![YSRCP Complaint To EC On IBV, RP Thakur](/styles/webp/s3/article_images/2024/05/13/YSRCP_Complaint_ABV_RP_IPS.jpg.webp?itok=ecitVjYe)
గుంటూరు, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్‌లపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులో పేర్కొంది.
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్‌లు టీడీపీ ఆఫీస్ వేదికగా అధికారుల్ని బెదిరిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని జిల్లా పోలీస్ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఫిర్యాదులో వైఎస్సార్‌సీపీ ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment