action against
-
TG: ‘ముందు మాట’ వివాదం.. ఇద్దరు అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు. -
యూపీ సీఎం బాటలో ఎంపీ సీఎం.. నిందితుని ఇంటిపైకి బుల్డోజర్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర పాలనలో అనుసరిస్తున్న విధానాలను ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఫాలో చేస్తున్నారు. ఇందు తాజాగా ఒక ఉదాహరణ మన ముందుకొచ్చింది.మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో మైనర్ బాలిక హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటిపైకి ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్ దూసుకెళ్లింది. నిందితుని ఇంటిని బుల్డోజర్ సాయంతో పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఈ ఉదంతం బిర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోహ్ మేట్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన స్నేహితునితో కలిసి మేటీ గ్రామానికి చెందిన మైనర్ బాలికను హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక నర్సరీలో పడేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆ బాలిక అమ్మమ్మ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఒక బావిలో లభ్యమైంది. ఈ కేసులో ఆ బాలిక (మృతురాలు) కోర్టులో మే 17న సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, ఇంతలోనే హత్యకు గురయ్యింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనాభివృద్ధి మండలి నిందితులను ఉరితీయాలని, వారి ఇంటిని బుల్డోజర్తో కూల్చివేయాలని డిమాండ్ చేసింది.ఈ నేపధ్యంలో నిందితుని తండ్రి యశ్వంత్‌కు చెందిన ఇంటిని అధికారులు కూల్చివేశారని తహసీల్దార్ రాజు నామ్‌దేవ్ తెలిపారు. ఆ ఇంటిని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలికను వేధించడం, హత్య చేయడం లాంటి దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని నామ్‌దేవ్ తెలిపారు. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
ఎన్నికల శిక్షణకు డుమ్మా.. 70 మంది అధికారులపై చర్యలు!
ఎన్నికల శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గతంలోనే వెల్లడించించింది. అయితే దీనిని పెడచెవిన పెట్టిన కొందరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. ఈ ఉదంతం యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రిసైడింగ్, పోలింగ్ శిక్షణకు హాజరుకాని 70 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం నిర్వహించే ఈ శిక్షణ.. ఓటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ శిక్షణకు హాజరు తప్పనిసరి అని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశారు. ఈ శిక్షణ సమయంలో ఓటింగ్ రోజున తలెత్తే సమస్యల పరిష్కారానికి అనేక వ్యూహాలను తెలియజేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. -
రాహుల్ గాంధీపై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ సోమవారం(ఏప్రిల్ 1) ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని, ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేస్తోందని రాహుల్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం పూరీ మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు. ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపైనా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషులను పెట్టిందని ఆరోపించారు. రాహుల్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రస్తుత ఎన్నికల్లో అతడి ప్రచారంపై ఆంక్షలు విధించాలి’ అని పూరీ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ దేశానికి చేస్తున్నది మంచిది కాదు.. కేజ్రీవాల్ -
హోలీ రాకుండానే యువకుల హంగామా!
రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్‌రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది. కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 లక్షల 94 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్ ‘ఆ కారు నంబర్‌ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు. Water-Balloon Kalesh (On 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too on the street) pic.twitter.com/2rU5jLe4f6 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 19, 2024 -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్‌టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్‌ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్‌ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
‘పేటీఎం’ మీద చర్యలపై తగ్గేది లేదు..
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం కస్టమర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే తప్ప.. తాము పేటీఎంకి వ్యతిరేకమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ రంగానికి ఆర్బీఐ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉందని, పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని దాస్ తెలిపారు.‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీపీబీఎల్‌పై చర్యలు తీసుకున్నాం. కస్టమర్ల సందేహాల నివృత్తి కోసం ఈ వారంలోనే ఎఫ్ఏక్యూలను జారీ చేస్తాం‘ అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ భేటీలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలంటూ పీపీబీఎల్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. ఇవి ఫిబ్రవరి 29 తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే దాస్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితులపై సమీక్ష.. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 2024–25 మధ్యంతర బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెడుతున్న అంశాలను వివరించారు. ఆర్థిక రంగం నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనేది పేర్కొన్నారు. -
గాజాలో ఇజ్రాయెల్ దాడులు అంతకు మించి: చైనా
బీజింగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం పెద్ద యుద్ధంగా పరిణామం చెందకుండా చైనా సహకారాన్ని కోరుతూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజే చైనా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడ్డాయి. "పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ఎవరూ ఎటువంటి చర్య తీసుకోకూడదు. వీలైనంత త్వరగా చర్చల దిశగా అడుగులు వేయాలి." అని వాంగ్ యి సౌదీ విదేశాంగ మంత్రితో ఈ మేరకు మాట్లాడారు. కాగా.. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని ముగించడానికి, కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం పశ్చిమాసియాను సందర్శించనున్నారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి తన పాత్రను పోషించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య ముగియడానికి ఏకైక మార్గం ఇరుదేశాలు చర్చలను ప్రారంభించడమేనని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలో సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం టూ- స్టేట్ ఫార్ములాగా పేర్కొన్న చైనా.. పాలస్తీనా స్వతంత్రానికి పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చైనా స్పందన సరిగా లేదని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా ప్రకటన అసత్యంగా ఉందని ఆరోపించింది. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచించకుండా ప్రకటన వెలువరించిందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు -
20 మంది IAS, IPS, నాన్ కేడర్ ఎస్పీలపై EC వేటు
-
కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్‌ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్‌ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్‌ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్‌లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ..
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ వెహికిల్స్ ఓనర్ అసోసియేషన్ బెంగళూరులో బందుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీంకు వ్యతిరేకంగా ఈ బందుకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్‌ను కొనసాగిస్తామని వెల్లడించింది. మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్స్ ఈ బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. The Federation of Karnataka State Private Transport Association had placed 28 demands in front of the #Karnataka government. With no consensus between the two parties, more than 10,000 members will gather for a protest march to Freedom Park in #Bengaluru.https://t.co/dw8rGmm4su — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 బంద్‌కు కారణం.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శక్తి స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని బెంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విన్నవించారు. ప్రధాన డిమాండ్.. బంద్ అమలుతో బెంగళూరులో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులో లేవు. శక్తీ స్కీంను ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలనేది యూనియన్ల డిమాండ్లలో ప్రధానమైనది. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని యూనియన్లు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండనున్నాయి. Members 32 unions part of the Federation of Karnataka State Private Transport Association protest at Freedom Park in #Bengaluru demanding a ban on bike taxis. Around 7 lakh vehicles operated by private persons or companies will stay off the roads on Sept 11 📹: @photomurali1 pic.twitter.com/LOmi0awTLL — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 ప్రభుత్వం చర్యలు.. బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో వీలైనన్ని అధిక బస్సులను నడుపుతున్నామని రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 500 అధిక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ.. -
వ్యక్తిగత డేటా సేఫ్‌గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్‌మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్‌కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్‌లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్‌లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్‌ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్‌ని అప్డేట్ మోడ్‌లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్‌ను చెక్ చేయాలి మీ యాప్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్‌తో యాక్షన్ సల్మాన్ ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్‌పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్‌లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..
భోపాల్: యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రభుత్వం స్బందించింది. వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు. #WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla's illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023 నిందితుని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్ డోజర్‌తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు. ఇదీ చదవండి: Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం -
రూ.100 కోట్ల స్కాం: నలుగురు కాదు ఆరుగురు ఉద్యోగులపై టీసీఎస్ చర్యలు
ముంబై: కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలతో కుమ్మక్కై, వాటికి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించినందుకు గాను ఆరుగురు ఉద్యోగులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చర్యలు తీసుకుంది. నైతిక నియమావళిని పాటించలేదని విచారణలో తేలడంతో ఆరుగురు ఉద్యోగులను, అలాగే ఆరు సంస్థలను నిషేధించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపైనా సంస్థ విచారణ జరుపుతోందని ఆయన షేర్హోల్డర్లకు వెల్లడించారు. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) కొందరు ఉద్యోగుల తప్పుడు ప్రవర్తన గురించి ఇద్దరు ప్రజావేగుల నుంచి కంపెనీకి ఫిర్యాదులు రావడం, టీసీఎస్‌లో ఉద్యోగాలకు లంచాలు తీసుకుంటున్నారని.. తత్సంబంధ వ్యక్తులు ఈ రకంగా కనీసం రూ. 100 కోట్లు సంపాదించారని ఇటీవల మీడియాలో వార్తలు రావడం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, సంపన్న దేశాల్లో అనిశ్చితితో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, అయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
మరోసారి గొడవ పడిన కోహ్లి, గంబీర్
-
గెహ్లాట్‌పై చర్యలకు శశిథరూర్ డిమాండ్
భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా గెహ్లాట్ తన ట్విటర్లో ఈమధ్య ఓ వీడియో సందేశం ఉంచారు. ఈ క్రమంలో ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థులు ఎవరైనా సరే..అంటూ మొదలుపెట్టి గెహ్లాట్ ప్రసంగం కొనసాగింది. ‘‘ఖర్గే పార్టీ నేతలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రతిపక్ష నేతలతోనూ చర్చించగల సామర్థ్యం ఉంది. కాబట్టి, పార్టీ ప్రతినిధులంతా ఆయన్ని ఘనమైన మెజార్జీతో గెలిపించాలి’’ అని గెహ్లాట్ సదరు వీడియో సందేశంలో కోరారు. ఈ పరిణామంపై గురువారం భోపాల్(మధ్యప్రదేశ్) పార్టీ కార్యాలయంలో శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పార్టీ ఆఫీస్ బేరర్గానీ, ముఖ్యమంత్రిగానీ, పీసీసీ చీఫ్‌లు గానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడంగానీ, మద్దతు తెలపడం లాంటి పనులు గానీ చేయకూడదు. मैं उम्मीद करता हूं जो भी डेलीगेट हैं वो भारी बहुमत से श्री मल्लिकार्जुन खड़गे को कामयाब करेंगे।कामयाब होने के बाद में वो हम सबका मार्गदर्शन करेंगे व कांग्रेस मजबूत होकर प्रतिपक्ष के रूप में उभर कर सामने आएगी।यह मेरी सोच है, मेरी शुभकामनाएं है खड़गे साहब भारी मतों से कामयाब हों। pic.twitter.com/OQ4Nk8zFKa — Ashok Gehlot (@ashokgehlot51) October 13, 2022 అలాంటిది గెహ్లాట్ బహిరంగంగా ఖర్గేకు మద్దతు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పక్షపాతం ప్రదర్శించకుండా దర్యాప్తు చేయాలి. అలాగే గెహ్లాట్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’’ అని థరూర్ పేర్కొన్నారు. చాలా చోట్లా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, బడా నేతలు మల్లికార్జున ఖర్గేకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ కార్యక్రమాలకు కార్యకర్తలను రమ్మంటూ పిలుస్తున్నారు. ఆయనతో కూర్చుని.. చాలాసేపు చర్చిస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది ఎందుకనో జరగడం లేదు అంటూ థరూర్ ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండి.. అంటే అక్టోబర్ 17 సోమవారం జరగనున్నాయి. మరోవైపు పార్టీ హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్ నేత మనీశ్ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం. ఇదీ చదవండి: చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు! -
గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం
వైరల్: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా.. అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు. It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8 — Surender Mehra IFS (@surenmehra) September 2, 2022 చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో.. Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ సీఈవో థామస్ లారెస్స్ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ శాఖ మంత్రిణేకే ససీంద్రన్ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో -
కొరడా ఝుళిపించిన కలెక్టర్.. డీపీఆర్‌ఓపై చర్యలు
సాక్షి, యాదాద్రి(నల్లగొండ): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి పద్మపై కలెక్టర్ పమేలా కొరడా ఝుళిపించారు. హెచ్చరిస్తున్నా అలసత్వం వీడకపోవడంతో గురువారం ఆమెను సమాచార శాఖ (ఐఆండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ బాధ్యతలు తీసుకున్న తొలిరోజునుంచే సీరియస్‌గా దృష్టి సారించారు. వారం రోజులు గడుస్తున్నా కొందరిలో మార్పు రాకపోవడాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా డీపీఆర్‌ఓపై తొలి వేటు వేశారు. జిల్లా యంత్రాంగంలో దడ జిల్లాలో పని చేస్తున్న ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల వరకు చాలామంది స్థానికంగా నివాసం ఉండ డం లేదు. ఇతర జిల్లాల నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. కలెక్టర్ బాధ్యతలు చేపట్టాగానే ఈ విషయంపై దృష్టి సారించారు. తొలిరోజే అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే స్థానికంగా నివాసం ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, నాల్గో తరగతి ఉద్యోగుల్లో స్థానికంగా నివాసం ఉండనివారి వివరాలనుసేకరించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చిపోతున్న అధికా రులను గుర్తించారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలస్థాయి అధికారులు, సిబ్బంది సమయపాల న పాటించకుండా రాకపోకలు సాగించడం, ప్రజల కు అందుబాటులో ఉండకపోవడంతో చక్కదిద్దాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 12గంటల వరకు విధులకు హాజరుకాకపోవడం, మధ్యాహ్నం 3 కాగానే వెళ్లిపోయే వారందరి వివరాలను సేకరించినట్లు తెలిసింది. మరికొందరిపైనా వేటు పడనుందా? డీపీఆర్ఓను సరెండర్ చేయడం ద్వారా నిర్లక్ష్యం వహించే ఉద్యోగుల విషయంలో తన వైఖరి ఏమిటో కలెక్టర్ చెప్పకనేచెప్పారు. ఇప్పటికే సుమారు ఐదుగురి వివరాలను సేకరించి వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, స్థానికంగా ఉండకపోవడం, సమాచారం లేకుండా జిల్లాను విడిచివెళ్తున్న వారిపై నిఘా ఉంచారు. వర్షాకాలం కావడంతో వరదలు వచ్చిన సమయంలో అధికారులు స్థానికంగా లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆమె ఇప్పటికే సమావేశంలో వివరించారు. దీంతోపాటు పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల్లో మొక్కుబడిగా కాకుండా పక్కాగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మార్పురానివారు ఎంత టి వ్యక్తులైనా సరే చర్యలు తప్పవని.. డీపీఆర్ఓ అ టాచ్తో చెప్పకనే చెప్పిందని అధికార వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. నిర్లక్ష్యానికి మూల్యం! సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటన, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పనుల పరి శీలన, వాసాలమర్రిలో గ్రామసభ, సహపంక్తి భోజనం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఉండగా డీపీఆర్ఓ అందుబాటులో లేకుండాపోయారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కలెక్టర్ నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే మూడు రోజులు సెలవుపై వెళ్లారు. తన సి బ్బంది ద్వారా కలెక్టర్ చాంబర్లో విధులు నిర్వహించే ఉద్యోగికి సెలవు పత్రం అందజేసి వెళ్లారు. చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి పర్యటనకోసం వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నా సమాచార శాఖ పరంగా నిర్వర్తించాల్సిన విధులను నిర్లక్ష్యం చేశారని కలెక్టర్ ఆగ్రహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గురువారం విధులకు హాజరైన డీపీఆర్ఓ పద్మకు.. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సిబ్బంది అందజేశారు. దీంతో ఆమె తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. -
మా ఆయన్ని విలన్‌గా భలే చూపిస్తున్నారు: షకీబ్ భార్య
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ అల్ హసన్ వ్యవహార శైలి విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. వికెట్లు తన్ని, పీకిపాడేసిన ఘటనలపై షకీబ్ క్షమాపణలు కూడా చెప్పాడు. ఇది జరిగి కొద్ది గంటలు కూడా గడవకముందే షకీబ్ భార్య ఉమ్మె అల్ హసన్ మరోలా స్పందించింది. ఈ వ్యవహారంలో నా భర్తను విలన్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మీడియాతో పాటే నేనూ ఆ కథనాల్ని ఎంజాయ్ చేశా. కేవలం ఆయన కోపాన్నే చూపించారే తప్ప.. అసలు విషయాన్ని మీడియా కప్పిపెట్టే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో అంపైర్లు అలా ఎలా నిర్ణయం ప్రకటిస్తారు? ఈ వ్యవహారంలో అంపైర్ల తీరుపైనా నాకు అనుమానాలున్నాయి. అయితే ఇంత వ్యతిరేకత ప్రచారంలోనూ నా భర్తకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లకు థ్యాంక్స్ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్చేసిందామె. కాగా, డీపీఎల్ టోర్నీలో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్, అబహాని లిమిటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముష్పికర్ రహీం ప్యాడ్‌కు బంతి తగిలాక అవుట్ అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ స్పందించకపోవడంతో వికెట్లను కాలితో తన్నేశాడు. ఆ తర్వాత ఏకంగా వికెట్లనే పెకిలించాడు. అయితే వివాదాలు 34 ఏళ్ల షకీబ్‌కు కొత్తేం కాదు. ఇదే డీపీఎల్ టోర్నీ టైంలో బయో బబుల్ ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసి విమర్శల పాలయ్యాడు. చదవండి: అవసరమా ఇలాంటి ప్లేయర్స్ చదవండి: షకీబ్‌కు ఊరట -
రంగంలోకి బ్యాంకులు : చిక్కుల్లో అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మరోఎదురు దెబ్బ తగిలింది. 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలపై మూడు చైనా బ్యాంకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా బ్యాంకులు ఇప్పుడు అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను వివరాలను అంచనా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి. తమకు రావాల్సిన రుణ బకాయిలకోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్నిమార్గాలను ఉపయోగించుకుంటామని ప్రకటించాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు తప్పవని భావిస్తున్నారు. (కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ) అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అంబానీ పర్సనల్ గ్యారంటీతో, చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. కానీ దివాలాతీసిన ఆర్‌కామ్ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించగా, చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22 న కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే తన దగ్గర చిల్లిగవ్వలేదనీ, బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. కోర్టు ఫీజుల కోసం తనభార్య నగలు అమ్మి, అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నానంటూ తాజాగా వాదించిన సంగతి తెలిసిందే. అయితే అంబానీ వాదనతో విబేధిస్తున్న బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. -
సాక్షి ఎఫెక్ట్: అక్రమ లేఅవుట్లపై కొరడా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నగరంలో అంతర్భాగమైన చాపురం సిద్ధిపేటలో టీడీపీ నేతలు వేసిన అక్రమ లేఅవుట్లపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్జాగా అక్రమ లేఅవుట్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. సిద్ధిపేటలో అనుమతి లేకుండా వేసిన మూడు లేఅవుట్లలోని సరిహద్దు రాళ్లను తొలగించారు. అంతేకాకుండా జిరాయితీ చెరువు కప్పేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులపై కూడా ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను వెదుకుతున్నా రు. ఇక లేఅవుట్లలో కలిసి ఉన్న ప్రభుత్వ భూములను రానున్న రోజుల్లో పేదలకు ఇచ్చే ఉచిత ఇళ్ల స్థలాల కోసం వినియోగించేందుకు చర్యలు తీసు కుంటున్నారు. అక్కడ ఎటువంటి ఆక్రమణలు లేకుండా, అనుమతి లేని లేఅవుట్లు కనిపించకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి అజయ్‌బాబు ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లలో ఉన్న హద్దుల రాళ్లను తొలగించే పని చేపట్టారు. -
ఎర్రచందనంతో దొరికితే కఠిన చర్యలు
♦ బెయిల్ కూడా దొరకడం కష్టం ♦ ఎర్రచందనం కేసు విచారణకు ప్రత్యేక కోర్టులు ♦ సాక్షితో ఓఎస్డీ సత్య ఏసుబాబు సాక్షి,కడప: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ బి.సత్య ఏసుబాబు హెచ్చరించారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రత్యేకంగా 1967 చట్టంలో కొన్ని సవరణలు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బెయిల్ ఇచ్చేందుకు కూడా వీలు లేదని.. ఒకవేళ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైన పక్షంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు కానీ, బెయిల్ పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చట్టాన్ని కఠినతరం చేశారన్నారు. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశంతోపాటు ఎక్కువ శాతం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారికి శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అక్రమంగా తరలించినా, ఎర్రచందనం దుంగలు కొట్టివేస్తున్నా పదేళ్ల శిక్షతోపాటు రూ.10లక్షలు జరిమానా విధించేలా చట్టం వచ్చిందన్నారు. మొదటిసారి తరలిస్తూ దొరికితే 5ఏళ్ల శిక్షతోపాటు రూ.3లక్షల జరిమానా, రెండవ సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారని ఆయన వివరించారు. ఎవరైనా వాహనంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు యజమానిపై కూడా కేసు పెడతామని హెచ్చరించారు.