
సాక్షి, అనంతపురం: చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ? అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం నమ్మక ద్రోహమే అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్సార్,వైఎస్ జగన్ పకడ్బందీగా అమలు చేశారు
వైఎస్ జగన్ లక్షలాది మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించారు. రూ. 3900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడం చంద్రబాబు అసమర్థతే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైనా మెగా డీఎస్సీ ఎందుకు ఇవ్వలేదు?.నిరుద్యోగ భృతి ఎక్కడ చంద్రబాబు’అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment