
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, అనుమతి లేని వాటిలో ప్లాట్లు ఖరీదు చేసి ఇబ్బందులు పడొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం హెచ్చరించింది. ఫార్మ్ ప్లాట్ల రిజి్రస్టేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడ గ్రామంలోని సర్వే నం.50లోని 1.02 ఎకరాల్లో ఫాం ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని సోమవారం నాటి ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్–2018 ప్రకారం ఎక్కడా ఫాం ల్యాండ్ ప్లాట్లుగా అమ్మడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు. ఫాం ల్యాండ్ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని వివరించారు. ఈ మేరకు ఫాం ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు కూడా ఇచి్చందని రంగనాథ్ తెలిపారు. జీవో నం.131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెలసిన అక్రమ లేఔట్లలోని ప్లాట్లలో ఇల్లు నిరి్మంచడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తించాలని కోరారు.
ప్రజావాణిలో 64 ఫిర్యాదులు...
సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 64 ఫిర్యాదులు అందాయి. తమ కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా కొందరు చుట్టూ ప్రహరీలు నిర్మించుకుంటున్నారని, నాలాలు కబ్జా చేసి వరదనీరు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారనే అంశాల పైనే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. రహదారులకు అడ్డంగా నిర్మాణాలు, ప్రహరీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాటిని తొలగించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లా కాచవాని సింగారం గ్రామంలోని సర్వే నం.54లో ఉన్న లేఔట్‌లోని భాగ్యనగర్ నందనవనం పార్కును కబ్జా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.
దేవరయాంజల్‌లో సర్వే నం.452, 453లో 3.39 ఎకరాలలో లే ఔట్ వేసి ప్రహరీ నిర్మించడంతో తమకు దారి లేకుండా పోయిందని ఆ ప్రాంత నివాసితులు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని రాక్‌గార్డెన్స్ అంటూ లే ఔట్‌లో పేర్కొన్న ప్రాంతంలో ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ పేరిట వ్యాపారం చేస్తున్నారని స్థానికుడు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. కాప్రా మున్సిపాలిటీలోని కుషాయిగూడ విలేజ్‌లో సర్వే నం. 177లో ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేశారని, ఆ పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న తమ లేఔట్‌లో చూపిస్తున్నారని çపలువురు ఫిర్యాదు చేశారు. కబ్జా చేయడమే కాకుండా అక్కడ కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment