమ వైపునకు వస్తుందోనని భయంతో హడలెత్తిపోతున్నారు నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
కూల్చివేతల్లో వెనక్కి తగ్గని హైడ్రా అధికారులు.. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేశారు. మరోవైపు హైడ్రా చేస్తున్న పనుల మీద దుమారం కూడా రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment