
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఠాకూర్‌ను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి ఉదయం డీజీపీగా మాలకొండయ్య పదవీ విరమణ కార్యక్రమంలో అనంతరం నూతన డీజీపీ ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేశారు. మాలకొండయ్య, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులతో సమావేశం అనంతరం నూతన డీజీపీపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గౌతం సవాంగ్ చివరివరకూ రేసులో ఉన్నా ఠాకూర్ వైపు మొగ్గు చూపారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కృషిచేస్తానని నూతన డీజీపీ పేర్కొన్నారు.
ఆర్పీ ఠాకూర్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జూలై 01న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన ఠాకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్ హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)లో అదనపు ఎస్పీగా తొలి నియామకం. గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా బాధ్యతలు. పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు నిర్వహించారు. జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా చేశారు.
ఆయన సర్వీసులు అందించిన మరిన్ని శాఖలు
- పాట్నాలోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వార్టర్స్ (సీఐఎస్‌ఎఫ్) డీఐజీగా బాధ్యతలు
- ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీగా సర్వీస్
- ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతి సేవలు
- రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు
- 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఠాకూర్ తాజాగా డీజీపీగా నియామకం
అందుకున్న మెడల్స్
- 2003లో ఇండియన్ పోలీసు మెడల్
- 2004 లో ఏఎస్‌ఎస్సీ మెడల్ సాధించిన ఠాకూర్
- పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్
Comments
Please login to add a commentAdd a comment