అక్రమ లేఅవుట్లలో సరిహద్దు రాళ్లను తొలగిస్తున్న అధికారులు, సిబ్బంది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నగరంలో అంతర్భాగమైన చాపురం సిద్ధిపేటలో టీడీపీ నేతలు వేసిన అక్రమ లేఅవుట్లపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్జాగా అక్రమ లేఅవుట్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. సిద్ధిపేటలో అనుమతి లేకుండా వేసిన మూడు లేఅవుట్లలోని సరిహద్దు రాళ్లను తొలగించారు. అంతేకాకుండా జిరాయితీ చెరువు కప్పేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులపై కూడా ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను వెదుకుతున్నా రు. ఇక లేఅవుట్లలో కలిసి ఉన్న ప్రభుత్వ భూములను రానున్న రోజుల్లో పేదలకు ఇచ్చే ఉచిత ఇళ్ల స్థలాల కోసం వినియోగించేందుకు చర్యలు తీసు కుంటున్నారు. అక్కడ ఎటువంటి ఆక్రమణలు లేకుండా, అనుమతి లేని లేఅవుట్లు కనిపించకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి అజయ్‌బాబు ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లలో ఉన్న హద్దుల రాళ్లను తొలగించే పని చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment