
డీజీపీ ఆర్‌పీ ఠాగూర్(ఫైల్)
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్‌పీ ఠాగూర్ నెల్లూరు జిల్లా రాపూరు స్టేషన్ ఘటనపై స్పందించారు. పోలీసులపై దాడి చేయటం బాధాకరమన్నారు. ఆ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన సూచించారు. ఆదివారం రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. కర్నూలు క్వారీ ఘటన, సీమలో ఫ్యాక్షన్ నివారణ, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల పరిధిలో మైనింగ్ క్వారీలపై తనిఖీలు చేపడతామని అన్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఫైర్ శాఖ సహాయంతో తనిఖీలు చేస్తామన్నారు. అక్రమ లైసెన్స్ కలిగి ఉన్నట్లయితే కఠిన చర్యలతో పాటు క్వారీలను మూసివేస్తామని హెచ్చరించారు.