ఏపీలో 37మంది డీఎస్పీల బదిలీ | 37 DSPs Transferred in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 37మంది డీఎస్పీల బదిలీ

Published Fri, Jun 28 2019 1:58 PM | Last Updated on Fri, Jun 28 2019 5:22 PM

30 DSPs Transferred in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున డీఎస్పీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఏకకాలంలో 37మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. అయితే బదిలీ అయినవారిలో ఏడుగురుని ఇంటెలిజెన్స్‌కు కేటాయించగా, మిగిలిన 30మంది అధికారులు మంగళగిరిలోని హెడ్‌ క్వార‍్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎన్నికల నిమిత్తం కొంతమంది పలు జిల్లాలకు బదిలీపై రాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారు ఉన్నారు. అంతేకాకుండా బదిలీ అయినవారిపై పలువురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల్లో మరిన్నీ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బదిలీ అయిన అధికారులు:

  1. బి.శ్రీనివాసులు... ఎస్డీపీవో కర్నూలు
  2. బాబు ప్రసాద్..ఎస్డీపీవో గూడూరు
  3. మురళి కృష్ణ..ఎస్డీపీవో నెల్లూరు టౌన్
  4. ఎన్.టి.వి. రామ్ కుమార్..ఎస్‌బీ డిఎస్పీఅనంతపురం
  5. ఎన్.యుగేంద్ర బాబు..ఎస్డీపీవో,పలమనేరు
  6. ఎన్.వెంకట రామ ఆంజనేయులు..ఎస్డీపీవో,చిత్తూరు
  7. పి.వి.ఎస్.ఎస్.ఎం.వి.అర్.వర్మ ఎస్డీపీవో,కాకినాడ
  8. జి.రామ ఆంజనేయులు..డిఎస్పీ ఎస్బి గుంటూరు..అర్బన్
  9. కే. శ్రీనివాసరావు ..ఎస్డీపీవో ,ప్రొద్దుటూరు
  10. ఎస్.వి.వి.ప్రసాదరావు...ఎస్డీపీవో ,అనకాపల్లి  
  11. ఏ.వి.ఎల్.ప్రసన్న కుమార్..ఏసీపీ..వైజాగ్ నార్త్ 
  12. జి.పూర్ణ చంద్రరావు ..ఏసీపీ వైజాగ్ ఈస్ట్
  13. బి.ప్రసాదరావు..ఎస్డీపీవో ,కాశీబుగ్గ
  14. సి హెచ్.వి.రామ రావు ..ఎస్డీపీవో ,పెద్దాపురం
  15. ఫై.మహేష్ ..ఎస్డీపీవో,గుడివాడ 
  16. వి.పోతురాజు ..ఎస్డీపీవో,అవనిగడ్డ 
  17. బి.శ్రీనివాసరావు ..ఎస్డీపీవో ,నూజివీడు
  18. వై.బి.పి.టి.ఏ.ప్రసాద్.. ఏసీపీ విజయవాడ సెంట్రల్ 
  19. ఎన్.మురళి కృష్ణ ..డిఎస్పీ,ఎస్బి , పశ్చిమ గోదావరి
  20. వి.కాలేషావలి ...ఎస్డీపీవో ,సత్తెనపల్లి
  21. జి.రామకృష్ణ ...డిఎస్పీ ,గుంటూరు నార్త్ 
  22. యు.నాగరాజ్ ఎస్డీపీవో , చీరాల 
  23. ఏ.ఎస్.సి.బోస్ ..ఎస్డీపీవో ,నందిగామ
  24. ఎన్.రామారావు ...డిఎస్పీ ,రాజముండ్రి సెంట్రల్
  25. విక్రమ్ శ్రీనివాస్ రావు ..డిఎస్పీ ,ఇంటెలిజన్స్ ,ఒంగోలు
  26. డి.అమర్నాథ్ నాయుడు..డిఎస్పీ ,ఇంటెలిజన్స్
  27. ఎం.శ్రీనివాస్ రావు.. డిఎస్పీ,ఏపి ఎస్పి 
  28. జె .మల్లికార్జున వర్మ ..డిఎస్పీ ,ఇంటెలిజన్స్,కడప 
  29. బి.విజయ్ భాస్కర్.. ,డిఎస్పీ ,ఇంటెలిజన్స్
  30. డి.శ్రవణ్ కుమార్ ...డిఎస్పీ ,ఇంటెలిజన్స్, కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement