andhra pradesh DGP
-
ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతో పోలిస్తే అభివృద్ధి చెందింది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా.. ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా, నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. టీడీపీ ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం మైనస్ 6.5శాతంతో టీడీపీ కాలంలో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.13,640 కోట్లు కేటాయించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 24,620 పాఠశాలల్లోని వసతులను మెరుగుపరిచారు. -
ఏపీపీఎస్సీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
-
13,296 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం కీలక విషయాలు వెల్లడించారు. గత కొంత కాలంగా రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13,296 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఆలయాల భద్రత విషయంలో సీసీ కెమెరాలు, మ్యాపింగ్ కీలకం కావటంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయాల వద్ద పోలీసు భద్రతతోపాటు టెంపుల్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని కొన్ని దుష్ట శక్తులు ఆలయాలపై దాడులను ప్రభుత్వానికి, పోలీసులకు ఆపాదించి.. దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని డీజీపీ మండిపడ్డారు. ఇక ఇప్పటివరకు దాడులకు సంబంధించి నమోదైన 9 కేసుల్లో రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఆయన మీడియాకు తెలిపారు. ఇందులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్న కొందరిపై కన్నేసి ఉంచామని, త్వరలో వారపై చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే సాహసం ఎవరూ చేయకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడుల నిరోధానికి మత సామరస్య కమిటీలు సమన్వయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
సాక్షి, విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్ వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.ఆయన వెంట సీఎస్ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. -
ఏపీలో 37మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున డీఎస్పీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఏకకాలంలో 37మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. అయితే బదిలీ అయినవారిలో ఏడుగురుని ఇంటెలిజెన్స్‌కు కేటాయించగా, మిగిలిన 30మంది అధికారులు మంగళగిరిలోని హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎన్నికల నిమిత్తం కొంతమంది పలు జిల్లాలకు బదిలీపై రాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారు ఉన్నారు. అంతేకాకుండా బదిలీ అయినవారిపై పలువురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల్లో మరిన్నీ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులు: బి.శ్రీనివాసులు... ఎస్డీపీవో కర్నూలు బాబు ప్రసాద్..ఎస్డీపీవో గూడూరు మురళి కృష్ణ..ఎస్డీపీవో నెల్లూరు టౌన్ ఎన్.టి.వి. రామ్ కుమార్..ఎస్బీ డిఎస్పీఅనంతపురం ఎన్.యుగేంద్ర బాబు..ఎస్డీపీవో,పలమనేరు ఎన్.వెంకట రామ ఆంజనేయులు..ఎస్డీపీవో,చిత్తూరు పి.వి.ఎస్.ఎస్.ఎం.వి.అర్.వర్మ ఎస్డీపీవో,కాకినాడ జి.రామ ఆంజనేయులు..డిఎస్పీ ఎస్బి గుంటూరు..అర్బన్ కే. శ్రీనివాసరావు ..ఎస్డీపీవో ,ప్రొద్దుటూరు ఎస్.వి.వి.ప్రసాదరావు...ఎస్డీపీవో ,అనకాపల్లి ఏ.వి.ఎల్.ప్రసన్న కుమార్..ఏసీపీ..వైజాగ్ నార్త్ జి.పూర్ణ చంద్రరావు ..ఏసీపీ వైజాగ్ ఈస్ట్ బి.ప్రసాదరావు..ఎస్డీపీవో ,కాశీబుగ్గ సి హెచ్.వి.రామ రావు ..ఎస్డీపీవో ,పెద్దాపురం ఫై.మహేష్ ..ఎస్డీపీవో,గుడివాడ వి.పోతురాజు ..ఎస్డీపీవో,అవనిగడ్డ బి.శ్రీనివాసరావు ..ఎస్డీపీవో ,నూజివీడు వై.బి.పి.టి.ఏ.ప్రసాద్.. ఏసీపీ విజయవాడ సెంట్రల్ ఎన్.మురళి కృష్ణ ..డిఎస్పీ,ఎస్బి , పశ్చిమ గోదావరి వి.కాలేషావలి ...ఎస్డీపీవో ,సత్తెనపల్లి జి.రామకృష్ణ ...డిఎస్పీ ,గుంటూరు నార్త్ యు.నాగరాజ్ ఎస్డీపీవో , చీరాల ఏ.ఎస్.సి.బోస్ ..ఎస్డీపీవో ,నందిగామ ఎన్.రామారావు ...డిఎస్పీ ,రాజముండ్రి సెంట్రల్ విక్రమ్ శ్రీనివాస్ రావు ..డిఎస్పీ ,ఇంటెలిజన్స్ ,ఒంగోలు డి.అమర్నాథ్ నాయుడు..డిఎస్పీ ,ఇంటెలిజన్స్ ఎం.శ్రీనివాస్ రావు.. డిఎస్పీ,ఏపి ఎస్పి జె .మల్లికార్జున వర్మ ..డిఎస్పీ ,ఇంటెలిజన్స్,కడప బి.విజయ్ భాస్కర్.. ,డిఎస్పీ ,ఇంటెలిజన్స్ డి.శ్రవణ్ కుమార్ ...డిఎస్పీ ,ఇంటెలిజన్స్, కృష్ణ -
ఏపీ నూతన పోలీస్ బాస్‌గా ఠాకూర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఠాకూర్‌ను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి ఉదయం డీజీపీగా మాలకొండయ్య పదవీ విరమణ కార్యక్రమంలో అనంతరం నూతన డీజీపీ ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేశారు. మాలకొండయ్య, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులతో సమావేశం అనంతరం నూతన డీజీపీపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గౌతం సవాంగ్ చివరివరకూ రేసులో ఉన్నా ఠాకూర్ వైపు మొగ్గు చూపారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కృషిచేస్తానని నూతన డీజీపీ పేర్కొన్నారు. ఆర్పీ ఠాకూర్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జూలై 01న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన ఠాకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్ హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)లో అదనపు ఎస్పీగా తొలి నియామకం. గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా బాధ్యతలు. పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు నిర్వహించారు. జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా చేశారు. ఆయన సర్వీసులు అందించిన మరిన్ని శాఖలు పాట్నాలోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వార్టర్స్ (సీఐఎస్ఎఫ్) డీఐజీగా బాధ్యతలు ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీగా సర్వీస్ ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతి సేవలు రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఠాకూర్ తాజాగా డీజీపీగా నియామకం అందుకున్న మెడల్స్ 2003లో ఇండియన్ పోలీసు మెడల్ 2004 లో ఏఎస్ఎస్సీ మెడల్ సాధించిన ఠాకూర్ పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ -
సుజనా చౌదరితో ఏపీ డీజీపీ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రపద్రేశ్ డీజీపీ జేవీ రాముడు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు ఏపీ డీజీపీ జేవీ రాముడుతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం జే వీ రాముడు కేంద్ర మంత్రిని కలిశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి ప్రమేయం ఉన్నట్టు వార్తలు రావడం, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీజీపీ.. సుజనా చౌదరిని కలవడం ప్రాధాన్యం ఏర్పడింది.