
తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.
‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment