RP Thakur
-
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
గుంటూరు, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్లపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదులో పేర్కొంది.ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లు టీడీపీ ఆఫీస్ వేదికగా అధికారుల్ని బెదిరిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని జిల్లా పోలీస్ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. -
ఆర్టీసీలో సౌర కాంతులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. తన ఆస్తులను మరింత సమర్థంగా సద్వినియోగం చేసుకునే వ్యూహంలో భాగంగా బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతోంది. రెస్కో విధానంలో రాష్ట్రంలో 838 సోలార్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది. నాలుగు ప్లాంట్లు రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లను ఆర్టీసీ నెలకొల్పింది. మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, కాకినాడలలో ఒక్కొక్కటి 100 కిలోవాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.37 లక్షల వరకు వెచ్చించింది. ప్రతి ప్లాంట్ ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఏడాదికి రూ.14 లక్షల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఓపెక్స్, ఇన్సిడెంటల్ చార్జీలు కలుపుకుని ఆ సోలార్ ప్లాంట్ల స్థాపన వ్యయం నాలుగేళ్లలో వెనక్కి వస్తుంది. ఐదో ఏడాది నుంచి ఏడాదికి రూ.12 లక్షల చొప్పున లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు. రెస్కో విధానంలో 838 ప్లాంట్లు ఇకపై రెస్కో విధానంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదట దశలో ఈ ఆర్థిక సంవత్సరంలో 400 ప్లాంట్లు నెలకొల్పేలా కార్యాచరణ సిద్ధం చేసింది. మిగిలిన 438 ప్లాంట్లను రాబోయే రెండేళ్లలో నెలకొల్పుతుంది. ఇందు కోసం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రెస్కో విధానంలో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై మొత్తం 838 రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తుంది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించి కంపెనీని ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ ఆర్టీసీ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను నెలకొల్పి 25 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది. ఆదా ఇలా.. ► ప్రస్తుతం బస్స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్‌కు రూ.10.15 చొప్పున, పారిశ్రామిక అవసరాల కిందకు వచ్చే గ్యారేజీలు, వర్క్ షాపులకు యూనిట్‌కు రూ.6.76 చొప్పున విద్యుత్ చార్జీలను ఆర్టీసీ చెల్లిస్తోంది. ► టెండర్ దక్కించుకున్న సంస్థ ఆర్టీసీకి 25 ఏళ్ల పాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం వెయ్యి కిలోవాట్ల ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను యూనిట్‌కు గరిష్టంగా రూ.5గా సూత్రప్రాయంగా నిర్ణయించారు. భవిష్యత్‌లో ఆ రేట్లు ఇంకా తగ్గుతాయి. ► సోలార్ విద్యుత్ వల్ల బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్‌పై రూ.5 చొప్పున, గ్యారేజీలు, వర్క్‌షాపులకు యూనిట్‌కు రూ.3 వరకు ఆర్టీసీకి ఆదా అవుతుంది. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికలో భాగంగానే బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాం. ఆర్టీసీపై వ్యవస్థీకృత భారం పడకుండా ఉండేందుకు ఎన్ఆర్ఈడీసీఏపీ భాగస్వామ్యంతో రెస్కో విధానంలో ఈ ప్లాంట్లను నెలకొల్పుతాం. దీనివల్ల ఆర్టీసీ ఆస్తులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు విద్యుత్ చార్జీల భారం 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. – ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ -
‘ప్రమోషన్ కోసం ఠాకూర్ మమ్మల్ని ట్రాప్ చేశారు’
సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెప్పు కోసం ఆర్పీ ఠాకూర్ తమను ట్రాప్ చేసి అక్రమ కేసులు పెట్టారని బాధితులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏసీబీ అక్రమ కేసుల బాధితుల మీడియా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఠాకూర్ డీజీ నుంచి డీజీపీ ప్రమోషన్ కోసం అక్రమంగా కేసులు పెట్టారని ఆయన వాపోయారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాటిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఠాకూర్ పెట్టిన అక్రమ కేసులకు మనస్తాపానికి గురై కొందరు ఉద్యోగులు ఆతహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నామని వెంకటేశ్వరావు అన్నారు. మిగిలిన వారికి పోస్టింగ్ ఇవ్వాలి.. 3 ఏళ్లుగా అన్యాయనికి గురైన వారిలో కొందరికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏసీబీలో లోపాలను ఎత్తి చూపిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా కృతజ్ఞతలు. ఠాకూర్ కేసుల బాధితులందరికీ న్యాయం చేయాలి. విచారణకు వెళ్లేముందు కేసులు పునర్ పరిశీలించమని కోరుతున్నాము. -బాధితుడు పయ్యావుల శ్రీనివాసరావు -
ఆర్పీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన ఏసీబీ డీజీగా ఉన్న కాలంలో తమపై అక్రమ కేసులు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పదమూడు జిల్లాల నుంచి తరలివచ్చిన బాధితులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై ఠాకూర్ అక్రమ కేసులు బనాయించారంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలకు సహకరించలేదని ఠాగూర్ తమపై పెట్టిన తప్పుడు కేసులపై రివ్యూ చేయాలని వారు కోరారు. టీడీపీకి తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ఠాకూర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఠాకూర్ అక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని బాధితులు పేర్కొన్నారు. ఏసీబీలో ఇప్పటికీ చంద్రబాబు, ఠాకూర్ మునుషులే అజమాయిషీ చెలాయిస్తున్నారని ఆరోపించారు. అందువల్లే తమపై పెట్టిన కేసులు పరిష్కారం కావటం లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని.. వెంటనే బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. -
బాబు పాలనలో పక్షపాత దాడులు!
సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాజకీయ ప్రేరేపిత దాడులకు ఉపకరణంలా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డీజీగా ఉండగా ఆయన్ను అడ్డు పెట్టుకుని మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు పక్షపాత దాడులకు ప్రేరేపించారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో ఏసీబీ సాగించిన దాడుల పూర్వాపరాలపై పునర్విచారణకు ఆదేశిస్తే అక్రమాల గుట్టు రట్టవుతుందని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు జమానాలో సొంత సామాజికవర్గం జోలికి పోకుండా అట్టడుగు వర్గాలు, గిట్టని అధికారులను ఏసీబీ ద్వారా టార్గెట్ చేసే వికృత క్రీడ యథేచ్చగా సాగింది. లంచం కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు టీడీపీ నేతలకు సెటిల్మెంట్లు సాగించే రాజకీయ దందాలుగా మారాయి. ఏసీబీ పక్షపాత దాడులపై కొన్ని ఉదంతాలు గమనిస్తే వాస్తవాలు ఏమిటో బోధపడతాయి. పక్షపాత దాడులకు ఇవిగో ఉదాహరణలు.. - టీడీపీ అధికారంలో ఉండగా గుంటూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ) డీఎస్పీ దుర్గాప్రసాద్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే నెపంతో రాయపాటి సాంబశివరావు వర్గీయులు లోకేశ్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఏసీబీ దాడులు చేయించారు. గుంటూరు కన్నావారి తోటలోని దుర్గాప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చడం కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం. చంద్రబాబు, లోకేశ్ ఒత్తిడితో ఠాకూర్ దూకుడు పెంచి ఈ కేసులో మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇరికించేందుకు తీవ్రంగా యత్నించారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఆళ్లను ఏసీబీ కేసులో ఇరికించేందుకు టీడీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. - ఓ సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు ఏసీబీని వాడుకున్నారనేందుకు నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డిపై అక్రమ కేసుల ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎస్సై నుంచి డీఎస్పీగా పనిచేసిన పోలీస్‌స్టేషన్‌లోనే టీడీపీ సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు చివరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించడం గమనార్హం. - విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శోభన్‌బాబుపై జరిగిన ఏసీబీ దాడి కక్ష సాధింపులకు పరాకాష్ట. ఆయన లంచం తీసుకోవడం గానీ డిమాండ్ చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు సాక్షాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఏసీబీ వైఖరితో తీవ్ర మనస్తాపం చెందిన సీఐ శోభన్‌బాబు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వెలుగులోకి రావడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఏసీబీ కక్షపూరితంగా దాడులు చేస్తోందని పేర్కొంటూ తన నిజాయితీని నిరూపించుకునేందుకు పోలీస్‌స్టేషన్ వద్ద సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని కోరుతూ శోభన్‌బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడటంతో ఉలిక్కిపడ్డ ఏసీబీ అప్పటికప్పుడు ఐదుగురు అధికారుల బృందాన్ని విమానంలో పంపించి ఆయన్ను బుజ్జగించి కేసును ఉపసంహరించుకుంది. - టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే, సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులపై ఏసీబీ కన్నెత్తి చూసే సాహసం చేయలేదని చెప్పేందుకు చిత్తూరు జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్ ఉదంతమే నిదర్శనం. ప్రస్తుతం పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల సమన్వయ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌కు ఆయన ప్రియ శిష్యుడు. రామ్‌కుమార్ ఆదాయానికి మించి రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందినా ఎలాంటి సోదాలు చేయలేదు. నాడు మంత్రిగా ఉన్న లోకేశ్ రంగంలోకి దిగి రామ్‌కుమార్ జోలికి వెళ్లకుండా జీఏడీ నుంచి ‘నో పర్మిషన్ ఎకార్డెడ్’ ఉత్తర్వులు జారీ చేయించి కాపాడారు. పార్టీ ఫిరాయింపులతోపాటు ఇటీవల ఎన్నికల్లో రామ్‌కుమార్ టీడీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ పెద్దల సెటిల్మెంట్లు గత మూడున్నరేళ్లుగా ఏసీబీ పెద్దఎత్తున దాడులు నిర్వహించింది. అవినీతి అధికారుల ఆట కట్టించడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకున్నా టీడీపీ కక్ష సాధింపు చర్యలకు ఏసీబీ సహకరించడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో టీడీపీ పెద్దలే సెటిల్మెంట్లు చేసి కాసులు ఏరుకున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో చిక్కిన అధికారుల ఆస్తుల్లో 30 నుంచి 50 శాతం వరకు తమ పేర రాయించుకున్నట్టు సమాచారం. సెటిల్మెంట్ కేసుల్లో సలహాదారుగా వ్యవహరించిన హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ ఒకరు శాఖాపరమైన విచారణతో సరిపెట్టేలా చేశారనే విమర్శలున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన ఆస్తుల వివరాలకు, విచారణ తదుపరి నమోదు చేసే డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్(డీఎఫ్ఆర్)లో పేర్కొన్న ఆస్తుల వివరాలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రేరేపిత ఏసీబీ దాడుల్లో బలహీనవర్గాలే బాధితులుగా మారిన నేపథ్యంలో గత ఐదేళ్లుగా సాగిన ఏసీబీ దాడులు, కేసులపై పునర్విచారణ చేస్తే అక్రమాలు, అవినీతి, అవకతవకలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. -
‘సీఎం మెప్పు కోసం అల్లరిపాలు చేశారు’
సాక్షి, విజయవాడ : మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ కారణంగా అక్రమ కేసుల్లో ఇరుక్కున్న అధికారులపై నమోదైన కేసుల్లో పారదర్శక విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ మాజీ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. శుక్రవారమిక్కడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆర్పీ ఠాకూర్ బాధితుల సంఘం నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ..‘ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నియమ నిబంధనలు పాటించాలి. మొదట సదరు అధికారులపై విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలి. అయితే ఆర్పీ ఠాకూర్ తన సొంత ప్రాభవం కోసం.. మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం నిబంధనలు పాటించలేదు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఇబ్బందులకు గురిచేసేవారు. సీఎం దగ్గర మెప్పు కోసం అధికారులను టార్గెట్ చేశారు. తనకు నచ్చిన మీడియాను తీసుకు వచ్చి ఆస్తుల విలువను పెంచి చూపేవారు. అధికారులను అల్లరిపాలు చేసేవారు. అక్రమాస్తుల కేసులలో సదరు వ్యక్తి పూర్వాపరాలు పరిశీలించకుండా, ఎవరు ఫిర్యాదు చేశారో కూడా పట్టించుకోకుండా చర్యలు తీసుకునేవారు’ అని ఆర్పీ ఠాకూర్‌పై ఆరోపణలు చేశారు. వాళ్లను టార్గెట్ చేసి.. ‘కింది స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ ఇబ్బందులు పెట్టేవారు. వివిధ శాఖల్లో నెంబర్ 2 స్థాయిల్లో ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. సుప్రీంకోర్టు తీర్పు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటే 6 నెలల్లోగా తిరిగి నియామకం జరగాలి. కానీ ఆ తర్వాత కూడా పోస్టు ఇవ్వకుండా ఠాకూర్ అడ్డుతగిలేవారు.దీంతో సంవత్సరాలు గడిచినా ఆస్తులు ఆటచ్ అయ్యి, పోస్టులు లేక అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ కోర్టుల ఆక్ట్ ప్రకారం జప్తు చేసిన ఆస్తులను కేసు పరిష్కారమయ్యే వరకు.. ప్రభుత్వ అవసరాలకు ఆ ఆస్తులను వాడుకునే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం అవినీతి అధికారులకు శిక్ష పడాలి. కానీ ఆర్పీ ఠాకూర్.. కింది స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టడం వలన తప్పు చేయని వారిపై కేసులు పెట్టారు. కాబట్టి నిజాయితీ గల అధికారులకు న్యాయం చేయాలి’ అని చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విఙ్ఞప్తి చేశారు. కాగా డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఠాకూర్ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. -
డీజీపీగా గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ) పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతారు. నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్, పర్ఛేజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఇద్దరి తీరు వివాదాస్పదం ఎన్నికల ముందు నుంచి డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వీరిద్దరూ పనిచేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. వారు ఆయా పోస్టుల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. దీంతో ఠాకూర్‌ను ఏసీబీ డీజీ పోస్టు నుంచి తప్పించి డీజీపీగా కొనసాగించేలా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి బదిలీ చేయడంతోపాటు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి తప్పించేందుకు చంద్రబాబు ససేమిరా అన్నప్పటికీ కోర్టు జోక్యంతో తప్పనిసరి అయ్యింది. ఖాళీ అయిన ఏసీబీ డీజీ పోస్టులో ఏబీ వెంకటేశ్వరరావును చంద్రబాబు సర్కారు నియమించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు.. అస్సాంకు చెందిన గౌతమ్ సవాంగ్ అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ప్రా«థమిక విద్య అభ్యసించారు. గ్రాడ్యుయేషన్ చెన్నై లయోలా కాలేజీ, పీజీ ఢిల్లీ యూనివర్శిటీలో సాగింది. ఐపీఎస్ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్ ఏపీ కేడర్ అధికారి. ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినరోజే రాష్ట్ర పోలీస్ బాస్‌గా పూర్తి అదనపు బాధ్యతలు సవాంగ్‌కు దక్కడం విశేషం. సవాంగ్ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఏపీ గ్రేహౌండ్స్ విభాగం ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా సేవలందించారు. 2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్ రేంజ్‌ల్లో పనిచేశారు. ఏసీబీ, ఎస్ఐబీ వింగ్‌లో విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్పీఎఫ్ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేసి, తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో ఆయనకు డీజీగా పదోన్నతి వచ్చింది. సవాంగ్‌ను డీజీపీగా నియమిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. -
ఆర్పీ ఠాకూర్ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర రావును కూడా బదిలీ చేసింది. వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్‌గా కుమార్ విశ్వజిత్‌ను నియమించింది. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్ జగన్‌తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ
-
వైఎస్ జగన్‌తో సీఎస్, డీజీపీ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌కు వీరు వివరించినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ మహేశ్ చంద్రలడ్డా కూడా జగన్‌ను కలిసి అభినందనలు చెప్పారు. మరోవైపు ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై కసరత్తును వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కౌంటింగ్‌కు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం
-
25,224 మందితో పటిష్ట బందోబస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, రాజకీయ పార్టీలకు చెందిన భారీ కాన్వాయ్‌లను కూడా అనుమతించబోమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 ప్రాంతాల్లోని 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మొదటి దశలో కౌంటింగ్ హాలు వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఉంటాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద రెండో దశలో ఏపీఎస్పీ సాయుధ పోలీసులు ఉంటారని, మూడో దశలో బాడీ వోర్న్ కెమెరాలు ధరించిన పోలీసులు కౌంటింగ్ కేంద్రం బయట ఉంటారని, నాలుగో దశలో ప్రత్యేక పోలీసు బృందాలు వాహనాల్లో గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు తగినంత పోలీస్ బలగం అందుబాటులో ఉందని డీజీపీ ఠాకూర్ చెప్పారు. 35 కంపెనీల కేంద్ర బలగాల్లో 3,325 మంది, 61 కంపెనీల ఏపీఎస్పీ బలగాల్లో 5,490 మంది, 118 స్పెషల్ పార్టీ టీమ్‌ల్లో 1,770 మంది, 67 ఏపీ ప్లాటూన్లలో 1,340 మంది సిబ్బంది, రాష్ట్రంలోని 21 మంది ఎస్పీలు, 31 మంది అదనపు ఎస్పీలు, 137 మంది డీఎస్పీలు, 379 మంది సీఐలు, 1,037 మంది ఎస్ఐలు, 2425 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 6,510 మంది కానిస్టేబుళ్లు, 2,759 మంది హోంగార్డులు ఎన్నికల లెక్కింపు సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కౌంటింగ్ సందర్భంగా బందోబస్తు నిర్వహించే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నట్టు డీజీపీ చెప్పారు. అన్ని హంగులతో ఉండే ఐదు ఫాల్కాన్స్ వాహనాలు, 14,770 సీసీ కెమెరాలు, 1,200 బాడీ వోర్న్ కెమెరాలు, 68 డ్రోన్స్, 9 వేల కమ్యూనికేషన్స్ పరికరాలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాటిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేసి, కౌంటింగ్ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 144, 30 సెక్షన్లు అమలు ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్లు అమలు చేస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమిగూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేధం. సెక్షన్ 30 అమలుతో కౌంటింగ్ కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో ఎక్కువ మంది సమావేశం కావడం, మైక్‌లు వాడటం నిషేధం. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్ ఫోర్స్‌తో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు డీజీపీ చెప్పారు. ఇవి చెయ్యొద్దు... ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలపై నిషేధం అమలు చేస్తామని డీజీపీ తేల్చిచెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు జరపరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు ఎటువంటి వాహనాలు, జన సమీకరణలు ఉండకూడదని సూచించారు. ముందస్తు చర్యలు అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని ముందు జాగ్రత్తగా బైండోవర్ చేసినట్టు డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లు, అనుమానితులను కౌంటింగ్ రోజున పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను సమీక్షిస్తామన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశమున్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి ముందుజాగ్రత్తగా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల జాబితాలు తమకు వచ్చాయని, వాటిని పరిశీలించి వారిలో నేర చరిత్ర ఉన్న వారిని, వివాదాస్పదంగా ఉండే వారిని గుర్తిస్తామన్నారు. వారి స్థానంలో ఇతరులను నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచిస్తామన్నారు. -
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
-
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
సాక్షి, కాకినాడ: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్‌లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ భద్రతా కారణాలరిత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్‌తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్షీట్లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించామని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని, ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగిందని, ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. -
ఏఓబీ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది : ఏపీ డీజీపీ
సాక్షి, కాకినాడ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తూర్పుగోదావరి జిల్లాలోని గాడిమొగ రిలయన్స్ టెర్మినల్‌తో పాటు పలు చమురు క్షేత్రాలను పర్యటించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై సమీక్షించారు. కేసుల నమోదు చార్జ్ షీట్లపై యంత్రానికి సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా సహరిద్దు (ఏఓబీ) ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కౌంటింగ్ భద్రతకు అన్ని ఏర్పాటు చేశామని డీజీపీ పేర్కొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి/గుంటూరు: శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్రవాదులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పలు జిల్లాల పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ ఠాకూర్ బుధవారం ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రధానంగా విమానాశ్రయాలు, ఓడ రేవులు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సముద్రతీరాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, హోటల్స్, జనం ఎక్కువగా చేరే స్థలాల వద్ద బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రముఖ మసీదులు, చర్చిలు, ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. కీలక ప్రాంతాలు, కేంద్ర సంస్థలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వద్ద స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏఏ ప్రాంతాల్లో అలజడులు, అసాంఘిక శక్తుల కదలికలు ఉండే అవకాశం ఉందో గుర్తించాలని సూచించారు. ఆర్మ్డ్ కౌంటర్ యాక్షన్ పోలీస్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు చాలా కేసుల్లో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా ఉపయోగపడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బందోబస్తు పరంగా పలు ప్రాంతాల్లో ఉన్న వైఫల్యాలను గుర్తించి వాటిని నెల రోజుల్లో చక్కదిద్దుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రజలతో పోలీసులు మంచి సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. భద్రతా చర్యలపై నెల రోజుల్లో సమీక్ష: డీజీపీ వీడియో కాన్ఫరెన్సు అనంతరం డీజీపీ ఠాకుర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు పలు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మరో నెల రోజులు తర్వాత భద్రతాపరమైన చర్యలు ఏమేరకు తీసుకున్నారో అనే విషయాలను సమీక్షిస్తామని డీజీపీ చెప్పారు. సమావేశంలో డీజీపీతోపాటు శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్, పీఅండ్ఎల్ ఏడీజీ హరీష్‌కుమార్ గుప్త పాల్గొన్నారు. రాజధానిలో హై అలర్ట్ ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాత్కాలిక సచివాలయంతోపాటు, హైకోర్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. అక్కడకు వెళ్లే అన్ని రహదారుల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. అనుకోని సంఘటన జరిగితే ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై మాక్‌డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర అధికారులతో మాట్లాడుతూ ఉగ్రవాద కదలికలపై ఆరా తీస్తున్నారు. మత పెద్దలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన గుంటూరు అర్బన్ పోలీసులు మసీదులు, చర్చిలు, దేవాలయాల వద్ద అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేసేలా మత పెద్దలకు సూచిస్తున్నారు. లాడ్జిలు, హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
నిఘా వర్గాల హెచ్చరికతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
-
ఏపీ డీజీపీ అత్యవసర సమావేశం
సాక్షి, విజయవాడ : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా సీపీ, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇస్లామిక్, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల కౌటింగ్ పై కూడా జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. -
ఆ ఘటన విచారకరం: డీజీపీ ఆర్పీ ఠాకూర్
విశాఖపట్నం: రుషికొండ రేవ్ పార్టీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం స్పందించారు. ప్రశాంత విశాఖ నగరంలో రేవ్ పార్టీ, డ్రగ్స్ రావటం విచారకరమన్నారు. రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 50 మందిని గుర్తించి, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై రౌడీషీట్ తరహాలో హిస్టరీ షీట్ తెరుస్తామని వెల్లడించారు. డ్రగ్స్ మాఫియా అనుసరిస్తున్న పద్ధతిని బ్రేక్ చేసే యోచనలో పోలీస్ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. డ్రగ్స్ వినియోగం ఏ సంస్థలో జరిగినా, స్టార్ హోటల్ అయినా కూడా వారిపై కేసులు నమోదు చేయడానికి వెనకాడమన్నారు. డ్రగ్స్ కంట్రోల్‌పై గెజిటెడ్ స్థాయి అధికారి బృందం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా డ్రగ్స్‌పై తగిన సమాచారాన్ని వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వాలని సూచించారు. త్వరలోనే డ్రగ్స్ కంట్రోల్‌పై ప్రత్యేకించి టెలీఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో శక్తి బృందాలను డీజీపీ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం శక్తి బృందాలు పని చేస్తాయని తెలిపారు. ఇప్పటికే విజయవాడలో శక్తి బృందాలు ప్రారంభించామని, త్వరలోనే తిరుపతితో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో శక్తి బృందాలు ఏర్పాటుల చేస్తామని చెప్పారు. చదవండి: ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు! -
మే 23న కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 13 జిల్లాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ,సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఈ సందర్భంగా మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగినంత శిక్షణ లేకపోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సరిపుచ్చడంతో పోలింగ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, కౌంటింగ్ సమయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉందని కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బలగాలు.. ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ... 2014తో పోలిస్తే తక్కువగా పోలీస్ ఫోర్సు ఉన్నా కలెక్టర్లు,ఎస్పీలు టీం వర్క్‌తో చిన్నపాటి సంఘటనలు మినహా ఎన్నికలను సజావుగా నిర్వహించారని వివరించారు. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలపై వాటికి బాధ్యులైన వారిని చాలా వరకూ అరెస్టు చేశామన్నారు. కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలీస్ బలగాలను తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లుతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో సీసీ టీవీలతో నిఘా సార్వత్రిక ఎన్నికల్లో 65శాతం పైగా దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం సిబ్బంది కృషికి నిదర్శనమని సీఈఓ ద్వివేది అన్నారు. రాష్ట్రంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడు అంచెల పటిష్టమైన బందోబస్తు ఉందని, సీసీ టీవీల నిఘాతో కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతోందని, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఆర్వోలు రోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని, ఎవరెవరు సందర్శిస్తున్నారనేది రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి మూడు దశల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
పోలీసు అధికారుల పక్కచూపులు!
సాక్షి, అమరావతి: పోలీసుశాఖలో పలువురు అధికారుల పక్కచూపులు మొదలయ్యాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పలువురు కేంద్ర సర్వీసులవైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో పాటు పలువురు ఐపీఎస్‌లు సైతం క్యూ కడతారంటూ ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పలువురు పోలీసు అధికారులు చంద్రబాబుకు వీరవిధేయులుగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీ నాటికి పలువురు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే విషయమై పోలీసుశాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి అఖిల భారత సర్వీసుకు చెందిన ఐపీఎస్, ఐఏఎస్ వంటి కీలక అధికారులు రాష్ట్రంలో పలు రాజకీయ వివాదాల్లో కూరుకుపోయారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారనే విమర్శలను మూటగట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలోని కొందరు పోలీసు అధికారులు మరీ బాహాటంగానే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేశారంటూ ఫిర్యాదులొచ్చాయి. ప్రస్తుత డీజీపీ ఠాకూర్ గతంలో ఏ డీజీపీ కూడా ఎదుర్కోనన్ని ఆరోపణలను అతి తక్కువ సమయంలోనే మూటగట్టుకున్నారు. సదా చంద్రబాబు సేవలో.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు అయితే అసలు విధులు వదిలి చంద్రబాబు కోసం రాజకీయ సర్వేలు, పార్టీ ఫిరాయింపులు వంటి అనేక కార్యకలాపాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావు, పోలీస్ ప్రధాన కార్యాలయంలోని శాంతిభద్రతల సమన్వయ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు యోగానంద్, మాధవరావులతో పాటు పలు జిల్లాల ఎస్పీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగించింది. రాష్ట్రంలో రాజకీయ చిత్రం మారనుందనే విషయం తెలుసుకున్న వారిలో ఆందోళన పెరిగిపోతోంది. ఎందుకైనా మంచిది.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోదామన్న ఆలోచనలతో పలువురు ఐపీఎస్‌లు పావులు కదుపుతున్నట్టు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
గత ఎన్నికలతో పోల్చితే హింసాత్మక ఘటనలు తక్కువ
సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు తక్కువేనని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల్లో ఆరుగురు మృతి చెందారని, ఈసారి ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. 2014లో హింసాత్మక ఘటనలు 276 జరుగగా, ఈసారి 84 హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపారు. గతంలో ఐదు ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఈసారి ఆరు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల పర్యవేక్షణ, లైవ్ రిలే కోసం 140 డ్రోన్స్ ఉపయోగించామని, ఎన్నికల నిర్వహణను డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించామని పేర్కొన్నారు. బాడీవోర్న్ కెమెరాలను ఉపయోగించి నేరుగా ఎన్నికల సరళిని పరిశీలించినట్టు డీజీపీ తెలిపారు. ఈ ఎన్నికల్లో 100 సెంట్రల్ సాయుధ పారా మిలటరీ ఫోర్స్ కంపెనీల కొరత ఉన్నప్పటికీ..బందోబస్తును సమర్థంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ఏపీ ఎన్నికలు జరగడంతో, ఆ రాష్ట్రానికి చెందిన 28,000 తెలంగాణ పోలీసు దళాలు వచ్చాయని, ఈసారి రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికల వల్ల ఆ రాష్ట్రం నుంచి బలగాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. తాము ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీజీపీ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. డీజీపీతో సీఎస్ అత్యవసర భేటీ.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం డీజీపీ ఠాకుర్‌తో అత్యవసర భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించేందుకు డీజీపీని తన వద్దకు రావాలని కోరితే విధులకు అంతరాయం ఏర్పడుతుందని భావించిన సీఎస్ నేరుగా ఆయనే పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. దాదాపు అరగంట పాటు డీజీపీతో సమావేశమైన సీఎస్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. -
టీడీపీ పక్షపాతి.. ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్‌రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్‌లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్‌గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్చార్జ్గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్‌కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు. -
సీఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆర్పీ ఠాకూర్..!
న్యూఢిల్లీ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ కమిషనర్లు అశోక్ లావాస, సుళీల్ చంద్రతో భేటీ అయ్యారు. ఇంటలిజెన్స్ డీజీగా బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఠాకూర్‌ను ఈసీ వివరణ అడిగినట్టు తెలిసింది. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహిరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఠాకూర్‌ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించి గట్టి హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ ఏడీజీగా ఉన్న శంకబ్రత బాగ్చీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. (చదవండి : ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు) -
ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు