
గుంటూరు: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం) గుంటూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దం మయ్యారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని అంబటి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment