Yuvatha Poru
-
పల్నాడు జిల్లా ఈపూరులో YSRCP నేత కొండ వర్ణి నాగేశ్వరరావు అరెస్ట్
-
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?
విశాఖపట్నం, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ ఇప్పటిదాకా కాలేదు. జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్ అన్నారు. -
పోలీసుల దౌర్జన్యం.. యువత పోరు సక్సెస్
-
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు
-
YSRCP 'యువత పోరు' విజయవంతం: YS జగన్
-
Lella Appi Reddy: యువత పోరు విజయవంతం
-
యువత పోరు విజయవంతం.. ‘కూటమి’పై తిరుగుబాటు మొదలైంది
సాక్షి, తాడేపల్లి: విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువత పోరు' విజయవంతం అయ్యిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్ళు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కార్ గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన 15 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతోంది. అందుకే వైఎస్సార్సీపీ పక్షాన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా వైఎస్ జగన్ పాలన, పార్టీ విధానాలతో ఏకీభవించి ఎంతోమంది మేధావులు మాకు అండగా నిలుస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటం చేస్తున్నాం.ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ విద్యార్థులు యువత సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వంపైన పోరాటానికి ముందడుగేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా యువత తరలిరావడం చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలికూటమి పార్టీలు మేనిఫెస్టోలో చేర్చిన హామీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను ప్రభుత్వం గాలికొదిలేసింది. పేదరికంతో విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యాదీవెన, వసతి దీవెనకు గాను గతేడాదికి సంబంధించి రూ. 3,200 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మరో రూ. 3,900 కోట్లు చెల్లించాలి. మొత్తంగా రూ. 7,100 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం రూ. 2,644 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ. 3 వేలు చెల్లిస్తామని చెప్పి యువత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాది బడ్జెట్లో సైతం పథకం ఊసెత్తలేదు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారుగత ప్రభుత్వంలో పేదవారికి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన వైఎస్ జగన్, ఐదేళ్లలోనే 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ఇచ్చారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటుండగా వాటిని పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో పక్కన పెట్టారు. కేంద్రం సీట్లు ఇస్తామని ముందుకొస్తే వద్దని ఐఎంఏకి లేఖలు రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఆ విధంగా మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థులను కలను చంద్రబాబు నాశనం చేశాడు. కమీషన్ల కోసం కార్పొరేట్లకు మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసే కార్యక్రమానికి తెరలేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు 9 నెలలకే ప్రజా స్పందన ఈ స్థాయిలో ఉందంటే, హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత ఏ స్థాయికి పెరుగుతుందో కూటమి నాయకులే అంచనా వేసుకోవాలి. ఇప్పటికే వైఎస్సార్సీపీ తరఫున రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమం చేశాం. ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పేదల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశాం. సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం భయపడిపోతోంది. నిరసన కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు.వారం రోజుల నుంచే నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులను అనుమతి కోరుతున్నా ఇవ్వకుండా కాలయాపన చేశారు. అడుగడుగునా నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని నిర్బంధాలను దాటుకుని ఈ రోజున యువత పోరు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా హామీల అమలుపై దృష్టిసారించాలి. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్‌కి పేరొస్తుందనే ఆలోచన వీడాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలి. తక్షణం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్‌తో టైం పాస్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విద్యార్థులు, యువత పక్షాన నిలబడి వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. -
చంద్రబాబు ప్రభుత్వంపై YSRCP నేతల ఆగ్రహం
-
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025 -
YSRCP Yuvatha Poru : కూటమి సర్కార్‌పై జనాగ్రహం..
-
కూటమి సర్కార్‌పై జనాగ్రహం.. వైఎస్సార్సీపీ యువత పోరు (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ యువత పోరును అడ్డుకుంటున్న పోలీసులు
-
కూటమిపై వైస్సార్సీపీ సమరభేరి.. గులాబీ బాస్ ఈజ్ బ్యాక్
-
ఇదేం సంస్కృతి.. పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా?: బొత్స ఆగ్రహం
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి.. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్‌ను ప్రయోగించే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. సభలో వారి కోసం ఆందోళన చేశాం. తొమ్మిది నెలలైనా రియింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?. మా హయాంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, మా హయాంలో ఎక్కడా బకాయిలు లేవు. దమ్ముంటే.. ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అది ఏది?. పోని ఎప్పుడిస్తారో అదైనా చెప్పండి?. జాబ్ కాలండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. మెగా డీఎస్సీ అన్నారు.. అదీ ఇవ్వలేదు. మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ హయాంలో మేం శాశ్వత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. అలాంటి మేం ఇప్పుడు విద్యార్థులు, యువత కోసం నినదిస్తే.. మా మీదే మార్షల్స్ ని ప్రయోగిస్తారా?. ఇదేం సంస్కృతి అని మండిపడ్డారాయన. అంతకు ముందు.. మండలి ప్రారంభానికి ముందు నిరుద్యోగ భృతి విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, చైర్మన్ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి రూ.3 వేలు తక్షణమే చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో చైర్మన్ మూడుసార్లు మండలిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, బాబు షూరీటీ.. మోసం గ్యారెంటీ అంటూ నినాదాలు చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా. -
వైఎస్సార్సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..
Yuvatha Poru Updates..👉ఏపీలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు.యువత పోరును అడ్డుకున్న పోలీసులు..విజయవాడలో యువత పోరుకు అడ్డంకులు.వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.యవత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు.వైఎస్సార్సీపీ నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు ఏర్పాటు. కృష్ణాజిల్లా..కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్..చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేశారుపార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను, ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుమీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ.. విద్యార్ధుల ఫీజులకు డబ్బులుండవా?.చంద్రబాబు, పవన్, లోకేష్‌కు పదేసి కార్లలో తిరగడానికి.. వాటి సిబ్బందికి డబ్బులుంటాయిపిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదాఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందిఅరెస్టులతో మమ్మల్ని అడ్డుకోలేరుఅరెస్టులు చేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనకడుగువేసేది లేదుశ్రీకాకుళం..యువత పోరు కార్యక్రమానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుజిల్లా కేంద్రానికి వస్తున్న ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, నేతలను అడ్డుకున్న పోలీసులు.రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్సీపీ పార్టీ నాయకులుచింతాడ వద్ద పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదంఅనంతరం, వైఎస్సార్సీపీ నేతలకు అడ్డుతప్పుకున్న పోలీసులు. విశాఖలో ఉద్రిక్తత..విశాఖ జిల్లా కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు..కలెక్టరేట్‌లోకి వైఎస్సార్సీపీ శ్రేణులను అనుమతించని పోలీసులు..కేవలం పది మందికి మాత్రమే కలెక్టర్‌ని కలిసేందుకు అనుమతి..గేటు బయట పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..జై జగన్ నినాదాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరెట్విజయవాడ..రాష్ట్ర వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుపునూరు గౌతమ్ రెడ్డి కామెంట్స్విద్యార్థులకు ఫీజులు వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందిచంద్రబాబు 7100 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ప్రజలను మోసం చేశారుగతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ 18వేల కోట్లు విడుదల చేశారుచంద్రబాబు అరకొర నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడువిద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు తక్షణమే అందించాలిఢిల్లీ..పార్లమెంట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..వేడుకల్లో పాల్గొన్న ఎంపీలు వైవీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, గొల్ల బాబురావు, అయోధ్య రామిరెడ్డి,వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..వైఎస్సార్ ఆశయ సాధన మా పార్టీ ధ్యేయంపేదల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందిపేదల పక్షాన నాడు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేశాంప్రజలకు అండగా నిలబడ్డాం.విశాఖ..వైఎస్సార్సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..జెడ్పీ జంక్షన్‌కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటున్న పోలీసులు..ఆంక్షలు అమలు కోసం భారీగా పోలీసుల మోహరింపు..ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్దమైన వైఎస్సార్సీపీ నేతలు.తిరుపతి..ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..వైఎస్సార్సీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోందిఎన్నో ఆశలు పెట్టుకొని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకువచ్చారువైఎస్ జగన్ పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేశారుపిల్లలు అందరూ కాలేజీలకు వెళ్లకుండా పంట పొలాలకు వెళ్తున్నారుఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు కొనసాగిస్తున్నాముయువతకు 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారుప్రతి విద్యార్థికి పది నెలల్లో ముప్పై వేలు ఇవ్వాలిమహిళా సంఘాలు అక్కౌంట్ లు 50శాతం నిర్వీర్యం అయిపోయాయిఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోంది.దీని పర్యవసానం చెల్లించక తప్పదుయువత పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలినెల్లూరు..వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించిన కాకాణి.హాజరైన అన్ని నియోజకవర్గ ఇన్చార్జులు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలుమాజీ మంత్రి కాకాణి కామెంట్స్..ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ఇది.ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు.కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. విలువలు విశ్వసనీయంతో ఐదేళ్లు జగన్ ప్రభుత్వాన్ని నడిపారుపార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్ జగన్.వైఎస్ జగన్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది.వైఎస్ జగన్ రూపం రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది.పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజల స్వచ్ఛందంగా హాజరవుతున్నారు..యువత పోరుకు సైతం భారీ సంఖ్యలో హాజరుకావాలి. కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం.కానూరు నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ.దేవభక్తుని కామెంట్స్..కూటమి యువతను, విద్యార్థులను మోసం చేసింది.విద్య, వైద్యంపై ఉక్కు పాదం మోపుతుంది.విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఫీజు కట్టే స్తోమత లేక పొలం పనులకు యువత వెళ్తున్నారు.విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.జగనన్న హయాంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాం.దున్నపోతు మీద వర్షం పడినట్లు ప్రవర్తిస్తుంది.ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది.అనంతపురం..వైఎస్సార్సీపీ యువత పోరుకు భారీ స్పందనజెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీచంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుయువత పోరులో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులుమాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ,మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ,వై.శివరామిరెడ్డి, ప్రభుత్వ విద్య మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి. -
Watch Live: YSRCP యువత పోరు
-
కూటమి ప్రభుత్వంపై ఇవాళ YSRCP యువత పోరు
-
వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు అంతా సిద్ధం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. ధర్నాలు నిర్వహించనున్నారు.16,347 పోస్టులతో డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన తొలి సంతకం అభాసుపాలైంది. 9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ అతీగతీలేదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు: కన్నబాబుకాకినాడ జిల్లా: పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.4,800 కోట్లు ఫిజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆయన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ పథకాన్ని వైఎస్ జగన్ విస్తృతంగా అమలు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే. మోసపోయిన ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ను నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని కన్నబాబు పేర్కొన్నారు. -
‘చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ? అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం నమ్మక ద్రోహమే అవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్,వైఎస్ జగన్ పకడ్బందీగా అమలు చేశారువైఎస్ జగన్ లక్షలాది మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించారు. రూ. 3900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం చంద్రబాబు అసమర్థతే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైనా మెగా డీఎస్సీ ఎందుకు ఇవ్వలేదు?.నిరుద్యోగ భృతి ఎక్కడ చంద్రబాబు’అని ప్రశ్నించారు. -
కూటమి ప్రభుత్వంలో కూలీలుగా విద్యార్థులు.. పవన్ ఏం చేస్తున్నట్లు..
సాక్షి,తాడేపల్లి: ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేక కూలి పనులకు వెళ్తున్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? బకాయి పడిన మొత్తం ఫీజు రియింబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజులు కట్టలేదని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఫీజు కట్టలేక విద్యార్థులు కూలీలుగా మారుతున్నారు.అనంతపురంలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.అయినాసరే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అందుకే 12న పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. గ్రూప్-2 విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి లోకేష్ దుబాయ్ వెళ్లి క్రికెట్ చూశాడు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని చంద్రబాబు ప్రయివేటీకరణ చేస్తున్నారు.మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం.ప్రశ్నిస్తామన్న పవన్ ఏం చేస్తున్నట్లు : చంద్రబాబు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.3900 కోట్లు ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు నెడుతున్నాయి. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా ప్రభుత్వం చెప్పటం లేదు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.2050 మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది.బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని నిరూపించారు. జాబ్ కేలండర్ జాడే లేదు.నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు.మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన విద్యా సంస్కరణలకు చంద్రబాబు పాతర వేశారు.ఈ సమస్యల పరిష్కారం కోరుతూ 12న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తాం’అని హెచ్చరించారు. రవిచంద్ర, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల
తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు -
ఈనెల 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 'యువత పోరు' కార్యక్రమం
-
యువత పోరుపై YSRCP స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల టెలీ కాన్ఫరెన్స్
-
‘యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’
గుంటూరు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం) గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దం మయ్యారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని అంబటి స్పష్టం చేశారు. -
జగన్ పిలుపుతో అన్ని జిల్లాల్లో యువత పోరు
-
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఈ నెల 12న యువత పోరుతో రాష్ట్రవ్యాప్త ధర్నాలకు YSRCP నిర్ణయం
-
బాబు దయవల్ల చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.. అందుకే YSRCP యువత పోరు..
-
‘యువత పోరు’తో చంద్రబాబు వైఖరిని ఎండగడదాం: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్‌ను లాంఛ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్సీశ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు.