av ranganath
-
వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతోనే అక్కడికి వెళ్లాం
సాక్షి, హైదరాబాద్: ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ ప్రధాన రహదారిలోని భగీరథమ్మ కుంట, తౌతానికుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మంగళవారం చేపట్టిన కూల్చివేతలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి బుధవారం ప్రకటన విడుదల చేశారు. అందులోకి అంశాలివి... ఆ రెండు జలవనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురికావడంతో పరిసర ప్రాంతాల్లో తరచు నీరు నిలిచిపోతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా హైడ్రా అధికారులు, స్థానిక మున్సిపల్, రెవెన్యూ విభాగాలతో కలిసి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎనిమిదేళ్ల క్రితమే తౌతానికుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు (Buffer Zone) సంబంధించిన తుది నోటిఫికేషన్, భగీరథమ్మ కుంటకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడ్డాయి.శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైడ్రా (Hydraa) ప్రధాన కార్యాలయంలో అక్కడి దుకాణాలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, శిఖం పట్టాదారులతో సమావేశం జరిగింది. ఆక్రమణల్ని గూగుల్ ఎర్త్ ద్వారా ప్రదర్శించారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏసీఈ కార్ప్ గ్రూప్ ఇటీవలే శిఖం పట్టాదారు మేకల అంజయ్య తదితరుల నుంచి ఏడు ఎకరాలకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. హైడ్రా ఇక్కడ కూల్చివేతలను పూర్తి చేసిన తర్వాత, ఆ కంపెనీనే శిఖం పట్టాదారుల పేరుతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. శనివారం నాటి సమావేశానికి ఏసీఈ కార్ప్ గ్రూప్ యజమానులు కూడా హాజరయ్యారు’ అని తెలిపారు.నిర్మాణ సామగ్రిని డంప్ చేస్తున్న కంపెనీలు ‘భగీరథమ్మ కుంట శిఖం పట్టాదారులు బఫర్ జోన్లో దుకాణాలు నడుపుతూ చెరువును నిర్మాణ శిథిలాలతో నింపుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో అక్కడ నిర్మాణ సామగ్రిని డంప్ చేస్తున్న కొన్ని టిప్పర్లను హైడ్రా బృందాలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. భగీరథమ్మ చెరువును ఆక్రమించినందుకు రాయదుర్గం(Rayadurgam) పోలీసుస్టేషన్లో సంధ్యా కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు దాని యజమాని శ్రీధర్ రావు, టిప్పర్ ఆపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైడ్రా గతవారం ఆక్రమణదారులతో సమావేశాలు నిర్వహించి, ఖాళీ చేయాలని, ఆక్రమణలు కూల్చివేస్తామని స్పష్టం చేసి, మూడు నాలుగు రోజుల గడువు ఇచ్చింది. అయినా ఎవరూ స్థలాలను, ఆక్రమణలను ఖాళీ చేయకపోవడంతో సోమవారం 24 గంటల సమయం ఇస్తూ నోటీసులు జారీ చేసింది. అయిన్పటికీ ఖాళీ చేయకపోవడంతో మంగళవారం కూల్చివేతలు చేపట్టింది’ అని రంగనాథ్ పేర్కొన్నారు.చదవండి: డ్రంకన్ డ్రైవ్ కేసులో యువకుడు, యువతికి విభిన్నమైన బెయిల్ వైన్‌షాప్ కూల్చకపోవడంపై వివరణ ఖాజాగూడలోని చెరువు బఫర్ జోన్లో ఉన్న వైన్‌షాప్‌ను కూల్చకపోవడంపైనా రంగనాథ్ వివరణ ఇచ్చారు. అది ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రాంగణమని, కొన్ని రోజుల్లో దాన్ని మరోచోటుకు మార్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరామని పేర్కొన్నారు. ఆ షాప్‌నకు అనుబంధంగా ఉన్న సిట్టింగ్, డైనింగ్ ఏరియా, రెస్టారెంట్, పాన్‌షాప్‌లను కూల్చేశామని తెలిపారు. -
200 ఎకరాలను పరిరక్షించాం!
‘ఈ ఏడాది జూలై 19న హైడ్రా ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాలను పరిరక్షించాం. వీటిలో 12 చెరువులు, ఎనిమిది పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుద్ధభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోలికి వెళ్లమని, హైడ్రా ఏర్పడిన తర్వాత వెలిసిన అక్రమ నిర్మాణాల పైనే చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 2025 సంవత్సరంలో హైడ్రా అనుసరించే విధానాలపై రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు వచ్చింది. సంజాయిషీ నోటీసులతో పాటు అవసరాన్ని బట్టి ఖాళీ చేయమని, కూల్చేస్తామని సైతం నోటీసులు జారీ చేస్తుంది. గడిచిన 5 నెలల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2025కు రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఓఆర్ఆర్కు ఆనుకుంటూ అవతలి వైపునకూ విస్తరించి ఉన్న 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పునరు ద్ధరించిన 12 చెరువులకు 2025లో పునరుజ్జీవం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైడ్రా వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎవరి ప్రమేయం లేకుండా ఎఫ్టీఎల్... ప్రస్తుతం నగరం పరిధిలో ఉన్న 1095 చెరువుల్ని హైడ్రా గుర్తించింది. వీటి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నిర్ధారణ, పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఏ దశలోనూ మానవ వనరుల ప్రమేయం లేకుండా పూర్తి సాంకేతికంగా దీన్ని తేల్చనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రికార్డులు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) డేటా, శాటిలైట్ ఇమేజ్‌తో పాటు అత్యంత రెజల్యూషన్ ఉన్న గూగుల్ డేటా తీసుకుంటున్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్, డ్రోన్స్ ఫొటోలతో పాటు రెవెన్యూ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. వీటి ద్వారా ఆయా చెరువుల ఎఫ్టీఎల్ మారడానికి కారణాలు స్పష్టంగా తెలుసుకోనున్నారు. పెద్ద నాలాల ఆక్రమణలపైనా నజర్... చెరువులతో పాటు నాలాల పైనా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికోసం కిర్లోస్కర్ కమిటీ, ఓమెంట్స్ నివేదికలను పరిశీలిస్తోంది. చిన్న చిన్న నాలాలు కాకుండా మూడు, నాలుగు ఆర్డర్స్‌లో ఉండే పెద్ద వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా నాలాలపై ఆక్రమణలను గుర్తిస్తున్నారు. చెరువులను మింగేస్తున్న వాటిలో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో వీటి డంపింగ్ కోసం ప్రత్యేక స్థలాల గుర్తింపుతో పాటు జలవనరులకు జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ప్రజలు, కాలనీ అసోసియేషన్లు ఇచ్చే ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యాప్, వెబ్సైట్ ద్వారా సమాచారం ⇒ హైడ్రా 2025లో తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు తదితరాలకు సంబంధించిన సమస్త సమాచారం జీపీఎల్ ఆధారంగా నిక్షిప్తం చేయనున్నారు. ⇒ ఓ వ్యక్తి ఎక్కడైనా నిల్చుని హైడ్రా యాప్ ఓపెన్ చేస్తే..అది వీటిలో ఏ ప్రాంతం పరిధిలోకి వస్తుందో తెలిసేలా అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత వీటిపై అవగాహన పెరిగిన ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ⇒ త్వరలో ఏర్పాటుకానున్న హైడ్రా పోలీసుస్టేషన్ ప్రభుత్వ, చెరువుల భూముల కబ్జా కేసులను దర్యాప్తు చేస్తుంది. ఈ దందాల వెనుక ఉన్న సూత్రధారులు, అధికారులను గుర్తిస్తుంది. ⇒ హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ డీ–మార్కేషన్ను 2025లో హైడ్రా పూర్తి చేయనుంది. మూసీలో ఉన్న ఆక్రమణల గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వర్షపు నీరు పరిరక్షణ పైనా హైడ్రా అధ్యయనం చేయనుంది. -
మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం పరిధిలో మొత్తంగా ఎన్ని చెరువులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’నిర్ణయించింది. దీని కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు మంగళవారం హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లారు.సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిత్తోపాటు ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. సర్వే ఆఫ్ ఇండియా గతంలో రూపొందించిన మ్యాప్‌లను రంగనాథ్ పరిశీలించారు. 1971–72 నాటి సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పట్లో వాటి విస్తీర్ణం ఎంత? నాలాలు ఎక్కడెక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేవి? తదితర విషయాలు పరిశీలించారు. తాజా మ్యాప్‌లతో వాటిని సరిపోల్చి చూశారు. ఈ అంశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా బృందానికి వివరించారు. పూర్తి వివరాలతో నివేదిక రూపకల్పనపై దృష్టి చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించడానికి, తాజాగా నిర్థారించడానికి ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీలతో కలిసి ముందుకు వెళ్తున్న హైడ్రా.. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి సమాచారం సేకరించింది. ఆ డేటాను సర్వే ఆఫ్ ఇండియా డేటాతో క్రోడీకరించనుంది. మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా డేటాను డిజిటలైజ్ చేయడంతోపాటు చెరువుల విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి ఈ నివేదికలో పొందుపర్చనుంది. నివేదికకు తుదిరూపు ఇచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రాధాన్యత క్రమంలో చెరువులను గుర్తించి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. -
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి ఆ విభాగం పని తీరుపై స్పష్టత ఇచ్చారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.‘‘మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు. దీనిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది’’ అని ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. అలాగే..HYDRAA has nothing to do with surveys on either side of the Musi River.HYDRAA is not evacuating the residents there.HYDRAA is not undertaking any demolitions there.No markings have been made on the houses in the Musi catchment area by HYDRAA authorities.The Musi…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024‘‘హైడ్రా అంటే కూల్చివేతలే కాదు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలి.HYDRAA is not just about demolitions.HYDRAA's jurisdiction extends only up to the Outer Ring Road.Not only in the city, but across the state, and even in other states, demolitions are being attributed to HYDRAA on social media, creating unnecessary fear among people.HYDRAA…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024.. హైడ్రా ప్రధాన విధి ప్రకృతి వనరుల పరిరక్షణ. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం’’ అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. చేశారు.సంబంధిత వార్త: ఎవరిని మెప్పించడం కోసం ఈ దూకుడు?.. తెలంగాణ హైకోర్టు సీరియస్ -
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 27 నుంచి ఇప్పటివరకూ జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా పేర్కొంది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.రామ్‌నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హైడ్రాకు ఐపీఎస్ అధికారి రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి.కాగా చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది. -
అలా నిర్మించిన ఇళ్లను కూల్చివేయం: హైడ్రా కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పారు.ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే అలాంటి నివాసాలను కూల్చివేయం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రమే నిర్మాణాలను కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు.సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయకండి అని ప్రజలకు సూచించారు.మరోవైపు.. హైడ్రా ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో కూల్చివేతలు చేపట్టింది. అలాగే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
తమ్మిడి– ఈదుల కుంటలే రోల్‌మోడల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లేక్ సిటీ... ఇక్కడ గొలుసుకట్టు చెరువులు ఉండటం ఓ ప్రత్యేకత... ఒకప్పుడు నగరంలోని చెరువుల్ని కనెక్ట్ చేస్తూ నాలాలు ఉండేవి... ఇప్పుడన్నీ ఆక్రమణలకు గురి కావడమే తరచూ వరదలు, రోడ్ల మునకలు.. చెరువులు, కుంటలతో పాటు నాలాలను చెర విడిపించి సంరక్షిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆది నుంచి చెబుతున్న విషయాలివి. చెరువులు, నాలాల పునర్ నిర్మాణంతో కలిగే ఉపయోగాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలని ఈ విభాగం కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. రాజధానిలోని రెండు చెరువుల్ని ఎంచుకుని, వాటితో పాటు నాలాలకు పాత రూపు తీసుకువచ్చి అభివృద్ధి చేయనున్నారు. వీటిని రోల్ మోడల్స్‌గా చూపుతూ మిగిలిన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ముందుకు వెళ్లనున్నారు. ఎన్–కన్వెన్షన్ కూలి్చవేతతో జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కిన తమ్మిడి కుంటతో పాటు దీని అనుబంధ చెరువు ఈదుల కుంటలను దీనికోసం ఎంచుకోవాలని భావిస్తున్నారు. వీటితో పాటు కనెక్టింగ్ నాలాలను అభివృద్ధి చేయడం ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూపనున్నారు. అందరితో కలిసి ముందుకెళ్తూ.. హైడ్రా ఆవిర్భావం నుంచి, డీఆర్ఎఫ్ రూపంలో దానికి ముందు అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువులు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని భవనాలను నేలమట్టం చేసింది. భవిష్యత్తులోనూ ఈ జల వనరులతో పాటు నాలాల విస్తరణకు కీలక ప్రాధాన్యం ఇవ్వనుంది. తాము తీసుకుంటున్న ఈ చర్యలతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా చేయాలని రంగనాథ్ నిర్ణయించారు. వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయిస్తూ.. నగరంలోని కొన్ని చెరువుల అభివృద్ధి ప్రారంభించిన తర్వాత వాటి స్వరూపం మారిపోయింది. కట్టలు ఉండాల్సిన చోట సిమెంట్, కాంక్రీట్ నిర్మా ణాలు చేపట్టి లేక్స్‌ను ట్యాంక్స్‌గా మార్చేశారు. వీటి లోని ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోకు ఉద్దేశించిన నాలాలనూ విస్తరిస్తూ కేవలం గట్లపై పార్కులు, వాక్‌వేలు అభివృద్ధి చేయడంతో పాటు విగ్రహాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలు సైతం ఇదే పని చేశాయి. ఈ మూస ధోరణికి భిన్నంగా వెళ్లాలని హైడ్రా నిర్ణయించుకుందిపూడికతీతలో స్థానికుల భాగస్వామ్యం.. ప్రస్తుతం అనేక చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణలకు గురి కావడానికి నిర్మాణ వ్యర్థాల పారవేత కూడా ఓ కారణమని హైడ్రా గుర్తించింది. సెల్లారు, ఇతర తవ్వకాల సమయంలో వెలువడుతున్న మట్టిని కూడా తీసుకువెళ్లి ఆయా చోట్ల పారేస్తున్నారు. ఇలా పూడుతున్న చెరువుల చుట్టూనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. చెరువుల్ని పునరుద్ధరించాలంటూ ఇప్పటికే వాటి చుట్టూ పారేసిన నిర్మాణ వ్యర్థాలు, మట్టిని తీయాల్సిందే. దీనికి భారీ ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙస్తున్న హైడ్రా ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల్ని భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించింది. సమీపంలోని చెరువుల్లో ఇలా పారేసిన మట్టితో పాటు వినియోగయోగ్యమైన నిర్మాణ వ్యర్థాలను వారు తీసుకువెళ్లేలా ప్రోత్సాహించాలని భావిస్తున్నారు. వీటిని తీసుకువెళ్లడంతో పాటు కొత్తగా ఎవరూ ఆయా ప్రాంతాల్లో డంప్ చేయకుండా చూసే బాధ్యతల్లోనూ స్థానికులకు భాగస్వామ్యం కల్పించాలని హైడ్రా సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము రేవంత్ సర్కార్‌కు లేదా?: ఏలేటి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా పేరుతో లేనిపోని హైక్‌ను సృష్టిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. రంగనాథ్ కమిషనరా..? పొలిటికల్ లీడరా..? అంటూ ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా..?. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.‘‘హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మర్తి రాజేశ్వర్‌రెడ్డికి వర్తించవా..?. ఓవైసీకీ ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పుడు, మిగతా వారికి, ఎన్ కన్వెన్షన్‌కు ఎందుకు సమయం ఇవ్వలేదు..?. ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి లేదా..?. ఓ వైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా..?. ఆయన ఇనిస్టిట్యూషన్‌లో మాత్రమే విద్యార్థులున్నారా..?. రంగనాథ్‌కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కుల్చుతున్నారా అనే అనుమానం కలుగుతుంది’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.‘‘కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. వంద శాతం చెరువు కబ్జా అయితే ముట్టుకోమని రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ హైక్ ఏంది..? ఈ హైడ్రా ఏంది అర్థం కావడం లేదు. తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకున్న పోలీస్ అధికారులు ఎంతో మంది ఉన్నారు. వారికిలేని సెక్యూరిటీ రంగనాథ్‌కు ఎందుకు..?. కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే టార్గెట్ పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఓల్డ్ సిటీలోకి వెళ్లేందుకు హైడ్రాకు దారి తెలవడం లేదా..?. డిస్క్రిమినేషన్ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతులతో వెళ్తే రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం’’ అంటూ ఏలేటి హెచ్చరించారు.‘‘రంగనాథ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చుకోండి, రాజ్యసభ ఇచ్చుకోండి, కానీ ఇంత హైక్ ఎందుకు చేస్తున్నారు?. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవైసీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఓవైసీ నిర్మాణాలను ముట్టుకోలేకపోతున్నారు. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చిన తరువాతే ఇతర చెరువులకు వెళ్ళాలి. పాతబస్తీలో ఎన్ని చెరువులున్నాయి. ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయినేది డేటా ప్రభుత్వం సేకరించాలి’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
వారిపై క్రిమినల్ కేసులు.. హైడ్రా మరో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ హెచ్ఎండీఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు.క్రిమినల్ చర్యల లిస్టులో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీవో, బాచుపల్లి ఎమ్మార్వో, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సర్వే ఆఫ్ ఎడి ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా.. తాజాగా ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’ గుర్తింపు ఉంది. హైటెక్‌సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. అధికారులు వాటి జోలికి వెళ్లలేదనేది వాస్తవం. కానీ, ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా.. కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్.. వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్చందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు. -
నాగార్జున కన్వెన్షన్ సంచలన విషయాలు
-
‘హైడ్రా’ నోటీసులు ఇవ్వదా?
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాదారుల గుండెల్లో హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుబులు పుట్టిస్తోంది. హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైడ్రాకు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.‘‘హైడ్రాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజకీయంగా ఎవరిపైనా కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసినట్లు సమాచారం ఉంటే ఇవ్వండి. వాటిని కూడా కూల్చేస్తాం. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణ వల్లే వరదలు. మూడు నాలుగేళ్లలో చెరువుల ఆక్రమణ భారీగా పెరిగింది.’’ అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.స్కూల్స్, కాలేజీల విషయంలో ఆక్రమణలు రుజువైతే చర్యలు ఎప్పుడు ఉంటాయి?. ఓవైసీ కాలేజీని కూల్చేస్తారా?. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉంది. నాగార్జున ఆక్రమణలు చేశారా? కూల్చివేతల అంశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారాయన. హైడ్రాపై పలు సందేహాలను రంగనాథ్ నివృత్తి చేశారు.హీరో నాగార్జున సినిమాలు చూస్తానన్న ఆయన.. ఇంకా ఏమన్నారో.. పూర్తి ఇంటర్వ్యూలో చూడొచ్చు.. -
హైడ్రా దూకుడు.. కమిషనర్ ఏవీ రంగనాథ్ భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.కాగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హైడ్రా. అక్రమ నిర్మాణదారులంతా ఎక్కడ బుల్డోజర్ తమ వైపునకు వస్తుందోనని భయంతో హడలెత్తిపోతున్నారు నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కూల్చివేతల్లో వెనక్కి తగ్గని హైడ్రా అధికారులు.. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేశారు. మరోవైపు హైడ్రా చేస్తున్న పనుల మీద దుమారం కూడా రేగుతోంది. -
వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’.. కబ్జాదారులే టార్గెట్‌గా...!
‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలతో రాజధాని హైదరాబాద్‌లోని చెరువుల్లో ఆక్రమణలు చేసిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఈ స్వయంప్రతిపత్తి సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్న అధికారులు ఇప్పటివరకు నగరంలోని అనేక భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. అయితే చాలా మందికి హైడ్రా మీద అనేక అనుమానాలు ఉన్నాయి.. వీటిపై హైడ్రా కమిషనర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..చదవండి: ఆక్రమణదారులకు సింహస్వప్నం!అసలు హైడ్రా అంటే ఏంటి?హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుంది.హైడ్రా ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా ఉంటారు.హైడ్రా ఏం చేస్తుంది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు. సిటీని పకృతి విపత్తుల నుంచి రక్షించడానికి కృషి చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడే సంస్థ ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తాం. ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, పార్కులు, నాలాలు, స్మశాన వాటికలు వంటి వాటిని కబ్జా కాకుండా చూస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66 శాతం కబ్జాకు గురయ్యాయి. ఇలాగే వదిలేస్తే ఒకటి రెండేళ్లలో సిటీ పరిధిలో చెరువనేదే కనిపించకుండా పోతుంది. వీటి రక్షణ కోసమే హైడ్రా. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటే భయం పుట్టాలి. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించాలి.జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వారి మీద విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అందజేస్తాం. వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోతే స్పందించి వాటిని క్లియర్ చేయడం. కూడా హైడ్రా విధినే.ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు.చదవండి: ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా? నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. -
లేక్‌లు లేఔట్లపాలు
సాక్షి, హైదరాబాద్: ఒకనాడు నిండుగా చెరువులతో, వాటి పక్కన తోటలతో కళకళలాడిన నగరం హైదరాబాద్.. కానీ నాటి చెరువులు కుంటలు అయిపోతే.. కుంటలన్నీ బస్తీలుగా మారిపోయాయి. చెరువు కనిపిస్తే చెరపట్టడమే లక్ష్యంగా చెలరేగిపోయిన కబ్జాదారులతో ఎక్కడికక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కమీషన్ల కక్కుర్తితో.. వందల కొద్దీ చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద పెద్ద కాలనీలను చూపించి.. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. గత 45 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 శాతం చెరువులు మాయమైపోయినట్టు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ తేల్చింది. దీనికి సంబంధించి ఇటీవల ‘హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (హైడ్రా)’కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల తొలగింపుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అనేక ప్రాంతాలకు అవే గుర్తింపు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల పేర్లలో బాగ్, తలాబ్, కుంట, కట్ట వంటి పదాలు ఉంటాయి. అవన్నీ నగరంలో చెరువులు, కుంటలు, తోటలు ఉన్న ప్రాంతాలే. దానికితోడు పెద్ద పెద్ద చెరువులూ ఎన్నో ఉండేవి. రియల్ఎస్టేట్ బూమ్‌తో కబ్జాలు, ఆక్రమణలతో పరిస్థితులు మారిపోయాయి. చెరువుల శిఖం భూములతోపాటు తూములు,అలుగులు, నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో 1979, 2024 మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎన్ఆర్ఎస్సీ.. పెద్ద సంఖ్యలో చెరువులు మాయమైనట్టు తేల్చింది. బుధవారం ఎన్ఆర్ఎస్సీలో జరిగిన సమావే«శంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉదాహరణకు శాతం చెరువు విస్తీర్ణం గతంలో 70 ఎకరాలుకాగా.. ఇప్పుడు మిగిలింది పదెకరాలే. ఎల్బీనగర్ కప్రాయి చెరువు 71 ఎకరాలకుగాను 18 ఎకరాలే మిగిలింది. హెచ్ఎండీఏ యంత్రాంగం నిర్లక్ష్యంతో.. ఇటీవలి వరకు గ్రేటర్లో చెరువుల బాధ్యతలను హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పర్యవేక్షించింది. దీని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 1,728 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చూపారు. కేవలం 200 చెరువుల హద్దులను మాత్రమే నోటిఫై చేశారు. ఈ కారణంగానే కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగింది. 472 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫాక్స్‌సాగర్‌లో.. ఇప్పటివరకు 120 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు వెలిశాయి. 2003లో అప్పటి ప్రభుత్వం చెరువు భూముల్లోనే 11 ఎకరాల్లో పేదలకు పట్టాలివ్వడం గమనార్హం. ఇక మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశ హరŠామ్యలే వెలిశాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నం చెరువు, మంగలి కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరు అందించిన దుర్గం చెరువు చిక్కిపోయింది. దీని 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల మేర గార్డెన్స్ వెలిశాయి. నేతలు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఔట్ల వెనుక రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చెరువుల్లో వెంచర్లు, లేఔట్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కొందరు అధికారుల కక్కుర్తి తోడుకావడంతో అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది. వాటిని పూర్తిగా కూల్చివేయడానికి బదులు నిర్మాణాల పైకప్పు, గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలేస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి వినియోగించి తర్వాతి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కొనసాగించేస్తున్నారు. తాజాగా ఎన్ఆర్ఎస్సీ ప్రజెంటేషన్ నేపథ్యంలో ‘హైడ్రా’ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చాలని, తర్వాత పాత నిర్మాణాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ఎనిమిది భవనాలను (ఐదు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తయినవి) అధికారులు కూల్చేశారు. రెండు లేఔట్లను ధ్వంసం చేశారు. స్థిరాస్తి కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోండి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ భవనాలను కూల్చేయడంతోపాటు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. శనివారం రెండు ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పరిసరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని.. తెలుసుకోకుండా ముందుకెళ్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్రమ నిర్మానాలు, కబ్జాలపై సమాచారం ఇవ్వాలి. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారుల కొరడా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సీఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రతతో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.అయితే కూల్చివేతలను ఆక్రమణదారులు అడ్డుకోగా.. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. -
వరంగల్ ప్రజలతో సింక్ అయ్యా: సీపీ రంగనాథ్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొదట పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకొని ఇన్చార్జ్ కమిషనర్‌గా ఉన్న క్రైం డీసీపీ దాసరి మురళీధర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భగా మురళీధర్‌తోపాటు కమిషనరేట్ అధికారులు నూతన కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. 2009వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్పీగా, 2012లో వరంగల్ ఓఎస్డీ, అదనపు ఎస్పీగా, 2014లో వరంగల్ ఎస్పీగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసులో విధులు నిర్వర్తించారు. ఈఏడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన ఇటీవల రాచకొండ కమిషనరేట్ జాయింట్ సీపీగా నియమితులయ్యారు. ఇప్పుడు వరంగల్ సీపీగా వచ్చారు. సీపీని కలిసిన వారిలో డీసీపీలు అబ్దుల్ బారి, సీతారాం, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సిబ్బంది ఉన్నారు. రాత్రి సీపీ అంబర్‌కిషోర్ ఝా భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించి మహాదాశీర్వచనం అందజేశారు. వరంగల్ ప్రజలతో సింక్ అయ్యా: సీపీ రంగనాథ్ నయీంనగర్: తాను వరంగల్ ప్రజలతో సింక్ అయ్యానని, ఎంతో అనుబంధం ఏర్పడిందని బదిలీపై వెళ్తున్న సీపీ రంగనాథ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో రంగనాథ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని, వరంగల్ ప్రజలతో, మీడియాతో చాలా సింక్ అయ్యానని తెలిపారు. ఇక్కడ చాలా సమస్యలున్నాయని, వాటి పరిష్కారంలో తాను ప్రజలకు దగ్గరయ్యానన్నారు. పేదలకు, బాధితులకు అండగా నిలవాలనే ఐడియాలజీతో తాను పనిచేస్తానని, బలహీనంగా ఉన్న వాడిని బలవంతుడి నుంచి కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. తనకు మళ్లీ అవకాశం వస్తే ఇక్కడ పనిచేయాలనుందని, నగర ప్రజలు మంచివారన్నారు. క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ.. అందరితో కలివిడిగా ఉండే సీపీ రంగనాథ్ బదిలీ కావడం కొంత బాధగా ఉందన్నారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీ కిరణ్‌కుమార్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, క్లబ్ కార్యవర్గంతోపాటు జర్నలిస్టు సంఘాల నేతలు దాసరి కృష్ణారెడ్డి, బీఆర్ లెనిన్, గాడిపల్లి మధు, తదితరులు పాల్గొన్నారు. -
రంగనాథ్‌పై బదిలీ వేటు.. వరంగల్ ఇన్చార్జ్ సీపీగా దాసరి మురళీధర్
వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్చార్జ్ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్ నుంచి దాసరి మురళీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా 2022 డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజునుంచే అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు.. సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారుల గుండెల్లో సీపీ రంగనాథ్ రైళ్లు పరిగెత్తించారు. సుమారు 2,500కు పైగా ఫిర్యాదులను బాధితులు, ప్రజలు స్వయంగా సీపీకి అందజేశారు. ఆ ఫిర్యాదులను సీపీ.. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికా రులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. మొదట్లో చాలామంది ప్రజలు సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలికారు. 10 నెలలు.. 24 మందిపై సస్పెన్షన్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 10 నెలల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న 24 మంది పోలీస్ అధికారులపై సీపీ రంగనాఽథ్ సస్పెన్షన్ వేటు వేశారు. భూకబ్జాదారులకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోని వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమిషనరేట్‌లో ఏడుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్ఐ, ఏడుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు పలువురిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కొరడా... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. సామాన్యులను మోసం చేసి సకాలంలో చెల్లింపులు చేయకుండా డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కమిషనరేట్‌లో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణ కోసం డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా యజామాన్యాల ముక్కుపిండి చెల్లింపులు చేయించారు. ప్రతి శుక్రవారం చిట్స్‌ఫండ్ యాజమాన్యాలు ఎంతెంత చెల్లించాయో వివరాలు తెలిపేలా ప్రత్యేకంగా వ్యవస్థను సిద్ధం చేయించారు. బండి సంజయ్ ఫిర్యాదుతోనేనా? రాష్త్రంలో పలువురు అధికారుల బదిలీ ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాఽథ్ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన పాత్ర లేకున్నా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారనే కోపంతో బండి సంజయ్ సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో బండి సంజయ్.. సీపీ రంగనాథ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీ వెంట మరికొంత మంది అధికారులు..? ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్ శాఖలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆ అధికారులపై ఈ సమయంలో వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాఽథ్ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పాలనపై ప్రత్యేక ముద్ర వేసిన సీపీ రంగనాఽథ్ బదిలీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో సంచలనంగా మారింది. -
వీడిన మిస్టరీ.. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమెది ఆత్మహత్యేనని, ఆమె శరీరంలో పాయిజన్ ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రకటించారు. ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతను బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. డాక్టర్ ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ప్రకటించడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. అయితే రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు ప్రీతి కేసు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’జిల్లా పేజీలో ‘ప్రీతి మృతిపై వీడని మిస్టరీ’శీర్షికన శుక్రవారం ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రీతిది ఆత్యహత్యేనని ప్రకటించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమన్నారు. ఘటనాస్థలిలో ఆత్మహత్యకు కారణమైన సిరంజీ ఉందని, సూది మాత్రం కనిపించలేదన్నారు. వారం, పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. సాక్షి వరంగల్ జిల్లా పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనం.. చదవండి: వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం! -
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్ గతేడాది డిసెంబర్ 29న సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్ రోప్లో రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్‌పేట్ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం... ఇలా నగర ట్రాఫిక్‌పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకువచ్చారు. ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్ రోడ్ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్ విభాగానికి కొత్త చీఫ్ వచ్చే వరకు మరో అధికారి ఇన్చార్జిగా ఉండనున్నారు. 19నెలలు పనిచేసిన తరుణ్‌జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ తరుణ్జోషిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తరుణ్‌జోషి 2021 ఏప్రిల్ 4న వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీస్ వర్టికల్స్, వెల్ఫేర్ విషయంలో నిజాయితీగల అధికారిగా పేరున్న ఆయన సుమారు 19 నెలల పాటు తన మార్కు వేసుకున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన తరుణ్‌జోషి సెంట్రల్ సర్వీసెస్‌కు వెళ్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇదే సమయంలో గురువారం ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ను నియమించింది. చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. పోలీస్‌శాఖలో రంగనాథ్ తనదైన మార్క్ ఏవీ రంగనాథ్ 1970 అక్టోబర్‌లో నల్లగొండలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకు అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్–1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ –1 లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. పోలీస్ బాస్ కావాలన్న ఏకైక లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. 1996 బ్యాచ్‌లో డీఎస్పీ ర్యాంక్‌లో స్థిరపడి 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి, ఆ తర్వాత సంవత్సరంపాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్‌ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు. నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్యపై కీలకంగా పనిచేశారు. కాగా, ఆయన సీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ప్రొఫైల్ పూర్తి పేరు : ఆవుల వెంకట రంగనాథ్ పుట్టిన తేదీ : అక్టోబర్ 22, 1970 పుట్టిన ప్రదేశం : నల్లగొండ తల్లిదండ్రులు : సుబ్బయ్య, విజయలక్ష్మి భార్య : లక్ష్మీలావణ్య పిల్లలు : రుషిత, కౌశిక్ గ్రూప్ –1 : 1996 డీఎస్పీ, 2006లో ఐపీఎస్ మొదటి పోస్టింగ్ : గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ ఇష్టమైన ఆట : టెన్నిస్ ప్రదేశం : కశ్మీర్ చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. -
ట్రాఫిక్ చీఫ్ కీలక నిర్ణయం! ఇకపై అటువంటి చలాన్లు ఉండవా?
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ– చలాన్ల ప్రధాన ఉద్దేశం రోడ్డు భద్రత పెంచడంతో పాటు ప్రమాదాలు, మరణాలు నిరోధించడం. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ జారీ విధానం ‘రోగమొక చోటైతే.. మందొక చోట’ అన్న చందంగా ఉంది. ఈ లోపాలను పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే ఎక్కువగా కన్నేసి ఉంచనున్నారు. అక్కడి ఉల్లంఘనులనే ఫొటోలు తీసి ఈ–చలాన్ల పంపనున్నారు. త్వరలో ఈ విధానం ప్రారంభం కానుందని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. 90 శాతం హెల్మెట్ కేసులే.. లక్డీకాపూల్ అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ప్రాంతం. ఇక్కడ సరాసరిన వాహనాల సరాసరి వేగం గంటలకు 15 కి.మీ కూడా మించదు. అలాంటి చోట హెల్మెట్ ధరించినా, ధరించకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇలాంటి చోట్లా రోజూ వందలు, వేల సంఖ్యలో ‘వితౌట్ హెల్మెట్’ కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్లు జారీ చేస్తుంటారు. ►ఏటా జారీ అవుతున్న ఈ– చలాన్లలో 90 శాతం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. ప్రస్తుతం జారీ అవుతున్న ఈ– చలాన్ విధానంలో ఇలాంటి లోపాలు అనేకం ఉన్నాయి. వీటిని గమనించిన రంగనాథ్ కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. ►దీని ప్రకారం ఏ ట్రాఫిక్ పోలీసు ఉల్లంఘనులకు నేరుగా చలాన్ విధించరు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న కెమెరాలతో ఉల్లంఘనకు పాల్పడిన వాహనం ఫొటో తీస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్‌లోని వాహనం చిరునామా ఆధారంగా ఉల్లంఘనకు సంబంధించిన ఈ– చలాన్ పంపిస్తున్నారు. ఈ ఫొటోలు తీసే పోలీసులు జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. బ్లాక్ స్పాట్లలోనే.. ఒకే చోట ఉంటూ తమ కంటికి కనిపించిన ప్రతి ఉల్లంఘనను ఫొటో తీస్తున్నారు. ఇకపై వీళ్లు తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్ స్పాట్స్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే గడిచిన అయిదేళ్ల గణాంకాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు పోలీసుస్టేషన్ల వారీగా ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పోలీసులు కూడా ఏ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఉల్లంఘనలకే ప్రాధాన్యం ఇస్తూ ఫొటోలు తీస్తారు. చదవండి: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111? 125 ఆధునిక ట్యాబ్‌ల కొనుగోలు.. ►ఈ విధానం అమలు కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు కొత్తగా 125 అత్యాధునిక ట్యాబ్స్ ఖరీదు చేశారు. కెమెరాల స్థానంలో వీటిని వినియోగిస్తూ, ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనుల ఫొటోలు తీయనున్నారు. దీంతో ఆ ఫొటో తీసిన సమయం, తేదీలతో పాటు ప్రాంతం కూడా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నమోదవుతుంది. క్షేత్రస్థాయి పోలీసులు ఒకే చోట ఉండి ఫొటోలు తీయకుండా నిఘా ఉంచేందుకు ఇది ఉపకరించనుంది. ►మరోపక్క ప్రస్తుతం ఈ– చలాన్ల బట్వాడాకు సంబంధించి పోలీసు విభాగం పోస్టల్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లిస్తోంది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒక్కో ఈ– చలాన్‌కు రూ.15 చొప్పున పోస్టల్ శాఖకు చేరుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ– లోక్ అదాలత్‌లో వచ్చిన సొమ్ము నుంచి ఇది చెల్లించాల్సిందే. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. -
ప్రణయ్ హత్య వెనుక మాజీ ఉగ్రవాది
-
ప్రణయ్ హత్య: ఎవరీ.. మహ్మద్ బారీ..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన కూతురు షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కసితోనే మిర్యాలగూడకు చెందిన రియల్టర్ తిరునగరు మారుతీరావు భారీ స్కెచ్ వేసి ప్రణయ్‌ను తుదముట్టించాడని తెలుస్తోంది. ఈ హత్య వెనుక మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీ హస్తం ఉన్నట్లు సమాచారం. రెండు రోజులుగా పోలీసులు పూర్తిగా ఈ కేసు విచారణ సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరి గిన తర్వాత సాయంత్రానికల్లా ప్రధాన నిందితుడు మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ దాదాపు సేకరించామని అధికారులు చెబుతున్నారు. ప్రణయ్, అమృతల వివాహం జరిగినప్పటి నుంచి వాళ్ల బంధాన్ని తెంచేందుకు మారుతీరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవి ఫలించకపోవడంతో ప్రణయ్‌ను మట్టుబెట్టాలని ఆలోచించి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. దీని కోసం రూ.కోటి వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదని, ఇంత భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని హత్యలు చేసే గ్యాంగ్‌లు తక్కువగానే ఉంటాయని, ఇందులో మరో కోణం దాగి ఉందన్న అంచనాతో విచారణ చేపట్టిన్నట్లు చెబుతున్నారు. మారుతీరావు చెప్పిన వివరాల తరువాత ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు స్టేషన్లలో పెట్టి విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎవరీ.. మహ్మద్ బారీ.. మారుతీరావు ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు హైదరాబాద్‌లో ఉంటూ నల్లగొండలో వ్యవహారాలు నడుపుతున్న మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మాజీ కానిస్టేబుల్ కొడుకైన బారీకి నేర చరిత్ర ఎక్కువగానే ఉందని పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో బారీ జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. నల్లగొండ పట్టణానికి చెందిన బారీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్‌ను ఈ హత్యలో వాడుకున్నాడని సమాచారం. 1998లోనే నల్లగొండ వన్‌టౌన్‌లో బారీపై రౌడీషీట్ తెరిచారు. బీజేపీ నేత గుండగోని మైసయ్య గౌడ్ హత్య కేసులో, మరో హత్య కేసులో, ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో బారీ నిందితుడు. అయిదారేళ్ల క్రితం ఓ భూ కబ్జా వివాదంలో బారీ మిర్యాలగూడకు రావడం, అందులో మారుతీరావు జోక్యం చేసుకుని సయోధ్య కుదర్చడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రణయ్ హత్యకు రూ.కోటి డిమాండ్ చేసిన బారీకి పెద్ద మొత్తంలోనే అడ్వాన్సు ముట్టజెప్పాడని తెలిసింది. హత్య చేయడానికి వచ్చిన వారికి మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మారుతీరావు దగ్గరి మిత్రుడు కరీం సహకరించి షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం కరీంను, మారుతీరావుతో సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీం ద్వారానే బారీకి డబ్బులు పంపించినట్లు అనుమానిస్తున్నారు. బారీతోపాటు రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. తుది దశకు విచారణ: ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రణయ్ హత్య కేసులో విచారణ తుది దశకు వచ్చింది. ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టం. కేసు పూర్వాపరాలను ఒకటీ రెండు రోజుల్లో బయటపెడతాం. విచారణ దశలో ఉన్న కేసులో ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేం. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు వారిని నమ్మించి దెబ్బకొట్టాడు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఇందులో నయీం గ్యాంగ్ హస్తం ఉందన్నది వాస్తవం కాదు. నయీమే లేడు ఇక గ్యాంగ్ ఎక్కడిది. ఇది పక్కా పరువు హత్య. సుపారీ గ్యాంగ్‌తో చేయించిన పని. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతాం. ఇంటి వద్దనే హత్య చేయడానికి రెక్కీ.. ప్రణయ్‌ని ఇంటి వద్దనే హత్య చేయడానికి నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 22న ఒకసారి ప్రణయ్ కారు వెనుకాల వచ్చి రెక్కీ నిర్వహించాడు. కారు అద్దెకు కావాలని ప్రణయ్ తండ్రి బాలస్వామిని అడిగిన నిందితుడు ఆ సమయంలో ప్రణయ్ ఉంటే హత్య చేయాలని వచ్చినట్లు సమాచారం. అలాగే మరోసారి ఇంటి ముందు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అయితే తనకు ప్రాణహాని ఉందని తెలిసిన ప్రణయ్ ఎప్పుడూ కారులో కూర్చున్న తరువాతే బయటికి వచ్చేవాడని, ఇలా ఇంటి వద్ద హత్య చేయడానికి అవకాశం రాకపోవడంతోనే ఆస్పత్రిని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత కరీం. (ఫైల్) -
ప్రణయ్ హత్యకు కోటి డీల్?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుల దురహంకారంతో తన కూతురు భర్త ప్రణయ్‌ను కడతేర్చేందుకు అమృత తండ్రి మారుతీరావు రూ.కోటి డీల్ కుదుర్చుకున్నాడా..? కిరాయి హంతకులకు రూ.50 లక్షలు అడ్వాన్స్ అప్పజెప్పాడా? విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ‘పరువు హత్య ’కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం గిట్టని ఆమె తండ్రి మారుతీరావు ఈ హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఆ దిశలో విచారణ జరుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నేరుగా ఒకే గ్యాంగ్‌తో సంబంధాలు పెట్టుకోకుండా ఈ హత్యను పకడ్బందీగా చేసేందుకు మూడంచెల గ్యాంగ్‌ను మాట్లాడుకున్నారని తెలిసింది. పని పూర్తిచేస్తే రూ. కోటి ముట్టచెబుతామని మాట ఖరారు చేసుకున్నారని, అడ్వాన్సుగా రూ.50 లక్షలు చెల్లించారని చెబుతున్నారు. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఈ గ్యాంగ్ కనీసం రెండు నెలలుగా మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటిపై నిఘా పెట్టిందని, రెక్కీ చేసిందని చెబుతున్నారు. అనధికారిక సమాచారం మేరకు హత్య జరిగిన శుక్రవారం మిర్యాలగూడ ప్రాంతంలోని బ్యాంకుల్లో మారుతీరావు అకౌంట్ల నుంచి కనీసం రూ.1.5 కోట్ల లావాదేవీలు జరిగాయని సమాచారం. కాగా, పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మూడు గ్యాంగులు ఇందులో పాల్గొన్నాయి. శుక్రవారం సాయంత్రానికే నిందితుడిని నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. హంతకులకు మారుతీరావు షెల్టర్ మారుతీరావు తన అల్లుడిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకున్నాడని, ఆ గ్యాంగ్ హత్యకు మూడు రోజుల ముందరే పట్టణానికి చేరుకుందని, వారికి మారుతీరావే షెల్టర్ కల్పించారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన కూతురు ఆస్పత్రికి వచ్చిన విషయాన్ని మారుతీరావు ఎప్పటికప్పుడు ఫోన్‌ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడని చెబుతున్నారు. మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరిగే సమయానికి ప్రధాన నిందితుడు మారుతీరావు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాడని, ఒక పనికోసం ఉన్నతాధికారులను కలిసేందుకు నల్లగొండకు వచ్చాడని సమాచారం. హత్య జరిగిన తర్వాత ఫోన్ రావడంతో ఆయన కలెక్టరేట్ నుంచి వెళ్లిపోయాడని, అయితే ఎటుపోవాలో పాలుపోక జాతీయ రహదారిపై చక్కర్లు కొట్టాడని, కేతేపల్లి, కట్టంగూరు తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నల్లగొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న మారుతీరావు విచారణ అధికారుల ఎదుట నోరు విప్పినట్లు తెలుస్తోంది. కూతురి కన్నా పరువే ముఖ్యం! పోలీసుల అదుపులో ఉన్న మారుతీరావు తన కూతురిపై ఉన్న ప్రేమతోనే ఈ హత్య చేయించినట్లు చెబుతున్నాడని తెలిసింది. ‘నా కూతురిపై ప్రేమతోనే ప్రణయ్‌ని చంపించా. 9వ తరగతిలోనే ప్రణయ్, అమృతలకు వార్నింగ్ ఇచ్చా. ఎన్ని సార్లు చెప్పినా ప్రణయ్ వినలేదు. నాకు నా కూతురు కన్నా సొసైటీలో నా పరువే ముఖ్యం అనుకున్నా. సుపారీ గ్యాంగ్‌కి నా కూతురికి ఎటువంటి హాని తలపెట్టొద్దని ముందుగానే చెప్పా. ప్రణయ్‌ని చంపించినందుకు నాకేం బాధ లేదు. జైలుకి వెళ్లడానికి సిద్ధపడే ఈ ప్లాన్ వేశా..’అని నిందితుడు మారుతీరావు పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, కొందరు పోలీసు అధికారులు మాత్రం అసలు ఆయన నోరే విప్పడం లేదని కూడా చెబుతున్నారు. మారుతీరావుది ‘ఘన’మైన చరిత్రే! కూతురి భర్తను అతి కిరాతకంగా కిరాయి హంతకులతో చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు వ్యక్తిగత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులతో సన్నిహితంగా ఉండే మారుతీరావు రెవెన్యూ, పోలీసు అధికారులనూ గుప్పిట పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్‌గా జీవితం మొదలు పెట్టిన మారుతీరావు, కొందరు రెవెన్యూ అధికారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని వారి అండదండలతో భూ దందాలు సాగించాడన్న ఆరోపణలు ఉన్నాయి. భూ దందాల కోసం అధికారులను లోబర్చుకోవడం.. వారి సరదాలు తీర్చి పనులు చేయించుకునే వాడని అంటున్నారు. ఆర్యవైశ్య, రైస్‌మిల్లర్స్ మధ్య తలెత్తే పంచాయితీలు సెటిల్ చేసేవాడని సమాచారం. రాజకీయ నేతలు, కొందరు కుల సంఘాల నాయకుల అవసరాలు తీరుస్తూ వారిని తనకు అనుకూలంగా మలచుకుని తన అక్రమ దందాలకు వాడుకునే వాడని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే టీఆర్ఎస్లో చేరాడని, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కేబుల్, బెల్లం వ్యాపారం సాగించేవాడని తెలుస్తోంది. విచారణ సాగుతోంది సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను సవాల్‌గా తీసుకుని జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. హతుడి భార్య అమృత ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. అమృతకు ఎలాంటి ప్రాణభయం లేదని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుంటే హోమ్‌కు తరలిస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండు మూడు రోజుల్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని, కేసు విచారణలో ఉండగా ప్రస్తుతం అన్ని వివరాలు బయటపెట్టలేమని ఎస్పీ పేర్కొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్
ఖమ్మంసిటీ: జిల్లాలో మొదటి విడతగా సోమవారం మున్సిపాలిటీల్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతమైంది. ఉద్యమస్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భాగస్వాములయ్యూరు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి, ఎస్పీ ఏవీ రంగనాథ్, జడ్పీ చైర్ పర్సన్ గడపల్లి కవిత పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్పొరేషన్ సహ కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పర్యటించి సందర్శించి స్ఫూర్తి నింపారు. ఖమ్మం నగరంలోని సారధి నగర్లో, కలెక్టర్ నివాసం వెనుక ఉన్న గోళ్లపాడు చానల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. గోళ్లపాడు చానల్లో సమారు కిలోమీటర్ మేర సిల్ట్ తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ మొదటి విడతగా మున్సిపాలిటీల్లో, రెండో విడతగా పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్లో పారిశుధ్య పనలకు 15 ట్రాక్లర్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోళ్లపాడు చానల్ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ మనసు స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా మొదటి అదనపు జడ్జి చిరంజీవి రావు మాట్లాడుతూ మన బాధ్యతలను గుర్తెగాలని సూచించారు. జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ ఇదో బృహత్తర కార్యక్రమమని, ఇందుకు కేంద్రం రూ. 20 వేల కోట్లు కేటారుుంచిందని చెప్పారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి రూ. వెరుు్య కోట్లు కేటారుుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ వేణు మనోహర్ మాట్లాడుతూ సుమారు 23 జేసీబీ, 191 ట్రాక్టర్లతో పూడిక తీత పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఒక్కరోజే 1928 టన్నుల చెత్త తరలించామని, 88 కిలో మీటర్ల మేర డ్రెరుున్లలో సిల్ట్ తొలగించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, తోట రామారావు, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, డీఎస్పీ బాలకిషన్‌రావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ త్యాగం వెలకట్టలేనిది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను సదాస్మరిస్తాం. అమరుల స్మత్యర్థం ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినా తక్కువే. సమాజాభివృద్ధిలో పోలీస్ త్యాగం వెలకట్టలేనిది’ అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పోలీస్ సంక్షేమం, అమరుల కుటుంబాలకు శాఖపరంగా అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన ‘సాక్షి’కి సోమవారం వివరించారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే... ‘ప్రజల భద్రతే లక్ష్యంగా వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వని అరుదైన శాఖల్లో పోలీస్‌శాఖ ప్రధానమైంది. జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా శత్రువుతో రాజీలేని పోరాటం చేశాం. ప్రజా శ్రేయస్సు కోసం సత్ఫలితాలను సాధించాం. జిల్లాలో దాదాపు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. జిల్లా పోలీసుల సమష్టి కృషి, త్యాగనిరతికి ఇది నిదర్శనం. జిల్లాలో దాదాపు 40 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. వారి కుటుంబాలకు పోలీస్‌శాఖ అండగా ఉంటోంది. వారి కుటుంబసభ్యులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నాం. వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నాం. జిల్లా పోలీస్ అధికారుల సంఘం సైతం వారికి అనుక్షణం అందుబాటులో ఉంటుంది. 1996 కంటే ముందు మరణించిన పోలీసులకు సంబంధించి వారి కుటుంబాలు అడుగుతున్న ప్రభుత్వపరమైన రాయితీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకుగాను అడిషనల్ ఎస్పీ, పోలీస్ అధికారుల సంఘం అమరవీరుల కుటుంబాలకు చెందిన వారితో కలిసి రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి సమస్యలను వివరిస్తాం. 1996 కంటే ముందు మరణించిన పోలీస్ అమరుల కుటుంబాలకు కేవలం ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇతర ఆర్థిక ప్రయోజనాలేవీ నెరవేరలేదు. ఈ విషయాన్ని హోంమంత్రికి ప్రతినిధి బృందం నివేదిస్తుంది. విద్యార్థులకు పోలీస్‌శాఖ విధి నిర్వహణపై అవగాహన కల్పించాం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా రక్తదానం, వ్యాసరచన, వక్తృత్వం, క్రీడాపోటీలు, ఓపెన్‌హౌస్, సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం విజయవంతానికి పోలీస్‌శాఖ కూడా విశేషంగా కృషి చేస్తోంది. పోలీసు అమరుల కుటుంబాలకు సంబంధించిన ప్రతి సమస్యనూ పోలీస్ కుటుంబ సమస్యగానే భావిస్తాం. అమరుల కుటుంబాలకు ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల్లో రెండుశాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఇతర ఉద్యోగాల్లోనూ దీన్ని అమలు చేయాలనే డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వ దృష్టిలో ఉంది’ అన్నారు.