న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ సోమవారం(ఏప్రిల్ 1) ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని, ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేస్తోందని రాహుల్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
అనంతరం పూరీ మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు. ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపైనా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషులను పెట్టిందని ఆరోపించారు. రాహుల్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రస్తుత ఎన్నికల్లో అతడి ప్రచారంపై ఆంక్షలు విధించాలి’ అని పూరీ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. ప్రధాని మోదీ దేశానికి చేస్తున్నది మంచిది కాదు.. కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment