‘హామీలు ఇచ్చి మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటే’ | Updates on YSRCP Agitation Poster Against Power Tariff Hike in AP | Sakshi
Sakshi News home page

‘హామీలు ఇచ్చి మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటే’

Published Mon, Dec 23 2024 6:46 PM | Last Updated on Mon, Dec 23 2024 9:06 PM

Updates on YSRCP Agitation Poster Against Power Tariff Hike in AP

సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నారు.  

ఇందులో భాగంగా సోమవారం గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ‘విద్యుత్‌ చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించింది. పోస్టర్‌ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు పాల్గొన్నారు.  

పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.

ప్రజలు అండగా వైఎస్సార్‌సీపీ పోరు బాట : భూమన 
వైఎస్సార్‌సీపీ పోరు బాట పోస్టర్‌ను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు ,పవన్ కళ్యాణలు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. రెండు విడతలగా 15 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెలా డైవర్ట్ చేస్తున్నారు.

ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి.  అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఉంటుంది.  గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా పోరాటాలు చేశారో.. అదే విధంగా మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.

మూడు లక్షల కోట్లు రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్ జగన్‌దే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపడతాం. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement