illegal layouts
-
అక్రమ లేఅవుట్ తయారు చేసి.. 10 శాతం మింగేశారు..
నిజామాబాద్‌నాగారం : నిజామాబాద్ మున్సిపాలి టీ పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. గజం భూమి రూ. వేల నుంచి రూ. లక్షల్లో పలుకుతుంది.. దీంతో చాలామంది వ్యవసాయభూములను వెంచర్లుగా మార్చేసి ప్లాట్లు చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. నగరంలోని మానిక్ భండార్ ప్రాంతం ఆర్టీసీ కాలనీ పద్మావతినగర్‌లో రెండు ఎకరాల్లో వెంచర్ వేశారు. భూములకు ధరలకు డిమాండ్ రావడంతో ఇదే అదనుగా పార్కుకు వదిలేసిన 10 శాతం భూమిలోనూ ప్లాట్లు చేసి మరీ సొమ్ముచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మున్సి పల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పెద్ద ఎత్తున కాసు లు దండుకొని వెంచర్ నిర్వాహకుడికి సహకరించా రని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై 2018 నుంచి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల కు రాతపూర్వకంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా స్పందించకపోవడం గమనార్హం. దొంగ లేఅవుట్ తయారు చేసి.. మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/ HRO/ H1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయా రు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గా కుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలు వ సుమారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పా ర్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సు మారు 700 గజాల భూమిని అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు. ఫిర్యాదులు.. చెత్తబుట్టలోకే... వెంచర్ నిర్వాహకుడి అక్రమాలను గుర్తించిన స్థానికులు, మరో సామాజిక కార్యకర్త చంద్రప్రకాష్ మోదానీ నేరుగా 2018 సంవత్సరం నుంచి మాక్లూర్ మండల తహసీల్దార్‌కు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చెత్త బుట్టలో వేస్తూనే ఉన్నారు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని వేధింపులను గురి చేయడంతో పాటు భయపెట్టడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ నెల 9న కూడా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపాయే.. మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/HRO/1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయారు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గాకుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలువ మారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పార్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సుమారు 700 గజాల భూమిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు. -
Telangana High Court: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయడం అనే ప్రక్రియే తప్పని.. అలాంటిది గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వాటినీ అనుమతించాలని కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. అలా ఎక్కడైనా చేసినట్లు తెలిస్తే ప్రభుత్వ న్యాయవాది (జీపీ) దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) పేరిట చేసే క్రమబద్దీకరణే సరికాదని స్పష్టంచేసింది. గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం తమ ఇంటి నిర్మాణానికి అప్లికేషన్లను అనుమతించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిర్మల్‌కు చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ దరఖాస్తులను పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పు సమంజసమే.. ఈ పిటిషన్లపై తొలుత హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లందరూ తమ ప్లాట్లకు యజమానులని, విక్రయ డాక్యుమెంట్లు కూడా వారి వద్ద ఉన్నాయన్నారు. టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తును సమర్పించడానికి యత్నించారని వెల్లడించారు. జీవో ప్రకారం 2022, ఆగస్టు 26 లోపు దరఖాస్తు చేయలేదని తిరస్కరించడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు తమ పిటిషన్లో ప్రభుత్వ జీవోను ప్రశ్నించలేదని చెప్పారు. అసలు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేయకుండా, ఇంటి నిర్మాణానికి ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు. జీవోలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదని, ఈ క్రమంలో ప్రతివాదులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ రిట్ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో పిటిషనర్లు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ద్విసభ్య ధర్మాసనం కూడా సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు ప్రభుత్వం 2020లో అనధికారిక ప్లాట్లు, లే–అవుట్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 131ని తెచ్చింది. దీన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు వెలువడ్డాక విచారణ చేపడతామని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అప్పటివరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం గతంలో వెల్లడించింది. అప్పటివరకు అర్జీదారులను ఇబ్బందులకు గురి చేయకూడదని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉంది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటి?’అని ఘాటుగా వ్యాఖ్యానించింది. -
Bapatla: జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందా
‘బాపట్ల మండలం ఈతేరులో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కర్లపాలెంలో ఓ లే అవుట్ వేసింది. దీంతో కర్లపాలెం వాసులు కరీముల్లా ఖాన్, అబ్దుల్ సమీద్, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, గోపీ, పవన్‌కుమార్, సోమయ్య తదితరులు ప్లాట్లను కొని అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు చెల్లించారు. తీరా చూస్తే ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని నిలదీశారు. ఇచ్చిన నగదును తిరిగిచ్చే ప్రసక్తే లేదని ఆ వ్యాపారి తెగేసి చెప్పాడు. దీంతో బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. సాక్షి, బాపట్ల: జిల్లాలో అనధికారిక లే అవుట్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొందరు అక్రమ లే అవుట్లను వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో నిఘా సన్నగిల్లడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. పాలనా సౌలభ్యం కోసం బాపట్లను జిల్లాగా ప్రకటించడంతో పట్టణ పరిసరాల్లోని 15 కిలోమీటర్ల పరిధిలో వందల సంఖ్యలో లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ఒక్కదానికీ అనుమతుల్లేవు. అయినా వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గుర్తించినవి ఇవే.. ► బాపట్ల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 61 లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 24 లేఅవుట్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. 35 లేఅవుట్లకు లేవు. కానీ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ► జిల్లాలో దాదాపు 150 వరకు అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీటిపై చర్యలు లేవు. నిబంధనలివీ.. ► వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా మార్చాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దీనికోసం ప్రభుత్వానికి ఐదుశాతం ఫీజు చెల్లించాలి. ► అధికారుల అనుమతితోనే లేఅవుట్ వేయాలి. ► 40 అడుగుల రోడ్లు ఉండాలి. ► 10 శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి. ► తాగునీటికి, విద్యుత్ సౌకర్యానికి రుసుములు చెల్లించాలి. ► కానీ ఇవేమీ అమలు కావడం లేదు. ప్రభుత్వం అవకాశం ఇచ్చినా..! అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ప్రజలు నష్టపోతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం అనధికార లే అవుట్లకు క్రమబద్ధీకరణ పథకం–2020ని ప్రకటించింది. 2019 ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే –అవుట్లలోని ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును చాలా వరకు రియల్టర్లు ఉపయోగించుకున్నారు. స్పందన బాగుండడంతో ఈ ఏడాది జూన్ 30 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పథకాన్ని ఆపేసింది. అయితే అనధికార లేఅవుట్లలో నిర్మించుకున్న భవనాలను వ్యక్తిగతంగా అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. అవకాశం ఇచ్చినా కొందరు వ్యాపారులు వినియోగించుకోలేదు. (క్లిక్: పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు) కలెక్టర్ సీరియస్.. జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తు చేసుకున్న అనధికార లే అవుట్లకు సంబంధించి అపరాధ రుసుం రూపంలో రూ.16 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. దీనిపై కలెక్టర్ విజయకృష్ణన్ ఇటీవల సీరియస్ అయ్యారు. తక్షణమే అపరాధ రుసుం వసూలు చేయాలని, ఇంకా ఉన్న అనధికార లే అవుట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి నిషేధిత జాబితాలో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో రియల్టర్లలో ఆందోళన మొదలైంది. చర్యలకు ఉపక్రమిస్తున్నాం పంచాయతీల్లో అనధికార లే–అవుట్లను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్ ఆదేశించారు. ఆ లే అవుట్లను గుర్తించి త్వరలోనే కలెక్టర్ ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎ.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి -
అక్రమ లేఅవుట్లు రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు, డిస్మిస్‌కూ వెనుకాడం
సాక్షి, అమరావతి: అనధికారిక లే అవుట్లను రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతిచ్చిన లే అవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్టర్ చేయాలని తెలిపారు. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం రిజిస్టర్ చేయకూడదనే నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలులో ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు. డీఐజీలు తమ జిల్లాల్లో లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతి నెలా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ లే అవుట్లను రిజిష్టర్ చేయడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల కొన్నిచోట్ల ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భూముల రీసర్వేపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో సభ్యులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక లేఅవుట్లపై సీరియస్‌గా స్పందించారు. మున్సిపల్ శాఖాధికారులు ఈ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. -
అక్రమ లే అవుట్లపై విజిలెన్స్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో అనుమతుల్లేకుండా వెలుస్తున్న లే అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డివిజన్, జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా నగరాలు, పట్టణాలకు చుట్టుపక్కల గ్రామ పంచాయతీల పరిధిలోను, మండల కేంద్రాలు, హైవేల పక్కన గ్రామాల్లోను కొందరు వ్యాపారులు అక్రమ లే అవుట్లు వేశారు. వీటివల్ల ఆయా పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతుండడంతో పాటు ఈ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్నవారు తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అనుమతుల్లేని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తుండడంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నట్టు ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతుల్లేని లే అవుట్లు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోను లే అవుట్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం జగన్మోహన్రెడ్డి అనుమతితో అనధికారిక లే అవుట్ల క్రమబద్దీకరణకు ఎల్ఆర్ఎస్ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో చాలాచోట్ల పంచాయతీలు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నాయని, లే అవుట్లకు అనుమతుల సందర్భంగా వస్తున్న ఫీజులో సగం పంచాయతీలకు రావాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులతో మాట్లాడి రావాల్సిన డెవలప్మెంట్ ఫీజులను పంచాయతీరాజ్‌శాఖ వసూలు చేయాలని సూచించారు. అక్రమ లే అవుట్ల నియంత్రణకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ప్రత్యేకంగా విజిలెన్స్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఈవోపీఆర్డీతో సహా ముగ్గురితో, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈవో, డీపీవో, జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారితో కూడిన విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. 2015 నాటికే 6,098 అక్రమ లే అవుట్లు.. 2015 నాటికే గ్రామీణ ప్రాంతాల్లో 6,098 అక్రమ లే అవుట్లు ఉన్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. తర్వాత కొత్తగా వెలిసిన వాటితో కలిపి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయన్నది విజిలెన్స్ బృందాలు గుర్తిస్తాయని చెప్పారు. ఈ అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారానే గ్రామ పంచాయతీలకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పాల్గొన్నారు. విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే లే అవుట్లపై విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జిల్లా అధికారులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. డివిజన్, జిల్లా స్థాయి బృందాలు ఇప్పటికే ఉన్న అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట పంచాయతీల్లో అక్రమ లే అవుట్లు ఏర్పాటు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ లే అవుట్లు గుర్తించినచోట ఆ విషయాన్ని స్థానిక ప్రజలందరికీ తెలిసేలా గ్రామంలో దండోరా వేయించాలని సూచించారు. ప్రతినెలా విజిలెన్స్ బృందాలు సమావేశం కావాలని నిర్దేశించారు. -
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రెడీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 31.08.2020 నుంచి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ప్రారంభించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లను రెగ్యులర్ చేస్తామని అధికారులు తెలిపారు. ⇒ నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. ⇒ 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి . ⇒ 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ⇒ ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ⇒ 100 గజాల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి. ⇒ 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి. ⇒ 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి. (చదవండి: ప్రైవేటు జలగలు..! ) -
సాక్షి ఎఫెక్ట్: అక్రమ లేఅవుట్లపై కొరడా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నగరంలో అంతర్భాగమైన చాపురం సిద్ధిపేటలో టీడీపీ నేతలు వేసిన అక్రమ లేఅవుట్లపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్జాగా అక్రమ లేఅవుట్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. సిద్ధిపేటలో అనుమతి లేకుండా వేసిన మూడు లేఅవుట్లలోని సరిహద్దు రాళ్లను తొలగించారు. అంతేకాకుండా జిరాయితీ చెరువు కప్పేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులపై కూడా ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను వెదుకుతున్నా రు. ఇక లేఅవుట్లలో కలిసి ఉన్న ప్రభుత్వ భూములను రానున్న రోజుల్లో పేదలకు ఇచ్చే ఉచిత ఇళ్ల స్థలాల కోసం వినియోగించేందుకు చర్యలు తీసు కుంటున్నారు. అక్కడ ఎటువంటి ఆక్రమణలు లేకుండా, అనుమతి లేని లేఅవుట్లు కనిపించకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి అజయ్‌బాబు ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లలో ఉన్న హద్దుల రాళ్లను తొలగించే పని చేపట్టారు. -
శ్రీకాకుళంలో పచ్చ నేతల దందా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూత వేటు దూరంలో అక్రమ లేఅవుట్లు వేసినా.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ముడుపులకు కక్కుర్తి పడి కళ్లు మూసుకుని ఉండిపోయారు. నేతల ఒత్తిళ్లకు దాసోహమైపోయారు. అక్రమ లేఅవుట్లతో పచ్చనేతలు సొమ్ము చేసుకున్నారు. ఇష్టారీతిన విక్రయించేసి కొనుగోలుదారులను మోసగించారు. ఇందులో టీడీపీ కీలక నేతల హస్తం ఉంది. వారి ముసుగులో చోటా నాయకులు, ప్రజల్ని జలగల్లా పిండేసిన జన్మభూమి కమిటీ సభ్యులు రియల్ దందా చేశారు. గతంలో జరిగింది కాదా అని ప్రస్తుత అధికారులు చోద్యం చూస్తున్నారు. వాటికి సంబంధించి సరైన రికార్డుల్లేవని మౌనం దాల్చుతున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో విలీనం కాబోతున్న చాపురం సిద్ధిపేటలో జాతీయ రహదారికి ఆనుకుని అనధికారికంగా మూడు లేఅవుట్లు వెలిశాయి. ఆర్.పార్థసారథి అనే వ్యక్తి నుంచి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుని అల్లు నరసయ్య అనే ఆసామి లేఅవుట్ వేశారు. 193 (3), 194 (3), 195 (1)లో దాదాపు ఎకరా 15 సెంట్లలో లేఅవుట్ వేశారు. దాన్ని ప్లాట్లుగా విభజన చేసి విక్రయాలు జరిపేశారు. అలాగే ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తల్లి విజయమ్మ నుంచి రెడ్డి చిరంజీవి అనే టీడీపీ నేత కొనుగోలు చేసి, దాన్ని 14మందికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో లేఅవుట్ వేసి విక్రయాలు జరిపేశారు. దీనికి కూడా అనుమతుల్లేవు. ఇదే రెడ్డి చిరంజీవి మరో లేఅవుట్ కూడా అనుమతి లేకుండా వేశారు. ఇందులో విశేషమేమిటంటే ప్రభుత్వ భూములు కలిసి ఉన్నాయి. ముఖ్యంగా అల్లు నరసయ్య వేసిన లేఅవుట్లో జిరాయితీ చెరువు కూడా కలిసి ఉంది. వాస్తవానికి చెరువును కప్పే అధికారం ఎవరికీ లేదు. సాగునీటికి ఉపయోగించాల్సిన చెరువును చదును చేసి ప్లాట్లుగా వేసేశారు. దీనికి నాలా ఉందని చెప్పడమే తప్ప దానికి సంబంధించిన రికార్డుల్లేవు. ఇదంతా గతంలో జరిగిందని ప్రస్తుత అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకైతే చెరువు ఏదైనా కన్వర్షన్ చేసి, చదును చేసి లేఅవుట్లు వేయకూడదు. అప్పటి అ«ధికారులు ఎలా కన్వర్షన్ చేశారో వారికే తెలియాలి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న అనధికార లేఅవుట్లకు ఆనుకుని ప్రభుత్వ రస్తా కూడా కలిసి ఉంది. అధికారులు పట్టించుకోకపోతే వాటిని కూడా అమ్మేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, విక్రయాలు చేసేందుకు సిద్ధంగా చదును చేసి ఉంచారు. మొత్తానికి మూడు లేఅవుట్ల విలువ రూ.30 కోట్లు దాటి ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి లేఅవుట్ వేయాలంటే ముందు భూమిని కన్వర్షన్ చేసుకోవాలి. దానికి కొంత ఫీజు చెల్లించాలి. లేఅవుట్ అనుమతి తీసుకోవాలంటే 40 అడుగుల రోడ్లు వేయాలి. కాలువలు, బీటీ రోడ్లు వేయాలి. ఎకరా విస్తీర్ణం గల లేఅవుటైతే 10 శాతం భూమిని రిజర్వు చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. ఎకరం దాటితే 15 శాతం భూమిని రిజర్వు చేయాలి. చెప్పాలంటే ఓపెన్ సైట్‌గా చూపించాలి. అలాగే విద్యుత్ పోల్స్ వేసి ఉంచాలి. అలాగే డిస్ట్రిక్ టౌన్ కంట్లీ ప్లానింగ్ అధికారి (డీటీసీపీ)కి ఎకరాకు రూ.1000 ఫీజు చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్ కింద స్క్వేర్ మీటర్‌కి రూ.4 చొప్పున ఎకరాకు రూ.16,187 చెల్లించాలి. అదే విధంగా లేఅవుట్ ప్లాన్ అనుమతి కోసం స్క్వేర్ మీటర్‌కి రూ.4 చొప్పున ఎకరాకు రూ.16,187 చెల్లించాలి. ఇవన్నీ ప్రభుత్వానికి ఎగ్గొట్టి, అనుమతి లేకుండా లేఅవుట్లు వేసి, కొనుగోలుదారులను టీడీపీ నేతలు ముంచేశారు. ఒక్క ఫీజుల కిందనే ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు రావల్సి ఉంది. అలాగే రిజర్వు సైటు విలువ రూ.కోట్లలో ఉంటుంది. విక్రయాలకు వచ్చేసరికి చూస్తే రూ.30 కోట్లు దాటే అవకాశం ఉంది. చోద్యం చూస్తున్న అధికారులు.. ముడుపుల కారణంగా గత అధికారులు ఎలాగూ పట్టించుకోలేదు. అనుమతి లేని లేఅవుట్ అని తెలిసినా, ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందని కని్పస్తున్నా, చెరువును కప్పేసి లేఅవుట్ వేశారని స్పష్టమవుతున్నా ప్రస్తుత అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. అసలు జిరాయితీ చెరువుకు లేఅవుట్ వేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని అడిగితే అధికారుల వద్ద సమాధానం లేదు. ఇలాగే అధికారులు వదిలేసిన ఆ లేఅవుట్లకు ఆనుకుని చదును చేసి ఉన్న ప్రభుత్వ భూమిని మున్ముందు కన్పించకుండా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాక్షి పరిశోధనతో కదలిక ఇక్కడ జరిగిన అక్రమ దందాపై ‘సాక్షి’ రెండు రోజులుగా పరిశోధన చేసింది. ఆక్రమణలు, జిరాయితీ చెరువు కప్పేసిన వైనం అధికారుల వద్ద వివరణ తీసుకునేందుకు యతి్నంచింది. ఇంకేముంది రెవెన్యూ, సర్వే అధికారులు కదిలారు. గురువారం ఆ లేఅవుట్ వద్దకు వచ్చి కొలతలు వేసే కార్యక్రమం చేపట్టారు. అవి అనధికార లేఅవుట్లేనని తేల్చి చెప్పారు. కొంతే ఆక్రమణకు గురైందని తెలిపారు. మిగతా ప్రభుత్వ భూమి ఆక్రమణలో లేదని, పక్కనే ఉందని చెప్పుకొచ్చారు. నివేదిక కోరుతాను చాపురం పంచాయతీలో వెలిసిన లేఅవుట్లపై ఆరా తీస్తున్నాను. ఇప్పటికే అధికారులు పంపించి సర్వే చేయించాను. వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాను. జిరాయితీ చెరువుకు నాలా ఎలా ఇచ్చారో తెలుసుకుంటాను. తదుపరి ఏం చేయాలో చేస్తాను. అనధికార లేఅవుట్లపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. –ఐ.టి.కుమార్, తహశీల్దార్, శ్రీకాకుళం చెరువు గర్భం నాలాకు రికార్డుల్లేవు చాపురం సిద్ధిపేటలో పరిధిలో గల 60 సెంట్ల భూమికి సంబంధించి (చెరువు గర్భం)కు 2018లో నాలా కట్టినట్లు చెప్పుతున్నారే తప్ప దానికి సంబంధించిన రికార్డులు లేవు. ఈ భూములకు సంబంధించి కార్యాలయంలో పరిశీలించినా ఎటువంటి రికార్డులు దొరకలేదు. – ప్రకాశ్‌రావు, ఆర్ఐ, తహశీల్దార్ పంచాయతీ అప్రూవల్ లేదు.. చాపురం పరిధిలోని సిద్ధిపేటలో రియల్ ఎస్టేట్లుగా వెలసిన భూములకు సంబంధించిన పంచాయతీ అప్రూవల్ ఏమీ లేదు. ఒకవేళ రియల్ ఎస్టేట్‌గా వేయాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అక్కడ అటువంటి నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా రియల్ ఎస్టేట్లు వేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –అజయ్‌బాబు, చాపురం పంచాయతీ సెక్రటరీ -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
‘రియల్’ దగా
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ) పరిధిలోని రణస్థలం మండలం కోస్టలో టీడీపీ నేత వేసిన అక్రమ లేఅవుట్ ఇది. 18 ఎకరాల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్‌కు అనుమతుల్లేవు. కేవలం నాలా చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్లో ప్లాట్ల విక్రయాలు చేసేస్తున్నారు. వీఎంఆర్డీఎ పరిధిలోని ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ శివారు దుప్పలవలసలో వేసిన లేఅవుట్ ఇది. మొక్కలు, తుప్పలు మొలిచేసి ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ లేఅవుట్లో ప్లాట్ల విక్రయాలే కాక.. మారు అమ్మకాలు కూడా జరిగాయి. విశేషమేమిటంటే ఈ లేఅవుట్ స్థలం కనీసం కన్వర్షన్ కూడా జరగలేదు. కన్వర్షన్ ఫీజు చెల్లిం చి, నిబంధనల మేర ప్రభుత్వానికి వదిలేసి రెవెన్యూ అధికారుల అనుమతి మేరకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ అటువంటిదేమీ చేయకుండా అడ్డగోలుగా లేఅవుట్ వేసేసి విక్రయాలు జరిపేశారు. తాజాగా ఎచ్చెర్ల మండలంలో 12 అనధికార లేఅవుట్లను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా లేఅవుట్ వేయడంతో సుమారు రూ.26 కో ట్ల మేర అపరాధ రుసుము విధించారు. తాజాగా కంచిలి, పూండి, గరుడుభద్రలో అనధికారికంగా వేసిన లేఅవుట్ల వ్యవహారం కలెక్టర్ జె.నివాస్ దృష్టికి వచ్చింది. వీరి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ (డీటీసీపీఓ) తన బృందంతో కలిసి వాటిని పరిశీలించి చర్యలకు ఆదేశించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి అక్రమ లేఅవుట్లు లెక్కలేనన్ని వెలిశాయి. కానీ అధికారుల దృష్టికొచ్చినవి కేవలం 290 మాత్రమే. నోటీసులు జారీ చేసి, గట్టిగా ఒత్తిడి చేయడంతో వీటిలో 14 లేఅవుట్లకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. మిగతా వారు మొండికేశారు. అందమైన బ్రోచర్లతో ఆకట్టుకున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతమని మభ్యపెట్టారు. వీఎంఆర్డీఎ పరిధిలో ప్లాట్ అంటే ఆషామాషీ కాదని ఊహాల్లో ఊరేగించారు. లేఅవుట్లో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఉన్న పళంగా విలువ పెరిగిపోతుంది.. ప్లాట్ తీసుకుంటే సంవత్సరంలోనే రెట్టింపు అయిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇంకేముంది సొంతిల్లు కట్టుకుందామని... తమ పిల్లల కోసం స్థలం కొని పెట్టుకుందామని కలలు కన్న ఎంతోమంది రియల్టర్ల చేతిలో మోసపోయారు. అమ్మేసిన తర్వాత కొంతమంది రియల్టర్లు పత్తా లేకుండా పోయారు. క్రయవిక్రయాలు జరిగేంతవరకు చోద్యం చూసిన అధికారులు ఆలస్యంగా మేల్కొని నోటీసులు జారీ చేసే కార్యక్రమం చేపట్టారు. పొజిషన్లో ఉన్న కొనుగోలుదారులు బుక్ అయిపోయారు. లేఅవుట్ వేసినవాళ్లు ఎక్కడో ఉన్నారు. అమ్మకాలు జరిపేసి చేతులు దులుపుకున్నారు. కొందరైతే పలాయనం చిత్తగించారు. ప్రస్తుతానికైతే కొనుగోలు చేసినవాళ్లు స్థలాల్లో ఉన్నారు. అధికారులు నోటీసులిస్తే గాని తెలియలేదు అది అక్రమ లేఅవుట్ అని. నోటీసులందుకున్నాక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా జిల్లావ్యాప్తంగా అక్రమార్కుల చేతిలో నష్టపోయిన వారు ఉన్నారు. లేఅవుట్ వేసినోళ్లు స్థానికంగా లేకపోవడం... ఆ ప్లాట్లలో కొనుగోలుదారులుండటంతో అధికారికంగా పొజిషన్లో ఉన్న వారిపైనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రలోభాలో, ముడుపులో తెలియదు గాని అనుమతి లేకుండా లేఔట్లు వేసినప్పుడు అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొనుగోళ్లు అయిపోయేంతవరకు చోద్యం చూశారు. ఇప్పుడేమో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొనుగోలుదారులపై పడుతున్నారు. ఇదీ విధానం.. లేఅవుట్ వేయాలంటే ముందుగా డిస్ట్రిక్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) లేదా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ) అనుమతులు తీసుకోవాలి. అంతకుముందే లేఔట్ వేసే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. దీనికి రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. నిర్దేశిత రుసుం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలి. వ్యవసాయేతర భూమిగా మార్పు పొందాక డీటీసీపీ, వీఎంఆర్డీఎ నుంచి అనుమతి తీసుకోవాలి. లేఅవుట్ అనుమతి తీసుకునేముందు విస్తీర్ణంలో 10 శాతం కామన్‌సైట్ (సామాజిక స్థలం) కేటాయించాలి. విస్తీర్ణంలో 25 శాతం మేర రోడ్లు వేయాలి. వేసిన రోడ్లకు ఆనుకుని మొక్కలు నాటాలి. కాలువలు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీసీపీ లేదా వీఎంఆర్డీఎ అధికారులు లేఅవుట్ అనుమతిస్తారు. ఇవన్నీ చేస్తే గిట్టుబాటు కాదని, ఏదో ఒక కొర్రీ పెట్టి ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో అక్రమ రియల్టర్లు అనుమతులు తీసుకోకుండానే చాలా చోట్ల లేఅవుట్లు వేసేశారు. అధికారికంగా 276 అక్రమ లేఅవుట్లు.. జిల్లాలో 290 అక్రమ లేఅవుట్లు ఉన్నట్టు అటు డీటీసీపీ, వీఎంఆర్డీఎ అధికారులు, ఇటు పంచాయతీ, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి. లేఅవుట్ అనుమతి ఫీజుతోపాటు ఓపెన్ సైట్ కేటాయించకపోవడం వలన ప్రభుత్వ ఆదాయానికి రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని వీఎంఆర్డీఎ, డీటీసీపీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండగా, క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కొరవడ్డాయి. కేవలం 14 లేఅవుట్ యజమానులు మాత్రమే తర్వాత అనుమతులు తీసుకున్నారు. మిగతా 276 లేఅవుట్లకు సంబంధించి నేటికీ అనుమతుల్లేవు. ఇవి కేవలం అధికారికంగా గుర్తించినవి. ఇక అధికారుల దృష్టికి రానివెన్నో ఉన్నాయి. వాస్తవానికైతే, అనధికార లేఅవుట్లలో చాలా వరకు ప్లాట్లు అమ్ముడైపోయాయి. వాటిలో దాదాపు నిర్మాణాలు జరిగిపోయాయి. లేఅవుట్లు వేసినోళ్లు అందుబాటులో ఉండటం లేదు. వారెక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం కొనుగోలుదారులే అక్కడుంటున్నారు. ఇవి అనధికార లేఅవుట్లని, ప్రభుత్వానికి ఫీజు కట్టాలని పంచాయతీ సిబ్బంది అడుగుతుంటే.. తామెక్కడ కట్టగలమని, లేఅవుట్ వేసినోళ్లను అడగండని చెబుతున్నారు. దాంతో తమకు సంబంధం లేదని, కొనుగోలు చేసినప్పుడు సక్రమమా, అక్రమమా? అన్నది చూసుకోవాలని, ఎవరైతే అనుభవంలో ఉన్నారో వారే చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక నివాసితులు అందోళన చెందుతున్నారు. కొందరైతే అనుమతుల్లేవని ప్లాన్ అప్రూవల్ లభించక, లక్షలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టలేక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఎటువంటి అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు కావడంతో డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాల కల్పన విషయాన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్రమ లేఅవుట్లు.. శ్రీకాకుళం డివిజన్ 223 టెక్కలి డివిజన్ 20 పాలకొండ డివిజన్ 33 అక్రమ లేఅవుట్లపై డ్రైవ్ పెడతాం.. జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్లపై సంబంధిత శాఖలతో కలిసి డ్రైవ్ పెడతాం. ఇప్పటికే కొన్ని చోట్ల గుర్తించి చర్యలకు సూచించాను. ఎన్ఫోర్స్మెంట్ ఉన్న శాఖలతో లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. – పి.నాయుడు, డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి -
అక్రమ బ్లో అవుట్లు!
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. రియల్ రంగం జోరు మీద ఉండటంతో కొందరు రియల్టర్లు, బ్రోకర్లు తక్కువ ధరకు ప్లాట్ల పేరిట ప్రజలను మోసగిస్తున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే హైదరాబాద్ శివార్లతోపాటు జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి అమ్మేస్తున్నారు. చిన్నపాటి లొసుగులను సాకుగా చూపుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిజి్రస్టేషన్ అవుతున్న ప్లాట్లలో దాదాపు 85 శాతం అక్రమ లేఅవుట్లే కావడం గమనార్హం. నిబంధనలివి... - సాధారణంగా లేఅవుట్ ఏర్పాటుకు డీటీసీపీ, హెచ్ఎండీఏ తదితర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. పంచాయతీలకు లేఅవుట్ జారీ అధికారం లేదు. - పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ప్లేగ్రౌండ్స్ తదితర వాటికి పక్కాగా స్థలాలను కేటాయించాలి. - తారు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు సౌకర్యాన్ని ప్రతి ప్లాటుకు కల్పించాలి. - ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చుట్టూరా 10 కి.మీ మేర నిర్మాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. - ఈ జలాశయాల పరిరక్షణకు 111 జీఓను తెచ్చి కాలుష్య పరిశ్రమలను నిషేధించింది. - గృహ, ఇతర అవసరాలకు మాత్రం భూ విస్తీర్ణంలో 10 శాతం మాత్రమే వినియోగించుకునేలా షరతు విధించింది. అనుసంధానానికి అడ్డు... కొత్తగా ఏర్పాటు చేసే లే–అవుట్ల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. అనుమతి పొందిన లేఅవుట్లలోని స్థలాలనే రిజిస్ట్రేషన్ చేసేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ సబ్ రిజి్రస్టార్లకు లేఖ రాసినా రిజిస్ట్రేషన్లశాఖ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. అలాగే 111 జీవో క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిన పంచాయతీరాజ్, హెచ్ఎండీఏ విభాగాలు చోద్యం చూస్తుండగా, వాటర్‌బోర్డు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలో రోడ్డు, ఓ భవన నిర్మాణం ఉన్న ప్రాంతం ఓ కుంట అంటే నమ్ముతారా! కానీ ఇది నిజం.. శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటలో అక్రమంగా వెలిసిన వెంచర్ ఇది. ఇక్కడ జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం ఎలాంటి లే–అవుట్లు, నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రియల్టర్లు ఏకంగా కుంటలోనే ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. కుంట సమీపంలో ఉన్న చారిత్రక ఫిరంగి కాలువ కూడా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కి కనుమరుగైంది. ఈ జీఓ పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లోనూ ఇలాంటి అక్రమాలే కనిపిస్తాయి. -
అక్రమ లేఅవుట్లకు చెక్
సాక్షి, ఆదిలాబాద్: ఇన్నాళ్లు గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 మండలాల్లో 9 బృందాలుగా ఏర్పడి అనుమతిలేకుండా వేసిన లేఅవుట్లలోని హద్దురాళ్లను గురువారం తీసేయించారు. ఇలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనరాదని బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 130 అక్రమ లేఅవుట్లను గుర్తించగా.. డీటీసీపీ అనుమతులున్నవి కేవలం 6 మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లేఅవుట్లు అత్యధికంగా జిల్లా కేంద్రం పరిధిలో 90 వరకు ఉండగా, మిగతావి ఆయా మండలాల పరిధిలో ఉన్నాయి. కాగా ఆదిలాబాద్ మండలంలో మూడు అధికార బృందాలు ఈ లేఅవుట్లలోని హద్దురాళ్లను తొలగింపజేశారు. నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, జైనథ్, బేల మండలాల్లో ఒక్కో అధికార బృందం ఈ లేఅవుట్లలోని రాళ్లను తీసేయించింది. ఈ లేఅవుట్లు పట్టా భూముల్లో ఉండగా, ఆదిలాబాద్ మండలంలో 10 చోట్ల ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోనూ ఉండటం గమనార్హం. దీంతోపాటు మావల శివారు పరిధిలోని బడా రియల్ వ్యాపారుల భూముల జోలికి వెళ్లకుండా అధికారులు దూరంగా ఉన్నట్లు తెలిసింది. నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 అమలులో భాగంగా నిబంధలన ప్రకారం అనుమతి లేని లేఅవుట్లలో ఈ బండరాళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి కఠినమైన నియమ, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పంచాయతీల పరిధిలో అక్రమంగా లేఅవుట్లు వేసినా, పంచాయతీ పాలకవర్గాలు అనుమతులు జారీ చేసినా చర్యలు తీసుకుంటారు. ఇక నుంచి..ఇంతకాలం మున్సిపాలిటీల పరిధిలోనే ఈ లేఅవుట్లతోపాటు ప్రస్తుతం వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ఆయా మండల కేంద్రాలు, అక్కడక్కడ అంతర్రాష్ట్ర రహదారిని అనుకుని గ్రామ పంచాయతీల్లో కూడా వేసిన లేఅవుట్లకు సైతం చెక్ పడనుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం కఠినతరం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. దీంతో ‘పంచాయతీ’ల్లోనూ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది. కాగా గతంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ లేఅవుట్‌కు నిర్ణయించినదే అనుమతిగా పరిగణించబడేది. ఇప్పుడు గతంలో లాగా కాకుండా నూతన చట్టంలోని 113 సెక్షన్ ప్రకారం సాంకేతిక అనుమతి, అధికారి అనుమతి లేకుండా లేఅవుట్ చేయరాదని, ఒకవేళ మంజూరు చేస్తే ఈ చట్టం సెక్షన్ 268 కింద గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చని పేర్కొనబడింది. అనుమతులు తప్పనిసరి.. గ్రామ పంచాయతీల్లో అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాల కింద వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలకు, వ్యాపారాలకు, ఇతరత్ర వాటికి వినియోగించాలనుకుంటే వ్యవసాయ భూమి చట్టం కింద ముందుగా నాలా రుసుము చెల్లించాలి. భూమి మార్పిడి ఆర్డీవో నుంచి అనుమతులు పొందాలి. ఆ తర్వాతనే లేఅవుట్ ప్రతిపాదన దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో గ్రామ పంచాయతీకి అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను బాధ్యతగా గ్రామ పంచాయతీ వారు జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ అనుమతి జారీ చేసే ప్రాధికార సంస్థకు పంపించాలి. ఇలా వారం రోజుల వ్యవధి పడుతుంది. ఇందులో కమర్షియల్‌గా మార్చే భూమి రెండున్నర ఎకరాలైతే జిల్లా స్థాయిలో, ఐదు ఎకరాలలోపు అయితే రీజనల్ స్థాయి, ఆపైన అయితే రాష్ట్రస్థాయి ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి అనుమతులు పొందాలి. గడువులోపు గ్రామ పంచాయతీ ఏ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాలని నూతన చట్టంలో పేర్కొనబడింది. డీటీసీపీ ఆదేశాలు లేకుండా లేఅవుట్‌కు అనుమతులు ఇస్తే, పంచాయతీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. లేఅవుట్ ఆమోదం కోసం కనీస నిబంధనలు ఇలా.. ముందుగా నాలా అనుమతి తీసుకుని ఈ లేఅవుట్ వేయదలిచిన మొత్తం స్థలంలో కనీసం 10శా తం ఖాళీ స్థలాన్ని పాఠశాలతోపాటు గుడి, పార్కు, ఇతరత్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తప్పకుండా విడిచిపెట్టాలి. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇంతేకాకుండా ప్రజాప్రయోజనాల కోసం అంటే 40 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి, 33 అడుగుల వెడల్పుతో అంతర్గత రహదారులు, మురికికాలువలు, తదితర వాటికోసం మరో 15శాతం కేటాయించాలి. అప్పుడు లేవుట్‌కు అనుమతి లభిస్తుంది. లేఅవుట్ ఉంటేనే సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేస్తారు. నెలలోపు అనుమతులు.. ప్రతిపాదించిన భూమిని సర్వే చేసి, అప్పుడు డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ, రహదారులు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లేఅవుట్ నిర్వాహకులకు సూచిస్తుంది. లేఅవుట్ పరిధిలోని స్థలాలను, రహదారులను పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత జిల్లా టౌన్, కంట్రీప్లానింగ్(డీటీసీపీ) నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. అనుమతులు జారీ చేసి, ప్రతిపాదనలను నివేదికను రెవెన్యూ, గ్రామ పంచాయతీలకు పంపుతారు. దానిపై గ్రామ పంచాయతీ సమావేశం జరిపి, తీర్మానం చేసి ఆమోదించాలి. లేఅవుట్లో గ్రామ పంచాయతీకి, ప్రజాప్రయోజనాల కోసం కేటా యించిన మొత్తం 25శాతం స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే, చట్ట ప్రకారం లేఅవుట్ నిర్వాహకులు(భూయజమాని)పై కఠిన చర్యలు తీసుకుంటారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనద్దు అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దు. నియమ, నిబంధనలను పాటిస్తూ లేఅవుట్లకు డీటీసీపీ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. లేదంటే ఆ లేఅవుట్ చెల్లదు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో నిబంధల ప్రకారం అనుమతి లేని 4 లేఅవుట్లలో రాళ్లు తొలగింపజేశాం. ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూశాఖ నుంచి నాలా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మహేందర్‌కుమార్, బేల ఎంపీడీవో -
బరితెగించిన రియల్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రియల్టర్లు బరితెగించారు. నాలుగు నెలల వ్యవధిలో 18 వేల అక్రమ లే అవుట్లలోని నివేశన స్ధలాలను పప్పుబెల్లాల్లా అమ్మేశారు. ఎన్నికల ఏర్పాట్లలో ప్రభుత్వ సిబ్బంది తలమునకలై ఉండటాన్ని గమనించి తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు తెరతీశారు. ఈ అక్రమ లే అవుట్లతో ఒకవైపు కొనుగోలుదారులను మోసగించడంతోపాటు మరోవైపు భారీగా ప్రభుత్వాదాయానికి గండికొట్టారు. రియల్టర్లకు జైలుశిక్ష... అనధికార లే అవుట్లలోని నివేశన స్ధలాలను విక్రయించిన రియల్టర్లు, ఏజెంట్లకు మూడు సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని చట్టం చెబుతోంది. అయినా అధికార పార్టీ నేతల అండదండలతో రియల్టర్లు ఒక ఎకరానికి లే అవుట్ తీసుకుని ఐదారు ఎకరాల్లోని నాన్ లే అవుట్లలోని స్ధలాలను అమ్మేశారు. మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కొరత, గ్రామపంచాయతీ సిబ్బంది అవినీతి కారణంగా ఈ దందా ఇంకా కొనసాగుతోంది. బిపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) తరహాలోనే అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందనే ఉద్దేశంతో అనేకమంది కొనుగోలుదారులు ఈ నివేశన స్ధలాలను కొన్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం,తిరుపతి, విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో అనధికార లేఅవుట్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. విశాఖ, గుంటూరు, నెల్లూరు వంటి కార్పొరేషన్లలో సమీప గ్రామాలు కూడా విలీనం అవుతుండటంతో అక్కడి స్ధలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ విలీన గ్రామాల్లోని స్ధలాలకు సమీప కాలంలో మంచి డిమాండ్ రానుందని ఏజెంట్లు ప్రచారం చేసుకుని అమ్మకాలు చేశారు. రంగురంగుల బ్రోచర్లలో లే అవుట్ల అనుమతులకు సంబంధించిన సీఆర్డిఏ నెంబర్లు ఉదహరించి మరీ అమ్మకాలు సాగించారు. అయితే కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న లే అవుట్ల విస్తీర్ణానికి మించిన స్ధలాలను అమ్మి కొనుగోలుదారులను నిలువునా ముంచేశారు. ఎన్నికల సందడిలో.. ఆన్లైన్ విధానంలో లే అవుట్లకు అనుమతి ఇచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించింది. గతంలో పంచాయతీ పరిధిలో లే అవుట్ల అనుమతికి అక్కడి గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతి తప్పనిసరి. వారు సిఫారసు చేసిన తరువాత కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖలో ఆ లే అవుట్లకు అనుమతి మంజూరు చేసేది. ఈ విధానంలో గ్రామ పంచాయతీల సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. తమ పరిధిలో అనధికార లే అవుట్లు ఉంటే వాటి వివరాలను కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ శాఖకు పంచాయతీ సిబ్బంది సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత డిసెంబరు వరకు రాష్ట్రంలో అనధికార లే అవుట్ల సంఖ్య 2 వేలకు మించిలేదు. అయితే జనవరి నుంచి సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో అన్ని శాఖల సిబ్బంది నిమగ్నం కావడంతో రియల్టర్ల అక్రమాలపై దృష్టి పెట్టలేకపోయారు. తెలుగుదేశం నేతల అండ కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రియల్టర్ల వెంచర్లకు అక్కడి కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే అనుమతుల కంటే ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అనుమతి తప్పనిసరి. వారి నుంచి ఫోన్‌కాల్స్ వెళ్లిన తరువాతనే కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ శాఖ ఆ వెంచర్లకు అనుమతి ఇచ్చిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రియల్టర్ల నుంచి భారీ మొత్తాల్లో మామూళ్లు తీసుకుని లే అవుట్ల అనుమతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. దీనికితోడు వారే అనధికార లే అవుట్లలోని స్ధలాల అమ్మకాలను ప్రోత్సహించారు. దీంతో రియల్టర్లు ఎకరం పొలంలో లే అవుట్లకు అనుమతి తీసుకుని నాలుగైదు ఎకరాల్లోని అనధికార లే అవుట్ల స్ధలాలను విక్రయించారు. ఇలా దాదాపు 18 వేల లే అవుట్లలోని స్థలాలను విక్రయించేశారు. కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ శాఖ చేసిన సర్వేలో 16 వేలకుపైగా అనధికార లే అవుట్లు ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని ఆ విభాగం డైరెక్టర్ రాముడు ధ్రువీకరించారు. దాదాపు అన్ని పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోందని చెప్పారు. దాదాపు 1100 మంది సిబ్బంది కొరత తమ శాఖలో ఉందని, దీని కారణంగా అక్రమాలను నిలువరించలేని పరిస్ధితి ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి రియల్టర్ల దందా కారణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దాదాపు 18 వేల అనధికార లే అవుట్లలోని స్ధలాలన్నింటినీ క్రమబద్దీకరిస్తే కోట్లలోనే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపనున్నారు. వీటి క్రమబద్దీకరణతో ప్రభుత్వానికి ఆదాయంతోపాటు రియల్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయం ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నామని ప్లానింగ్ డైరెక్టర్ రాముడు తెలిపారు. -
అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ మరోవైపు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా హెచ్చరికబోర్డులను ఏర్పాటు చేస్తోంది. రోడ్లు, వీధిదీపాలు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా అడ్డగోలుగా వెలుస్తున్న వెంచర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించిన అనంతరం కూడా పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు పుట్టుకురావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీల నుంచి అనుమతి తీసుకోకుండా అభివృద్ధి చేస్తున్న వెంచర్లకు అడ్డుకట్ట వేస్తోంది. ఇందులో భాగంగా అనధికార లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లను నిషేధించింది. ఈ మేరకు అక్రమ లేఅవుట్ల జాబితాను స్థానిక రిజిస్ట్రార్లకు పంపిస్తోంది. తద్వారా గ్రామ పంచాయతీల అనుమతుల పేరిట ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న లేఅవుట్లకు బ్రేక్ పడుతుందని భావిస్తోంది. లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం పంచాయతీల పాలకవర్గాలకు లేనప్పటికీ, కారుచౌకగా లభిస్తుందనే ఆశతో అమాయక జనం స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే ప్లాట్లను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పదునుపెట్టిన సర్కారు గ్రామ పంచాయతీల్లో వెలిసే లేఅవుట్ల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. ప్లాట్ల వద్ద డిస్ప్లే బోర్డులు.. అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయ బ్రోచర్లతో ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లకు చెక్ పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికార, అనధికార లేఅవుట్లపై స్పష్టతనిస్తూ ‘సైట్’లో బోర్డులు ఏర్పాటు చేయనుంది. అప్రూవ్డ్ లేఅవుట్ అయితే హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఇచ్చిన ఎల్పీ నంబర్, సర్వే, విస్తీర్ణం పేర్కొంటూ డిస్ప్లే బోర్డులు పెట్టనుంది. అనుమతిలేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనుంది. మార్గదర్శకాలివే..! - పంచాయతీ కార్యదర్శి విధిగా తనఖా(మార్టిగేజ్) కింద ‘హెచ్ మార్కింగ్’చేసిన ప్లాట్లను గ్రామ పంచాయతీ పేరిట గిఫ్ట్‌డీడ్ చేయించాలి లేఅవుట్ డెవలపర్/ప్రమోటర్/యజమాని లేఅవుట్ అభివృద్ధి పనులను పంచాయతీ, మండల ఇంజనీర్ పర్యవేక్షణలో చేయాలి - భూమి చదును, రోడ్లు, ఇరువైపులా మురుగు కాల్వలను విధిగా నిర్మించాలి. వాననీరు ప్రవహించేలా కాల్వలు, కుంటలు, చెరువులకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి - 10 శాతం వదిలిన ఖాళీస్థలం చుట్టూ హద్దురాళ్లు పాతి కంచె వేయించాలి. ఈ పదిశాతం స్థలం గిఫ్ట్‌డీడ్ చేసిన అనంతరమే ఫైనల్ లేఅవుట్ అనుమతి విడుదల చేయాలి -
అక్రమ లేఅవుట్లపై సర్కార్ కొరడా
సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు చట్టాన్ని కఠినతరం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల శివార్లలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల వల్ల కోర్టు కేసులు, వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో చట్టంలో మార్పులు, చేర్పులు చేపట్టింది. గ్రామాల్లో అక్రమ లే అవుట్లకు, అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అంశాన్ని నూతన పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం చేర్చింది. సంబంధిత గ్రామాల పరిధిలో అప్పటికే ఏర్పడిన లే అవుట్ల జాబితాలను కూడా పంచాయతీలు సిద్ధం చేసి ప్రకటించాల్సి ఉంటుంది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టాక వెలిసే అక్రమ లే అవుట్లు, ఆక్రమణలు, నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది. తదనుగుణంగా అక్రమ లేఅవుట్లు, తదితరాలపై కచ్చితమైన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం పని సులువు కానుంది. నియంత్రణ చర్యలు.. వ్యవసాయ భూమిని సొంతదారు లేదా డెవలపర్ లేఅవుట్‌గా అభివృద్ధి చేసి భవనాల నిర్మాణం చేపట్టడానికి ముందే దీనికి సంబంధించి గ్రామపంచాయతీకి దరఖాస్తు(ఒక దరఖాస్తు ప్రతిని టెక్నికల్ శాంక్షన్ అథారిటీకి పంపించాలి) చేసుకోవాలి. వ్యవసాయేతర అవసరాల కోసం వ్యవసాయభూమిని మార్చుకున్నాకే ఈ దిశలో చర్యలు చేపట్టాలి. ఈ దరఖాస్తును సాంకేతిక మంజూరు కోసం ఏడురోజుల్లోగా టెక్నికల్ శాంక్షన్ కమిటీకి పంచాయతీ పంపించాలి. నిర్ణీత గడువులోగా ఇది జరగకపోతే శాంక్షన్ కమిటీకి ఈ ప్రతిపాదన ఫార్వర్డ్ అయినట్టుగా పరిగణిస్తారు. లేఅవుట్లో భాగంగా రోడ్ల ప్రణాళిక, మురుగుకాల్వలు, మంచినీరు, వీధిదీపాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ కమిటీ 30 రోజుల్లోగా భూమి సొంతదారు లేదా డెవలపర్‌కు తెలియజేస్తుంది. కామన్‌గా ఉండే స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీకి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. లే అవుట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అంశాలు పూర్తి చేసినట్టుగా సొంతదారు లేదా డెవలపర్ నుంచి లేఖ అందాక ప్రతిపాదిత లేఅవుట్‌ను శాంక్షన్ అథారిటీ పరిశీలిస్తుంది. అన్ని సరిగ్గా ఉంటే 30 రోజుల్లోగా తుది మంజూరునిస్తారు. నిబంధనలు పాటించకపోతే నెలరోజుల్లోగా సదరు దరఖాస్తును కమిటీ తిరస్కరిస్తుంది. ఈ మేరకు శాంక్షన్ అథారిటీæ నుంచి వర్తమానం అందాక వారం రోజుల్లోగా పంచాయతీ లేఅవుట్‌కు మంజూరునివ్వడమో లేదా దరఖాస్తు తిరస్కరిస్తున్నట్టు తెలియజేయడమో చేస్తుంది. శాంక్షన్ అథారిటీ అధికారి నిర్ణీత గడువులోగా మంజూరు చేయకపోతే అతడిపైనా క్రమశిక్షణా చర్య, జరిమానాతో పాటు పదోన్నతులు కల్పించకుండా చర్య తీసుకునే అవకాశాన్ని కొత్తచట్టంలో కల్పించారు. పంచాయతీ నుంచి మంజూరు లభించిన తేదీ నుంచి అన్ని లేఅవుట్లు రెండేళ్ల కాలపరిమితిలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆలోగా ఆ లే అవుట్‌ను పూర్తి చేయలేకపోతే అది రద్దవుతుంది. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు... కొత్తచట్టంలో భాగంగా పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కొత్త భవనాలు కట్టడం లేదా ఉన్న ఇంటికే మార్పు లు, చేర్పులు చేసేందుకు అవకాశం లేదు. మూడు వందల చదరపు మీటర్ల వరకు స్థలంలో పది మీటర్ల ఎత్తులో జీప్లస్ టు నివాస భవనాలకు మాత్రమే పంచాయతీ అనుమతినివ్వొచ్చు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా భవననిర్మాణ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి ఈ దరఖాస్తును పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చాకే ఈ మంజూరు ఇస్తారు. చెల్లుబాటయ్యే అన్ని పత్రాలు సమర్పించినా పంచాయతీలు వారంలోగా మంజూరు ఇవ్వడంలో విఫలమైతే భవననిర్మాణానికి అనుమతినిచ్చినట్టుగా భావించేలా చట్టంలో ఏర్పాటు చేశారు. జీ ప్లస్ టు పరిమితులకు మించి నిర్మించే భవనాలకు టెక్నికల్ శాంక్షన్ అథారిటీ అనుమతినివ్వాల్సి ఉంటుంది. అక్రమ లే అవుట్లుగా గుర్తించిన వాటిని క్రమబద్ధీకరించే అధికారం అథారిటీకి ఉంది. -
హెచ్ఎండీఏపై కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్ : అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)తో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై కాసుల వర్షం కురిసింది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు ఏకంగా రూ.928 కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రూ.695 కోట్లు, నాలాల ఫీజు రూపంలో రూ.233 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలో వచ్చి చేరాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ అయిన వారిలో మరో 18,500 మంది ఫీజు కట్టాల్సి ఉండటం, పరిశీలనలో ఉన్న వందల సంఖ్యలో దరఖాస్తులు క్లియర్ అయితే మరో రూ.150 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహకారంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ, ఆమోదం అంతా పారదర్శకంగా జరిగిందని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. మరో రూ.150 కోట్లు వచ్చే అవకాశం... హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్లో 20 శాతం అధిక రుసుముతో క్రమబద్ధీకరించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఇలా పాతవి, కొత్తవి కలిపి మొత్తం దరఖాస్తులు 1,75,612కు చేరాయి. టైటిల్ క్లియరెన్స్, టెక్నికల్ స్క్రూటిని, సైట్ ఇన్స్పెక్షన్, ఫైనల్ ప్రాసెసింగ్ ఇష్యూ... ఇలా నాలుగు దశల్లో లక్ష దరఖాస్తులను ఆమోదించారు. ప్రభుత్వ భూములు, సీలింగ్, శిఖం, మాస్టర్ ప్లాన్ రోడ్స్ తదితర స్థలాల్లో ఉన్నాయనే వివిధ కారణాలతో 75,612 దరఖాస్తులను తిరస్కరించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు సోమవారం చివరి రోజు కావడంతో చాలా మంది ఫీజు చెల్లించారు. అయితే హెచ్ఎండీఏకు మరో రూ.150 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పెంచే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
అక్రమంగా దోచేస్తున్నారు!
► లేఅవుట్‌కు ఏలాంటి అనుమతులు లేకుండానే అమ్మకాలు ► పాలకులతో కలిసి అధికారుల చేతివాటం? 15ఏటీపీసీ01ఏ– రాచానపల్లి వద్ద అనుమతి లేకుండా వెలసిన వెంచర్ 15ఏటీపీసీ01బీ– ఏలాంటి పంచాయతీ అనుమతి లేకుండానే రాచానపల్లి గ్రామం వద్ద ప్లాట్లు అమ్మకానికి కలవు అని బోర్డు పెట్టిన దృశ్యం అనంతపురం రూరల్: అనంతపురంలో అక్రమ లేఅవుట్ల అడ్డులేకుండా పోతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ అనంతపురం రూరల్ మండల పరిధి రాచానపల్లి పొలంలో బళ్లారి ప్రధాన రహదారి పక్కనే వున్న సర్వే నెంబర్ 5లో వెలిసింది. ఈ లేఅవుట్‌కు ఏలాంటి పంచాయతీ అనుమతి లేదు. అయితే ఏం? యాథేచ్చగా స్థలానికి పేరు పెట్టేసి స్థలాన్ని అమ్మకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై రాచానపల్లి పంచాయతీ కార్యదర్శి నాగక్రిష్ణయ్య వివరణ కోరగా ‘ల్యాండ్ స్కేప్ లేఅవట్’కు పంచాయతీ నుంచి ఏలాంటి అనుమతి తీసుకోలేదు.. క్రయ విక్రయాలు జరపకుండా నోటీసు బోర్డును వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. పాలకులతో కలిసి అధికారుల చేతివాటం?: పంచాయతీ అనుమతి ఖచ్చితంగా తీసుకుంటే లేఅవుట్ మొత్తం స్థలంలో 10శాతం స్థలాన్ని పంచాయతీ పేరిట ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు 10శాతం స్థలాన్ని ప్రజాప్రయోజనాల దృష్ట్య ప్రజల అవసరాల కోసం ఖాళీ స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కొందరు పంచాయతీ అధికారులు స్థానిక సర్పంచ్‌లతో కలిసి లేఅవుట్ల యజమానుల నుంచి బహిరంగంగా అందిన కాటికి దోచుకుంటున్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే బాగుందంటూ లేఅవుట్ యజమానులు సైతం వారి బాటలోనే పయనిస్తూ... పంచాయతీ అనుమతి ఉందంటూ బోర్డులను సైతం ఏర్పాటు చేసుకొని స్థలాలను అమ్మేసుకుంటూ సోమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి లేఅవుట్ల అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. పట్టించుకోని అధికారులు: అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా గతంలో 42లేఅవుట్లు అక్రమ లేవుట్లు ఉన్నట్లు ఉన్నతాధికారులు లెక్కలు తేల్చారు. వాటిలో నోటీసు బోర్డులను ఏర్పాటు చేసి పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టే పనులను చేయాలని స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేశారు. అయితే గతంలో లేఅవుట్ల యజమానులతో అధికారులు లాలూచి పడడంతో తూతూ మంత్రంగా వారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్ప పంచాయతీ అదాయం రాబట్టడంతో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో లేఅవుట్ల యజమానులు యధేచ్చగా స్థలాలను అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటు వెళ్లిపోతున్నారు. పంచాయతీ అనుమతి ఉందని గుడ్డిగా నమ్మి స్థలాలను కొనుగోలు చేసిన కొనుగోలు దారులు అనుమతి కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి స్థలం విలువలో 14శాతం అదనంగా చెల్లించి అనుమతి తీసుకుంటూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అక్రమ లేఅవుట్లలో నోటీసులు బోర్డులను ఏర్పాటు చేసి అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఈఓఆర్డీ లక్ష్మినరసింహా అన్నారు. -
‘హద్దు’లేని అక్రమాలు
– విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు – ‘పురం’లో పెచ్చుమీరుతున్న రియల్టర్లు – మున్సిపల్ చైర్పర్సన్ భర్త ప్లాట్ల విక్రయాలు – ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి హిందూపురం అర్బన్ : మున్సిపాల్టీ స్థలాలను పర్యవేక్షిస్తూ, అక్రమ లేఅవుట్లను అదుపు చేసి ఆదాయాన్ని పెంపునకు కృషి చేయాల్సిన పాలకులే అక్రమాలకు పాల్పడుతుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. రాజకీయ పలుకుబడితో రియల్టర్లు కూడా ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు వేసి, భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. హిందూపురం పట్టణంలోని నింకంపల్లి రోడ్డు పార్టు-1లో ఓ ప్రజాప్రతినిధి భర్త సుమారు 11.51 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారు. వాస్తవంగా ఈ భూములను వ్యవసాయ భూమి నుంచి వాణిజ్య భూములుగా మార్చుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ పొంది, విక్రయించాలి. అయితే ఇవేవీ లేకుండా డాక్యుమెంట్ నం.7036/2011పైకి సర్వే నంబరు 238/1లో 2.13 ఎకరాలు, 241/1లో 2.05, డాక్యుమెంట్ నంబర్ 196/బీ4,/2012లో 242/2లో 0.85సెంట్లు, 243/2లో 0.97సెంట్లు, 243/1బీలో 1.10 ఎకరాలు, 238/1ఏలో 1.26 ఎకరాలు, 243/1లో 2 ఎకరాలు, 238/1లో 1.21 ఎకరాలు మొత్తం 11.51 ఎకరాల్లో అక్రమంగా ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నారు. ఇందులో రోడ్లు, కాల్వలు, ఇతర అవసరాలకు స్థలాలు వదిలితే మొత్తం 240 ప్లాట్లు వేసుకోవచ్చు. అయితే సుమారు 284 ప్లాట్లు వేశారు. దీంతో భవిష్యత్తులో కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశమూ లేకపోలేదు. అలాగే పట్టణ నడిబొడ్డున çపులమతి రోడ్డు సమీపంలోని డీఆర్ కాలనీలో కూడా సర్వే నంబరు 482/1సీలో 2.94 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లతో ప్లాట్లు విక్రయాలు, అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్ల నంబర్లతో ఫ్లెక్సీలు : మున్సిపాల్టీ అనుమతి లేకుండా వెంచర్లు వేసిన సర్వే నంబర్లను బహిరంగంగా ఫ్లెక్సీల్లో వేసిన వాటికి మున్సిపాల్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందులో రెండు సర్వే నంబర్లు కనపరచలేదని మిగిలిన రియల్టర్లు విమర్శిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ కంటికి కనిపిస్తున్న వాటిని వదిలేసి ఇతరులను వేధిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అనుమతులు తీసుకోవాలి ఇలా.. - మున్సిపాల్టీ, పంచాయతీల నుంచి అప్రూవల్స్ పొంది, సెస్ చెల్లించాలి. - లేఅవుట్ వేసే స్థలంలో ప్రభుత్వానికి 20 శాతం సెస్ రూపంలో చెల్లించి, ముందుగా మున్సిపాల్టీ టౌన్‌ప్లానింగ్ అధికారులతో అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. - వ్యవసాయ భూములైతే ఆర్డీఓకు దరఖాçస్తు చేసుకొని, సెస్ మొత్తాన్ని చెల్లించి కమర్షియల్ ల్యాండ్‌గా మార్చుకోవాలి. - అనంతరం పంచాయతీ, మున్సిపాల్టీ అధికారులకు దరఖాస్తు చేసుకొని వెంచర్లో మధ్యలోగానీ లేదా చివరి భాగంలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం కొంత స్థలాన్ని కేటాయించి, మున్సిపాల్టీ పేరిట రిజిష్టర్ చేయాలి. - అలాగే రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు అవసరమైన నిర్దేశిత స్థలాలను వదిలేసి,ప్లాట్లు వేయాలి. - ఇన్ని చేస్తే భారీగా పన్ను చెల్లించడంతో పాటు ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని, కొద్ది స్థలాన్ని కూడా వదలకుండా రియల్టర్లు అక్రమ లేఅవుట్ల ద్వారా ప్లాట్లు విక్రయాలు చేస్తున్నారు. నోటీసులు జారీ చేశాం అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని భవనాలను గుర్తించి ఇప్పటికే ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఐదు భవనాలను కూల్చివేస్తున్నట్టు నోటీసులు కూడా జారీ చేశాం. త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటాం. - విశ్వనాథ్, కమిషనర్ -
‘ఎటు చూసినా అక్రమ లేఔట్లు’
కదిరి : 'కదిరి మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా అనుమతి లేకుండానే లేఔట్లు వేస్తున్నారు. ఈ విషయం అధికార పార్టీ నాయకులతో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతోంది. వారికి మామూళ్లు ముట్టజెప్పడంతో నోరుమెదపకుండా ఉన్నారు. మున్సిపల్ అధికారులే మున్సిపల్ ఆదాయానికి గండి కొడితే ఎలా?' అని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉట్టికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొందరు చదును చేసి ప్లాట్లుగా వేసి అమ్మడానికి సిద్ధం చేశారు. మాజీ మంత్రి బుధవారం విలేకరులను ఆ స్థలంలోకి తీసుకెళ్లి అక్కడ అనుమతి లేకుండా లేఔట్ల వేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ కనుసన్నల్లోనే అదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తానే స్వయంగా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, దీనిపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మున్సిపల్ రిజర్వ్ స్థలాలన్నీ కబ్జా అయిపోయాయని, కానీ అధికారుల్లో మాత్రం ఏమాత్రం చలనం లేదన్నారు. దీనిపై త్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
అక్రమ లే అవుట్లలో నిర్మాణాల కూల్చివేత
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. సీఓఆర్డీ యుగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాంపెల్లి గ్రామంలోని 15 అక్రమ లే అవుట్ల సరిహద్దు రాళ్లను తొలగించడంతో పాటు అక్రమ లే అవుట్ల ప్రహరీలను కూల్చివేశారు. అలాగే, దమ్మాయిగూడ, నాగారం, కీసర, అహ్మద్‌గూడ, చేర్యాలలోని అక్రమ లే అవుట్లపై కూడా రెండు రోజుల్లోపల చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ లే అవుట్లపై జాయింట్ కలెక్టర్ ఆమ్రపాల్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు చేపట్టారు. -
అక్రమ లేఔట్ల తొలగింపు
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో అక్రమ లేఔట్లను గురువారం అధికారులు తొలగించారు. అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను వికారాబాద్ డివిజన్ ఈవోఆర్డీ పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈవోఆర్డీ ఆధ్వర్యంలో అధికారులు బోర్డులను, హద్దు రాళ్లను తొలగించారు. అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రియల్టర్లను హెచ్చరించారు. -
అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు నో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతి లేకుండా వెలసిన లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సంస్థ పాలకవర్గం నిర్ణయించింది. అక్రమ లేఅవుట్లను నిరోధించడానికి రిజిస్ట్రేషన్ల నిలిపివేతే మార్గమని సమావేశం అభిప్రాయపడింది. భారత రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్-22ఏ కింద అక్రమ లేఅవుట్లను అడ్డుకొనేందుకు వాటిలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించాలని పాలకవర్గం మూకుమ్మడిగా నిర్ణయించింది. హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని కేంద్ర కార్యాలయంలో హెచ్ఎండీఏ 20వ పాలకవర్గ సమావేశం జరిగింది. అనుమతి (అప్రూవల్) ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేయాలనీ... లేదంటే నిలిపివేయాలన్న నిబంధనను పాటించాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించేలా ప్రభుత్వాన్ని కోరాలని పాలకవర్గం అభిప్రాయపడింది. ప్రధానంగా 1,000 చ.మీ. విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తుకు లోబడిన భవనాలకు అదీకూడా... హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన లేఅవుట్లోని ప్లాట్లకే అనుమతిచ్చే అధికారం గ్రామపంచాయతీలకు ఉంది. అయితే... ఆ నిబంధన లేవీ పాటించకుండా ఇష్టారీతిన అనుమతులిస్తుండటం వల్ల శివారు ప్రాంతాల్లో లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా రాకుండా పోతోందని సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు పాత తేదీలతో అనుమతులిస్తూ ప్రోత్సహిస్తున్నాయని, అందుకే గ్రామ, నగర పంచాయతీలకున్న అధికారాల (డెలిగేషన్ పవర్స్)ను పూర్తిగా రద్దుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపై పాలకవర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఉప్పల్ భగత్ రైతులకు వెయ్యి చ.గ. ప్లాట్ ఉప్పల్ భగత్‌లో రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారంగా (జీవో నం.36 ప్రకారం) ఎకరానికి 1,000 చ.గ. ప్లాట్‌ను అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే... ఇక్కడి గడ్డిభూముల్లో మధ్యలో అక్కడక్కడ బిట్స్‌గా మిగిలి ఉన్న 13.30 ఎకరాల భూమిని మొత్తం 61 మంది రైతుల నుంచి హెచ్ఎండీఏ సేకరించి మెగా లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఆయా రైతులకు కూడా ప్లాట్లు ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను హెచ్ఎండీఏకు ఇవ్వాలని, లేనిపక్షంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వాలని కోరుతూ సమావేశంలో పెట్టిన అంశానికి కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే సమావేశంలో ఐటీ బకాయిలపై లోతుగా చర్చ సాగింది. ట్యాక్స్ కన్సల్టెంట్‌గా ఆర్.సుబ్రహ్మణ్యం అండ్ కంపెనీకి చెందిన ఆర్.సుబ్బారావును, ఐటీ సెల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా ఎస్.లక్ష్మిని ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తూ కమిటీ నిర్ణయం తీసుకొంది. హెచ్ఎండీఏలో రివైజ్డ్ పే స్కేల్స్‌ను, రివైజ్డ్ పెన్షన్స్ అమలు చేసేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. పెన్షన్ ఫండ్ కింద ఎల్ఐసీకి చెల్లించాల్సిన రూ.16 కోట్లకు గాను ఒక వాయిదాలో రూ.4 కోట్లు చెల్లించారు, ఇక మిగిలిన రూ.12 కోట్లు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. సిటీ ఐటీఎస్, హెచ్ఆర్ఎం ప్రాజెక్టులకు ఓకే హెచ్‌జీసీఎల్ ఆధ్వర్యంలో రూ.162కోట్ల వ్యయంతో తలపెట్టిన సిటీ ఐటీఎస్ ప్రాజెక్టుకు, రూ.14.5 లక్షల వ్యయంతో తలపెట్టిన హెచ్ఆర్ఎం ప్రాజెక్టుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2013-14 యాన్యువల్ అకౌంట్స్‌ను, 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి ప్రతిపాదించిన రూ.304.37 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇందుకోసం వెచ్చించిన రూ.258 కోట్లు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. కిస్మత్పూర్ వద్ద ఈసీ నదిపై రూ.6.58 కోట్ల వ్యయంతో తలపెట్టిన వంతెన నిర్మాణానికి కమిటీ ఆమోద ముద్రవేసింది. హెచ్ఎండీఏ పెండింగ్ కేసుల (2,462 కేసులు) వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా లీగల్ అడ్వయిజర్‌ను నియమించాలని కమిటీ నిర్ణయించింది. -
అక్రమ లేఅవుట్లపై పంచ్
రంగారెడ్డి జిల్లాలో అక్రమార్కులకు చెక్ 900 ఎకరాల పంచాయతీ స్థలాల స్వాధీనం రాజధాని శివారు ప్రాంతాల్లో అధికారుల స్పెషల్ డ్రైవ్ 2,700 అక్రమ లేఅవుట్ల గుర్తింపు, కేసులు పెట్టాలని నిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంచాయతీ స్థలాలను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కొరడా విదిల్చింది. లేఅవుట్లు/వెంచర్లలో ఆక్రమణకు గురవుతున్న దాదాపు 900 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. రియల్టర్లతో చేతులు కలిపిన ఇంటిదొంగలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీంతో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములు పంచాయతీల పరిధిలోకి వెళ్లాయి. స్థిరాస్తి రంగం ఊపందుకోవడంతో జిల్లాలో అడ్డగోలుగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. నిబంధనల ప్రకా రం ప్రజా ప్రయోజనాల కోసం లేఅవుట్ విస్తీర్ణంలో పది శాతం స్థలం కేటాయించాలి. ఈ స్థలాన్ని స్థానిక పంచాయతీకి బదలాయించాలి. అయితే రియల్టర్లు ఈ స్థలాలను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు కూడా కుమ్మక్కుకావడంతో ఖాళీ స్థలాలన్నీ పరాధీనమయ్యాయి. కొన్నిచోట్ల హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కూడా అక్రమార్కులతో చేతులు కలపడం విశేషం. రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలో 17.36 ఎకరాల విస్తీర్ణంలోని ఒక వెంచర్‌కు అధికారికంగా అనుమతి మంజూరు చేసిన హుడా.. తాజాగా అదే వెంచర్‌లోని ఖాళీ స్థలంలో ప్లాట్ల విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 8,663.7 చదరపు గజాల జాగా అమ్మకానికి లైన్‌క్లియర్ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన పంచాయతీ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. అధికారుల స్పెషల్ డ్రైవ్ నగర శివార్లలోని 210 గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన లేఅవుట్లపై స్పెష ల్ డ్రైవ్ చేసిన అధికారులు.. వాటిలో 90 శాతం అనుమతుల్లేనివేనని తేల్చా రు. లేఅవుట్లు చేయాలంటే హెచ్ఎండీఏ, డీటీసీపీ(పట్టణ, గ్రామీణ ప్రణాళిక సంచాలకుడు) అనుమతి తప్పనిసరి. అయితే హెచ్ ఎండీఏ మార్గదర్శకాలను పాటించకుండా చాలామంది రియల్టర్లు అనధికార లేఅవుట్లకే మొగ్గు చూపుతున్నారు. నగర శివార్లలో దాదాపు 2,700 అక్రమ వెంచర్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించారు. అనుమతులు పొందిన 300 లేఅవుట్లలోనూ పంచాయతీలకు నిర్దేశించిన 10 శాతం స్థలాలు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 20 ఎకరాలను లేఅవుట్‌గా మార్చి విక్రయిం చేం దుకు చేసిన యత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఘట్కేసర్ మండలం మేడిపల్లి పంచాయతీ పరిధిలో పార్కు స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కార్యదర్శిపై వేటు వేశారు. కబ్జాదారుపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. ప్రజోపయోగాలకు కేటాయించిన పది శాతం స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డీపీవో పద్మజారాణి తెలిపారు. కబ్జాలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. -
‘రియల్’ మాయ..!
సామాన్యుడికి సొంతిల్లు కలగానే మారింది... లక్షల రూపాయలు పోసి కొన్న ప్లాటును దక్కించుకునేందుకు ఎన్నో పాట్లు పడాల్సి వస్తోంది... రియల్ వ్యాపారులు జనం ఆకాంక్షను పెట్టుబడిగా పెట్టి కోట్లు గడిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అనుమతి లేని వెంచర్లను తెరమీదకు తెస్తున్నారు... పంచ రంగుల కరపత్రాలతో ప్రచారం చేసి ప్రజలను మోసగిస్తున్నారు... ఆదిలోనే వీటిని నివారించాల్సిన రెవెన్యూ అధికారులు రియల్ మాయలో పడి కళ్లు మూసుకుంటున్నారు. ⇒ విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు ⇒ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి ⇒ మోసపోతున్న కొనుగోలుదారులు ⇒ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లభించని సమాచారం ⇒ పట్టించుకోని అధికారులు సంగారెడ్డి క్రైం: పచ్చని పంట పొలాలు కనుమరుగవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలను ఆనుకొని ఉన్న గ్రామాల చుట్టూ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, జోగిపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, గజ్వేల్, మెదక్, జహీరాబాద్, తూప్రాన్ తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. అనుమతులు ఉన్న వెన్ని?.. లేనివెన్నో అధికారులకే తెలియని పరిస్థితి. ఇవేవీ తెలి యని అమాయక జనం వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. లేఅవుట్ వేయాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ఇందుకు మార్కెట్ విలువలో పది శాతం డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాల్సి. కానీ జిల్లా లో వందల ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే లేఅవుట్లు వేయడంతో ప్రభుత్వం రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతుంది. అనుమతి పొందిన లేఅవుట్లో పది శాతం భూమిని సామాజిక అభివృద్ధి కోసం వదలాలి. అంటే పది ఎకరాల్లో లేఅవుట్ చేస్తే ఎకరాను వదిలేయాలి. ఇందుకు ససేమిరా అంటున్న రియల్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. లే అవుట్లలో మౌలిక వసతులు కల్పించే అంశాన్ని విస్మరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఉదాసీనత, మామూళ్ల మత్తు కారణంగానే అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇది ఆదాయ వనరుగా మారాయన్న విమర్శలున్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్‌ను వ్యవసాయేతర భూమిగా మార్చకుండా లేఅవుట్ చేస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలి. కానీ వారు అవినీతిపరులకే వత్తాసు పలుకుతున్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల తీర్మానం తర్వాత విస్తీర్ణం అనుసరించి జిల్లా టౌన్ ప్లానింగ్, రీజినల్ డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌కు పంపాలి. అన్నీ పకడ్బందీగా ఉంటేనే వారు అనుమతిస్తారు. కానీ ప్రతి దశలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. మామూళ్లు తగ్గినప్పుడే రెవెన్యూ అధికారులు అక్కడక్కడా దాడులు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏయే సర్వే నంబర్లలో ఎంత విస్తీర్ణంలో లేఅవుట్ వేశారన్న అధికారిక సమాచారాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. అనుమతి ఉన్న లే అవుట్లలోనే ప్లాట్లు చేయాలన్న నిబంధన గట్టిగా విధించాలి. ఇలా చేస్తేనే అక్రమాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. -
అక్రమ లేఔట్లపై చర్యలు
విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని పినతాడివాడ, పెదతాడివాడ గ్రామాల్లో ఏర్పాటైన అనధికార లేఔట్లపై విజిలెన్సు అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పది లేఔట్లు ఏర్పాటైనట్లు వారు బుధవారం గుర్తించారు. మొత్తం లేఔట్లలోని భూమిలో పది శాతం భూమి విలువ రూ.12 కోట్ల 4 లక్షలను వాటి యజమానుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేయాలని, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1.60 లక్షలు రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేశారు. దీంతో సదరు లేఔట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు, నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి రాజకుమారి తెలిపారు. అదే విధంగా జిల్లాలో 189 వరకు అక్రమంగా ఏర్పాటైన లేఔట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిపైనా నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.